Monday, December 19, 2011

77 ఓ బుల్లి కథ 65 --- మళ్ళా న్యూఇయర్ వస్తోంది


"What we have done for ourselves alone dies with us; what we have done for 
others and the world remains and is immortal." ~ Albert Pike

ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.

ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.

మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.

మనం అందరి జీవితాలనీ తీర్చి దిద్దలేము. సుఖవంతమూ చెయ్యలేము. కానీ ఏతా వాతా సహాయం చెయ్యాలనే చూస్తాం. ఎందుకంటే ఎవరయినా బాధ పడుతుంటే మనం చూడలేము. సంవత్సరానికి ఒక రోజు మనం, కూర్చుకున్న ఆ "మనం" లో మనకన్నా బాధపడుతున్న వాళ్ళని మన వాళ్ళుగా జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, జపాన్లో  సునామీ లయినా  అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.

స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.

చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే  ఈ చిన్న సహాయాలతో  వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.

7 comments:

  1. నిజమే ! మనం సంఘ జీవులం తర తమ బేధం అనేది మన ఆలొచన లోనే ఉంది. ఎలా చూస్తె అలాగే కనబడు తుంది. నిజానికి " మన " అనుకునే వారి కంటె మనమెవరో తెలియక పోయినా సాయ పడ గలగడం గొప్ప ఆలొచన . పదో వంతైన చేయ గలిగితే అదృష్ట వంతులం . చాలా ఉన్నత మైన ఆలొచన . రావు గారూ .ధన్య వాదములు
    " అందరికీ నూతన సంవత్సర + క్రిస్మస్ శుభా కాంక్షలు "

    ReplyDelete
  2. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    చక్కటి భావన; చక్కటి కార్యం. మీరు అభినందనీయులు. ఏంచేదానికంటే పంచేదానిలో ఎక్కువ తృప్తీ వుంటుందని పెద్దలు చెబుతారు. `మనం ఈరోజు ఒకరికి, మనకు చేతనయినంతలో, సహాయం అందిస్తున్నాము అంటే, ఇదివరకే మనం ఎవరో వారినుంచి సహాయం అందుకుని వున్నామనే అర్ధం'. హిందూ తత్త్వంలో ప్రతి జీవి, ఎప్పుడో, ఎక్కడో, మరోజీవితో సంబంధం కలిగి వుండేవుంటాడు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  3. @రాజేశ్వరి గారూ మనమందరమూ ఒకటే కదా మరి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  4. హిందూ తత్త్వంలో ప్రతి జీవి, ఎప్పుడో, ఎక్కడో, మరోజీవితో సంబంధం కలిగి వుండేవుంటాడు.
    -------------
    @మాధవరావు గారూ మనమందరం సంఘజీవులం కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడూ ఆధారపడి ఉంటాము. ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఆధార పడాల్సి వస్తుందో చెప్పలేము. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. సార్ ! థాంక్స్ అండి.
    మీరు చెప్పినట్లు ప్రయత్నించాను. రసజ్ఞ గారి వ్యాఖ్య కనిపించింది. మీరు చాలా స్పష్టంగా వ్రాసి ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  6. inspiring...thank you very much sir..

    ReplyDelete
  7. kvsv గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. ప్రస్తుతం నా కంప్యుటర్ కి గ్రహణం పట్టింది. మా ఆవిడ కంప్యుటర్ వాడటానికి ప్రయత్నిస్తున్నాను.కంప్యుటర్ వాడే నా కిచ్చిన వాడుక టైము అయిపోతోంది. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete