మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.
నచికేతుని కిచ్చిన మూడవ కోరిక తీర్చటానికి రెండొవ భాగంలో యముడు నచికేతునికి మన అందరిలో ఉండే ఆత్మ గురించి చెబుతాడు. ఆత్మ అందరి హృదయాలలోనూ నాడీ సముదాయం మధ్య ఆసీనమై ఉంటుంది కానీ, అది ఎవరికీ కంటికి కనపడదు , దానికి ఆకారం లేదు. దానికి క్షీణత్వం లేదు. దేహానికి ప్రాణ మిచ్చేది అదే తీసుకుపోయేది అదే. అన్ని ప్రాణులలో ఉన్నదీ అదే. అది నశించదు , అది ఉన్న దేహం క్షీణించి నశించిపోతే ఇంకొక దేహం వెతుక్కుని దానిలో ప్రవేశిస్తుంది.
మన మనసు (mind ) జ్ఞానేంద్రియాల ద్వారా బయట వస్తువులని గుర్తిస్తుంది. ఈ మనసువెనుక తెలివి తేటలు (intellect ) ఉన్నాయి. ఆతెలివితేటల తరువాత ఉన్నది ఆత్మ(Self ). దాని తర్వాత అవ్యక్తం (avyaktham ). దాని తర్వాత పురుష (Purusha ). దానితర్వాత ఏమీలేదు.
పుస్తకాలు తిరగ వెయ్యటం మూలానో, వేదాలు చదవటం మూలానో , తెలివితేటల మూలానో ఆత్మ జ్ఞానం (realization ) కలుగదు. బ్రహ్మ మనకి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనటానికి జ్ఞానేంద్రియాలు పెట్టాడు కానీ మనలో ఉన్న ఆత్మని చూసుకోటానికి ఏమీ పెట్టలేదు.
ఈ ఆత్మకి పేరుకూడా పెట్టలేము. అతీతుడు (infinite ), ఆకారము లేనివాడు, మనకు తెలిసిన మాటలకి అందని వానికి ఏ పేరు పెడతాము ! అందుకనే ఋషులు "ఓం" అని సంభోదించారు.
యోగా (Yoga ) తో ఆత్మను కనుగొన వచ్చు అంటారుగానీ అది కుదరదు. ఎందుకంటే యోగ అంటే జ్ఞానేంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవటం. ఇది తాత్కాలికం. వస్తూ పోతూ ఉంటుంది.
మనలో ఉన్న ఆత్మే మన తెలివితేటల్ని, మన జ్ఞానేంద్రియాలనీ పని చేయించేది. కానీ "మాయ" ఆత్మని గుర్తించకుండా చేస్తుంది. ఆత్మని గుర్తించ కలిగేది "నిర్వికల్ప సమాధి" తోనే.
ఎవరైతే కోరికలకు (Vishaya kara Vrittis ) అతీతుడో , మనసునీ జ్ఞానేంద్రియాలనీ అదుపులో ఉంచుకుంటాడో , సద్గుణుడో, తమలోని ఆత్మను అనుభూతి (feeling ) (Brahmakara Vritti ) ద్వారా గుర్తించ గలుగుతారో వారికి బాధలూ భయాలూ మరణము ఉండవు. బాధలూ భయాలూ మరణాలూ ఉండేది అశాశ్వితమయిన శరీరానికి గానీ శాశ్వితమైన ఆత్మకు కాదు.
ఆత్మ ఉనికిని కనుగొనుటకు ధ్యాన మార్గం (Meditation ) ఒక్కటే దారి. నువ్వు ఆత్మ కోసం వెదుకుతున్నావని నీ మనసుకుచేప్పు, మనసు చేత నీ తెలివికి(Intellect ) చెప్పి దానిచేత ఆత్మని వెతికించు. ఆత్మని కనుగొనవచ్చు. మొదట్లో బొటనవేలంత జ్యోతిని మనసులో సృష్టించుకొని దానిమీద ఓంకార జపం(Meditate ) చెయ్యి. ఆత్మ సంధానం పొందవచ్చు. దీనిని ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో సాధించ వచ్చు.
ఫల శృతి:
నచికేతుడు యముని ఉపదేశం ననుసరించి కామక్రోధాదులను, మరణమును జయించి బ్రహ్మైక్యము పొందెను.
ఎవరైతే నచికేతుడు, యముని కధ విందురో వారికి ఆత్మజ్ఞానం కలుగును.
ఎవరైతే వారి పూర్వికుల శ్రార్ధ కర్మలప్పుడు భక్తితో ఈ కధ చదువుతారో వారి పూర్వికులు మోక్ష్మము పొందుదురు.
ఓం: మనమెప్పుడూ ద్వేషించు కోకుండా, పోట్లాడుకోకుండా చేసి మనందరినీ ఆ పరమాత్మ రక్షించి ముక్తి ప్రసాదించు గాక.
నా మాట:
ఈ ఉపనిషత్ లో చివర ఫల శృతి ఉంది. ఆ రోజుల్లో కూడా అసూయలూ వైషమ్యాలూ పోట్లాడుకోటాలూ ఉన్నాయన్నమాట. (మనలోమన మాట ఇద్దరు ఋషులు పోట్లాడుకుని రెండు యజుర్వేదాలువ్రాశారు. మన ఈ ఉపనిషత్ కృష్ణ యజుర్వేదంలో నుండి తీసుకొనబడినది.)
ఆత్మ మన శరీరానికి ప్రాణంపోసి అన్ని అవయవాల చేత పని చేయిస్తుంది. కంప్యూటర్ భాషలో మాట్లాడితే కంప్యూటర్ పనిచేయటానికి ప్రాణం పొసే విద్యుత్ కిందకి వస్తుంది.
( త్యాగయ్య గారు 250 ఏళ్ళ క్రిందట మననుండి హృదయాన్ని కదిలించే ధ్వని ఎల్లా వస్తుందో చెప్పారు. మనం "ఓం " శబ్ద వ్యక్తీకరణకి వాటిని ఉపయోగించుకోవచ్చు.
1. ప్రాణానల సంయోగము వల్ల ప్రణవనాద సప్త స్వరములు.
2. నాభీ హృద్ కంఠ రసనా నాసాదుల
3. నిద్దుర నిరాకరించి వేకువజామున లేచి
4. శోభిల్లు సప్తస్వర
ధ్వని పుట్టించాలంటే వాయువు అవసరం. తెల్లవారు ఝామున లేచి నిశ్చలత్వముతో, ఆ వాయువుని నాభి లో పుట్టించి హృదయం మీదకుండా కంఠమును తాకుతూ కదిలిస్తూ నాసికా ముఖ ద్వారాలనుండి బయటికి తెచ్చి సప్తస్వరాలను పలికించు.
మన "ఓం" శబ్ద సృష్టికి తద్వారా మనలోని "ఆత్మ " ని కనుగొనటానికి (realization ) త్యాగయ్యగారి మాటలు ఎంతోఉపయోగపడతాయి.
త్యాగయ్య గారి గురించి పై చెప్పిన మాటలన్నీ ఈ క్రింది విజయ శివ గారి వీడియొ నుండి సేకరించినవి.
chaalaa baavundi.
ReplyDeleteశ్రీ గారూ మీకు నచ్చినందుకు థాంక్స్.
ReplyDeleteశ్రీ లక్కరాజువారికి, నమస్కారములు.
ReplyDeleteకఠోపనిషత్ మూడో భాగాన్ని చదివాను. బాగుంది. అయితే, ఇందులో నాకు కొన్ని సందేహాలు వున్నాయి. ఈ క్రింది వాటిని చదివిన తరువాత, మీయొక్క వివరణలను ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.
1. “నేతి” – నా ఇతి, అనే సూత్రాన్ని అనుసరించి, “ నేను “ ఈ శరీరాన్ని కాదు; నేను ఈ ఇంద్రీయాల్ని కాను; నేను మనస్సును, బుద్ధిని కాను అని ఒక్కొక్క దాన్ని ప్రక్కకు పెడుతూ, నేను కేవలం ఆత్మను ( లేదా జీవాత్మను లేదా పరమాత్మను ) అని తెలియ చెబుతున్నారు మన గురువులు. అయితే,
2. “ నువ్వు “ ఆత్మ కోసం వెదుకుతున్నావని నీ మనసుకుచేప్పు, మనసు చేత నీ తెలివికి(Intellect ) చెప్పి దానిచేత ఆత్మని వెతికించు. ఆత్మని కనుగొనవచ్చు – అనే ఈ వాక్యంలో నువ్వు ఆత్మ కోసం వెదుకుతున్నావనీ, ....... అని అంటే, ఇక్కడ ఆ నువ్వు అంటే ఎవరు?
