Monday, February 27, 2017

133 ఓ బుల్లి కథ 121 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 2

సెన్సరీ న్యూరాన్స్ (Sensory neurons )


"కూరలో ఉప్పు లేదు వెయ్యాలి"

"నాకు బాగానే ఉంది, సరిపోయింది "

"లేదు సరిపోలేదు"

"నాకు సరిపోయింది"

సంభాషణ ఇల్లా వెళ్తూ, వెళ్తూ ఎక్కడికో పోయి, ఇంట్లో జుట్టులు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మన ముక్కూ మన కళ్ళూ ఇంతెందుకు మన అవయవాలు ఏవీ ఇంకోళ్ళతో సమానంగా (exact ) ఉండవు. అయినప్పుడు మన రుచులు (tastes ) ఎందుకుండాలి? ఉండవు . ఇంతెందుకు వంట చేస్తున్నప్పుడు వట్టిచేతులతో మా ఆవిడ పట్టుకునే భగుణని నేను పట్టుకోలేను. ఆ వేడికి నా చేతులు తట్టుకోలేవు. నిజానికి పోతే మన అందరి ఆలోచనలూ ఒకటిగా ఉండటానికి అసలు వీలులేదు .

మన ఇష్టా ఇష్టాలూ అభిరుచులూ అన్నీ వేరువేరుగా ఉండటానికి కారణం మన పంచేంద్రియాలు. వాటి నుండి వచ్ఛే సమాచారాన్ని మన మనస్సు గుర్తు పెట్టుకుంటుందని మనకి తెలుసు. మా అత్తయ్య చేసిన ఆ దోసకాయ పప్పు తిన్న రుచి ఇంకా గుర్తుంది. జీవితంలో మన అనుభవాల మూలాన మన అభిరుచులు ఏర్పడుతాయి. మన ఏ ఒక్కరి అనుభవాలు ఒకటి కావు. అయినప్పుడు మన అభిరుచులు ఒకటిగా ఎల్లా ఉంటాయి? మనమనుకునే "జిహ్వకో రుచి" అంటే ఇదే నేమో !

మనం పుట్టిన దగ్గరనుండీ, మనం జీవించాలని మన ఆత్మ ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. వీలయినంత వరకూ జీవత్వాన్ని శరీరంలో ఉంచటమే దాని గమ్యం. అందుకనే శరీరం అంతటా sensory neurons పెట్టి ఎప్పటికప్పుడు మన సమాచారం అంతా సేకరించి కష్టాలొస్తే పరిష్కరించి, మనలో జీవత్వం ఉండేందుకు సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. ఎవరు ఏమి చేసినా (వైద్యులు) తాను చేసే పనులకి సహాయం చేయటం తప్ప ఆజ్యం పోస్తే పరిస్థితి వికటిస్తుంది.

మన శరీర మంతా ఆక్రమించిన ఈ sensory neurons ఎప్పుడూ బ్రెయిన్ కి సంకేతాలు పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు బ్రెయిన్ లో రికార్డు అవుతాయి. మనము కంప్యూటర్ వాడినప్పుడు మన బ్రౌజర్లో మనము చూసిన సైట్లన్నీ రికార్డ్ అయినట్లు. కాకపోతే ఒకటే తేడా  కంప్యుటర్లో ఆ సమాచారాన్ని తీసివేయవచ్చు (delete ). కానీ బ్రెయిన్ నుండి తీసివేయ లేము (ఇంతవరకూ అది చేతకాలేదు. ముందు అవుతుందని నాకు నమ్మకం లేదు ).

ఈ  sensory neurons కాస్త pressure  sensitive. వీటికి కొంచెం వత్తిడి తగిలితే వాటిలో కొద్దిపాటి విద్యుత్ ఉద్భవిస్తుంది. దీనిని action potential అంటారు. ఈ action potentials న్యూరాన్ నెట్వర్క్ ద్వారా ప్రయాణించి మెదడులో thalamus అనే చోటికి చేరుతాయి. శరీరంలో అన్ని న్యూరాన్స్ నుండి వచ్చిన సంకేతాలని thalamus విశ్లేషించి, సమస్యా పరిష్కారానికి central cortex లో వాటి వాటి స్థానాలకు
పంపుతుంది.( కళ్ళవి కళ్ళ చోటుకి, చెవులవి చెవుల చోటుకి అల్లాగ.) అక్కడ వాటి పరిష్కరణకి సరిఅయిన సమాధానాలు తయారుచేయబడి (action potentials ) పని నెరవేర్చటం కోసం వాటి వాటి గమ్యస్థానాలకు  neural network ద్వారా పంపబడతాయి.

ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఏదయినా  ముఖ్యమయిన సమాచారం వెంటనే పరిష్కరించాల్సి వస్తే  network మధ్యలో వచ్చే spinal cord కలిపించుకుని సమస్యను పరిష్కరించి తరువాత thalamus కి తెలుపుతుంది.

Spinal cord కల్పించుకునేవి :
1. మన ఎదురుకుండా పులి కనపడుతుంది వెంటనే పరుగెడుతాము.
2. మీ కాలి మీద చీమ పాకుతోంది. వెంటనే చెయ్యి వెళ్ళి దానిని తీసి వేస్తుంది.
3. పొరపాటున వేడి పెనముని పట్టుకున్నారనుకోండి వెంటనే చెయ్యి తీసేస్తారు.

