Monday, February 21, 2011

45 ఓ బుల్లి కథ 33 ---- Hawaii -- హవాయీ లో ఓ ఆత్మకధ

నాకు University లు  చూడాలంటే  చాలా ఇష్టం. మన జీవన విధానాల్లో మార్పులకు అంకురార్పణ చేసిన ప్రదేశాలు చాలా వరకూ విశ్వ విద్యాలయలే.  దానికి తోడు మాలో ఒకరికి మరువలేని మలుపులు University లు. కాలుగాలిన పిల్లిలా ఫోటోలలో తిరుగుతున్న వారు వీరే. వాటి గురించి, ఉద్వేగంతో చెప్పిన కధ వారి మాటల్లోనే వ్రాస్తున్నాను. 


University of Illinois లో ఒక మాస్టారు చిన్న గది చూపెడుతూ "ఇదిగో ఇక్కడే mosaic చేశారు" అంటే, ఇంటర్నెట్  లో బ్రౌజు  చెయ్యటం సృష్తీకరించింది ఈ చిన్న గది లోనా అని ఆశ్చర్య పోయాను. University of Chicago Research  Institute corridor లో నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు ఫెర్మి ఇక్కడ నడిచే వారు అని. Nuclear chain reaction ఇక్కడ సాధించక పోతే మనకు కాంతి నిచ్చే power reactors ఉండేవి కాదు. Collagen structure ట్రిపుల్ హేలిక్సు లో కేంద్రీకరించిందన్న G.N. Ramachandran, Black holes ఉంటాయని శాస్త్రీకరించి "నోబెల్" తెచ్చుకున్న Chandrasekhar కూడా ఇక్కడే ఈ హాల్సులో  నడుచుకుంటూ వెళ్ళేవారు. అటువంటి చోట్లకి వెళ్ళంగానే ఆ వాతావరణానికి  మనలో ఒక సృజనాత్మక మైన భావుకత ప్రవేశిస్తుంది.
క్రిందటి సంవత్సరం University of New Mexico చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చిన్న సరస్సు ఒడ్డున కూర్చుని గంటల తరబడి నురోన్స్ గురించి మాట్లాడు కున్నాము. ఆ  విద్యాలయం లో మనస్సు మీద పెద్ద పరిశోధనలు చేస్తారు.


మన జీవితం లో, మన సౌలభ్యం కోసం  రోజూ  ఉపయోగించేవి ఎన్నో ఈ విశ్వవిద్యాలలోనే ఎవరో ఒకళ్ళు, రాత్రులూ పగళ్ళూ కృషిచేసి కష్టపడి పనిచేసి కనుగొన్నవే. కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు. కానీ వాళ్ళ కృషి మనము ఎప్పుడూ మర్చిపోలేము. వాళ్ళను తలచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకే University of Hawaii కి వెళ్ళటం. వెళ్ళిన రోజు శలవ అవటం మూలాన నిర్మానుష్యంగ ఉంది.  మొదటే "ఈస్ట్ వెస్ట్ సెంటర్" కనపడింది. నలభై ఏళ్ళ క్రిందట అక్కడ డైనింగ్  హాల్ లో రోజూ భోజనం చేసేవాడిని. ఒక ప్లేటు రైస్ లో mixed vegetables మజ్జిగ తో కలుపుకుని , జపనీస్ గార్డెన్ చూస్తూ తినే వాణ్ని. "ఈస్ట్" నుండి "వెస్ట్" నుండి వచ్చిన విద్యార్ధులతో చూడ ముచ్చట గా ఉండేది. అది ఇప్పుడు మూసేసి కాన్ఫరెన్స్ హాలు చేశారుట. ఆ బిల్డింగ్ చుట్టూతా ఒక సారి ప్రదక్షిణ చేసి జపనీస్ గార్డెన్ ఫోటో తీసు కున్నాను.
తరువాత తెలిసింది కాఫిటేరియా  ఏడు ఏళ్ళ క్రిందే మూసి వేసేశారుట..


తరువాత నేను పనిచేసిన research బిల్డింగ్ కి బయల్దేరాను. చూచాయగా గుర్తుంది ఎక్కడుంటుందో. అది ప్రత్యేకం  George Von Bekesy కోసం కట్టించింది. Fish , ఏ విధంగా శబ్దాన్ని గ్రహిస్తాయో పరిశోధనలు చెయ్యటానికి ఆయన్ని హార్వార్డ్ నుండి ఇక్కడకు తీసుకు వచ్చారు. Bekesy గారికి మన చెవి ఎల్లా పనిచేస్తుందో తెలుసుకున్నందుకు "నోబెల్" వచ్చింది. మా ప్రొఫెసర్ పేరు L.H.Piette , ఆయన కాన్సెర్ మీద పరిశోధనలు చేస్తారు. Bekesy ఎప్పుడోపోయారు,  Piette అయిదేళ్ళ క్రిందట కాన్సెర్ తో పోయారుట. కనీసం ఆ బిల్డింగ్ చూద్దామనుకున్నా వెతికి పట్టుకోలేక పోయాను.ఇవ్వాళ అన్నీ నిరాశలే.చివరిగ  YMCA కి వెళ్ళాము. మొదట అమెరికా వచ్చినప్పుడు కాంపస్ లోని YMCA లో రెండు రోజులు ఉన్నాను. ఇదంతా నలభై ఏళ్ళ క్రిందటి సంగతి. మొదటి రోజు ఆకలి తో క్రింద కాఫిటేరియా కి వచ్చాను. ఏమి తినాలో తెలియదు. చెప్పేవాళ్ళు లేరు. కానీ అక్కడ రైస్, బట్టర్ చూశాను. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పైన రూముకి  వెళ్ళి అమ్మ ఇచ్చిన చింతకాయ పచ్చడి తెచ్చుకుని, ఒక మారు మూల బూత్ లో కూర్చుని  పచ్చడి ముద్ద వెన్నతో కలుపుకుని తిన్నాను. అది నిజంగా స్వర్గమే. ఇప్పుడు కాఫెటేరియా లేదు. అది ఉండే చోట  "Yogurt Land" ఉంది. అది చూడంగానే మాతో వచ్చిన పిల్లలకి మహదానందం వేసింది . అక్కడ sample cups తీసుకొని  అన్నిరకాల  "Yogurt " లు రుచి చూసి మీకు నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు. ఎదురుకుండా చింతచెట్టు దాని క్రింద చింత  కాయలు. అక్కడ బైఠాయించాము "Yogurt" కప్పుల తోటి.  చింత చిగురు కోసుకుని పప్పు చేసుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. కొందరు పెద్దలు చింతకాయలు వలుచుకుని తిన్నారు కూడా. ఇదీ హవయీ లో ఒకరు చెప్పిన ఆత్మ కధ.
"యమ్మీ"      "అక్క నాకు పెట్టకుండా  తింటోందే"      "దా నాన్నా నేను పెడతాను"  


4 comments:

 1. విశేషాలన్నీ బాగున్నాయండి. మీరు చెప్పిన తీరు కూడా చక్కగా ఉంది. మేడం ను మిమ్మల్ని , మీ గ్రాండ్ చిల్డ్రన్ అనుకుంటా అందరినీ చూశాను ఈ ఫోటోస్ లో.

  ReplyDelete
 2. i really enjoyed the writeup and it is true that minds open up with innovative ideas in places like
  you have mentioned in the blog. regards.

  ramanarao

  ReplyDelete
 3. యూనివర్సిటీ ల గురించి అక్కడి అనుభవాలు ,అనుభుతులు ,చక్కగా వివరించారు. ఏదేశమేగిన అన్నట్టు,మన ఆవకాయ ,మన నిమ్మకాయ, మన చింత కాయ పచ్చడి మర్చి పొలెము. హవాయి ఆత్మ కధ బాగుంది. ఫొటొలు సరెసరి

  ReplyDelete
 4. @anrd, @ramanarao, @రాజేశ్వరి గార్లకి

  యూనివర్సిటీలలో ఏదో ఒక మూల కూర్చుని కొత్తవాటిని కనిపెట్టాలనే కుతూహలంతో జీవితం గడిపే వాళ్ళని స్మరించటానికే ఈ పోస్ట్. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

  ReplyDelete