Monday, March 6, 2017

134 ఓ బుల్లి కథ 122 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 3

మోటార్ న్యూరాన్స్ (Motor Neurons)


రారోయి మాయింటికీ మావో
మాటున్నదీ మంచి మాటున్నది

నీవు నిలుచుంటే
నిమ్మ చెట్టు నీడున్నది

నీవు కూర్చుంటే
కురిసీలో పీటున్నది

నీవు తొంగుంటే
పట్టెమంచం పరుపున్నది

"దొంగరాముడు " చిత్రంలో సావిత్రి పాట పాడుతూ R. నాగేశ్వరరావు చుట్టూతా తిరుగుతూ నృత్యం చేస్తుంది. ఆ నృత్యం లో తన మొహం నుండీ కాళ్ళ దాకా ఎన్నో కదలికలు మనం చూస్తాం. ఆ కదలికలన్నీ ఆ యా చోట్ల ఉన్న కండరాల కదలికలు. ఈ కండరాల కదలికలకు కారణం మెదడు నుండి వస్తున్న విద్యుత్ (action potential). ఆవిడ పాడుతూ నాట్యమాడుదా మనుకుంది. వెంటనే మెదడు సహకరించి ఆయా కండరాలకు ఆజ్ఞలు (action potentials) పంపించింది.

మెదడులో కండరాలకు ఆజ్ఞలు పంపించే వాటిని motor neurons అంటారు. ఆజ్ఞలు విద్యుత్ రూపంలో ఉంటాయి. వీటిని action potentials అంటారు. ఈ ఆజ్ఞల వలెనే మన కండరాలు మనకు కావాల్సిన పనులు చేస్తున్నాయి. పక్క బొమ్మ లో కండరాలకు మెదడునుండి ఆజ్ఞలు వచ్ఛే మార్గంని (Neuro transmission) చూడవచ్చు.

మనం నడుద్దామని అనుకుంటున్నామనుకోండి , మెదడులో motor neurons ఒక చిన్న విద్యుత్ ప్రవాహం సృష్టిస్తాయి (action potentials). ఈ ప్రవాహం అంచె లంచెలుగా న్యూరాన్లను (న్యూరల్ నెట్వర్క్ ) లో దాటుకుంటూ   గమ్యస్థానం (కండరాలకి ) చేరుకుంటుంది. ఇది  రెండు విధాలు గ జరుగుతుంది. మొదటిది, electrical neurotransmission. రెండు వైర్లు కలిపి నట్లు న్యూరాన్లు కలపబడి కరెంట్ వెళ్తుంది. రెండొవది chrmical neurotransmission, ఇది న్యూరాన్లు కలవకుండా మధ్య ఖాళీ ఉంటే జరుగుతుంది. కరెంటు ఒక్కొక్క న్యూరాన్ నుండీ గంతులేస్తూ న్యూరాన్ల మధ్య ఉన్న సందు ని దాటుకుంటూ వెళ్తుంది. ఈ రెండు న్యూరాన్ల మధ్య ఉన్న సందుని (ఖాళీని) synapse అంటారు.

మొదటి న్యూరాన్ axon కాలవ(సందు) దాకా వచ్చి తనలో ఉన్న కరెంటుని (action potential) రసాయనిక పదార్ధాలుగా మార్చి కాలవ లోకి వదులుతుంది. వీటిని neurotransmitters అంటారు. అవి ఈదుకుంటూ అవతలి న్యూరాన్ dendrite receptors దగ్గరకి చేరిన తరువాత మళ్ళా కరెంట్ గ (action potential) మార్చబడతాయి. ఇలా కరెంట్ రూపాలు మార్చుకుంటూ గంతులేస్తూ న్యూరాన్లను దాటుకుంటూ కండరాలకు చేరుకుంటుంది. మనం ఒక కాలు ముందు ఒక కాలు పెట్టి నడవ గలుగుతాము. ఇదంతా చాలా సమయం తీసుకుంటుందని అనుకునేరు, ఈ  action potential వేగం చాలా ఎక్కువ, ఒక సెకండ్లో ఒక ఫుట్బాల్ ఫీల్డ్ దాటగలదు.

అసలు జరిగేదేమిటంటే, కాలవ ఇవతల వడ్డున ఉన్న న్యూరాన్ లోని కా ల్షియం ఆయాన్స్ (ions),  అక్కడే దాక్కున్న neurotransmitters ని బయటికి వచ్చేటట్లు చేస్తాయి. ఈ  neurotransmitters ఈదు కుంటూ అవతల న్యూరాన్ కు చేరుతాయి.  రెండవ న్యూరాన్ లోని  Ca (Calcium), K (potassium), Na (sodium), Cl (chlorine) ఆయాన్స్(ions ) వాటిని మరల విద్యుత్ గ (action potential) మారుస్తాయి.

మనింట్లో విద్యుత్ తీగల్లో, ఎలెక్ట్రాన్స్ (electrons) పరిగెత్తటం వల్ల కరెంట్ ముందరికి వెళ్ళటం జరుగుతుంది. అల్లాగే మెదడులో కరెంట్ (action potential) ముందరకి పోవటం, న్యూరాన్లలో ఉన్నCa (calcium), K (potassium), Na (sodium), Cl (chlorine) ఆయాన్స్ (ions) అటూ ఇటూ పరిగెత్తటంవల్ల.

మనము ఇక్కడ గుర్తించాల్సిన దేమిటంటే మన మెదడు పనిచేయటానికి శరీరంలో కాల్షియం, పొటాషియం, సోడియం, క్లోరీను ముఖ్యం కనుక అవి ఉన్న ఆహార పదార్ధాలని తప్పకుండా మనం తీసుకోవాలి.
ఉదా : For Calcium  పాలు, పెరుగు, మజ్జిగ. Potato, Banana for Potassium. ఉప్పు (NaCl)

To get a specific job done in the body, action potentials are created in the brain by motor neurons to act upon the muscles. These action potentials reach their destination through neural network. As there are gaps in between two neurons called synapses, the action potentials convert themselves into chemical messengers called neurotransmitters and swim through the gap and reach the next neuron dendrite receptors. This is what is called chemical neurotransmission.

The actual process goes like this. After the action potential reaches the tip of axon, the Calcium ions present in the axon tip initiate the emission of neurotransmitters. They swim through the synapse and reach the dendrite receptors of the next neuron. In the second neuron the neurotransmitters initiate the movement of K, Na, and Cl ions and recreate the action potential. After running through the neural network the action potential reaches the destination muscle.

Although the process looks complicated and time consuming,  the speed at which the action potential travels in the neural network is quite fast amounting to 500 feet per second.

దీనిలోని బొమ్మలు  గూగుల్  నుండి సేకరించినవి.

మాతృకలు :
1. Books on Brain
2. Neurons,Synapses
3. Explore Brain
4. Creating Mind ---- By John E. Dowling (1998)W. W. Norton & Company Inc., 500 Fifth Avenue,       New York, NY 10110 USA

2 comments:

  1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    పోనుపోను, టపాలో ఎన్నో ఆశ్చ్యర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. టపా చాలా బాగుంది. ఫోటోలు కూడా పెట్టటంతో ఇంకా బాగుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. మాధవరావు గారూ మీరు పోస్టులు చదివి వ్యాఖలు వ్రాస్తున్నందుకు ధన్యవాదములు. చాలా క్లిష్టమయినవి తేలికగా చెబుదామని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించినవి. చాలా వాటికి మందుల్లేవు. మెదడు ఎల్లా పని చేస్తుందో తెలుసుకుంటే జాగర్తగా ఉండ చ్ఛేమోనని వ్రాస్తున్నాను. ఎందుకంటే ఇది వికటిస్తే పక్కనున్న వాళ్ళకి చాలా కష్టమవుతుంది. మీరు ఏమన్నా విపులీకరించమంటే చేస్తాను. నా ఈ-మెయిల్ మీ దగ్గర ఉంది.

    ReplyDelete