3. మొదటి పేరాలో తేల్చి చెప్పిన ఆ నేను అనేది ఆత్మనే అయితే, అప్పుడు, ఆత్మ, ఆత్మని వెతకమని మనసుతో చెప్పినట్లు అవుతుంది కదా?
4. “ఈ ఆత్మకి పేరుకూడా పెట్టలేము. అతీతుడు (infinite ), ఆకారము లేనివాడు, మనకు తెలిసిన మాటలకి అందని వానికి ఏ పేరు పెడతాము? “ –
“మనసువెనుక తెలివి తేటలు (intellect ) ఉన్నాయి. ఆతెలివితేటల తరువాత ఉన్నది ఆత్మ(Self ). దాని తర్వాత అవ్యక్తం (avyaktham ). దాని తర్వాత పురుష (Purusha ). దానితర్వాత ఏమీలేదు. “
“బ్రహ్మ మనకి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనటానికి జ్ఞానేంద్రియాలు పెట్టాడు కానీ మనలో ఉన్న ఆత్మని చూసుకోటానికి ఏమీ పెట్టలేదు. “
పై మూడు వాక్యాలని గమనిస్తే, జ్ణాన ఇంద్రియాలలో “మనస్సు” కూడా ఒకటి. పేరులేని, ఆకారములేని, ఉనికి యెక్కడో తెలియని ( అతీతం అయిన ఆత్మను ) మనసు ద్వారా, నిర్వికల్ప సమాధి ద్వారా ఎలా తెలుసుకుంటాము? అనేది నా ప్రశ్న. ఆత్మ, దాని తరువాత అవ్యక్తము అని చెప్పినప్పుడు, అవ్యక్తమును ఏ విధముగా తెలుసుకుంటాము?
5. నాకు గుర్తు వున్నంతవరకు, బహుశా, కఠోపనిషత్ లోనే ఒక చోట ఈ విధంగా చెప్పబడింది:- “ ఏ మనసు చేత సంకల్పించబడలేదో, ఏ మనస్సు చేత ఊహింపబడలేదో, ఏ మనస్సు చేత చూడబడలేదో, ఏ మనస్సు చేత అనుభవించబడలేదో అట్టిది, అదే పరమాత్మ “.
6. “ఆత్మని గుర్తించ కలిగేది "నిర్వికల్ప సమాధి" తోనే. ´ --- నిర్వి: ఏమీ లేని ; కల్ప : కల్పన లేక ఊహ. అంటే, ఏదీ లేదా దేనినీ కల్పించలేని లేదా ఊహించలేని స్థితియే నిర్వికల్ప సమాధి.
మీ స్నేహశీలి,
పబ్బరాజు మాధవరావు.
మాధవరావు గారూ:
ReplyDeleteచిరకాలదర్శనం. ఎల్లా ఉన్నారు ?
మీరు చెప్పిన దంతా నిజం(correct ). ఇక్కడ మనం బాహ్య ప్రపంచానుభూతులు కలిగిన శరీరంని మనకు కనపడని,ఆకారంలేని ఆత్మతో కలపాలని చూస్తున్నాము. దీనికి ఒకటే మార్గము. మొదట మనకు తెలిసిన పంచేంద్రియాల ద్వారా ఆత్మ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పాలి. మనకు మనస్సు ఎక్కడుంటుందో తెలియదు, దాని మార్గం తెలుసు (brain ద్వారా). "జ్యోతి", "ఓం" కూడా ఆత్మ తో అను సంధానికి మన ప్రయత్నాలు. ఒకసారి ఆత్మానుభూతి పొందిన తరువాత పైన చెప్పిన వన్నీ అనవసరం.
ఉదాహరణకి అమెరికా వెళ్ళాలంటే వీసా మొదలయినవి కావాలి. కానీ అవి లేకుండా కూడా వెళ్ళచ్చు. కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు.
నాకు తెలిసినది చాలా తక్కువ.మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.