Monday, November 22, 2010

36 ఓ బుల్లి కథ 24-- డయబెటీస్ రిస్క్ తగ్గించుకోవాలంటే --

ముందుమాట: Dr. Judith Fradkin of National Institute of Health, US చెప్పిన సలహాలు. ఇవి Parade 22 Nov, 2010 Stay Healthy by Emily Listfield column, 4 Easy Steps to Lower Your Diabetes Risk వ్యాసానికి తెలుగు అనువాదము.

Dr. Judith Fradkin of National Institute of Health, US ఏమి చెబుతున్నారంటే 'మీ టైపు 2 డయాబెటీస్ రిస్క్ ని, రోజూవారి క్రమం లో కొన్ని మార్పులు చేస్తే,  సగానికి సగం తగ్గించ వచ్చు. మీ బరువుని 15 పౌన్లు తగ్గించి, రోజుకి 30 నిమిషములు నడవటం మొదలెడితే మీలో వచ్చే మార్పులని గమనించ గలరు'.
(నామాట: మీ BMI, 18.5  కి 24.9 కి మధ్య నుంటే మీ బరువు సరీగ్గా ఉన్నట్టు లెక్క. క్రింద క్లిక్ చేసి మీ BMI తెలుసుకోండి. http://www.nhlbisupport.com/bmi/bmicalc.htm
Body mass index (BMI) is a measure of body fat based on height and weight that applies to adult men and women.)


ఇంకా వారు చెప్పినవి:
1. Revamp Your Breakfast: మీరు తినే మోతాదుని సరిచూసుకోండి. తక్కువ మోతాదుతో కడుపు నిండిందని అనిపించే ఆహార పదార్ధములను తినండి. Whole-grain bread, whole-grain cereal with skim milk, or low fat yogurt with fruit.

2. Take a 10 minute Break: మీరు చాలా సమయము కంప్యూటర్ దగ్గర కూర్చునేటట్లు అయితే, కనీసం రోజుకి మూడుసార్లు పది నిమిషాలు లేచి తిరగండి. ఎక్సరసయిజు, కండరముల లోనికి రక్త ప్రవాహము ను పంపి వాటి ఇన్సులిన్ receptive ని పెంచుతుంది. 

3. Indulge in half a desert: మీకు డయాబెటీస్ ఉండి తీపి పదార్దములు తింటే మీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చెయ్యటం కష్టము. డయాబెటీస్ లేని వారికి , షుగర్ is a lot of empty కాలోరీస్. మీకు Brownie (చిన్నతీపి చాకొలేట్ కేకు) తినాలని అనిపిస్తే, సగం కేకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి తింటూ, సంతృప్తి పడుతూ, ఆనందించండి.

4. Sleep on it:  నిద్ర సరిగ్గా పోనివారికి డయాబెటీస్ రావటానికి వీలు ఉంటుంది అని పరిశోధనల వల్ల తేలింది.
(నామాట: మీకు మరుసటి రోజు నిద్రలేక బద్ధకంగా ఉన్నట్టుంటే, మీరు సరీగ్గా నిద్రపోలేదని భావన. అందుకని చక్కగా రోజూ నిద్ర పోవుటకు ప్రయత్నించండి.)

చివరిమాట: రోజూ ఆరోగ్యకర మయిన ఆహారం మితంగా తింటూ, మన అవయవాలనన్నీ ఉపయోగించు కుంటూ, నిద్రలేమి లేకుండా జీవితం గడుపుతూ వుంటే డయబెటీస్ ని దూరముగా ఉంచవచ్చు అని తేలుతోంది.

Monday, November 15, 2010

35 ఓ బుల్లి కథ 23 -- బెలూన్ ఫెస్టివల్ లో ఒకరోజు --

ముందు మాట: అక్టోబర్ మొదటి వారంలో అమెరికా లో అల్బుకర్క్(Albuquerque)  అనే ఊళ్ళో ప్రతీ సంవత్సరం వారం రోజులు బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి మేము వెళ్లటం జరిగింది. దానిని గురించే ఈ పోస్ట్.

