అమ్మా రైలు వస్తోంది. త్వరగా రా.
ఇంకా రావేమే. వెళ్ళిపోతుంది తొందరగా రా.
అమ్మయ్య ఎక్కాను రైలు. ఇంక కదలవే రైలూ.
ఛుక్ ఛుక్ రైలు కదిలిందిరా. అమ్మ అవిగో మామిడి కాయలు. అవిగో బనానా. ఏమిటే ఆ పూలు?
అవిగో పైనాపుల్ చెట్లు.
చాకొలేట్ చెట్టు.
అబ్బ ఎన్ని రంగుల చెట్లో!!
చూడు ఎంత బాగుందో.
గణ గణ గణ క్రాస్సింగ్ గేటు వస్తోంది.
అదిగో వాటర్ ఫాల్!.
అబ్బా ఎంత పెద్ద పొలామో!
.
అమ్మాస్టేషన్ వచ్చేసింది. దిగాలి.
అమెరికాలో ఉన్నవాళ్ళు Dole Pineapple అనే మాట వినకుండా తప్పించుకోలేరు. ఆ రెండు పదాలకి అవినాభావ సంబంధముంది. 15th century లో pineapple దక్ష్నిన అమెరికాలో బ్రజిల్ అనే దేశం నుండి వచ్చి అమెరికా, చైనా, ఇండియా మొదలయిన దేశాలకు పాకింది. అమెరికా లో వృక్ష శాస్త్రము చదివిన, జేమ్స్ డోల్, 1900 లో 22 ఏళ్ళప్పుడు Hawaii వచ్చి pineapples తోట వేసి పెంచటం మొదలెట్టాడు. వ్యాపారం వేగంగా పుంజు కొనుట మూలముగా దానిని plantation గ చేసి పండించి, Honolulu లో ప్రాసెస్సింగ్ ప్లాంట్ పెట్టి ప్రపంచమంతా pineapple ని export చేశారు. ఆయన వ్యాపారం అలా అభివృద్ది చెందటం మూలంగా దగ్గరున్న ఒక ద్వీపాన్ని(Lanai) కొనివేసి pineapples పెంచి, ఎగుమతి చేసి, Dole అనే పేరు ప్రపంచమంతా తెలిసేటట్లు చేసాడు. Pineapple, Hawaii లో ఒక వ్యాపార పంట. ఒకప్పుడు 75% ప్రపంచం లో వాడే pineapples ఇక్కడినుండే వచ్చేవి. Pineapple Plantation ఎల్లా వుంటుంది, ఏ విధంగా సేద్యం చేస్తారు అనే వాటిమీద Dole Plantation వారు ఒక చిన్న ట్రైన్ టూర్ పెట్టారు. దానికి మేము వెళ్ళాము. ఈ పొలం(Plantation) లో దాదాపు మన వేపు పండే అన్ని పళ్ళ చెట్లు, మామిడి, అరిటి, పనస మొదలయినవి చూడవచ్చు. పొలంలో పనిచెయ్యటానికి కావలసిన యంత్రాలని కూడా చూడవచ్చు.
ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. దానిలో Pineapple Ice cream చాలా బాగుంటుంది. షాప్ లో ఒక మూల నడుము నొప్పికి Hawaiian Instant వైద్యం చేస్తున్నారు. "Noni" bottle లో నుండి మందు తీసి నడుముకి ఒక నిమిషం రాస్తారు. నొప్పి తగ్గితే కొనుక్కోండి అంటున్నారు. మేము టెస్ట్ చేసిన తరువాత, రెండు సీసాలు "Noni" కొనుక్కున్నాము. ఈ కాలంలో నడుం నెప్పులు ఎవరికి రావటల్లేదు?
ఈ క్రింద Pineapple Express టూర్(Dole plantation టూర్), ఎవరో తీసిన వీడియో పెడు తున్నాను.దానితో పాటు Pineapple ఎల్లా మెషిన్ తో ప్రాసెస్ చేస్తారో వీడియోలు కూడా పెడుతున్నాను. చూసి ఆనందించండి.
మీకు వీడియో మధ్యలో ఆగి పోతుంటే, స్టాప్ చేసి కాసేపు ఆగితే buffering (డౌన్లోడ్ ) అవుతుంది. అప్పుడు ప్లే చెయ్యండి. ఆగకుండా చూడవచ్చు.