Monday, January 24, 2011

43 ఓ బుల్లి కథ 31 ---- Hawaii -- Pearl Harbor

మన జీవితం లో చూసే, Memorials, సంవత్సరికాలూ, పుట్టినరోజులూ, మెట్టిన రోజులూ, ఇవన్నీ జరిగిన ముఖ్య సంఘటలని గుర్తు కి తెస్తూ వుంటాయి.ఇవి మనస్సు నుంచి చెదరిపోని కొండ గుర్తులు. దీనికి కారణం మనము నేర్చుకోవాల్సినవి వాటిలో ఉన్నాయని మన మనస్సు గ్రహించటమే. అందులో Pearl Harbor సంఘటన ఒకటి. ఇది, మా తెలివి తేటలు ఎవ్వరికీ లేవు, మాకెవ్వరూ అడ్డు రారు, రాలేరు అని విర్రవీగే వాళ్ళకి అహం ఎల్లా దెబ్బ తింటుందో, ఒక పెద్ద ఉదాహరణ.

Pearl Harbor Memorial గురించి క్లుప్తంగా చెప్పాలంటే జపనీస్, Pearl Harbor మీద గుప్తంగా ముట్టడి చేసి అమెరికా పసిఫిక్ ఫ్లీట్ ని దాదాపు సర్వనాశనం చేసిన రోజు  స్మరించుకోవటానికి కట్టిన కట్టడం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో,  మనమీదకి ఎవ్వరూ దండెత్తలేదు కదా అని తటస్థస్థాయిలో ఉన్న అమెరికా కి కనువిప్పు కలిగించి, Japan మీద యుద్ధ ప్రకటనతో రెండవ ప్రపంచ యుద్ధం లో దిగటానికి కారణమయిన రోజు. అటునుంచి జపాన్ ఇటునుంచి జర్మనీ ప్రపంచాన్ని కబళించే ప్రయత్నాన్ని అడ్డుకున్న రోజు. ప్రపంచములో మనకెవ్వరూ అడ్డులేరు అనుకున్న వాళ్ళకి గడ్డురోజులు మొదలయిన రోజు.

ఆరోజు చనిపోయిన దాదాపు 3000 మందిని స్మరించుకోటానికి నిర్మించిన Memorial ని చూడటానికి వెళ్ళాము. మునిగిపోయిన "ARIZONA" యుద్ద నౌకను పైకి తీసి దాని మధ్యలో సముద్రము లో ఈ మెమోరియల్ ని కట్టారు. మేము వెళ్ళిన రోజు సముద్రపు గాలులు తీవ్రత మూలంగా విజిటర్స్ ని వెళ్ళ నివ్వ లేదు. అక్కడ ఒక మ్యుజియం ఉంటే చూశాము, ఒక అమెరికన్ సబ్మరైన్ ఉంటే లోపలికి వెళ్ళి చూశాము. మెమోరియల్ లోకి వెళ్ళలేక పోయినా, మీరే కదా మా స్వాతంత్ర జీవితానికి అంకురార్పణ చేసింది అని స్మరించుకున్నాము.

ఈ పోస్ట్ లో మెమోరియల్ ఫోటో, సుబ్మరైన్ ఫోటో, జపనీస్ దండయాత్ర (Dec 7, 1941) వీడియో, రెండవ ప్రపంచ యుద్దానికి అడ్డుకట్ట వేసిన అమెరికా సమాధానం (Aug 6, 1945) వీడియో పెడుతున్నాను. ఈ రెండు వీడియోలు Re-enactments.

ఫోటోలు వీడియోలు నేను తీసినవి కాదు.





















6 comments:

  1. విర్ర వీగటం, అహం దెబ్బ తినటం గట్రా గట్రా ఏదో వ్రాసారు కానీ ఎవరు విర్ర వీగారో, ఎవరి అహం దెబ్బ తిందో clarity లేదు. ఇంకొంచెం better గా వ్రాయవచ్చు అనిపిస్తోంది. (అందరికీ pearl harbor గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా)

