ముందుమాట: మన జీవించే విధానంలో కొద్ది మార్పులు చేసుకుని కేన్సర్ రాకుండా కాపాడుకోగాలమా అనేది తెలిసికోటానికే ఈ పోస్ట్.
సంవత్సరాల బట్టీ చేసిన పరిశోధనల ఫలితంగా తేలిన దేమిటంటే కేన్సర్ బారి నుండి తప్పించు కోవచ్చని. దానికి రెండే రెండు సూత్రాలు అని.
1. మొదటిది క్లుప్తంగా చెప్పాలంటే మనం తినే ఆహారం లో మూడు వంతులు ప్రకృతి పరంగా చెట్ల నుండి (plant based) వచ్చినవి అయి ఉండాలి.
2. రెండవది కృత్రిమంగా తయారు చేసినవి తిన కూడదు, తాగ కూడదు, పీల్చ కూడదు. అంటే దేహము లోకి ఎక్కించ కూడదు. (నా మాట: మన శరీరం ఒక పెద్ద రసాయన శాల. ప్రకృతి పరంగా సృష్టించిన వాటితో రసాయనిక ప్రక్రియలు చేయకలదు కానీ మానవ సృష్టి తో రూపొందిన వాటి నుపయోగించుట శరీరమునకు కష్టము, క్లిష్టము కూడా. )
పై రెండు సూత్రాలనీ విశదీకరించి చూస్తే:
చేయరానివి: పొగత్రాగుట, మధ్యము సేవించుట, స్థూలకాయం (మీ BMI తో గమనించండి), ఫిజికల్ యాక్టివిటీ లేకపోవుట.
తిన కూడనివి: processed meats, salty foods, sugary drinks, huge helpings of red meat .
చేయవలసినవి: Plant based foods వాడుట. వాటిలో వ్యాధులు రాకుండా సంరక్షించే పదార్దములు ఉన్నాయి.ఈ క్రింద చెప్పిన కూరలకు కేన్సర్ నిరోధక శక్తీ ఉన్నదని పరిశోధనలలో తేలింది.
Broccoli :BERKELEY — An anti-cancer compound found in broccoli and cabbage works by lowering the activity of an enzyme associated with rapidly advancing breast cancer, according to a University of California, Berkeley, study appearing this week in the online early edition of the journal Proceedings of the National Academy of Sciences. That compound is indole-3-carbinol.
Broccoli anti - Cancer .
Broccoli :BERKELEY — An anti-cancer compound found in broccoli and cabbage works by lowering the activity of an enzyme associated with rapidly advancing breast cancer, according to a University of California, Berkeley, study appearing this week in the online early edition of the journal Proceedings of the National Academy of Sciences. That compound is indole-3-carbinol.
Broccoli anti - Cancer .
సూచన: కనీసం వారానికి మూడు అర కప్పులు వండినది కానీ పచ్చి కాబేజీ కానీ తినటం మంచిది.
దొరకకపోతే: Any cruciferous vegetable, including brussels sprouts, cauliflower, kale and broccoli. Kimchi, a Korean pickled dish that is similar to sauerkraut, also is a good choice.
Flaxseeds: వీటిలో lignans (a weak form of estrogen)ఉన్నాయి.Breast cancer రాకుండా కాపాడుతాయి. Flaxseeds also contain omega-3 fatty acids, which appear to inhibit colon cancer in both men and women.
సూచన: రోజుకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ ల flax seed powder వాడండి.
దొరకకపోతే: For more lignans: Eat Walnuts, and cook with canola oil.
Mushrooms: వీటిల్లో బటన్ మష్రూమ్స్ Breast Cancer ని ప్రోద్భలం చేసే aromatase అనే యం జై ము ని నిరోధించే శక్తి ఉన్న పదార్ధాలు ఉన్నాయి. బటన్ మష్రూమ్స్ లో ఉన్న పదార్ధాలు prostate cancer cells ని కూడా హతమార్చ గలవు.
సూచన: అరకప్పు బటన్ మష్రూమ్స్ వారానికి మూడు సార్లు.
దొరకకపోతే: Porcinis or Chanterelles, wild mushrooms with a nuttier taste.
Olives: వీటిలో ఉన్న maslinic acid and oleanolic acid కేన్సర్ సెల్స్ పెరుగుదలను ఆపి వాటి అంతట అవే చంపుకునేటట్లు (apoptosis) చేస్తాయి.
సూచన: రోజుకు ఎనిమిది నల్ల లేక పచ్చ ఆలివులు తినటం మంచిది.
దొరకకపోతే: రోజుకి ఒకటి లేక రెండు టేబుల్ స్పూనుల వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడండి.
Onions(ఉల్లిపాయలు): వీటిలో శక్తి వంతమయిన కాన్సర్ ను హతమార్చే phenolic compounds ఉన్నాయి. వీటిలో ఉన్న Quercetin, liver, colon, and lung cancer వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
సూచన: వారానికి మూడు సార్లు ఒక అరకప్పు ఉల్లి ముక్కలు తినటం మంచిది. Red or Yellow Onions cooked or raw half a cup three times a week is good.
దొరకకపోతే: Garlic, Apples, Capers, Green and Black Tea have the same Quercetin.
Pumpkin (గుమ్మడి): దీనిలో beta-carotene తో పాటు చాలా Carotenoids ఉండటం మూలంగా ఇది తిన్న వారికి కొన్ని కేన్సర్లు వచ్చే రిస్క్త తగ్గుతుంది. అవి gastric, breast, lung and colorectal cancers. గుమ్మడి గింజలు తింటే prostate cancer వచ్చే రిస్క్ తగ్గు తుందని కనుక్కున్నారు.
