Monday, October 3, 2011

73 ఓ బుల్లి కథ 61 --- మీ కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ముందుమాట: మన శరీరంలో అవయవాలు సరీగ్గా పని చెయ్యాలంటే  వాటికి తగిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. అన్నిఅవయవాల లోకీ నయనం ప్రధానం అంటారు. వాటిని జాగర్తగా చూసుకోవటం జీవితంలో చాలా ముఖ్యమయిన విషయం. కళ్ళకి కావాల్సిన పోషక పదార్ధాలు ఇవ్వటానికి మనం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించే ఈ పోస్ట్.

వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దానికి తోడు పొగత్రాగుట, స్థూలకాయం కూడా ఉంటే ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలు, macular degeneration (చుట్టూతా కనపడుతుంది కానీ చూపులో మధ్య భాగం కనపడదు), Cataracts (కంట్లో lens మసక బారుతుంది), Glaucoma (కంట్లో నీటి వత్తిడి పెరిగి optic nerve చెడిపోయి చూపు సన్నగిల్లు తుంది.).

ఆహార నియమాలలో ముందుగా కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు Steven Pratt, M.D, the author of Super Health.  మనం తీసుకునే ఆహారంలో, lutein, omega-3 fatty acids, vitamin C, - Vitamin E, ఉంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు వారు.

ఆ పోషక పదార్ధాలు ఉన్న కూర గాయాలు :

1. Spinach. బచ్చలి కూర, దుంప బచ్చలి. Kale, Swiss chard, Turnip, Mustard and Collard Greens.
అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే lutein, cell damage ని అరికట్టుతుంది. అందుమూలంగా macular degeneration, cataracts రాకుండా ఆపవచ్చు.

2. Salmon. sardines, herring, mackerel and albacore tuna. 
వీటిని Cold-water fish అంటారు. వీటిల్లో DHA అనే omega-3 fatty acid ఉండటం వలన cell damage లేకుండా చూసి macular degeneration రాకుండా ఆపటం జరుగుతుంది.

3. Walnuts, Pistachios
వీటిల్లో omega-3 fatty acids, anti oxidants, Vitamin E ఉంటాయి. ఇవి వాపు(inflammation) ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, cardio vascular ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.

4. Berries. Blue berries, Black berries, Straw berries, Mul berries, Cherries and Grapes.
ఇవన్నీ cardiovascular health కి చాలా మంచివి. బ్లడ్ ప్రెజర్, వాపులు (inflammation) తగ్గించటానికి మంచివి.  macular degeneration రావటానికి బ్లడ్ ప్రెజర్ కూడా ఒక కారణం.

5. Orange bell peppers. gogi berries pumpkin, squash, sweet potatoes and carrots.
వీటి ప్రత్యేకత అన్నీఆరెంజ్ రంగులో ఉండటం. వీటిల్లో vitamin-A, vitamin-C, lutein, zeaxanthin ఉండటం మూలంగా Cataracts, macular degeneration, night vision (రేచీకటి) మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.

6. Broccoli.  Brussels sprouts and Cabbage.
వీటిల్లో broccoli చాలా మంచిది. మన దేహంలో Anti-inflammatory enzymes ని ఉసికొలిపి detoxification (చెడ్డ వాటిని బయటికి పంపటం) కి దోహదం చేస్తుంది. Brussels sprouts, Cabbage ఆ ennzymes ని ఎక్కువ చేస్తాయి.

7. Tea. Green tea, black tea and oolong tea. 
ఇవి Cataracts, macular degeneration, రాకుండా కాపాడుతాయి.

8. Soy. Soy milk, soy sauce, miso and tempeh.
వీటిల్లో powerful antioxidant properties ఉన్న isoflavones, కళ్ళకి వచ్చే dry eye syndrome, cataracts రాకుండా కాపాడుతాయి.

9. Eggs.
వీటిల్లో ఉన్న omega-3 fatty acid DHA, lutein and zeaxanthin కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్ ని అడగటం మంచిది.

10. Avocados.
వీటిల్లో ఉన్న lutein, macular degeneration రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి. (beta-carotene, vitamin C, vitamin B6, vitamin E).

చివరిమాట:  మీ కళ్ళ ఆరోగ్యం కోసం పైన చెప్పిన వాటిల్లో మీకు ఇష్టమయిన మీకు దొరికే వాటిని మీ దైనందిన ఆహారంలో వాడండి. రోజూ  leafy green vegetables వాడటం కూడా చాలా మంచిది.

మాతృక:
  
10 super foods to protect Vision
The fight glaucoma, macular degeneration, cataracts
Steven Pratt, M.D.,
Super Health
Penguin Group (USA) Inc.
375 Hudson Street, New York NY 10014 USA

6 comments:

 1. @రసజ్ఞ గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. శాస్త్ర పరిశోధనలు విరామము లేకుండా జరుగుతూనే ఉంటాయి. కొత్త సంగతులు వచ్చినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను.

  ReplyDelete
 2. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, తీసుకోవాల్సిన బలవర్ధకమైన ఆహారాన్ని గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
  ఈ రోజుల్లో టీవీ, ఇంటర్నెట్ వంటి వాటి వాడకం బాగా పెరగటం వల్ల , కళ్ళకు అధిక శ్రమ కలుగుతోంది కదా ! మంచి ఆహారం తీసుకోవటం వల్ల కళ్ళు మరీ త్వరగా అలసిపోవు....

  ReplyDelete
 3. నమస్కారములు
  కళ్ళకు తీసుకో వలసిన జాగ్రతల గురించి చక్క గా వివరించారు. ఇలా ప్రతీ పార్టు గురించి శ్రమ తీసుకుని మీరు ఇచ్చే సలహాలను పాటించ గలిగితే కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొంద వచ్చును. ఎక్కడో డాక్టరు వద్దకు వెళ్ళి వాళ్ళు ఒకటికి పది టెస్టులు ఇరవై మం దులు వాడమనడం అవి పడీ పడక బాధ పడడం , ఈ బాధలేవి ఉండవు మీ వైద్యానికి ధన్య వాదములు. మరిన్ని తెలుప గలరు

  ReplyDelete
 4. @anrd గారూ కళ్ళు చాలా ముఖ్యమయినవి. వాటి గురించి మనం సామాన్యంగా పట్టించుకోము.
  పెద్ద పట్టించుకో నవుసరం లేదు, మంచి ఆహారం పెడితే చాలు మీకు ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాం, నాయనానందం కల్పిస్తాము అంటాయి కళ్ళు.
  ఆ మంచి ఆహారం అందరికీ తెలియటానికే ఈ పోస్ట్.
  ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. @రాజేశ్వరి గారికి
  తెలిసిన మంచి సంగతులు అందరికీ తెలపాలనే ప్రయత్నమే ఇది. ఎంతమందో పరిశోధనలు చేసి నిర్ణయించిన సంగతులే చెపుతున్నాను. నా గొప్పతనం ఏమీ లేదు. మనం సరియిన ఆహార జాగ్రత్తలు తీసుకుంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అని నేను నమ్ముతాను. మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు.

  ReplyDelete