ముందుమాట: మనకి ఒక మనస్సు ఉన్నదని తెలిసికోవటం, దాని తర్వాత అది ఎల్లా వచ్చింది అని దానినే ఉపయోగించి పరిశోధించటం అనేది మానవుడికే చెల్లు. మన బ్రెయిన్ పని చెయ్యటానికి మూల కారణం మన శరీరం లోని న్యురోన్ కణాలు. సృష్టిలో న్యురాన్ ఎల్లా వచ్చిందో తెలుసుకోటానికే ఈ పోస్ట్.
ఒక పదార్ధములో జీవత్వము ఉన్నదని తెలిపేది దానిలో చలించే తత్వమున్న అణువు. దానినే మనము కణము (Cell) అంటాము. దానిలో జీవత్వం ఉన్నంత వరకూ , అది జీవించటానికి ఆహారం తీసుకుంటుంది, మలమును విడిచిపెడుతుంది, తనజాతిని పెంపొందించు కుంటుంది (reproduction). Cell-Wikipedia.
ప్రకృతి పరముగా జీవత్వమున్న ప్రతీ కణమూ తన జీవిత కాలంలో తనలాంటి దాన్ని ఇంకొకటి తయారు చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. దీన్ని Mitosis అంటారు. ఈ మైటోసిస్ లో జన్యు పదార్ధముకి కూడా మారు ప్రతి తయారవుతుంది. కానీ ఈ జన్యు పదార్ధ మార్పిడిలో కొద్ది మార్పులు కలగ వచ్చు. దానిని DNA Mutation అంటారు. అందరు మనుషులూ ఒకే విధంగా ఉండకపోవటానికి కారణం ఇదే. ఈ duplication ( reproduction cycle) లో జీవించలేని కణ మార్పులు జరిగితే, ఆ కణములు తమంతట తామే చంపుకుంటాయి (Apoptosis).
ఏక కణ Microorganisms మూడు నాలుగు బిలియన్ ఏళ్ళ క్రిందట నుండి ఉన్నాయని పదిహేడవ శతాబ్దములో కనుగొన్నారు. కానీ ఇవ్వి ఉండచ్చు అని ఆరవ శతాబ్దము లోనే జైనిజం పవిత్ర గ్రంధాలలో మహావీర్ గారు వ్రాశారు. భారతీయ మేధా శక్తికి ఇది ఒక గొప్ప గర్వ కారణం. Amoeba, Baker's yeast, Sponges, unicellular organisms కి ఉదాహరణలు.( Microorganism -- Wikipedia).
సృష్టిలో రెండు కణములు ఉన్న జీవులు కూడా ఉన్నాయని పరిశోధనలలో తేలింది. అవి ఒకటి రెండు బిలియన్ ఏళ్ళ క్రిందట నుంచీ ఉండవచ్చు అని నిర్ధారణ చేశారు. ఏక కణ జీవుల reproduction లో జరిగిన తప్పుల మూలంగా ద్వి కణ జీవులుగ వచ్చి ఉండవచ్చు అని కూడా తీర్మానించారు. సామాన్యంగా ఒక కణం నుండి ఇంకొక కణం జన్మించేటప్పుడు తప్పులు జరిగితే, జన్మించిన కణం దానంతట అది చనిపోతుంది. కానీ తప్పులు చిన్నవైనప్పుడు, జీవించగల శక్తి ఉన్నప్పుడు అవి జీవిస్తాయి. ఈ విధంగా బహు కణ జీవులు ఉద్భవించాయని చెపుతారు.
ఒక జీవిలో రెండు జీవ కణములు ఉంటే జీవించటం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఒక కణం ఒక వేపు పోదామంటే ఇంకొక కణం ఇంకొక వేపు లాగుతుంటే జీవించటం కష్టం అవుతుంది కదా. ఆ రెండు కణాలు మాట్లాడుకుంటే బాగుండి సామరస్యంగా ఉంటాయి అని ప్రకృతి నిర్ధారించి, రెండిటి మధ్యా మాటలు చేర వెయ్యటానికీ న్యురాన్ ( Nerve cell) అనే కణమును సృష్టించటం జరిగింది. జీవిలో ఉన్నరెండు కణములను న్యురాన్ కు కలుపుటవలన ఒక సూక్ష్మమైన కణ సమాచార మార్గానికి అంకురార్పణ జరిగింది. దీనినే nerve net అంటారు. ఉదా: simple sea creatures Jelly fish and Corals.
రాను రాను ఈ జీవులలో తప్పొప్పుల కలయిక వలన కణ సాంద్రత పెరిగింది. దానికి తోడు ప్రత్యేక పనులు మాత్రమే చేసే కొన్నికణములు రూపొందినాయి. కణములు ఎక్కువయిన కొద్దీ వాటిమధ్య సమాచార పంపకము క్లిష్ట మవగా ప్రకృతి, nerve నెట్ లో కొన్ని మార్పులు చేసి కొత్తగా nerve cord ని రూపొందించినది. ఇది శరీరము ముందరి భాగములో మొదటి నుండి చివరి దాకా వ్యాపించి మధ్య లోనున్న న్యురాన్ ముడుల సహాయముతో వివిధ కణముల మధ్య సమాచార వ్యాప్తికి దోహదము చెయునదిగా రూపొందెను. ( నామాట: బహుశ జీవుల్లో Spinal Cord లాంటిది ప్రారంభం ఇక్కడేనేమో.) ఈ న్యురాన్ ముడులను nerve ganglion అంటారు. ఉదా: వాన పాములో (earthworm) ప్రతి భాగములోను ఇవి ఉండటము మూలంగా అది పాక గలుగు తున్నది. దానికి తోడు తన తలలో ఉన్న న్యురాన్ ముడి (cerebral ganglion) మూతికి కలప బడింది. చూశారా సృష్టి విచిత్రం, జీవి బ్రతకటానికి ఆహారం తీసుకునే ఏర్పాటు తయారయింది. ఇప్పటి నుండీ జీవిలో తల ప్రాముఖ్యత పెరిగి, కళ్ళు ముక్కు చెవులు ఏర్పడ్డాయి. అందుకనే సృష్టిలో కుక్క (వాసన ప్రాధాన్యత), గబ్బిలం (శబ్దము ప్రాముఖ్యత) మొదలగునవి జీవించ కలుగు తున్నాము.
కణ విభజన లో (self replicating ) జరిగిన చిన్న చిన్న తప్పులు, ఒప్పులుగా మారి జీవులు uni cellular నుండి multi cellular జీవులుగా సృష్టి లోకి వచ్చి ఉండ వచ్చుఅని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ multi cellular జీవ కణములు మాట్లాడు కోవాలంటే న్యురాన్స్ కావాలి. జీవిలో ఉన్న కణజాల వృద్ధిని బట్టి న్యురాన్స్ సంఖ్య కూడా వృద్ది చెందింది. బిలియన్ల సంవత్సరాల నుండీ జరిగిన మార్పులను మనము ఇప్పుడు uni cellular Amoeba నుండి multi cellular మనిషి దాకా ఉన్న జీవ రాసులలో చూడగలుగు చున్నాము. కాల క్రమంలో కొన్నిజీవులు బతికి బయటకట్టితే కొన్నిజీవులు బతకలేక హరించుకు పోయాయి (ఉదా: Dinosaur, List of extinct Animals, Wikipedia ). ఏ జీవిలో ఎన్నిన్యురాన్సు ఉన్నయ్యో, (List of animals by number of neurons, Wikipedia), నుండి చూడచ్చు.
సృష్టి లో మానవుని దగ్గరకు వచ్చేసరికి వివిధ కణముల సంఖ్య పెరుగుట వలన (ఉదా: ఎర్ర కణములు, తెల్ల కణములు మొదలయినవి) వాటిని సక్రమంగా పని చేయించటానికి ఎక్కువ న్యురాన్స్ అవసరము కలిగింది. మళ్ళా ఆ న్యురాన్స్ అన్నీశరీరములోని కణములతో కలిసికట్టుగా పని చెయ్యటానికి న్యురల్ నెట్వర్క్ ఏర్పరచ వలసి వచ్చింది. ఇవి అన్నీసరీగ్గా కలిసి పని చేయించ టానికి మానవునిలో మెదడు (Brain) నెలకొల్ప వలసి వచ్చింది. ప్రకృతికి ఎంత ఓపిక ఉందో, ఇదంతా నిర్మించటానికి మూడు బిలియన్ సంవత్సరాలు పట్టింది.
సృష్టి లో మానవుని దగ్గరకు వచ్చేసరికి వివిధ కణముల సంఖ్య పెరుగుట వలన (ఉదా: ఎర్ర కణములు, తెల్ల కణములు మొదలయినవి) వాటిని సక్రమంగా పని చేయించటానికి ఎక్కువ న్యురాన్స్ అవసరము కలిగింది. మళ్ళా ఆ న్యురాన్స్ అన్నీశరీరములోని కణములతో కలిసికట్టుగా పని చెయ్యటానికి న్యురల్ నెట్వర్క్ ఏర్పరచ వలసి వచ్చింది. ఇవి అన్నీసరీగ్గా కలిసి పని చేయించ టానికి మానవునిలో మెదడు (Brain) నెలకొల్ప వలసి వచ్చింది. ప్రకృతికి ఎంత ఓపిక ఉందో, ఇదంతా నిర్మించటానికి మూడు బిలియన్ సంవత్సరాలు పట్టింది.
Amoeba నుండి మానవుడి దాకా జరిగిన పరిణామ క్రమము:
3 Billion years ago Uni cellular organisms
1 Billion Years ago ---- Multi Cellular Organisms started
400 Million Years ago ---- Fish (Simple Brain)
300 Million Years ago ---- Life on land started (Complex Brain)
180 Million Years ago ---- Jurassic, the Dinosaur age
30 Million Years ago ---- Monkey Line started
4 Million Years ago ---- Human Line started
2 Million Years ago ---- Skillful Human Line Started (Using Tools)
1 Million Years ago ---- Human Line Started moving out of Africaచివరిమాట: ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మన మనుగడకు ముఖ్యమయినవి, ప్రకృతి పరమయినవి, వాతావరణం (weather), భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు మన కంట్రోలులో లేవు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనము ఒక భాగము మాత్రమే అని మనము గ్రహించ గలగాలి. అంతే కానీ మన చుట్టూతా కనపడేవన్నీ మనవి అనుకుని మన స్వలాభం కోసం నాశనము చెయ్యటం ప్రకృతి పరంగా మంచిది కాదు.
మాతృకలు :
2. Your Brain by Tabitha M. Powledge, Macmillan Publishing, New York NY 10022