బ్లడ్ ప్రెజరు మందు డాక్టర్లు ఇవ్వటానికి కొత్త విధానం. ఈ క్రింద ఉదాహరించిన వ్యాసానికి తెలుగు లో నా స్వేచ్చానువాదము.
Blood Pressure Medication Breakthrough
Scientists Develop Precise Tool to Identify Optimal Blood Pressure Prescription
Michael H. Alderman, MD
Albert Einstein College of Medicine of Yeshiva University
Albert Einstein College of Medicine of Yeshiva University
Special from Bottom Line's Daily Health News
January 4, 2011
January 4, 2011
"మట్టి ముద్దలు చేతులతో తీసుకుని గోడమీద కొడితే కొన్ని అయినా గోడకి అతుక్కుంటాయి" అనే నానుడి మీరు వినే ఉంటారు. అదే సామెత Blood Pressure కి మందులివ్వటంలో కూడా వర్తిస్తుంది. డాక్టర్లు ఒకదాని మీద ఒక మందు ఇచ్చి ఏదో ఒకటి పనిచేస్తుంది అనుకుంటారు. చివరికి వ్యాధిగ్రస్తులు రెండు మూడు మందులు రోజూ వేసుకోవలసి వస్తుంది.
Blood Pressure control లో ఉండటానికి సాధనము మందులే కాదు, బరువు తగ్గటం, వ్యాయామం చెయ్యటం మరియు జీవన విధానాలను మార్చటం ద్వారా కూడా సరి చెయ్య వచ్చు. కానీ మందులతోటి మాత్రమె స్వాధీనము లోకి వచ్చేటట్లయితే, ఖచ్చితంగా ఏమందు వాడాలి అనేది చెప్పటానికి ఒక కొత్త విధానం కనుగొన్నారు.
క్లుప్తంగా HBP గురించి:
మన kidneys లో తయ్యారు అయ్యే renin అనే enzyme మన Blood Pressure ఎక్కువ తక్కువలని నిర్ణయిస్తుంది. శరీరపు అవసరాన్ని బట్టి Renin , blood volume మరియు vascular resistance ని మార్పు చేస్తుంది. కానీ ఎక్కువ రెనిన్ ఉండటము కూడా hypertension కి కారణం అవుతుంది. ఇంతవరకూ డాక్టర్లకి ఎక్కువ రెనిన్ ద్వారా hypertension రోగులకి వస్తోంది అని నిర్ధారించే ఉసులుబాటు లేదు.
ఇప్పుడు hypertension వ్యాధికి ఇచ్చే మందులు రెండు రకాలు.
1. "R" drugs (beta-blockers and ACE inhibitors). ఇవి రక్తం లోని రెనిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తయ్యి.
2. "V" drugs (diuretics and calsium channel blockers). ఇవి blood volume ను తగ్గించి పనిచేస్తాయి.
ఇంతవరకూ డాక్టర్లకి వ్యాధిగ్రస్తులకు ఏమందు ఇవ్వాలి అని నిర్ణయించటానికి సరి అయిన మార్గము లేక, కొందరికి రెండు విధముల మందులూ ఇవ్వ వలసి వచ్చుచుండెను. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశోధనా ఫలితముల వలన ఏ మందు వాడవలెననే నిర్ధారణ తేలిక అగును.
పరిశోధనా ఫలితములు:
ఈ పరిశోధనలు, కొత్తగా గుర్తించిన 945 hypertension వ్యాధిగ్రస్థుల మీద Albert Einstein College of Medicine of Yeshiva University, New York City జరిగినవి. వాటిని American Journal of Hypertension, August 2010, లో ప్రచురించారు.
వ్యాధిగ్రస్థుల blood renin levels, blood pressure గుర్తించి వారికి "R" లేక "V" type drug ఇవ్వటమయినది. ఒకటి నుండి మూడు నెలల తరువాత blood Pressure గుర్తించగా క్రింది ఫలితములు కనపడెను.
1. ఎక్కువ రెనిన్ లెవెల్స్ (more than 2.5 ng/mg/h) ఉన్న వాళ్లకి "R" drug బాగా పనిచేసింది.
2. తక్కువ రెనిన్ లెవెల్స్ (below 0.74 ng/mg/h) ఉన్న వాళ్లకి "V" drug బాగా పనిచేసింది.
3. కొందరి కి తప్పు drug ఇస్తే వాళ్ళ blood pressure పెరిగింది. అంటే ఎక్కువ రెనిన్ వాళ్లకి "V" drug, తక్కువ వాళ్లకి "R" drug అన్న మాట.
మీ డాక్టర్ తో మాట్లాడండి:
ఈ పరిశోధనల కర్త Michael Alderman, MD, former president of The American Society of Hypertension, చెప్పేది ఏమిటంటే ఈ పరిశోధనా ఫలితాలు రోజూ వారీ డాక్టర్ల ఆఫీసుల్లో ఉపయోగానికి రావటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఈ పరిశోధనా ఫలితాలగురించి మీ డాక్టర్నిఇప్పుడే సంప్రదించవచ్చు.
పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చూడండి.
No comments:
Post a Comment