Thalamus కల్పించుకునేవి:
ఉదా : మీరు మంచినీళ్లు తాగాలనుకుంటున్నారు. మెదడు నుండి షుమారుగా వచ్చే సంకేతాలు:
1. మీ కంటికి, గ్లాస్ ఎక్కడుందో చూడటానికి.
2. మీ చేతికి, గ్లాస్ తీసి నోరు దగ్గర పెట్టటానికి
3. మీ  నోటికి, తాగటానికి.

కింద బొమ్మ లో చేతి లో నుండి బయల్దేరిన సంకేతాలు (Blue ) మెదడులోకి వెళ్ళి cortex లో పరిష్కరించబడి న తరువాత, పరిష్కరణ సంకేతాలు(Red ) గమ్య స్థానం ఎలా చేరుకుంటయ్యె చూడచ్చు.


కొన్ని ప్రాముఖ్యములేని సమాచారాలయితే వాటికి మెదడు(thalamus ) లో గుర్తింపు ఉండదు.
ఉదా : మీరు సముద్రపు ఒడ్డున నివసిస్తున్నారనుకోండి, కొంతకాలానికి సముద్రపు హోరు మీకు వినపడదు, మీరు చేసే ఏ పనికీ అడ్డురాదు. రోజూ చేపల మార్కెట్లో పని చేసే వాళ్లకి  ఆ వాసన అలవాటయి వాళ్ళపని వాళ్ళు చేసుకు పోతూ ఉంటారు. ఇంతెందుకు మనం రోజూ బట్టలు వేసుకుని తిరుగుతుంటే అవి మన చర్మాన్ని రాచుకుంటూఉంటాయి. మనకి అవి మన చర్మాన్ని రాచుకుంటున్నాయనే గుర్తింపు ఉండదు. సెంటు పూసుకున్నామనుకోండి. కొంత సేపటికి మనకి ఆ సెంటు వాసన వెయ్యదు.

ఈ సంకేతాల్లో మన ఉనికిని తెలిపేవి చాలా ముఖ్యమయిన సంకేతాలు. మనము ఏ నిమిషంలో ఎక్కడ ఉన్నామో మెదడుకి ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు విరుద్ధమైన పొంతనలేని సంకేతాలు వస్తే మెదడు తికమక పడుతుంది.

ఉదాహరణకి:
1.  గుండ్రంగా మనచుట్టూతా మనం తిరుగుతూ ఆగి పోయామనుకోండి.
తలతిరిగి కూర్చుండిపోతాము.
2. ప్లేన్ లో వెళుతున్నాము. మన సీటులో కూర్చున్నాము. పుస్తకం చదువుతున్నాము.
మనము పుస్తకం చదవటం అటుంచి పరిగెడుతూ కూర్చోలేము, కూర్చుని పరిగెత్తలేము.మూడు విరుద్ధమైన సంకేతాలు (కదులుతున్నాము, అదే సమయంలో కూర్చున్నాము, అదే సమయంలో చదువుతున్నాము) మన మెదడుకి వెళ్తున్నాయి. మెదడుకి ఏమి చెయ్యాలో సందిగ్దావస్థలో ఉంటుంది. మన మనుకునే travel sickness కి కారణం ఇదే .

మనకి కలిగే చాలా జబ్బులకి ఈ సంకేతాలు సరీగ్గా తయారు కాకపోవటమో  లేక సంకేతాలు గమ్యస్థానానికి చేరకపోవటమో కారణం.(Alzheimer's, Depression, Epilepsy, Parkinson's etc).

తరువాత పోస్ట్ లో ఈ సంకేతాలు ఒకచోటునుండి ఇంకొక చోటుకి ఎల్లా  ప్రయాణం చేస్తాయో చూద్దాము.

We have five senses, seeing, hearing, smelling, tasting and touching. There are specific receptors for specific senses spread all over body. They produce electrical impulses called action potentials. First destination for all these impulses is the thalamus, which is in the middle of the brain. Thalamus is the central processing unit for sensory impulses where they were analyzed and sent to proper locations on cerebral cortex. Visual Cortex takes care of Optical signals coming from the eye, auditory cortex for hearing, somatic sensory cortex for identifying and locating touching signals. Final signal analysis was made at the cerebral cortex and response signal was sent to the appropriate area through the neural network.

Sometimes conflicting signals reach the brain and brain gets confused resulting in dizziness, or seasickness etc. In almost all these cases you will be doing two opposite things at the same time, you are moving and yet you are sitting stationary ( going in a plane, traveling on a ship, whirl around and stop etc).

Most of the Nerve disorders(Depression, Epilepsy, Parkinson's etc) come because of problems in Nerve signal generation or transmission.

దీనిలోని బొమ్మలు  గూగుల్  నుండి సేకరించినవి.

ఈ పోస్ట్, చాలా పుస్తకాల నుండి క్రోడీకరించి వ్రాసిన సమాచారం. మీకు ఆ పుస్తకాల పేర్లు ఆ పుస్తకాల లోని సంక్షిప్త సమాచారం కావాలంటే క్రింది పోస్టులు చదవండి.

1. Books on Brain
2. Sensory_neuron

2 comments:

  1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    టపా బాగుంది. మరిన్ని వివరాలకోసం కొత్త టపాకోసం ఎదురుచూస్తూ,
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. బ్రెయిన్ చాలా ముఖ్యమయినది. దానిని గురించి వీరులయినంత వరకూ పూర్తిగా వ్రాద్దామనుకుంటున్నాను. అది ఎల్లా పనిచేస్తుందో తెలిస్తే మనం పొరపాట్లు చేస్తుంటే సరి దిద్దుకోవచ్చు. బ్రెయిన్ రోగాలు ప్రపంచెంలో ఎక్కువ అవుతున్నాయి. మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete