Monday, October 24, 2011

74 ఓ బుల్లి కథ 62 --- అందేనా ఈ చేతుల కందేనా

ముందుమాట: వైయరమణ (Yaramana) గారి పోస్ట్ "కల్లోల చిత్రాలు" చదివిన తరువాత మనస్సు అల్ల కల్లోలమై గూగుల్ లో అటూ ఇటూ పరిగెడుతుంటే ఈ పాట నాకు యుట్యుబు (youtube) లో తారస్యం అయ్యింది. నా బ్లాగ్ లో పోస్టులు వ్రాయకుండా ఈ పాట నాకు నచ్చి రోజూ వింటూ కూర్చుంటున్నాను. ఇంట్లోవాళ్ళకి పాత గ్రామఫోను రికార్డు లా ఈ పాట రోజూ వినటం బాధగా ఉంది. నేను చెప్పాను  "నా చేతుల్లో ఏమీ లేదు, పోస్ట్ రాద్దామని కూర్చున్నప్పుడల్లా ఈ పాటని అనుకోకుండా క్లిక్ చేస్తున్నాను. పాట విన్న తరువాత ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తోంది"  అని. మా ఆవిడ మొదట నాకు బద్దకం పెరిగిపోతోందని అనుకున్నది కానీ అది నిజం కాదు అని తర్వాత తెలుసుకుంది. (రోజూ కూరలూ అవీ సమయానికి తరిగిస్తూనే ఉన్నాను కదా మరి). సమస్యా పరిష్కారం ఆవిడకే అప్పగించాను. చాలా "మెంటల్ మధనం"  తర్వాత ఈ "సావిత్రి ఎఫ్ఫెక్ట్" పోవటానికి ఆవిడ నుండి ఒక విరుగుడు బయటికి వచ్చింది.  సావిత్రి మీద ఒక పోస్ట్ వ్రాసెయ్యండి మీకు పట్టిన జాడ్యం పోతుంది అని ఆవిడ చెప్పింది. ఏవిధంగా పోతుందో నాకు తెలియదు. అప్పటికీ ఇది మహానటి గారి జయంతీ కాదు పుట్టినరోజూ కాదు బాగుండదేమో అని దాట వెయ్యటానికి ప్రయత్నించాను. "అందాలోలికే చందమామలని ఎప్పుడైనా పలకరించవచ్చు" అని వాదించటం మూలంగా పోస్ట్ వెయ్యక తప్పలేదు. అయినా మన దగ్గర సొల్యుషన్ ఏమీ లేనప్పుడు ఇచ్చిన సలహాని పాటించటమే మంచిది. అందులో భార్య సలహా వినకపోతే ఏమి జరగవచ్చునో నాకు 

Yaramana గారు వ్రాసిన "ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి!!"  అనే పోస్ట్  చదవటం మూలాన తెలిసింది.  *సాంబారు.తో. ఒక చెరగని ముద్ర"    వేసి    "మిర్చి బజ్జీలు -తో- ఒక దారుణ హత్యాకాండ" జరుగు తుందే మోనని భయమేసి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. దీనిలో పెట్టిన వీడియో, "పూజాఫలం" లో "సావిత్రి" పాడిన కమ్మని పాట విని ఆనందించండి. 

కల్లోల చిత్రాలు 

సంగీతం విని ఆనందించటం తప్ప నాకు సంగీత జ్ఞానం లేదు. ఏవి పల్లవులో, ఏవి చరణాలో తెలియవు. అందుకు క్షంతవ్యుణ్ణి. 


పాట ఇలా మొదలవుతుంది:

సుందర సురనందనావనా మల్లీ
జాబిల్లీ

అందేనా ఈ చేతుల కందేనా
అందేనా ఈ చేతుల కందేనా

చందమామ ఈ కనులకు విందేనా 
అందేనా ఈ చేతుల కందేనా

*************************************************
ఆ నోట్లోనుంచి ఆ వాక్యాలు వినంగానే నాలో నేను మైమరచిపోతాను.
ఐహిక జ్ఞానం ఉండదు. 
*************************************************

ఆ మడుగున కనిపించీ
నా మనసున నివశించి 

అంతలోనే ఆకాశపు 
అంచుల విహరించే 

చందమామ ఈ కనులకు విందేనా

తలపు దాట నీక  
మనసు తలుపు వేయ గలను గాని 

నింగి పైకి ఆశలనే 
నిచ్చెనేయ గలను గానీ  

కొలనులోన కోకిలనే
అలల పైన ఊగే 

కలువ పేద బ్రతుకులోన 
వలపు తేనె నింపేనా 

చందమామ ఈ కనులకు విందేనా

ఇదిగో వీడియో:








2 comments:

  1. నమస్కారములు.
    ఈ పాట నేనెప్పుడూ వినక పోవడం నాకే వింతగా ఉంది. అయితే సావిత్రిని అభిమానించని వారు , సాంబారు రుచి తెలియని వారు , భజ్జీల ఘాటు అనుభ వించని వారు , వుండ రంటే వుండరు. , వుండరు గాక వుండరు .అసలు ఉండనే వుండరు కదా ?
    అవునూ ! ఇంతకీ భార్య సలహా పాటించి నందున ఏమైనా కాస్త పనిలో " డిస్కౌంట్ " ??????????????????????????

    ReplyDelete
  2. మన జీవితంలో ఎంతోదూరంలో కనిపించే వాటికి ఏవో నిచ్చెనలు వేసుకుని వాటి అంచులు అందుకోవాలని, ఆస్వాదించాలని అనుకుంటాము. కొన్ని కోరికలు సఫలీకృతము అవుతాయి కొన్ని కావు. సఫలీకృతం అయినా కాకపోయినా దాదాపు అందరం జీవితంలో ముందరికి సాగిపోతూనే ఉంటాము. ఆ పరమార్ధం చెప్పినందుకే ఈ పాటంటే నాకు ఇష్టం.

    సావిత్రికి "పూజాఫలం" లో ఆ కోరికలు సఫలీకృతం అయ్యాయి కానీ నిజజీవితంలో కాలేదు.

    మూడు వారాలు మాతృ దేశానికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందుకే ఈ ఆలేస్యం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete