Monday, June 24, 2019

151 ఓ బుల్లి కథ -- ఆరోగ్యంగా ఉండాలంటే - Part 1

ప్రకృతిలో జీవత్వం ఉన్న ప్రతి జీవికి పుట్టటం గిట్టటం సహజం. జీవించటం అనే ఈ మధ్యకాలంలో మనం ఏవిధంగా ఆరోగ్యంగా ఉండగలమో పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాసాలు. ఆరోగ్యం లేకపోతే మనం చేసేది చాలా తక్కువ.

మనం పుట్టినప్పుడు మనమంటూ స్వతహాగా చేసింది ఏడవటం. అప్పటి నుండీ సమయానికి ఎవరో పెట్టిన తిండి తింటూ, బయట ఊరికే వస్తున్న గాలిని పీలుస్తూ పెరిగాము.దీనిలో కూడా
మనం చేసేది ఏమీ లేదు పెట్టిన నోట్లో ముద్ద నమలడం మాత్రమే.

సూక్ష్మంగా చూస్తే మన శరీరమనే ఈ యంత్రం మనం తీసుకుంటున్న గాలి, ఆహారం నుండి శక్తిని (energy ) తయారు చేసి మనల్ని నడిపిస్తోంది. ఆ ప్రక్రియలో వచ్చే మలినాలని (waste products ) బయటికి పంపుతోంది.

షుమారుగా మనకు తెలిసిన "కారు" అనే యంత్రం కూడా ఈవిధంగానే పనిచేస్తుంది. గాలి, పెట్రోల్ తీసుకుని కదలటానికి శక్తిని తయారు చేసుకుని , waste products, exhaust ద్వారా బయటికి పంపిస్తుంది.

కాకపోతే మనకీ కారుకీ తేడా maintenance instructions. కారు వచ్చినప్పుడు మనింటికి వాటితో వస్తుంది కానీ మనము అల్లా కాదు. మనకి అసలు maintenance instructions లేవు మనకి మనమే తయారు చేసుకోవాలి.

పోనీ మనకు మనం గట్టి సూచనలు చేసుకుందామన్నా, మనందరమూ ఒకే మూసలో నుండి పుట్టలేదు. మనందరి DNA లు వేరు. అందుకని మన అభిరుచులూ అలవాట్లూ వేరు. ఎంత ప్రయత్నించినా ఒకే maintenance instructions కుదరవు.

ఉదాహరణకి చిన్న ఉల్లిపాయ (garlic ) బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది చాలా మంచిది అంటారు, అది తిని ఊపిరాడక emergency hospital కి వెళ్లిన వాళ్ళు నాకు తెలుసు అల్లాగే వేరుశెనగ తిని, శనగలు తిని, మునగాకు కారప్పొడి తిని వెళ్లిన వాళ్ళు నాకు తెలుసు.

ఇప్పటికి మీరు గ్రహించే ఉంటారు. మనతో రాని ఈ  maintenance instructions ఎవరికి వారు తయారు చేసుకోవలసినదే. మన అందరి DNA లు ఒకలా ఉండవు. మన రూపురేఖలు ఒకటి కావు. maintenance instructions అందరికీ ఒకలా ఉండవు కానీ ప్రయత్నిద్దాము.

మన శరీరమనే ఈ యంత్రం ఎల్లా పని చేస్తుందో తెలుసుకుని, మన గమ్యానికి ఆరోగ్యంగా చేరటానికి షుమారుగా కావలసిన maintenance instructions ఈ పోస్టుల్లో వ్రాసుకుందాము.

2 comments:

  1. నమస్తే రావుగారూ! మంచి ప్రయత్నం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పలురకాలైన డైట్ లు వచ్చి ప్రజలలో కొంత అయోమయాన్ని కలుగజేస్తున్నాయి. ఈ అయోమయాన్ని, అపోహలను పోగట్టి స్పష్టత ఇవ్వటానికి ప్రభుత్వంనుంచి గానీ, national institute of nutrition వంటి సంస్థలనుంచిగానీ ప్రయత్నం జరగటంలేదు. ఒక విశాల దృక్పథం లేకపోవటమే దీనికి కారణం. మీరు వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న ఈ చొరవలో కొద్ది శాతమైనా concerned partiesకు కలగాలని ఆశిద్దాం. ఇక మీ గత పోస్టుపైన నాకు ఒక సందేహం ఉందండి. రేషనలిస్టుల దృష్టిలో యోగాసనాలకు సంబంధించి... అవి శారీరక కదలికలతో కూడి ఉంటాయికాబట్టి ఫర్వాలేదని వారు అంటారు. ధ్యానాన్ని మాత్రం వారు అంగీకరించరు. దానిని placebo effectగానే చెబుతుంటారు. ధ్యానం వలన ప్రయోజనాలకు scientific validation ఏమైనా ఉందా అనేది నా సందేహం.

    ReplyDelete
  2. శ్రవణ్ గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు."ధ్యానం " గురించి తప్పకుండా విడిగా వ్రాస్తాను.అది పనీ పాటా లేని వాళ్ళు చేసేది అని అనుకుంటారు కొందరు. మన ఆచారాలకు కారణాలు ఉన్నాయి కాకపోతే అవన్నీ కనుమరుగు అయిపోయాయి. ఇంతలో meditation గురించిన ఈ చిన్న వ్యాసాన్ని చూడండి.
    https://www.healthline.com/nutrition/12-benefits-of-meditation

    ReplyDelete