Wednesday, February 2, 2011

44 ఓ బుల్లి కథ 32 ---- Hawaii -- Polynesian Cultural Center


పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు 1000 పైగా ఉన్న ద్వీపాల్నన్నిటినీ కలిపి Polynesian Islands అంటారు. ఈ ద్వీప వాసులందరి  వేషభాషలు, నాగరికత, జీవన విధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. Hawaii ద్వీపాలు వీటిల్లో  కొన్ని. ఇక్కడ మాట్లాడే భాష Hawaiian. ఈ Polynesian Islands నాగరికతని చూపించ టానికి నిర్మించినదే Polynesian Cultural Center. Honolulu కి కొంచెం దూరంలో ఉంది. కారులో వెళ్ళాలి. చూడటానికి, వారి నాగరికతని తెలుసుకోవటానికి చాలా ఆకర్షణలు ఉన్నాఇక్కడ. మీకు వీలయితే పగలు పూట వెళ్ళండి అన్నిటినీ చూడవచ్చు.

మాకు సమయము దొరకక రాత్రిపూట ఇక్కడ జరిగే ఒక షో కి వెళ్ళాము.ఈ షో వీరి నాగరికత గురించి. కథ నాకు అర్ధమయినంత వరకూ ఇది; ఒక పల్లెటూళ్ళో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెంటపడుతూ ఉంటాడు. అమ్మాయికీ అబ్బాయంటే ఇష్టమే. ఆ ఊరి పెద్ద అనుమతి ఉంటేగానీ ఈ పెళ్లి జరగదు. ఆ అబ్బాయి ఎందుకోమరి భయపడి అమ్మాయికి చెప్పకుండా  పారిపోతాడు. ఊరి పెద్ద అనుమతితో  ఆ అబ్బాయిని వెంట బడి పట్టుకుని చివరికి పెళ్లి చేస్తారు. తరువాత వాళ్ళకి పిల్లాడు కూడా పుడతాడు. ఇదంతా ఒక డాన్సు డ్రామా గా వేశారు.

నాకు ఆశ్చర్యము కలిగించిన విశేషాలు సూక్ష్మంగా :  పెళ్ళికి  అబ్బాయినీ అమ్మాయినీ భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకు వస్తారు. ఒకరింట్లో పెళ్లి అనేది ఆ ఊరంతటికీ ఒక celebration. అమ్మాయిలు చెవి పైన పువ్వు కుడివేపు పెట్టుకుంటే పెళ్లి అయినట్లు, ఎడమవైపు పెట్టుకుంటే కానట్లు. వీళ్ళు కోడి పందేలు కూడా జరుపుకుంటారు. వెలుగుకి కాగడాలు వాడుతారు. వాటితో డాన్సులు కూడా చేస్తారు.

Honolulu ఉన్నOvahu  ద్వీపం చుట్టుతూ ఒక హైవే ఉంది. దాని మీద డ్రైవింగ్ చాలా బాగుంటుంది. చుట్టూతా ఉన్నఅన్ని Beaches లోనూ ఆగి చూడవచ్చు.మర్నాడు డ్రైవ్ చేస్తూ వరుసగా Beaches చూస్తూ సెంటర్ వైపు వచ్చాము. కానీ సెంటర్ లోపలికి వెళ్ళటానికి కుదరలేదు. సెంటర్ కి దగ్గరలో మెక్డోనాల్డ్  ఉంది. అక్కడ లంచ్ కి ఆగాము. ఒక ఇంటిలో ఉన్న మెక్డోనాల్డ్ ని నేనెక్కడా చూడలేదు. అందుకని ఫోటో తీశాను. మీకోసం ఇక్కడ పెడుతున్నాను.

ఈ పోస్ట్ లో రెండు వీడియోలు పెడుతున్నాను. మొదట వీడియో Polynesian డాన్సు ఎల్లా ఉంటుందో చూపించటానికి. రెండోది వీళ్ళ డాన్స్ లలో ఒకటయిన Hula డాన్స్ ఎల్లా చెయ్యాలో నేర్పేది. చూసి ఆనందించండి.




















4 comments:

  1. నమస్కారములు.
    పొలొనీషియన్ ఇలాండ్ లోని వారి హూలా డాన్స్ గురించి వారి పెళ్ళి తంతు కోడి పందేలు చెవిలొ పువ్వు భుజాల మీద కూర్చో బెట్టు కోవడం వారి ఆచార వ్యవహారాలను చదువు తుంటే చాలా ఇంట్రస్టింగు గా ఉంది .ఇక వీడియోలు చూస్తుంటే నిజంగా అక్కడ ఉన్నంత ఆనందం ఇంతకు ముందు మీరు " పెరల్ హార్బరు , పైనాపిల్ పీలింగు , బెలూన్లు " ఇలా జత చేసిన వీడియోలన్ని ఎంతొ బాగుంటాయి. రోజుకోసారైనా అన్ని చూస్తూ ఉంటాను.నాకు ఫొటోలు వీడియోలు ఉంచడం రాదుగా అందుకని

    ReplyDelete
  2. @రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. హులా డాన్స్ ని ఎక్సరసైజు గ చేయవచ్చు కూడా. హులా డాన్స్ అంటే సముద్రపు అలల గలగలని సుతారంగా చేతుల మెరమెరలతో చూపించటం.

    ReplyDelete
  3. నేను , ఆనందం బ్లాగ్..... anrd నండి . ఈ బ్లాగులు చదవటం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయండి. మీరు వ్రాసిన బెలూన్ ఆత్మ కధ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ చదవటం నాకు ఇష్టమే కానీ వాటికి కామెంట్స్ రాయలేదు ఇంతవరకూ. కామెంట్స్ రాయటమంటే నాకెందుకు భయమో ఎప్పుడయినా చెబుతానండి. కృతజ్ఞతలండి..

    ReplyDelete
  4. @anrd
    Nice to see you. Our motto is enjoy life without hurting anybody. And share things what we can to make other's life easier and comfortable.
    మీరు ఇక్కడకి వచ్చి వ్యాఖ్య పెట్టినందుకు ఆనందంగా ఉంది.

    ReplyDelete