Tuesday, March 22, 2011

52 ఓ బుల్లి కథ 40---- అందాల బొమ్మ రవివర్మ ముద్దుగుమ్మ


లక్కరాజు శివరామకృష్ణ రావు 



రేపు వస్తావని
మాపు వస్తావని

కన్నుల్లో కాయేసి
ఎదురు చూశాను

టింగు రంగా అంటూ
నడిరేయి వచ్చావు

స్నాన పాదులు చేసి
జుట్టార బోశాను

ఏటి వడ్డున్నాను
ఏటోగా ఉంది

బయట సవ్వడి చూసి
నీవు అనుకొంటి

నీవు వస్తావని
ఎదురు చూస్తున్నా

వంటరిగా వున్నాను
జంట నవుదామని



మాలాకుమార్ గారి పోస్ట్ లో పెట్టిన రవివర్మ పిక్చర్  చూసి వ్రాసిన నా భావాలు.
ఇక్కడ వారి పోస్ట్ సాహితి  

14 comments:

  1. చాలా బాగుందండి మీ కవిత . నేను అనుకున్నాను , ఇలా కామెంట్స్ బాక్స్ లో కాకుండా మీ బ్లాగ్ లో రాస్తే ఇంకా చాలా మంది చూసేవారు కదా అని .
    ధన్యవాదాలండి .

    ReplyDelete
  2. రావుగారూ,
    మీ కవిత బాగుందండీ.
    ఈ చిత్రం ఎంతమంది చేత కవిత్వం రాయిస్తోందోకదా...

    ReplyDelete
  3. రావు గారూ ! రవి వర్మ గారి చిత్రమే అద్భుతం గా ఉందను కుంటే మీ భావ పరంపర కవితా సృష్టి అద్భుతం గా ఉంది. మీ కవితలు ఎప్పుడు బాగుంటాయి.నాకు చాలా చాలా ఇష్టం. మీ భావాలు అలా సజీవంగా కళ్ళలో కదులుతూ ఉంటాయి .హేట్సాఫ్ !

    ReplyDelete
  4. మాలా కుమార్ గారూ మీరు ఆ పిక్చర్ పెట్టకపోతే నేనే వ్రాసేవాడినే కాదు. ధన్యవాదాలన్నీ మీకు. థాంక్స్ ఫర్ ది కామెంట్

    ReplyDelete
  5. శ్రీలలిత గారూ మాలా కుమార్ గారిని ముందర మెచ్చుకోవాలి తరువాత inspire అయి వ్రాసిన మనందరికీ ఆ మెచ్చుకోలు. థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  6. రాజేశ్వరి గారూ నేనేమి చెప్పేది. నేను అనుకోకుండా మాలా కుమార్ గారి బ్లాగ్ లో పిక్చర్ చూసి వ్రాసాను. గేయాలు వ్రాసి చాలా రోజులయ్యింది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉన్నది. నేను ఇవాళ చికాగో నుండి సియాటిల్ వచ్చాను. తెలుగులో వ్రాయటం కొంచం కష్టంగా ఉన్నది ఈ కంపూటర్ మీద.
    థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

    ReplyDelete
  7. లక్క రాజు గారికి నమస్కారాలు,

    చాలా బాగా రాసారు,
    చదువుతుంటే తక్కువ సమయంలోనే రాసినట్టు తెలుస్తుంది ..గ్రేట్!

    ReplyDelete
  8. సత్య గారూ మీరు మొదలెట్టారు ఇదంతా. నేను గేయాలు వ్రాసి చాలా ఏళ్ళయింది. మీరు initiate చేశారు మళ్ళా. మాలా కుమార్ గారు పెట్టిన పిక్చర్ చూసాక వ్రాయటం తప్పలేదు. థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  9. ధన్యవాదాలండీ!
    నాదేమీ లేదు ...అదినాకు బాగా తెలుసు!

    "
    అయినా, రవిని ఇంకా కవిని ఒకరు మేల్కొలపరు!
    భానుడికి కిరణాలు భావకుడికి కవనాలు ఒకరునేర్పరు!"

    సత్య

    ReplyDelete
  10. @సత్య గారూ ధన్యవాదాలు. ముందు లో ఇంకా మంచి రచనలు మన అందరినుండీ రావాలని కోరుకుందాము.

    ReplyDelete
  11. శ్రీ లక్కరాజు గారికి,నమస్కారములు.

    కవిత చాలా సున్నితంగా వున్నది. అలాగే, శ్రీ సత్య గారి స్పందన కూడా అంత అందంగానే వున్నది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  12. ధన్యవాదాలు మాధవరావు గారూ ఏవో అప్పుడప్పుడూ బయటికి వస్తూ ఉంటాయి.

    ReplyDelete
  13. $Rao S Lakkaraju గారికి

    ముందుగా మీకు
    :: శ్రీఖరనామ ఉగాది నూతనసంవత్సర శుభాకాంక్షలు. ::

    ****
    చాలా బాగా, సున్నితంగా రాసారు.

    కింద నాలుగు పంక్తులు నేటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవనశైలిని ప్రతిబంబిస్తున్నాయి, అని నా భావన. ;)

    "
    కన్నుల్లో కాయేసి
    ఎదురు చూశాను

    టింగు రంగా అంటూ
    నడిరేయి వచ్చావు
    "

    ReplyDelete
  14. Thank you Rajesh Happy Ugadi greetings from Chicago. I did not realize those four lines reflect us until you mentioned it. The words flow through us without realizing after years of doing it. Thanks again for your comments.

    ReplyDelete