ఇంట్లో పుట్టినరోజు పండగలకీ వాటికి బూరలూది కట్టడం తప్పితే బెలూనులంటే పెద్ద వ్యామోహం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ లో రోజూ సాయంత్రం వాతావరణ బెలూనులు ఎగరేసేవారు అంతకు తప్పితే వాటి ఉపయోగాలు కూడా ఎక్కువ తెలియవు. అప్పుడప్పుడూ హాట్ ఎయిర్ బెలూన్స్ లో ఎగిరే వారిని చూస్తూ, ఎందుకు వీళ్ళకి ఈ పిచ్చ అనుకునే వాణ్ని. కానీ నా అంతట నేను తెల్లవారుఝామున నాలుగున్నరకు చీకట్లో వణుకుతూ, కారు చీకటిలో బెలూనులు ఎగరేయ్యటం చూట్టానికి వెళ్తానని నేను ఎప్పుడూ కలలోనయినా అనుకోలేదు. ఏడుగంటలకి మొదలయ్యే పండగకి ముందరగా వెళ్ళకపోతే చాలాసేపు క్యు లో నుంచో వలసి వస్తుందిట. అప్పుడు ఎంత చలి అంటే గడ్డి మీద పరుచుకున్దామని తీసికెళ్ళిన దుప్పటిని, బట్టతల ఫ్రీజ్ అవుతుంటే ఆగలేక తలకి చుట్టుకున్నాను. పగలుపూట అచ్చు ఇండియా లో లాగా ఉంటుంది అంటే చికాగో నుండి చలికాగే బట్టలు తెచ్చుకోలేదు. కానీ రాత్రిపూట అలాస్కా లాగా ఉంటుందని ఎవరూ చెప్పలేదు.

అల్బుకర్క్ అమెరికా లో నివసించటానికి  ఒక మంచి ఊరని ఒక చోట Newsweek లో అనుకుంటా చదివాను. అది అమెరికాలో New Mexico అనే రాష్ట్రం లో ఉంది. Mexico కి దగ్గర అవటం మూలంగా  Mexico జీవన విధానము ఎక్కువగా కనపడుతుంది. ఎడారి ప్రదేశము అయినప్పటికీ చుట్టూతా ఎటుచూసినా కొండలు. కొండలపయిన దూది పింజల వంటి తెల్లటి  మేఘాలు. ఆ మేఘాలు కలుపుతూ అనంతమయిన నీలి ఆకాశం. వీటన్నిటి క్రిందా బుజ్జి బుజ్జి ఇళ్ళు, ఊళ్ళు. బంగారు కాంతులతో వీటన్నిటి మీదా తాపడం పెట్టి కనుల పండగ చేసే అస్తమించే సూర్యుడు చూడటానికి చాలా బాగుంటాడు. అసలు ఎయిర్ పోర్ట్ తోనే ప్రారంభము అవుతుంది మెచ్చుకోలు. కొండరాళ్ళ బ్రిక్స్ తో చేసిన ఫ్లోరింగ్ రంగు రంగులతో కళకళ లాడుతూ ఉంటుంది. ప్రపంచం లో ఇటువంటి ఎయిర్ పోర్ట్ నేను ఎక్కడా చూడలేదు . ఇక్కడ నేటివ్ అమెరికన్ ఇండియన్స్ ఉండటము మూలాన వాళ్ళ పద్ధతులు ఎక్కువగా కనపడుతూంటాయి. ఓల్డ్ సిటీ చావిళ్ళల్లో పూసల దండలనుండీ చేత్తో చేసిన అనేక ఆభరణాలు అమ్ముతారు. ప్రతీ షాప్ ముందరా ఎండు మెరపకాయల దండలు వెళ్ళాడేస్తారు. దుష్ట శక్తులు రాకుండా ఉండటానికి.

ఇంక బెలూన్స్ సంగతికి వస్తే, అసలు మాకు ఈ బెలూన్ల పిచ్చ రావటానికి కారణం, మొన్న మార్చి లో ఇక్కడకి వచ్చినప్పుడు, ఉబుసుపోక బెలూన్ మ్యుజియం కి వెళ్ళటం జరిగింది. అది ఒక చూడవలసిన ప్రదేశము ఇక్కడ. హాట్ ఎయిర్ బెలూన్స్ ఎల్లా తాయారు చేస్తారో, ఎంతమంది దానిలో ఎక్కి ప్రపంచం చుట్టి వద్దామని ప్రయత్నించారో, యుద్ధం లో వాటిని ఎల్లా ఉపయోగించేవాళ్ళో , ఇంగ్లాండ్ నుండి అమెరికాకి బెల్లూన్ షిప్ లో ఎలా వచ్చేవాళ్ళో అంతా తెలుసు కున్నాము. సిమ్యులేటర్ లో బెలూన్ నడపటానికి ప్రయత్నించాము కూడా. కాకపోతే అది గాలికి కొట్టుకు పోయి దిగవలసిన చోట దిగలేదు. అంతా ముగించుకుని వెళ్లబోతుంటే, అక్కడ పనిచేసే ఆయన, మేము బెలూన్ల గురించి చాలా అడగటం గమనించి, అక్టోబర్ లో బెలూన్ల పండగ ఉంది రమ్మన్నాడు. అక్కడ వచ్చింది గొడవ. ఏమయినా సరే అక్టోబర్ లో ఇక్కడికి రావాల్సిందే అని నిర్ధారణ అయిపొయింది. వయసు పెరిగినకొద్దీ మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే, అన్నిటికీ తలతిప్పుతూ ఉండాల్సిందే. అయినా మనదేమి పోయింది సుబ్బరంగా తీసుకువెళ్ళి తిప్పుతానంటే.

