Saturday, August 23, 2014

102 ఓ బుల్లి కథ 90 --- కంప్యూటర్ మూల పడితే

గత రెండు నెలల నుండీ నా కంప్యూటర్ సరీగ్గా పని చెయ్యటం మానేసింది. "ఈనాడు" వార్తలు లేవు "హిండూ" వార్తలు లేవు "మాలిక" బ్లాగులు చూడటం లేదు. పోనీ పని చెయ్యటం మానేసి గుట్టుగా కూర్చుంటుందా అంటే అదీ లేదు. "ఈనాడు" తీసుకు రావమ్మా అంటే ఒక అరగంటకి తీసుకు వస్తుంది. ఒక్కొక్కప్పుడు దానికోసం అలా చూస్తూ కూర్చోవాలి.

నేను ఇంటర్నెట్ ప్రొవైడర్ కస్టమర్ సపోర్ట్ కి ఫోన్ చేశాను. మీ ఇంట్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి అని అడిగాడు. మూడు ఉన్నాయి రెండు బాగానే పని చేస్తున్నాయి అని చెప్పాను. ఆ చెప్పటం తప్పయి పోయింది. మూడింట్లో రెండు పనిచేసి మూడోది పనిచెయ్యకపోతే మూడవది పాడయ్యి ఉంటుంది అని తేల్చాడు. ఇంక వాళ్ళు మాయింటికి వచ్చి నా ప్రోబ్లం సంగతి చూడటం సున్నా.

ఇంట్లో భర్త, ఏ పనీ చెయ్యకుండా కంప్యూటర్ స్క్రీన్ ఎదురుకుండా కూర్చుని జపం చెయ్యటం ఏ భారత నారీ మణికీ ఇష్టముండదు ! నాన్నగారి సమస్య గురించి మా ఆవిడ పిల్లల్ని అడిగింది. "కంప్యూటర్ పాతదయి పోయింది వైరస్ లు ఉండి ఉంటాయి కొత్తది కొనటం మంచిది" అని సలహా ఇచ్చారు.

నా కెందుకో కొత్త కంప్యూటర్ కొనటం ఇష్టం లేదు. నాలాంటివాడు  యాఫ్త్రాల్  ఓ జీవంలేని కంప్యూటర్ కి లొంగిపొవాలా ? అయినా కంప్యూటర్ కొన్ని రోజులు లేకపోతే జీవితం తల్లకిందులు అవదు కదా. దీనిసంగతి ఏదో   తేల్చుకోవాలని అనుకున్నాను.

పూర్వం ఇటువంటి పరిస్థితి వస్తే కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఫార్మాట్ చేసి వాళ్ళు ఇచ్చిన డిస్కులతోటి ఆపరేటింగ్ సిస్టం ని లోడ్ చేసేవాణ్ణి. కంప్యూటర్ దాదాపు కొత్త కంప్యూటర్ లాగా అయ్యేది. అలా ఏమన్నా చేయచ్చోమో అనే ఆశతో దాచిపెట్టిన కంప్యుటర్ file పైకి తీశాను.

ఈ laptop కొని 5 ఏళ్ళయింది. "Gateway " వాళ్ళు తయ్యారు చేశారు. windows 7 ఆపరేటింగ్ సిస్టం. కొత్త కంప్యుటర్ కొన్నప్పుడు వాటితో వచ్చిన వాటి నన్నిటినీ (మాన్యుయల్స్ వగైరా) ఒక పెద్ద కవర్ లో పెట్టి దాచి పెట్టాను. Instruction Manual,  "recovery " అని నా రైటింగ్ తో నాలుగు డిస్కులూ ఉన్నాయి. నేనే ఎప్పుడో వాటిని తయారు చేసి ఉంటాను. Instruction Manual లో కంప్యూటర్ ని పూర్వ దశకి తీసుకు రావచ్చేమో అని వెతికాను. recovery management అని ఒకటుంది దాని ద్వారా కంప్యూటర్ ని పాత టైం లోకి తీసుకు వెళ్ళచ్చు అని తెలుసుకున్నాను.

