Monday, September 22, 2014

104 ఓ బుల్లి కథ 92-- అమెరికాలో ఐఫెల్ టవర్ ఉందా?

ఉంది. మనం రోజూ ఎన్నెన్నో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రపంచంలో ప్రశస్థ మైన వాటిని చూడాలని అనిపిస్తుంది. అవి వివిధ దేశాల్లో ఉంటే వెళ్ళాలంటే చాలా డబ్బు శ్రమతో కూడిన పని. అందుకని అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాలా వాటికి డూప్లికేట్ లు తయ్యారు చేశారు. వాటి లిస్టు క్రింద ఇస్తున్నాను. మీరు వాటికి దగ్గరలో ఉంటే చూడటానికి ప్రయత్నించండి. కొంత కాకపోతే కొంతయినా త్రుప్తి పడవచ్చు. నేను కొన్ని ఊళ్ళకి వెళ్ళానుగానీ అవి ఉన్నయ్యని తెలియక వాటిని చూడలేదు. పక్కనున్న రెండు ఫోటోలు మొన్నీమధ్య (ఈ నెలలో Paris, France Pisa, Itali) తీసినవి. నా ఫోటో చాతుర్యం వలన ఐఫెల్ టవర్ వంగి నట్టు కనపడుతుంది గానీ నిజంగా వంగలేదు.

1. Eiffel Tower: Paris, Texas USA
అసలుది Paris, France లో ఉంది. అమెరికాలో  Texas రాష్ట్రంలో ఉన్న Paris అనే ఊళ్ళో ఉంది. అసలు దానికన్నా కొంచెం ఎత్తు ఉండాలని దీనిపైన ఒక టోపీ కూడా పెట్టారు.

2. The leaning tower of Pisa: Niles, Illinois USA
అసలుది Pisa, Italy లో ఉంది. దీనిని 1934 లో కట్టారు. అసలు దానిలో సగం సైజు ఉంటుంది. ఈ రెండు కట్టడాలు కట్టిన కారణాలు వేరు. పీసా లో కట్టినది పక్కనున్న చర్చ్ బెల్స్ ఉంచటానికి కాకపోతే Niles లో కట్టింది చూడ ముచ్చట కాని పక్కనున్న water tanks ని దాచి పుచ్చటానికి. 

3. The Parthenon: Nashville, Tennessee  USA
అసలుది Greece లో ఉంది. ఇది Nashville’s Centennial Park లో ఉంది. దీనిని Tennessee’s 1897 Centennial Exposition కోసం కట్టారు.

4. London Bridge: Lake Havasu City, Arizona USA
"లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ " అనే పాట మీరు చిన్నప్పుడు పాడి ఉంటారు లేకపోతే కనీసం వినయినా ఉంటారు.1968 లో ఈ బ్రిడ్జి అవసాన దశలో ఉంటే దాదాపు 2. 5 మిలియన్ డాలర్లకి లండన్ సిటీ దీనిని అమ్మింది. కొనుక్కున్న వాళ్ళు దాని రాళ్ళన్నీ జాగర్తగా తీసుకువచ్చి అమెరికాలో ఆరిజోనా రాష్ట్రంలో దీనిని కట్టారు.

5. The Titanic: Branson, Missouri USA
అసలుది సముద్రపు అడుగున ఎక్కడో ఉంది. ఇది టైటానిక్ కి కాపీ. దీనిలో ఆ షిప్ గురించి ఒక మ్యూజియం కూడా ఉంది.

6. Stonehenge: Natural Bridge, Virginia USA
అసలుది England లో ఉంది. దీన్ని అంతా Styrofoam తో చేశారు. అందుకనే దీన్ని Foamhenge అని కూడా అంటారు. ఇది Blue Ridge Mountains లో,  Natural Bridge అనే ఊళ్ళో Virginia రాష్ట్రంలో ఉంది.


మాతృక
https://www.yahoo.com/travel/copycat-travel-icons-across-the-usa-92756797352.html

2 comments:


  1. ఫోటోలు వెరైటీగా బాగున్నాయండి.

    ఫోటోలు, వాటి గురించిన వివరములతో చక్కగా వేసారు.

    ReplyDelete
  2. @anrd గారూ ఫోటోల మీద ఇంట్లో ఒక చిన్న దుమారం నడుస్తోంది. మా ఇటలీ ట్రిప్ లో చాలా ఫోటోలు తీశాము. ఇప్పుడు ఎవరు ఏవి తీశారో నాకు గుర్తులేదు. ఫోటోలో నేను లేకపోతే ఆ ఫోటో నేనే తీసి ఉంటానని అన్నాను. దానికి మా ఆవిడ వప్పుకోవట ల్లేదు. అందుకని ఫోటో క్రెడిట్స్ నేను తీసుకోవటల్లేదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete