Tuesday, March 19, 2019

150 ఓ బుల్లి కథ ---- పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి

"నాకు ఇష్టంలేని పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి,ఏమి చేయమంటావు? " అన్న పరమేశానికి ఏమి చెప్పాలో అర్ధం కాలా.

'ఆ ఆలోచనలు వచ్చినప్పుడు బాధగా ఉంటుంది కదూ" అన్నాను.

"పరమేశం మన మనస్సు ఒక కంప్యూటర్ లాంటిది. దానికి మనం వినేది చూసేది చేసేది అన్నీ తెలుసు. కొన్ని గుర్తు పెట్టుకుంటుంది కొన్ని గుర్తుపెట్టుకోదు  " అన్నా.

"మనకు ఇష్టం లేనివే ఎందుకు గుర్తుకు వస్తుంటాయి " అన్నాడు.

" మనం అటువంటి పనులు మళ్ళా చెయ్యకుండా" అన్నాను.

"మనస్సులోకి ఆ ఆలోచనలు రాకుండా ఏమన్నా చేయగలమా" అన్నాడు.

"ఎక్కడో చదివినట్టు గుర్తు. మనస్సు కంప్యూటర్ లాంటిది కాబట్టి, ఆ ఇష్టంలేని ఆలోచనలు వచ్చినప్పుడు డిలీట్ డిలీట్ అను. ఆ ఆలోచనలు మనస్సు నుండి తొలగి పోతాయి."

"మనస్సులో కంప్యూటర్ కి డిలీట్ అంటే తెలుస్తుందా" అన్నాడు.

"ఎందుకు తెలీదు. మనం కీ బోర్డు మీద డిలీట్ బట్టన్ నొక్కుతున్నాము. డిలీట్ అంటే దానికి తెలుసు. Alexa weather అంటే Alexa  weather చెప్పటల్లా, అల్లాగే మనస్సుకి ఒక ముద్దుపేరు పెట్టుకుని పిలిచి డిలీట్ డిలీట్ అను".

"పనిచేస్తుందా" అన్నాడు

"పనిచేస్తే పనిచేస్తుంది లేకపోతే లేదు. పని చెయ్యక పోతే మన ఋషులు చెప్పే మెడిటేషన్ (ధ్యానం) మొదలెట్టు.తప్పకుండా పనిచేస్తుంది."

"అదెందుకు పనిచేస్తుంది?"

"ధ్యానం చేసేటప్పుడు దాని మీదే మనస్సు నిలబెట్టాలి ". "అంటే మనస్సులో ఆలోచినలు అటూ ఇటూ పోకుండా ఒక దాని మీదే నిలబడి ఉంటుంది"

"అయితే"

"సముద్రపు ఒడ్డునున్నావనుకో అలలు వస్తూ హోరు వినిపిస్తుంది ". "ఒక క్షణం అలలు రాకుండా ఉన్నప్పుడు ఉండే ప్రశాంతత నీవు నమ్మలేవు"

"నిజమే"

"మనస్సులో ఆలోచనలు అల్ల కల్లోలంగా అలలు లాగా వస్తూ ఉంటాయి. మనస్సుని ఒకే ఆలోచన (ధ్యానం) మీదే నిలబెట్టావనుకో ఆ ఆలోచినలు నిలిచిపోతాయి"."అదే మనకు కావాల్సింది"

"ధ్యానం చేసే దెల్లాగూ ?"

"పల్లా కొండలరావు గారు వారి బ్లాగ్ పోస్ట్ లో ధ్యానం మీద వారికి నచ్చిన వీడియో పోస్ట్ చేశారు.
http://blog.palleprapancham.in/2019/03/blog-post_19.html
అదే నాకు నచ్చింది కూడా. అదే నేను ఇక్కడ ఇస్తున్నాను. పరమేశం ఆ వీడియో చూసి ధ్యానం ఎల్లా చెయ్యాలో నేర్చుకో".





మన మెదడు లో ఉన్న కంప్యూటర్ గురించి Waldon Melanie వ్రాసిన పుస్తకం నుండి ముఖ్య విషయాలు ఈ క్రింద ఇస్తున్నాను:
The following information about brain is taken from the book:

Your Brain Understanding with numbers (2014)
Waldron, Melanie
Raintree, Chicago Illinois, USA

Remember, Your one amazing brain:

1. Has about 100 billion brain cells and is 75 per cent water.

2. Stores about 100,000 gigabytes worth of memories

3. Uses 20 per cent of your energy

4. Is connected to around 93,000 miles (150,000 kilometers) of nerves in your body

5. Sends messages around your body at upto 270 miles(435 kilometers) per hour

6. Sees, hears, smells, tastes, and feels for you

7. Keeps your heart pumping and your lungs breathing

8. Rests while you sleep.

No comments:

Post a Comment