"start " icon ను క్లిక్ చేసి చూస్తే all programs లో Gateway అని ఉంది, క్లిక్ చేశాను. Gateway Recovery Management వచ్చింది. ఇంక నా పని నల్లేరు నడక నుండి పూల బాట మీద నడక అయ్యింది. ఇంక తనే చెప్పేసింది ఎల్లా recover అవ్వాలో(restore ద్వారా ). టైం మెషీన్ తో పాత కాలం లోకి పోయినట్లు దాదాపు ఒకటిన్నర గంటల్లో నా కంప్యూటర్ కి పూర్వ వైభవం తీసుకు రాగలిగాను. మీరు మీ laptop కి recovery డిస్క్ లు ఇంకా క్రియేట్ చెయ్యకపోతే తప్పకుండా వెంటనే చెయ్యండి. ఎప్పుడో అప్పుడు అవసరం రావచ్చు.

సరే కొత్త కంప్యూటర్ తోటి టెస్ట్ మొదలెట్టాను. కాసేపు Internet బాగా వచ్చింది కానీ తరువాత అంతా మామూలే. ఏమిటో అర్ధం కావటల్లేదు. ఒకరోజు నిద్రపట్టక పోతే రాత్రి 3 గంటలకి కంప్యూటర్ ఆన్ చేసాను. మీరు నమ్మరు blasting speed లో Internet వచ్చింది.

ఎన్ని రోజులని కంప్యూటర్ కోసం తెల్లవారు ఝామున లేచేది ? ఇంక విసుగు వచ్చేసి ఏమవుతుందో చూద్దామని కంప్యుటర్ ని మేడ మీద నుంచి కిందకి తీసుకు వచ్చాను. బ్రహ్మాండ మయిన స్పీడ్ తో Internet వచ్చింది. అప్పటినుండీ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఇంత సులువుగా నా ప్రాబ్లం సరి అవుతుందని అనుకోలేదు. ఒక విధంగా చూస్తే నా రెండు నెలల శ్రమా వృధాయే.

ఈ పోస్ట్ కి ఉపసంహారం ఏమి వ్రాసేది ? నాకు నేనే తిట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి.  ఈ పనిని నేను ముందరే ఎందుకు చెయ్య లేదు ? అనే ప్రశ్నకి సమాధానం లేదు. కానీ ఈ రెండు  నెలలలో laptop maintenance మీద చాలా తెలుసుకున్నాను. Windows లో కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ సాల్వ్ చేసే tools చాలా ఉన్నాయి. మీరు క్రింద చెప్పిన విధంగా క్లిక్ చేసుకుంటూ పోతే వాటి గురించి చాలా తెలుస్తాయి. మీకు కంప్యూటర్ ప్రొబ్లెమ్స్ ఉంటే వాటినుండి బయట పడటానికి ఇవి చాలా పనికి వస్తాయి.

1. start -> control panel -> system and security

2. start -> right click on the computer -> properties

P.S: ప్రస్తుతం డైనింగ్ టేబుల్ మీద తిష్ట వేశాను. ఎంత కాలం సాగుతుందో తెలియదు. డైనింగ్ టేబుల్ కిచెన్ కిందకి వస్తుంది. కిచెన్ నా ఆధీనంలో లేదు. 

4 comments:

  1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
    బాగుందండీ మీ కంప్యూటర్ కథ. ఏదో చేస్తే ఏదో అయినట్లు; ఎక్కడో తన్నితే, ఎక్కడో తగిలినట్లు, పై అంతస్తు నుండి క్రింది అంతస్తుకు తీసుకువచ్చి కూడా కంప్యూటర్స్ ని బాగు చెయ్యవచ్చని `ఎడిసన్' ప్రయోగంలాగా తెలిసివచ్చిందన్నమాట!!!
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. మాధవరావు గారూ
    కస్టమర్ సపోర్ట్ కంప్యుటర్ ఎంత దూరం లో ఉందని అడగ లేదు. WiFi సిగ్నల్ మేడ మీద వీక్ గ వస్తోంది. దానిని గురించి ఏదో చెయ్యాలి. ప్రస్తుతం డైనింగ్ టేబుల్ మీద తిష్ట వేశాను. ఎంతకాలం సాగుతుందో తెలియదు!. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. Thanks for your comment Anuradha garu. I am in Italy on vacation and can not write in telugu because of limited PC.

    ReplyDelete
  4. anrd has left a new comment on your post "102 ఓ బుల్లి కథ 90 --- కంప్యూటర్ మూల పడితే":

    కంప్యూటర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

    ReplyDelete