ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ పక్కన కాఫీ తాగుతూ హులా డాన్సు చూడటం. మేము ఉన్న Ashton Waikiki Beach Hotel లో ఉదయం పలహారాలు ఫ్రీ.
పక్క అమ్మాయి హైస్కూల్ లో చివరి సంవత్సరం చదువుతోంది. పొద్దున్నే డాన్సు చేసి స్కూలుకి వెళ్తుంది. తనకి ఇది పార్ట్ టైం ఉద్యోగం.
భార్యని రివోల్వింగ్ రెస్టారెంట్ కి (ఆవిడ ఎప్పుడూ వెళ్ళలేదు) తీసుకువెళ్లటం. అక్కడ తినటానికి ఏమీలేక "పాస్తా" చేయించుకు తినటం. అది నిజంగా తిరుగుతోందని ఒక గంట కూర్చుని నిరూపించటం.
"International Market Place" లో షాపింగ్ కి తీసుకు వెళ్ళటం.
తీసుకు వెళ్ళిన రైసు కుక్కర్ తో రోజూ గోంగూర ముద్దా, పెరుగు ముద్దా తినటం. తరువాత తెలిసింది, నా కడుపుకింత పడేయ్యటం రోజంతా నసగకుండా ఉండటానికిట.
"Snorkel" చేద్దామనకున్న వాళ్ళని జిహ్వకో రుచి అని వాళ్ళ పాటిన వాళ్ళని వదిలెయ్యటం.
Subway "veggie Max" తింటూ సూర్యుడికి వీడ్కోలు ఇవ్వటం.
చివరి రోజు Waikiki Hilton లో fried rice చేయించుకుని తినటం.
ఈ క్రింది Travel Video చూడండి
మేము ఉపయోగించిన కెమెరాలు నాలుగు:
Canon Power shot SD 1200 IS
Sony Cybershot DSC-W310
Two Canon EOS REBEL T2i
పిక్చర్స్ తీసినవాళ్ళు పది మంది.