సూచన: వారానికి కనీసం మూడు అర కప్పులు వాడటం మంచిది.
దొరకకపోతే: Carrots, broccoli and all of the winter squashes, including acorn, butternut and spaghetti squash.
Raspberries: బెర్రీస్ అన్నీ, cherry blueberry strawberry, అన్నిటిలోనూ cell damage ని తగ్గించే anti-inflammatory పదార్ధాలు ఉన్నాయి. Raspberries లో ellaginic acid, selinium ఉండటం మూలంగా oral and liver cancer cells పెరగటానికి అవరోధం కలిపిస్తుందని కనుగొన్నారు.
సూచన: ఒకటిన్నర కప్పులు వారానికి రెండు మూడు సార్లు.
దొరకకపోతే: Cherries and Cherry juice, frozen berries and cherries.
చివరిమాట: దీనిమాత్రుక:
7 Foods Proven to Fight Cancer, David Grotto, RD, LDN
http://www.bottomlinesecrets.com/article.html?article_id=45566
కాన్సర్ గురించి విలువైన విషయాలు చెప్పారండి. ఈ రోజుల్లో ఈ వ్యాధి బాగా ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది. మీరు చెప్పినట్లు వ్యాధి రాకమునుపే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాన్సర్ ను నిరోధించే గుణం కొన్ని కూరగాయలకు ఉంటుందని అంటున్నారు.
ReplyDeleteఈ రోజుల్లో పంటలలో అధిక దిగుబడుల కొరకు వాడే గాఢమైన రసాయనిక మందుల వల్ల కూరగాయలు,పసుపు వంటివి తమ సహజ గుణాలను కోల్పోతున్నాయేమో అనిపిస్తుంది. ఆహార ఉత్పత్తుల ద్వారా మంచి ఫలితాన్ని పొందాలంటే , వాటిపై రసాయనాల వాడకాన్ని నిలిపివేయాలి.
ఆధునిక వైద్యులు కాన్సర్ కణితిని రేడియేషన్ ద్వారా నిర్మూలించటానికి ప్రయత్నిస్తారు. అందువల్ల కొన్ని దుష్ఫలితాలు ఉంటాయన్నారు. దానికన్నా , కాన్సర్ కణాలకు వెళ్ళే పోషకాలను అడ్డుకుని , వాటికవే క్రమంగా బలహీనమయి నిర్మూలించబడే పద్ధతి లేదు కాబోలు.
ఇప్పడు వైద్యులు ఉపయోగించే చికిత్సా పద్ధతుల వల్ల వల్ల మంచి కణాలకు కూడా హాని కలుగుతుంది. ఇంకా కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి. కానీ, ప్రకృతిలో ఉన్న కొన్ని మూలికల్లో , మంచి కణాలకు హాని జరగకుండా , కాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించే గుణాలున్న మూలికలు ఉంటాయేమో , ఆయుర్వేద వైద్యులు ప్రాచీన గ్రంధాలు పరిశోధించి తెలుసుకుంటే బాగుంటుంది....
@anrd గారూ నాకు తెలిసింది కేన్సర్ లక్షణాలు బయటికి తెలియటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని. నిజం తెలుసుకోటానికి నమ్మకమైన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాను. శరీరానికి సరియిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. ప్రకృతి పరంగా వచ్చిన మన దేహానికి ప్రకృతి పరంగా వచ్చినవి ఆహారంగా ఇవ్వటం న్యాయం.
ReplyDeleteమీరు ఉదాహరించినట్లు Nanomedicine drug delivery ద్వారా కాన్సెర్ కణాలకే మందు అందే పరిశోధనలు జరుగుతున్నాయి.
ఆయుర్వేదం లో దీనిని "రాచ పుండు" అంటారని అనుకుంటాను. వ్యాధి నివారణకు ఏమి వాడుతారో తెలియదు. నేను మీ వ్యాఖ్యకు సమాధానము వ్రాయటానికి వెతుకుతుంటే కొన్ని కొత్త పరిశోధన గురించి తెలుసుకున్నాను. కొంచెం లోతుగా నిర్ధారణ చేసుకుని పోస్ట్ చేస్తాను.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
నమస్కారములు రావు గారూ !
ReplyDeleteకేన్సర్ వ్యాధి గురించి , తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చక్కని విషయాలను తెలియ జెప్పారు కాక పొతే అన్ర్ద్దద్ గారు చెప్పినట్టు ఈ రోజుల్లో అన్నీ స్వలాభాల కోసం కల్తీ చేస్తున్నారని తెలుస్తోంది . మరి ఏం తినగలం ? పళ్ళు కూరలు , కుడా , కృత్రిమంగా నే తయారు చేసి అమ్ముతున్నారని వార్తలు. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇలాంటివి ఏమి చెయ్యలేము కదా ? అయినా మన ప్రయత్నం మనం చేయాలి . అందుకు మీ సలహాలు మంచి మార్గ దర్సకాలు. మీ శ్రమకి ధన్య వాదములు. మీ అభిమాని
@రాజేశ్వరి గారూ మన తాహతులో మనకి అందుబాటులో వుండేవి కొనుక్కుని/పండించుకొని తింటాము. అంతకన్నా చేసేదేముంది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
చాలా ఉపయోగకరమైన పోస్ట్ thank you
ReplyDeletenestam
@nestam గారూ మీకీ పోస్ట్ నచ్చినందుకు థాంక్స్. మీలాగా వ్రాయలేను కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి నేను. మీ వ్యాఖ్యకి ధన్య వాదములు.
ReplyDelete