టాంక్ యోధులు |
Rose Garden గులాబీలు |
భోజన ప్రియులు |
వైకుంఠ పాళీ ఆటగాళ్ళు |
పిల్లల కేక్ కట్టింగ్ |
ఆయన దాయాదులు ఈ స్థలంలో ఒక పార్క్, ఒక గల్ఫ్ కోర్స్ కట్టి వాటికి ఆయన వరల్డ్ వార్ 1 లో ఫ్రాన్స్ లో పోరాటం చేసిన ఊరు పేరు పెట్టారు. అల్లాగే వార్ కి సంబంధించిన మ్యుజియంలు కట్టారు. పిల్లలు ఆడుకోవటానికి యుద్దం లో వాడిన టాంక్ లు తీసుకు వచ్చి పెట్టారు. పార్క్ చాలా పెద్దది (29 ఎకరాలు ). ఒకపక్క పిక్నిక్ లు చేసుకోవటానికి పెద్దస్థలమూ, పక్కన కార్ పార్కింగ్ కి స్థలమూ. ఇంకా ఈ పార్క్ లో ఉన్నవి పెద్ద Rose Garden, ఒక పెద్ద సరస్సు (ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు). పార్క్ అంతా రకరకాల పూలు, చట్లతో కళకళ లాడుతూ కనువిందుగా ఉంటుంది. నడవలేని వాళ్ళకి ట్రాలీ లో ఎక్కించి పార్క్ అంతా తిప్పుతారు. ఇక్కడ ఉన్న ఆయన నివాసం కూడా ఒక మ్యూజియం లాగా చేసి టూర్స్ ఇస్తున్నారు.
పిక్నిక్ సూత్రధారులు |
రెండవ పని మా ఇంటి దగ్గరలో ఉన్న Fermi Lab కి స్నేహితులని తీసుకు వెళ్ళటం నాకొక అలవాటు. నేను అక్కడకి ఎన్ని సార్లు వెళ్ళానో చెప్పలేను. నేను చూసి నచ్చిన వాటిని అందరికీ చెబుతూ ఉంటాను. నాకు వీలయితే అక్కడికి తీసుకువెళ్ళి చూపెడతాను. మోహన్ Fermi కి వెళ్దాము వస్తారా అంటే తప్పకుండా అని బయల్దేరాము. నా కెందుకో Fermilab అంటే చాలా ఇష్టం. ప్రపంచం లో దేశ దేశాల నుండీ పరిశోధనలు చెయ్యటానికి వచ్చిన ఒక వెయ్యి మంది ఇక్కడ రాత్రిం బవళ్ళు పనిచేస్తూ ఉంటారు.
Fermi అంటే Enrico Fermi, University of Chicago లో Atomic Chain Reaction ని సాధించిన ఆయన. చికాగో దగ్గర Batevia అనే ఊళ్ళో కట్టిన particle physics and accelerator laboratory కి ఆయన పేరు పెట్టారు. మోహన్ చెప్పినట్లు హైస్కూల్ ఫిజిక్స్ పుస్తకాల్లో దీనిని గురించి ఒక లైన్ ఉంటుంది. CERN వాళ్ళ The Large Hadron Collider (LHC) రాకముందు Fermilab Tevatron ప్రపంచెం లో చాలా పెద్ద Collider.
సూక్ష్మంగా చెప్పాలంటే Fermilab, మన ప్రపంచములో atom కన్నా చిన్నవాటిని కనుక్కోటానికి పెట్టిన పరిశోధనాలయం. ఇక్కడ చేసే పని చాలా సింపుల్ గ కనపడుతుంది కానీ చాలా క్లిష్టమయినది. ఈ పరిశోధనల కోసం భూమి కింద ఒక సొరంగం తవ్వి paticles (atoms, protons మొదలయినవి ) పరిగెత్తటానికి ఒక పెద్ద enclosed racetrack లాంటిది కట్టారు. దీనిలోనికి కొంత స్పీడ్ లో protons ని పంపిస్తారు. ఒక రౌండ్ తిరిగిన తరువాత వాటిని magnetic field తో ఒక తన్ను తంతారు. అప్పుడు అవి ఇంకొంచెం ఎక్కువ స్పీడ్లో పరుగెడుతాయి. తన్ని నప్పుడల్లా స్పీడ్ పెరుగుతుంది. అల్లా తన్నులు తిని తిని మంచి స్పీడ్ వచ్చినప్పుడు వాటికి అడ్డంగా ఏదైనా పదార్ధం పెడుతారు. మాంచి స్పీడ్లో వస్తున్న protons తగిలే సరికి ఆ పదార్ధం ముక్కలు ముక్కలవుతుంది. ఇంక మిగిలింది పగిలిన ముక్కల్లో చిన్న ముక్కని కనిపెట్టటం. ఆ ముక్కలలో atom కన్నా చిన్న ముక్కలున్నయ్యేమో నని వెతుకుతారు. atom కన్నా చిన్న వైన ఆరు quarks లో, top quark, bottom quark ఇక్కడ కనుగొన్నారు. ఇప్పుడు ప్రపంచం లోకల్లా పెద్దది, యూరప్ లో పెట్టిన, The Large Hadron Collider (LHC) లో protons పరిగెత్తే racetrack Fermilab Tevatron కన్న పెద్దది. అందుకని అవి ఎక్కువ స్పీడ్తో పరిగెత్తి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ మైన ముక్కలని చెయ్యగలదు. మీరు వినే ఉంటారు, క్రిందటి సంవత్సరం boson అనే atom కన్న చిన్న పదార్ధాన్ని ఇక్కడ కనుగొన్నారు.
