Monday, January 17, 2011

42 ఓ బుల్లి కథ 30 ---- Hawaii -- Pineapple Express




అమ్మా రైలు వస్తోంది. త్వరగా రా.












ఇంకా రావేమే. వెళ్ళిపోతుంది తొందరగా రా.











అమ్మయ్య ఎక్కాను రైలు. ఇంక కదలవే రైలూ.





ఛుక్ ఛుక్ రైలు కదిలిందిరా. అమ్మ అవిగో మామిడి కాయలు. అవిగో బనానా.  ఏమిటే ఆ పూలు?





అవిగో పైనాపుల్ చెట్లు.












చాకొలేట్ చెట్టు.






అబ్బ ఎన్ని రంగుల చెట్లో!!











చూడు ఎంత బాగుందో.











గణ గణ గణ క్రాస్సింగ్ గేటు వస్తోంది.















అదిగో వాటర్ ఫాల్!.












అబ్బా ఎంత పెద్ద పొలామో!









.
అమ్మాస్టేషన్ వచ్చేసింది.  దిగాలి.


అమెరికాలో ఉన్నవాళ్ళు Dole Pineapple అనే మాట వినకుండా తప్పించుకోలేరు.  ఆ రెండు పదాలకి అవినాభావ సంబంధముంది. 15th century  లో pineapple దక్ష్నిన అమెరికాలో బ్రజిల్ అనే దేశం నుండి వచ్చి అమెరికా, చైనా, ఇండియా మొదలయిన దేశాలకు పాకింది. అమెరికా లో వృక్ష శాస్త్రము చదివిన, జేమ్స్ డోల్, 1900 లో 22 ఏళ్ళప్పుడు Hawaii వచ్చి pineapples తోట వేసి పెంచటం మొదలెట్టాడు. వ్యాపారం వేగంగా పుంజు కొనుట మూలముగా దానిని plantation గ చేసి పండించి,  Honolulu లో ప్రాసెస్సింగ్ ప్లాంట్ పెట్టి ప్రపంచమంతా pineapple ని export  చేశారు. ఆయన వ్యాపారం అలా అభివృద్ది చెందటం మూలంగా దగ్గరున్న ఒక ద్వీపాన్ని(Lanai) కొనివేసి pineapples పెంచి, ఎగుమతి చేసి, Dole అనే పేరు ప్రపంచమంతా తెలిసేటట్లు చేసాడు. Pineapple, Hawaii లో ఒక వ్యాపార పంట. ఒకప్పుడు 75%  ప్రపంచం లో వాడే  pineapples ఇక్కడినుండే వచ్చేవి. Pineapple Plantation ఎల్లా వుంటుంది, ఏ విధంగా సేద్యం చేస్తారు అనే వాటిమీద Dole Plantation వారు ఒక చిన్న ట్రైన్ టూర్  పెట్టారు. దానికి మేము వెళ్ళాము. ఈ పొలం(Plantation) లో దాదాపు మన వేపు పండే అన్ని పళ్ళ చెట్లు, మామిడి, అరిటి, పనస మొదలయినవి చూడవచ్చు. పొలంలో పనిచెయ్యటానికి కావలసిన యంత్రాలని కూడా చూడవచ్చు.

ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. దానిలో Pineapple Ice cream చాలా బాగుంటుంది. షాప్ లో ఒక మూల నడుము నొప్పికి Hawaiian Instant వైద్యం చేస్తున్నారు. "Noni" bottle లో నుండి మందు తీసి నడుముకి ఒక నిమిషం రాస్తారు. నొప్పి తగ్గితే కొనుక్కోండి అంటున్నారు. మేము టెస్ట్ చేసిన తరువాత,  రెండు సీసాలు "Noni" కొనుక్కున్నాము. ఈ కాలంలో నడుం నెప్పులు ఎవరికి  రావటల్లేదు?

ఈ క్రింద Pineapple Express టూర్(Dole plantation టూర్), ఎవరో తీసిన వీడియో పెడు తున్నాను.దానితో పాటు Pineapple  ఎల్లా మెషిన్ తో ప్రాసెస్ చేస్తారో వీడియోలు కూడా  పెడుతున్నాను. చూసి ఆనందించండి.

