Tuesday, February 1, 2022

193 ఓ బుల్లి కథ -- భాషలు ఎల్లా పుట్టాయి ? (Evolution of Languages )

మనం జీవించాలంటే రెండు పనులు రోజూ చేస్తుండాలి. శరీరానికి మనస్సుకి ఆహారం. దీనికి మనం పంచేంద్రియాల సహాయం తీసుకుంటాము. ఈ రెండింటికీ నోరు చాలా ముఖ్యం. మొదట్లో ఆహారం తీసుకోటానికి నోరు ఉపయోగించినప్పుడు, దానితో శబ్దాలు చెయ్యవచ్చు అని గ్రహించారు. ఆ శబ్దాలు విన సొంపుగా చెయ్యవచ్చుఅని తెలుసుకొని ఆచరించటమే సంగీతం. ఆ శబ్దాలతో  మనసులో భావాలు వ్యక్తం చెయ్యవచ్చు అని తెలిసికొనటం ఒక భాషకు పునాది. మానవులు ప్రపంచం లో పలు చోట్ల గుంపులుగా ఉండటం వలన, వారి అవసరాలకి గుంపుకో భాష తయారు అయ్యింది. 

సియాటిల్ ఇంటిలో  పుస్తకాల కోసం వెతుకుతుంటే "The Evolution of Language" అనే పుస్తకం దొరికింది. పెద్ద పుస్తకం. చదవటానికి ఉపక్రమించాను. ఇది March 2008 లో బార్సిలోనా, స్పెయిన్ లో జరిగిన "Evolution  of Language " కాన్ఫ రెన్స్ లో సమర్పించిన పరిశోధనా పత్రాల సంకలనం.

 కొంచెం కష్టమైనా విషయం తెలుసుకుందామనే జిజ్ఞాసతో చదవటం ప్రారంభించాను.  ఈ పోస్టు లో ఆ పరిశోధనా పత్రాల నుండి నేను తెలుసుకున్న కొంత సమాచారం మీతో పంచుకుంటున్నాను. దీనిలో రెండు పరిశోధన పత్రాలు వ్రాసిన వాడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నా సందేహాల నివారణ తేలిక అయింది.

Paper By: Xavier Castello, Lucia Loureiro - Porto , Ritta Toivonen , J. Saramaki and K. Kaski (page 59): ప్రపంచం లో చాలా సమాజాలలో రెండు మూడు భాషలు ప్రాచూర్యంలో ఉన్నవి కానీ వాటి భవిష్యత్ ఎట్లావుంటుందో చెప్పటం కష్టం. ఇప్పుడు ప్రపంచం లో ఉన్న దాదాపు 6000 భాషల భవిష్యత్తు ప్రశ్నార్ధకము. వీటిలో 50% ఈ శతాబ్దంలో మాయ మవుతాయి. దీనికి కారణము ప్రపంచంలో  ప్రజల భాషల వాడుక సమానత్వం లేదు. ఎందుకంటే 96% ప్రజలలో వాడుకలో  4% భాషలే ఉన్నాయి. అందులో 25% భాషలు మాట్లాడే వాళ్ళు 1000 మంది కూడా లేరు. కొన్ని కొత్త భాషలు రావటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అంతరించే భాషలతో పోలిస్తే అవి చాల తక్కువ.

Jean-Louis Dessalles (page 91) : మానవు లందరూ వాళ్ళ వాళ్ళ భాషా పటిమని  ప్రదర్శించు కోవాలని చూస్తూ ఉంటారు. సామాన్యంగా ఒక్కొక్కళ్ళూ రోజుకి 15,000 పదాలు ఉపయోగిస్తారని గమనించారు  (Mehl et al. 2007). ఎక్కువ సమయం వాదనకో లేక జరిగిన ఒక సంగతి గురించి చెప్పటానికో ఉపయోగిస్తారు. ఆఫీసులో పనిచేసేవాళ్ళు వాళ్ళ బ్రేక్ సమయంలో చేసే సంభాషణలు క్రింది విధంగా ఉంటాయి.

దేనిగురించో కధ చెప్పటం -------------------------  43.4%

తాను చూసిన / విన్న  వాటి గురించి చెప్పటం--- 19.75%

వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల గురించి చెప్పటం---  16.8%

ఊహాగానం (Gossip )  --------------------------------  13.8%

జోక్ లు చెప్పటం  -----------------------------------    6.3%

అల్లాగే  భోజన సమయంలో మాట్లా డే మాటల్లో  చాలావరకూ జరిగిన వృత్తాంతాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో గొణుగుడు లేక నిశ్శబ్దంగా ఉండటం కూడా మామూలే.

చాలా మంది సంభాషణల్లో చెప్పే కధలు వాళ్ళ కు జరిగిన  అనుభవంతో చెప్పినవి కావు. చాలా వరకు ఇంకొకళ్ళ దృష్టిని ఆకర్షించటానికి ఈ విధంగా చెబుతూ ఉంటారు. మానవులకు సమాచారం అంటే చాలా ఇష్టం. అందుకని స్నేహితులను ఆకర్షించటానికి సమాచార కేంద్రములుగా మారుతారు.

Paper by Juan C Moreno Cabrera : మొదట సంజ్ఞలు, తరువాత మాటలు, ఆ తరువాత వాక్యాలూ, ఆ తరువాత వాక్యాల కుదింపులూ (syntactic Complexity ) వచ్చాయి. ఉదా హరణకి :I know that , It is true  రెండు వాక్యాలు మాటని ఒక వాక్యంలో  I know that it is true. ఇటువంటివి దాదాపు అన్ని భాషల్లో ఉన్నాయి. ఈ వ్యాసంలో అవి ఎలా వచ్చాయి అనే దాని మీద చర్చించారు. 

Paper by Dennis Philps (page 251): ఆది మానవుడు సంజ్ఞల నుండి మాటలకు ఎలామారాడు అనేది చాలా క్లిష్టమయిన సమస్య. దీనికి నోరు, కన్నుల సమన్వయం చాలా ముఖ్యము (Mouth-Eye Coordination).

Paper by Kiran Lakkaraju and Les Gasser (page 456) : భాష ఒకరి  సొత్తు కాదు. భాష నిలవాలంటే ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ సహకరించాలి. చాల మంది పరిశోధకులు దీనికి  "Multiagent Agreement Problem(MAP)" కింద పరిశీలించారు కానీ మేము చెప్పే క్రింద కారణాల వల్ల MAP తో పరిశోధనా ఫలితాలు సరీగ్గా ఉండవని గుర్తించవచ్చు. ఈ MAP విధానంలో పరిశీలించాలంటే MAP కు కొన్ని సవరణలు తప్పవు.

"Signal" అనే పదానికి తెలుగు గుర్తురాకపోతేమా ఆవిడని అడిగాను. ఎందుకు అని ఎదురు ప్రశ్న వేసింది. భాష అనేది ఎల్లా పుట్టిందో పరిశీలిస్తున్నాను అన్నాను. ఎందుకు పనికిరాని అనవసరపు వాటి మీద సమయము వ్యర్ధము చేస్తారు సాయంత్రం భోజనానికి కూర చెయ్యమంది. Mouth-Hand-Eye Coordination తోటి కాలిఫ్లవర్ తరిగి కూర చెయ్యాలి. భాష కన్న భోజనం ముఖ్యం. అందుకని దీనిని ఇంతటితో ముగిస్తాను. గ్రేట్ రిసెర్చికి ఇటువంటి అడ్డంకులు ఎప్పుడూ వస్తుంటాయి. అందుకనే కొత్తవి డిస్కవర్ చెయ్యటం చాలా కష్టం. I got to go. అంటే నేను వెళ్ళాలి అని అర్ధం. సామాన్యంగా సంభాషణ తెంపటానికి (ఆపటానికి) అంటూ ఉంటారు.

PS: I got money. I got fame. I got food. ఇవన్నీ బాగానే అర్ధమవుతాయి కానీ ఇంగిలీషు వాడి I got to go. ఏమిటి ?

