Wednesday, February 8, 2017

130 ఓ బుల్లి కథ 118 ---- నిమ్మకాయ నీళ్ళు


మొన్నీ మధ్య "డెన్నీస్" రెస్టారంట్ కి వెళ్ళి కాఫీ తాగటం ఇష్టం లేక "నీళ్ళు " డ్రింక్ గ ఇమ్మన్నాము. సర్వర్ నుండి తర్వాత ప్రశ్నలు "టాప్ వాటర్ "  "లెమన్ వాటర్" "ఐస్" "వితౌట్ ఐస్".

అప్పటి దాకా రెస్టారెంటుల్లో  "లెమన్ వాటర్" సర్వ్ చేస్తారని తెలియదు. సరే  "లెమన్ వాటర్" తెప్పించామనుకోండి, ఒక జగ్ నీళ్ళ లో ఒక స్లైస్ యెల్లో లెమన్ వేశారు. మొన్నీ మధ్య వల్లీ వాళ్ళ ఇంట్లో కూడా  "లెమన్ వాటర్" ఇచ్చారు. (పై బొమ్మని Lemon అంటారు. కింద బొమ్మ Lime.) నిన్న "శ్రవణ్ " గారు  "లెమన్ వాటర్" తో తేనె కలిపి తినటం మంచిదేనా? అని email లో అడిగారు.  దాని ఫలితమే ఈ పోస్ట్.

జీర్ణ ప్రక్రియలో మనం తిన్న ఆహారం షుగర్ (glucose ) గ  మార్చబడి మన రక్త కణాల్లో mitochandria అనే చోట oxygen తో దగ్దమవటం మూలంగా శక్తి (ATP రూపంలో ) విడుదలవుతుంది. ఎప్పుడైనా రసాయనిక మార్పులు జరుగుతుంటే వ్యర్ధ పదార్ధాలు (byproducts ) బయటకి వస్తాయి. వాటిల్లో freeradicals ఒకటి. అవి వెళ్ళి వేటిమీదన్నా కూర్చుంటే  ఆ పదార్ధాల పని తీరు మారి పోతుంది. శరీరంలో జబ్బులు రావటానికి ఈ freeradicals కారణం కూడా ఒకటి. ఈ హడావిడిలో కొన్ని ఆక్సిజన్ atoms  ఉదృత రూపం దాలుస్తాయి. ఉదృత రూపం దాల్చినవి, ఇంకొకళ్ళు సక్రమంగా చేస్తున్న పనిని  చెడగొట్టట మేగా.

At the end of this electron transport chain, the final electron acceptor is oxygen, and this ultimately forms water (H20). At the same time, the electron transport chain produces ATP. (This is why the the process is called oxidative phosphorylation.)

ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళకి వద్దాము. నిమ్మకాయ రసంలో antioxidents ఉన్నాయి. శరీరం లో ఆక్సిజన్ atoms ఉదృతం తగ్గించాలంటే antioxidents కావాలి. ఇవి నిమ్మకాయ రసంలో సమృద్ధిగా ఉన్నాయి.

ఒక గ్లాస్ నీళ్లలో ఒక అర నిమ్మకాయ రసం కలపండి. మీ ఇష్టాలని బట్టి తక్కువ ఎక్కువలు చూసుకోండి. మీకు తాగటం కొంచెం కష్టంగా ఉంటె తేనె కలుపుకోండి. తేనె మంచిది. కానీ మార్కెట్ లో కార్న్ సిరప్ కలిపిన తేనె ఎక్కువగా అమ్ముతున్నారు. కల్తీ తేనె (high fructose corn syrup ఉన్న తేనె ) కాకుండా చూసుకోండి. ఇందాక చెప్పినట్లు మీ ఇష్టాలను బట్టి పాళ్ళు నిర్ణ ఇంచు కోండి.

ఇదంతా కష్టంగా ఉంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు రోజూ నిమ్మకాయ ఊరగాయ వేసుకుని ఒక అన్నం ముద్ద తినండి. నేను అందుకనే నిమ్మకాయ ఊరగాయ పెట్టి అందరికీ ఇస్తూ ఉంటాను. నా ఇదోరకం దేశసేవ.

Health benefits of drinking lime juice and warm lime water

Every time you drink a glass of lime juice, you not only quench your thirst, you also give your body a lot of health benefits. In spite of the wealth of information about the health benefits of lime, I’m still faced with questions like, “Is lime juice good for you?” Well, take a look at just some of its many benefits and the answer will be clear:
0. Skin care
1. Digestive aid
2. Constipation
3. Supporting healthy blood sugar levels
4. Heart health
5. Respiration
6. Joint care
7. Treatment of scurvy
8. Temperature regulation
9. Weight loss

8 comments:

  1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    నిమ్మ రసం గురించి అందరికీ తెలిసినా, వాటి పోషక గుణాలూ, ఉపయోగాల గురించి బాగా చెప్పారు. ధన్యవాదములు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. మాధవరావు గారూ ఈ మధ్య మీ పోస్ట్ లేమీ రావటల్లేదు. అందరూ కుశలమా. ఈ మధ్య "శ్రవణ్ " గారు email పంపారు "నిమ్మకాయ నీళ్ళు" మంచివని సైన్టిఫిక్ గ ఏమన్నా చెప్పగలమా అని. దానికి ఈ పోస్ట్ వేశాను. మీకు నచ్చినందుకూ మీ వ్యాఖ్యకూ ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

      గత ఏడెనిమిది నెలలుగా పెద్దగా ఏమీ వ్రాయలేదు. శ్రీ తత్త్వవిదానంద స్వామీజీ వారి ఆధ్యాత్మిక క్లాసెస్ కి వెళ్తూ ఉన్నాము. వారానికి నాలుగు క్లాసెస్ వుంటాయి. వాటిలో మునిగిపోయి, ఆ పుస్తకాలు చదువుతూ ఉండటంలో ఏమీ వ్రాయటంలేదు. మేమంతా బాగున్నాము. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు. వచ్చినప్పుడు తప్పక మా యింటికి రండి.
      మీ స్నేహశీలి,
      మాధవరావు.

      Delete
  3. మీ నిమ్మకాయ-ఊరగాయ దేశసేవ నచ్చిందండి. మీరు మా చుట్టుపక్కల వుంటే ఎంత బావుండేదో అనుకుంటున్నాను :)

    ReplyDelete
  4. మీరు చికాగో దగ్గర ఉంటే మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళతాను.
    లలిత గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. నిమ్మకాయ నీళ్లు రోజూ తాగటం మొదలెట్టండి.

    ReplyDelete
  5. Thank you sir for obliging my request.

    ఇంకొక చిన్న ఉపప్రశ్న. ఇప్పటికే ఎసిడితో బాధపడేవారికి ఈ నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఏసిడ్ వలన వ్యతిరేక ప్రభావమేమైనా ఉంటుందా.

    Thanks and Regards

    ReplyDelete
    Replies
    1. దీని మీద చాలా మంది పరిశోధనలు చేశారు. అది శరీరం లోకి వెళ్ళిన తరువాత జీర్ణ ప్రక్రియలో alkaline ఆవు తుందిట.నీళ్ళు ఎక్కువ కలపండి. మీ శరీరానికి పడకపోతే తాగవోకండి.

      Outside the body, lemon juice is acidic (pH is below 7). This is a non-issue. Everyone knows this. It’s a citrus fruit.

      Inside the body however, when lemon juice has been fully metabolized and its minerals are dissociated in the bloodstream, its effect is alkalizing and therefore raises the pH of body tissue (pH above 7 is alkaline). Please notice the difference.

      Delete