Wednesday, March 10, 2010

14. ఓ బుల్లి కథ 2 ---- నల భీముడు ----

నల భీముడు ----

కౌంటర్ మీద దాన్ని చూడగానే అనుకున్నాను ఏదో విశేషం ఉందని. కారప్పూస కోసం పిండి కలిపెసింది ట. సంవత్సరం బట్టి పెసరపప్పు తో చెయ్య కుండ ఏదోవిధంగా అడ్డుకున్నాను. మా ఇంటో రూల్ ప్రకారం ఆవిడ పిండి కలిపితే నేను కారప్పూస వేయించాలి. అది నా బాధ. ఆవిడ అంటే ఎవరో కాదు మా ఆవిడే. నాకు కొంచెం కోపంగా ఉన్నప్పుడు ఆవిడ అంటాను.

క్రిందటి సంవత్సరం మూడు నెలలు కష్టపడి కారప్పూసకి ఒక ఫార్ముల తాయారు చేసాం. ఒక కప్పు చొప్పున శనగ పిండి, బియ్యప్పిండి అరకప్పు మినపపిండి, అరగటానికి జీలకర్ర వాము మెత్తటి పిండి రెండు స్పూనులు. దానిలో స్పూన్ కారం స్పూన్ ఉప్పు. ఉప్పులేని బట్టర్ స్టిక్ లో సగం . ఒక కప్పు నీళ్ళు పోసి పిండి కలపటం, కారప్పూస చేసాం, రుచి కమ్మగా ఉంది. ఇంక ఇదే పద్ధతి అనుకున్నాము. కారప్పూస మీద నా మార్కు పడిపోయింది. కాని కొందరికి అది ఇష్టం ఉండదు. అసూయ. దానిని ఎలా మార్చాలా అని ప్రయత్నం. ఏదో విధంగా తన మార్కు వెయ్యాలి. నా పేరు రాగూడదు.

నాకు దీని మీద తగువు పెట్టు కోవటం ఇష్టం లేదు. ఇంకోవిషయం మూలాన మూడురోజులబట్టి కోప గృహం (మా ఇంటో అది ఒక గది) లో పడుకున్నాక ఇవాళే మాటలు కలుపు తున్నాను.

సరే కారప్పూస చెయ్యటం మొదలు పెట్టాము. గొట్టం లో నుండి బుంది లాగ నూనెలో పడుతున్నాయి. పిండి లో జిగురు తక్కువయ్యి ఇల్లా వచ్చాయని ఆవిడే గ్రహించింది. పిండి లో ఒక అర కప్పు మినపపిండి వేసి కలిపింది. ఈ తడవ నూనెలో చక్రాలు లాగ వచ్చాయి. రుచి చుస్తే నా కెందుకో చప్పగా ఉన్న ట్టు అనిపించి. కారం ఉప్పు వేస్తె బాగుంటుంది అన్నాను. అవి వెయ్యటం జరిగింది. నూనెలో వేగిన తరువాత చూడటానికి బాగానే ఉన్నాయి కాని ఉప్పెక్కువయ్యింది. అంతా పారేసి మళ్ళా మొదలెడుదాము అన్నాను. సరిఅయిన స్పందన రాలేదు. ఉప్పు లేక పోయినా తినచ్చు కానీ, ఎక్కువ అయితే తినటం చాలా కష్టం. ఈ తడవ పావు కప్పు మినపపిండి వేసి కలిపి కార్యం ముగించాము. ఇంకా రుచి చూడ దలుచు కోలేదు. పళ్ళెం లో మూడు రకాల కారప్పూస ఉంది, బూంది లాంటిది, ఉప్పగా ఉన్నది, రుచి చూడనిది.

నా మాట విననందుకు చాలా కోపం వచ్చింది. చేసిన కారప్పూస చక్రాలన్నీ కచ్చగా చేత్తో నలిపేసి కలిపేశాను. ఇంటికి పది మందిని పిలిచి పెట్టేస్తే అయి పోతుంది. ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తూ నాలుగు ముక్కలు నోట్లో వేసుకున్నాను. వావ్ బ్రహ్మాండం గ ఉంది. ఇంక ఎవర్ని పిలవాల్సిన అవసరం లేదు. ఎల్లా చేసినా బ్రహ్మాండం గ వస్తాయి. ఈ నలభీముడికి అడ్డు లేదు.

7 comments:

  1. రావు గారూ !
    నూతన సంవత్సరంలో మరిన్ని మంచి రచనల్ని పరిచయం చేస్తారని ఆశిస్తూ... ఉగాది శుభాకాంక్షలతో......
    - శిరాకదంబం

    ReplyDelete
  2. @SRRao గారు
    నమస్కారములు. మా హైస్పీడ్ ఇంటర్నెట కొంచం గొఢవయ్యింది. లేటుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. నేను "బుల్లి కథ" అనే పేరుతో ఒక చిన్న పరిశోధన లాగా చేస్తున్నాను. ఫలిస్తుందో లేదో మీరే చూద్దురుగాని. థాంక్స్ ఎగైన్.

    ReplyDelete
  3. fantastic. Man, you're too good! Still laughing even as I type this

    ReplyDelete
  4. ఎవరు, ఎవరు, నా పేరు వాడింది ఎవరు (ఏయన్నార్ స్టైల్లో)
    ఆవిడ :):)
    బాగుంది కధ :):)
    It will be easy for people to comment if you can remove Word Verification. You dont need it anyway.

    ReplyDelete
  5. @కొత్త పాళీ గారూ నమస్కారాలు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. @భాస్కర్ రామరాజు గారూ నమస్కారములు. మీరు అన్నట్టు వర్డ్ వేరిఫికేషన్ తీసేశాను. ధన్యవాదములు.

    ReplyDelete
  7. మీరు అరోరాలో హెక్డ ఉంటారూ?
    నే రెండు వారాల క్రితం అరోరా వచ్చా

    ReplyDelete