ఇక్కడ జరిగేది International Balloon Festival అంటారు. International వాళ్ళని చూడలేదు గానీ అమెరికాలో మిగతా చాలా  రాష్ట్రాలనుండి ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేయ్యటానికి వచ్చిన వారిని చూశాను. ఒక్కొక్కళ్ళు తమ బెలూన్ సరంజామాతో పెద్ద పెద్ద వానుల్లో వచ్చారు. అక్కడ దాదాపు వంద షాపులు గుడారాల్లో ఉన్నాయి. చాలావరకు రకరకాల తినే వస్తువులు. మొదట తినటం ముఖ్యం కదా. నాకు ఫన్నేల్ కేక్ అంటే ఇష్టం. పిల్లలు క్యు లో నుంచుని తెచ్చి పెట్టారు. మీరు చూసే మొదటి ఫోటో మేము బెలూన్స్ ఎగరేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు చిమ్మ చీకట్లో తీసిన ఫోటో. మొట్టమొదట బెలూన్ ని క్రింద పరుస్తారు. అది దాదాపు ముప్పై అడుగులు ఉంటుంది. దాని ముఖద్వారములో చాలా శక్తివంతమయిన ఫ్యాన్ పెట్టి గాలి గట్టిగా విసురుతారు. అది హోండా కంపెని తయారు చేసిన ఫ్యాన్. చూసి ఆశ్చర్య పోయాను. కొన్ని నిమిషాలకి బెలూన్ కొంచము పైకి లేస్తుంది. అప్పుడు propane గ్యాస్ కొద్దిగా వెలిగిస్తారు. బెలూన్ లో ఉన్న గాలి వేడెక్కి బెల్లూన్ లేచి నుంచుంటుంది. దానికింద ఒక పెద్ద బుట్ట ఉంటుంది. దానిలో propane గ్యాస్ వెలిగించటానికి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. దానిలో నలుగురు ఎక్కవచ్చు. అందులో ఒకళ్ళు పైలట్,  propane గ్యాస్ తో బెలూన్ లో గాలిని వేడిచేస్తూ బెలూన్ ని కంట్రోల్ చేస్తాడు. ఇప్పటి దాకా బెలూన్ ఎగరకుండా పదిమంది పట్టుకుంటారు. బుట్టలోకి ప్రయాణీకులు ఎక్కంగానే, వాళ్ళు దాన్ని వదిలేస్తారు. బెలూన్ పైకి ఎగురుతుంది. అప్పటినుండి పైలట్ కంట్రోల్ లో ఉంటుంది. అల్లా ఒక్కొక్క వరుసలో పది బెలూన్స్, దాదాపు పది వరసల నుండి ఎగరటం మొదలెడు తాయి. నిమిషాల్లో ఆకాశం అంతా బెలూన్ల మయం. కొన్ని బెలూన్స్ మనకు తెలిసిన ఆకారాలుగ కూడా చేశారు. తొమ్మిది గంటలకి అంతా అయిపోయి ఇంటిముఖం పట్టాము. మళ్ళా సాయంత్రం చీకట్లో బెలూన్స్ లో propane మెరుపులు చూడటానికి, బాణసంచా చూడటానికి, వచ్చాము. కానీ కారు చీకట్లు కమ్మి, మేఘావ్రుతమయి ఇసుక తుఫాను రావటం తో చూడటము పడక త్వరగా ఇంటికి చేరుకున్నాము. నేను చెప్పినవన్నీ క్రింద ఫోటోలలో చూడచ్చు.

చివరిమాట: రెండవ ప్రపంచ యుద్ధానికి చరమ గీతం పాడిన యాటమిక్ బాంబ్ తయారు చేసిన ప్రదేశం, లాస్ ఎలామోస్, అల్బుకర్క్ కి దగ్గరే. లేకపోతే జపాన్, జర్మనీ ప్రపంచాన్ని పంచుకునేవాళ్ళు. అల్బుకర్క్ లో న్యుక్లియర్ మ్యుజియం కూడా
ఉన్నది. దగ్గరలో ఉంటే తప్పక వెళ్ళండి.