మీకు వీడియో మధ్యలో ఆగి పోతుంటే, స్టాప్ చేసి కాసేపు ఆగితే buffering (డౌన్లోడ్ ) అవుతుంది. అప్పుడు ప్లే చెయ్యండి. ఆగకుండా చూడవచ్చు.








8 comments:

  1. By e-mail from Sayee Koka
    Hi LSRao

    I enjoyed seeing the Hawaii pictures and also the videos especially
    Pineapple video it was very descriptive

    Sayee

    ReplyDelete
  2. Great information....Thanks for sharing Raju gaaru.

    ReplyDelete
  3. @sayee and Rajesh gaaroo

    Thanks for the comments. What I am trying is a little touch to a beautiful place.

    ReplyDelete
  4. చుక్ చుక్ రైలు వచ్చింది అమ్మ ఆలశ్యం గా రైలు ఎక్కింది . రైలు కదులుతుంటే దృశ్యం ఎంత అందం గా ఉందో ? మామిడి కాయలు బనానాలు అందమైన పూలు హబ్బ ! కన్నుల విందు చేస్తున్నాయి.ఇంకా పైనాపిల్ చెట్లు చాకోలేట్ చెట్లు భలే భలె .
    ఇంకా రంగు రంగుల చెట్లు , అబ్బో ! సీనరీ ఎంత చక్కగా ఉంది.గణ గణ క్రాసింగు గేటు ,హాయ్ హాయ్ వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉందొ.మరి.ఎంత పెద్ద పొలమొ ? ? ? హయ్యొ ! అప్పుడే గేటు వచ్చేసిందా ? ప్చ్ ! దిగి పోవాలా ? తప్పదా ? ? ?

    ReplyDelete
  5. @రాజేశ్వరి గారూ
    శంకరాభారణంలో నాలుగు పద్య పాదాల్లో దృశ్యాన్ని చిత్రీకరించలేక ఏవో నాలుగు వాక్యాలుగా వ్రాయటానికి ప్రయత్నించాను. థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  6. You have so many talents Rao Garu
    Thank you for sharing.

    ReplyDelete
  7. నమస్కారములు
    రావు గారూ ! సీరియస్ గా తీసుకున్నారా ? భలే వారె ! అసలు మీరు చిత్రాలకు రాసిన వ్యాఖ్యలు నాకు ఎంతగానొ నచ్చిసరదాగా అల్లా రాసాను. ఇంతకు ముందు కుడా బెలూన్లకు రాసారు కాని అప్పుడు ఏమి అనిపించ లేదు మీ రచనల ముందు మీ నాలెడ్జ్ ముందు నేనెంత మీ పేరు అనడానికి కుడా నేను పనికి రాను.నాకు నిజంగా బాగా నచ్చాయి.చక్కని వ్యాఖ్యలు వాటికి తగిన అందమైన చిత్రాలు అక్కడే ఉన్నంత అనుభూతి.నిజం.ఇది నిజమైన నిజం.ఒట్టు.పొరబాటుకు మరి ప్చ్ ! క్షమించక పోతె ఎలా ?

    ReplyDelete
  8. @bachisri గారూ
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    @రాజేశ్వరి గారూ
    మీరు వ్రాసిన కామెంట్ బ్రహ్మాండంగా ఉంది. మనము పద్యాలు వ్రాసినా, వాక్యాలు వ్రాసినా కోరుకునేది ఏమిటంటే చదువరులకు ఒక దృశ్యాన్ని కన్నులముందు పరిచి సుతారంగా నడిపించాలని. మీరు వ్రాసిన కామెంట్ మళ్ళా చదువుకోండి, దృశ్యం ఎంత చక్కగా కళ్ళముందు కదిలి పోతుందో. మీకు ఎందుకు అనుమానం వచ్చిందో అర్ధం కాదు. పోస్ట్ చదివిన తరువాత వచ్చిన మనసులో ప్రేరేపణలే కామెంట్స్ క్రింద వస్తాయి. మీ కామెంట్స్ ఎప్పుడూ బాగానే ఉంటాయి.

    ReplyDelete