పిల్లలకి Fermilab లో జరిగే సంగతులు చెప్పటానికి Lederman Science Center అని ఒక దాన్ని కట్టారు. ఇక్కడ పిల్లలూ పెద్దలూ paricle ఫిజిక్స్ లో చిన్న చిన్న experiments చెయ్య వచ్చు. వీలయితే మీరు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి.
The Leon M. Lederman Science Education Center houses hands-on exhibits for ages 10+, technology and science labs, a store and the K-12 Teacher Resource Center. Educators who have attended workshops may bring their students here for field trips. Science Adventures classes for all ages take place at the Lederman Science Center.
మూడవ పని మా ఇంటి తోటకి సంబంధించినది. మా తోటలో ప్రతి సంవత్సరం లాగా దిగుమతి రాక పోయినా మాకు కావలసిన దాని కన్నా ఎక్కువ పండాయి. అందుకని స్నేహితులని పిలుస్తాము. ఒకరకంగా Garden Party లాంటిది. Garden లో పండినవి పంచుకోవటం ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం తోటకూర చాలా వచ్చింది. Italian Beans, బీరకాయలు చాలా వస్తున్నాయి. బోలెడన్ని థాయ్ మెరపకాయలు కాశాయి. కీరా దోసకాయలూ టమేటాలు బోలెడన్ని. కానీ కొన్ని మొక్కలు చాలా తక్కువ కాశాయి. yellow squash రెండు కాయలు వచ్చాయి. వంకాయలు మూడంటే మూడు వచ్చాయి. జుకినీ కి ఉన్న పెద్ద పెద్ద ఆకులు వంకాయ చెట్టుకు ఎండ తగలకుండా మూసేస్తున్నాయి. అందుకని ఆకులు కట్ చేశాము. దానితో జుకినీ చచ్చి కూర్చుంది. హైస్కూల్ సైన్స్ మర్చిపొయాము. ఆకులలో ఉన్న పత్రహరితము సూర్యరస్మితో కలిసి కదా మొక్క తన ఆహారం తయారు చేసుకునేది. అందుకనే జుకినీలు నాలుగే వచ్చాయి. సొరకాయలు అసలు రాలేదు. కొత్తిమెర వేద్దామనుకున్నా గానీ డాలరికి నాలుగు కట్టలు వస్తుంటే ఎందుకులే అని వేయలేదు. మొన్నీ మధ్యన కట్ట రెండు డాలర్లయింది. నాలిక కరుచుకున్నాను. ఈ సమ్మర్ లో మెక్సికో నుండి వచ్చే కొత్తిమెరలో మలినాలున్నాయని అమెరికా లోకి రానివ్వ లేదు. మాకు మెక్సికో నుండి చాలా కూరగాయలు వస్తాయి.
మా నాన్నగారు ప్రతి రోజూ పోద్దునపూట పెరటి తోటలో కూరలు కోసుకు వచ్చేవారు. మా అమ్మ ఆ రోజు వంట వాటితో చేసేది. అదే మా ఇంట్లో చేద్దామని ప్రయత్నం. మా ఇంటిలో వంటలు ఈ సంవత్సరం వింటే మీకు నోరువూరుతుంది. అన్నీ తోటలోనుండి కోసుకువచ్చి చేసినవే. తోటకూర పప్పు, తోటకూర(ఎండ బెట్టి) కూర. నేతి బీరకాయ, జుకినీ, దోసకాయ(కీరా) లతో కూర, పప్పు, పులుసు, పచ్చడి.
పచ్చి గ్రీన్ టొమాటో లతో పచ్చడి, పులుసు. Italian Beans తో కూర, వంకాయ తో కలిపి చేస్తే చాలా బాగుంటుంది. లేత బీరకాయలతో కూర (నాకు చాలా ఇష్టం) చాలా సార్లు చేశాం. నేను చేసిందల్లా మొక్కలకి ప్రేమగా నీళ్ళు పోయటం. అప్పుడప్పుడూ వాటికి పాటలు పాడుతూ ఉండటం. మొక్కలకి మ్యూజిక్ చాలా ఇష్టంట. మా ఆవిడ చేసిందల్లా కూరలు కోసుకొచ్చి వంట చేయటం. నిజం చెప్పొద్దూ వంటలన్నీ మంచి ఫ్లేవర్ఫుల్ గ వచ్చాయి. పెరటి తోట కూరగాయలతో ఎవరు చేసినా వంటలు బ్రహ్మాండంగా వస్తాయల్లె ఉంది.
1. http://www.cantigny.org/
2. Fermilab
No comments:
Post a Comment