    ReplyDelete
  2. @Anonymous గారికి
    నేను రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు జరిగిన సంగతుల గురించి చెబుతున్నాను. జర్మనీ,Japan వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని పరిపాలించాలని అనుకున్నారు. ఒక్కొక్క దేశాన్నీ వాళ్ళ అదుపులోకి తీసు కొంటున్నారు. అమెరికా మీద వాళ్ళు ముట్టడి చెయ్యలేదు కాబట్టి అమెరికా యుద్ధం లో చేరకుండా తటస్థంగా ఉన్నది(బ్రిటన్ కోరినా కూడా). అమెరికా ప్రజలు కూడా యుద్ధం లో కి వెళ్ళటానికి ఇష్ట పడలేదు. Japan పెరల్ హార్బర్ మీద బాంబులు వేసిన రోజుతో అమెరికా యుద్ధం లోకి రావటం తోటి జర్మనీ,Japan ఆశలు అడియాస లయ్యాయి. ఆ రోజు అల్లా జరగక పోతే ప్రపంచం ఎల్ల వుండేదో చెప్పలేము.

    దీనిలో నాకు కనుపించిన నీతి ఏమిటంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వచ్చు ఎంతవారలయినా ఎగిరెగిరి పడ వలసిన అవుసరము లేదు అని.

    ReplyDelete
  3. అహం, విర్రవీగడం అటుంచితే... అమెరికా వాడి దగ్గర అప్పటికి రెండే బాంబులున్నాయట, దురదృష్టవశాత్తు రెండోది పేలి వుండకపోతే, కథ వేరేలా వుండేదేమో. " మీరే కదా మా స్వాతంత్ర జీవితానికి అంకురార్పణ చేసింది అని స్మరించుకున్నాము." ఇది అర్థం కాలేదు, మీరు అమెరికన్లా(పౌరులు)? జపాన్ బర్మా దాటివుంటే బ్రిటీష్ వారు 1943లోనే పలాయనం చిత్తగించేవాళ్ళు, మనకు (ఇండియాకు) స్వతంత్రం వచ్చివుండేదేమో కదా.
    ఇదంతా గేం, గెలుపుఓటములు ఓ లక్. అమెరికా తను మాత్రం పాఠం నేర్చుకోలేదు: ఇరాక్ మీద దాడి, పాకిస్థాన్ తోక పట్టుకుని ఆఫ్ఘనిస్థాన్ ని ఈదాలనుకోవడం ద్వారా ఒళ్ళు కాల్చుకుంది.

    ReplyDelete
  4. @Anonymous గార్కి
    నేను కొంచం విపులంగా వ్రాయాల్సింది. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

    @Snkr గార్కి
    ఆ సమయంలో బ్రిటీష వాళ్ళు వెళ్లి పోతే ఇండియా జపనీస్ చేతుల్లో చిక్కేదేమో కదా. అప్పుడు ఉన్న పరిస్థితి ఒకటే. ఏసియా అంతా జపనీస్ క్రింద, యూరోప్ అంతా జర్మనీ క్రింద రావాలని. ఇంకో చిత్రమయిన విశేషం, అప్పుడు జపాన కి ఆయిల్ అమెరికా సప్లై చేసేది. ఆఫ్గనిస్తాన్ ని చరిత్ర లో ఇంతవరకూ ఏ దేశమూ జయించ లేదనుకుంటాను. ఐ మే బి రాంగ్.
    అందుకనే మన సామెతలంటే నాకు చాలా ఇష్టం.
    థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  5. నమస్కారములు.
    ఆర్టికల్ బాగుంది నాలాంటి తెలియని వారికి తెలుసుకోవలసినవి చాలా బాగా చెప్పారు. " ఫోటోలు వీడియోలు చక్కగా ఆశక్తి దాయకంగా కన్నుల విందు చేస్తున్నాయి. నిజమె ! ఎంతటి వారికైనా అహం పనికి రాదు." ఎదిగిన గొద్దీ వదగమని " అన్నారు కదా ? .బంగారపు పళ్ళానికైనా గోడ చేరువ కావాలి మరి ?

    ReplyDelete
  6. @రాజేశ్వరి గారికి
    నేను చూసి ఆనందించినవి అందరికీ చూపాలనే నా ఆరాటాన. అక్కడికి తీసుకు వెళ్ళలేను. నాకు తెలిసింది మాటల్లో పెట్టడం.అందుకే ఈ పోస్టులు. వాటిలో కూడా పరిపూర్ణత ఉన్నదో లేదో కూడా తెలియదు. మీకు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

    ReplyDelete