Tuesday, January 11, 2011

41 ఓ బుల్లి కథ 29 ---- Hawaii -- Waikiki Beach

హవాయీ ద్వీపాలు పసిఫిక్ మహాసముద్రములో అమెరికా పశ్చిమ తీరానికి 2500 మైళ్ళ దూరం లో ఉన్నాయి. వీరి భాష, నాగరికత వేరు. కానీ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు. ఇది అమెరికాలో 50 వ రాష్ట్రము. సియాటిల్, శాండియాగో, లాస్ యాన్జిల్స్, శాన్ఫ్రాన్సిస్కో ల నుండి దాదాపు  5 గంటల విమాన ప్రయాణం. ఈ ద్వీపాల పేర్లు Hawaii, Oahu, Mauve, Kauai మొదలయినవి.  ఈ ద్వీపాలలో టూరిస్ట్ లు ఎక్కువగా వెళ్ళే ద్వీపం పేరు Oahu . దీనిలో పెద్ద పట్టణం Honolulu . ఈ పట్టణంలో టూరిస్ట్ లు ఎక్కువగా తిరిగే  వీధి Kalakauva Avenue , ఎక్కువగా ఆకాశ హర్మ్యాలు ఉన్నది కూడా ఈ వీధిలోనే. ఈ  ప్రదేశాన్ని Waikiki అంటారు. Waikiki బీచ్ ఇక్కడే ఉంది. సామాన్యంగా వసంత, వేసవి కాలాల్లో ఇసకవేస్తే రాలనంత జనంతో హడావిడిగా కళకళ లాడుతూ ఉంటుంది. మేము నవంబర్ చివరలో వెళ్ళాము కాబట్టి పెద్దగా జనం లేరు. వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది కానీ ఆ సమయంలో మేముండే చికాగో తో పోలిస్తే వంద రెట్లు మేలు. ఇక్కడ వస్తువుల ఖరీదులు, ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడకి  వచ్చే జనం మూడు నాలుగు రోజుల కన్న ఎక్కువ ఉండరు.  అందుకని  ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. మేమున్న హోటల్లో ప్రతీ రూముకీ రెండు సంచులు ఇస్తారు. పొద్దున్నే క్రింద పలహారాలు పెట్టివుంటాయి. అవి సంచీల్లో నింపుకోవటం చల్ మోహనరంగా అంటూ బీచ్ కి బయల్దేరటం. వాతావరణం బాగుంటుంది. చుట్టూతా ఉండే సౌందర్యాన్ని ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆస్వాదించ వచ్చు. చుట్టూతా  సహజ ప్రకృతి సౌందర్యం మూలాన ఇక్కడ  ఏ కెమెరా తో ఎల్లా తీసినా చక్కటి ఫోటోలు వస్తాయి. మిమ్మల్ని అందరూ expert photographer అనుకుంటారు. దీనిలో మేము తీసిన Waikiki  బీచ్ ఫోటోలు, ఎవరో ఎప్పుడో  kalakauva avenue లో నడుస్తూ తీసిన వీడియో ఇక్కడ పెడుతున్నాను. మేమున్న హోటల్ పేరు కూడా దాన్లో ఉంది. చూసి ఆనందించండి. నా ఉద్దేశమల్లా నా మనస్సులో కలిగిన చక్కటి అనుభూతిని మీతో పంచుకోవటం.  

8 comments:

 1. challa Bagunndandi mee Hawaii Post. meery kuda chala Enjoy chesaranukunta.

  ReplyDelete
 2. బాగుంది. Honolulu లో మీరు చూసిన మరిన్ని విషయాలకై ఎదురు చూస్తాను.

  ReplyDelete
 3. Nice.....been thinking of visiting Hawaii for a long time. Now after reading your post, will definately plan to visit in Nov/Dec 2011.

  ReplyDelete
 4. @bachisri, cbrao, rajesh

  మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. ఇంకా హవాయీ మీద వ్రాయాలనే కోరిక తీరలేదు. అందుకని ఇంకొన్ని పోస్టులు మీరు చూడాల్సి వస్తుంది.

  ReplyDelete
 5. సంక్రాంతి శుభాకాంక్షలు రావు గారు.

  ReplyDelete
 6. @నీహారిక
  Thanks. Same to you. There is some uniqueness in you and is evident from your writings. Keep on doing whatever you are doing.

  ReplyDelete
 7. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  శి. రా. రావు
  సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

  ReplyDelete
 8. థాంక్స్. మీకూ మీ కుటుంబానికీ అమెరికా నుండి వెచ్చటి శుభాకాంక్షలు. మాకిక్కడ mid winter. మీకూ అక్కడ చలి ఎక్కువగా ఉందని విన్నాను.Take care.

  ReplyDelete