9 comments:

  1. It all started with man trying to imitate birds and animals to help him hunt. Later, he found it useful in many other ways.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసినంత వరకూ భాష పుట్టుక గురించి ఒక నిర్ణీత సిద్ధాంతం లేదు. మీరు చెప్పినది సబబుగానే కనపడుతున్నది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  2. P G Wodehouse గారు తన Summer Lightning నవలలో ముందుమాటలోI thank my wife too without whose help I would have completed writing this book much faster అంటాడు . 
    తెలుగు భాషకు సంబంధించినంత వరకు ప్రముఖ భాషావేత్త తిరుమల రామచంద్ర గారు కొంత పరిశోధన చేసినట్లున్నారు. వారు రచించిన “మన లిపి - పుట్టుపూర్వోత్తరాలు”, “నుడి-నానుడి” అనే రచనలు ప్రసిద్ధం. 
    https://te.m.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0
    అమెరికాలో మాడిసన్ లోని విస్కాన్సిన్ యూనివర్శిటీలో తెలుగు భాషా విభాగంలో కొన్ని దశాబ్దాలపాటు పని చేసిన ప్రముఖుడు డాక్టర్ వెల్చేరు నారాయణరావు గారు ఈ అంశం మీద ఏమన్నా వ్రాసారేమో తెలియదు. వారు తరువాత అట్లాంటాలోని (జార్జియా రాష్ట్రం) ఎమరీ (Emory) యూనివర్శిటీకి మారినట్లున్నారు. 

    All the best with your own research efforts 👍.

    ReplyDelete
  3. నా ఉద్దేశంలో మానవులలో భాష ఎల్లా ఏర్పడింది అనేది నిర్ధారించటం ఇంతవరకూ జరగలేదు. అందుకని ఈ పరిశోధనలో మనమందరమూ పాల్గొన వచ్చును. మీ ఉద్దేశంలో ఎల్లా జరిగిందో చెప్పండి. మన ఆలోచనలన్నీ కలిపితే స్వష్టత వస్తుందేమో.
    విన్నకోట వారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  4. పైన నేనిచ్చిన తిరుమల రామచంద్ర గారి లింకుని clickable చేసి ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను మరింత వీలుగా ఉంటుందని.

    తిరుమల రామచంద్ర గారు

    ReplyDelete
  5. ప్రస్తుతం చికాగోలో బ్లిజర్డ్. ఎక్కడికీ వెళ్లే పని లేదు. ఇంటిపనులైన తర్వాత తప్పకుండ చదువుతాను. థాంక్స్ విన్నకోట వారూ.

    ReplyDelete
  6. రామచంద్రగారి లిపి గురించి చదివాను. వారు తెలుగు, కన్నడ లిపి సామీప్యన్నీ , తెలుగు భట్టిప్రోలు లిపి గురించి, మన లిపి ఇతర దేశాలకు ఎల్లా వెళ్లిందో వ్రాశారు. భాషలో మార్పులు ఎల్లా వచ్చాయో వ్రాసారు కానీ అసలు భాష ఉద్భవించటానికి కారణాలు ఏమిటో ప్రస్తావించలేదు. విన్నకోట వారూ థాంక్స్.

    ReplyDelete
  7. తిరుమల రామచంద్ర గారి wiki నుండి వారి "నుడి-నానుడి" రచన గురించి :-
    ==============================
    "నుడి-నానుడి : మహీధర నళినీమోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకం లో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు : గోంగూర, మిరపకాయ, నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా..."
    ====================================

    “నుడి-నానుడి” pdf పుస్తకం archive.org నుండి ఈ లింకు ద్వారా దింపుకోవచ్చు 👇.

    నుడి-నానుడి (తిరుమల రామచంద్ర)

    ReplyDelete
    Replies
    1. పుస్తకం download చేసుకుని చదువుతున్నాను. కొంచెం time తీసుకునేటట్లు ఉంది. థాంక్స్ విన్నకోట గారూ.

      Delete