Showing posts with label Telugu rachana Lakkaraju. Show all posts
Showing posts with label Telugu rachana Lakkaraju. Show all posts

Tuesday, April 13, 2010

18. ఓ బుల్లి కథ 6 ---- శనగలతో నా చిట్కా వైద్యం

శనగలతో నా చిట్కా వైద్యం ----
ఇవాళ రహస్యముగ  ఒక కొత్త పరిశోధన చేయవలయునని  నిర్ణయించు కొంటిని. ఈ మద్య నాకు కొంచం మతిమరుపు ఎక్కువ అయినది దానికి చిట్కా మందు కనిపెట్టవలె నని అనుకొనుచుండగా ఒక మంచి "క్లూ" దొరికినది. ఇంటి ఆవిడ ఆఫీసు కి వెళ్ళిన వరకు ఆగి ఒక "క్యాన్" "గర్బాన్జో" కొనుక్కుని వచ్చితిని. వచ్చి కట్ చేయుచుండగా "క్యాన్" ఒపెనేర్ మధ్య మధ్యలో స్లిప్ అయి మూత వచ్చుటలేదు. రేకు వంచి తీయుదమని ప్లయర్సు కోసం వెతుకుట జరిగినది. అవి కనపడలేదు. మా ఇంటిలో ఇటువంటివి ఎచ్చట ఉండునో నాకు తెలియదు. టూల్స్ అన్నీ ఒక చోట పెట్ట మని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినరు. కాగా పోగా ఉపయోగించే వాళ్లకి ఎక్కడ ఉన్నయ్యో తెలుసు అని ఎద్దేవా చేస్తారు. మా ఇంటిలో చేతి వాటం వాడిని (హండీ మాన్ ) నేను కాదు. నా పరిశోధన విరమించుకునే పరిస్థితి ఏర్పడి నాకు చాలా బాధ వేసినది.

అసలు నేను చేసిన తప్పు ఉబుసుపోక "నాన్న" బ్లాగ్ చదువుట. దానిలో శనగలు ఎంత మంచివో వ్రాసితిరి. శనగలు తింటే ఎలా ఉండునో చూపుటకు ఒక ఫోటో గూడ ఉంచిరి. అది చాలా బాగుగ  ఉన్నది. మొన్న అటువంటిది ఒకటి తీయించు కుంటిని గాని, అది
సైడ్ ఫోజులో తీయటముతో నా బొజ్జ బయట పడెను.  వ్యాయామ యంత్రముల ముందర బొజ్జ బాగుండదు కదా అందుకని నా ఫోటో పెట్టలేదు. ఇంతకీ చెప్పొచ్చే దేమిటనిన అది చదివి న తరువాత, శనగలు తినిన మైండ్ చాలా బాగా పనిచేయునని  గట్టి నమ్మకము  కలిగినది. ఎందువలన అనిన శరీరం చక్కగా ఉండుటకు  మైండ్ కదా ముఖ్యము .అందుకనే పేరంటపు  శనగలు తిని తిని మన ఆడవాళ్ళకి చాలా తెలివి తేటలు వచ్చి ఉంటవని నా అనుమానము. మనని పేరంటములకు చస్తే పిలవరు కదా. ఈ మధ్య మా ఆవిడ పేరు గూడా గుర్తు ఉండక "ఆవిడ" అని అనుచుంటిని. ఆవిడ ఆఫీసు నుండి వచ్చే లోపల శనగలు తో మైండ్ చిట్కా మందు తయ్యారుచేయుదమని అని అనుకుంటిని. ఇప్పుడు "క్యాన్" మూత వచ్చుటలేదు. ఈ డబ్బా లో నుండి శనగలు ఎటుల తీయ వలయునో ఏమి చేయవలయునో తోచటము లేదు.

పెద్ద పెద్ద వాళ్ళు స్నానము చేస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి క్లిష్ట మయిన సమస్యలని పరిష్కరించారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అది కూడా ప్రయత్నించితిని. అరగంట స్నానము చేసినను సమాధానము దొరకలేదు. దిగులుగా డ్రెస్ వేసుకుని తలదువ్వుటకు దువ్వెన కొరకు మధ్య అర తీసితిని, ఎదురుకుండా ప్లయర్సు కనపడినది. రిలేటివిటీ థియరీ ని మళ్ళా కనుక్కున్నంత ఆనందము కలిగినది.

ఇంక నా పని నల్లేరు నడక నుండి పచ్చగడ్డి మీద పరుగుగ మారి పోయినది. వెంటనే రేకు వంచి శనగలు తీసి మూడు సార్లు బాగా కడిగి ఆరబోసితిని. రెండు నోట్లో వేసుకొంటిని. పచ్చివి రుచిగ లేవు. రుచి తెప్పించుట  నాకు పెట్టిన విద్య. భగుణె లో రెండు స్పూన్స్ నూనె (ఆలివ్ అయితే ఇంకా మంచిది) వేసి, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు జీల కర్ర, నాలుగు మెంతులు, చిటికెడు పసుపు , ఒక ఎండు మేరప తుంచి వేసితిని. వేగిన తరువాత ఆరిన శనగలు పోసితిని . శనగలు వేగుతున్నప్పుడు నీళ్ళు ఉండటము వలన  
పేలును. నీళ్ళు పోవు వరకు వేయించి పావు స్పూన్ కారము ఉప్పు వేసి పులుపు కోసం నిమ్మకాయ పిండితిని.

ఇంక నా ఆనందమునకు అంతు లేదు. ఎందుకైనా మంచిదని
పొటాసియం కోసం అరిటిపండు ఒకటి తింటిని. నా మెదడుకి మందు ఇప్పుడు నా చేతులలో ఉంది. రెండు గింజలు నోట్లో వేసుకుని రుచి చూసితిని. బ్రహ్మాండముగా ఉండెను. గబా గబా ఒక గుప్పెడు తీసుకు ని తింటిని. తలుపు తాళం తీసుకుని వచ్చుచున్న చప్పుడు అయినది. స్వరాజ్యం వచ్చావా అని సంతోషం పట్టలేక పెద్దగ అంటిని. పేరుపెట్టి పిలుస్తున్నారు? ఏమిటి విశేషం అన్న సమాధానం నా చెవులకు విందయినది. ఇన్నాళ్ళకు మా ఆవిడ అసలు పేరు తిరిగి గుర్తుకు వచ్చెను. "యురేకా" అని అరిచితిని. నా చిట్కా మందు పనిచేసినది. నా పరిశోధన ఫలించినది. నా కనులు ఆనంద భాష్పముల తోటి నిండిపోయినవి.

మాతృక "నాన్న" బ్లాగు లో "మీకు తెలుసా" పోస్ట్ (ఏప్రిల్ 7, 2010). వ్రాసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

లక్కరాజు శివరామ కృష్ణారావు

Sunday, November 1, 2009

6. మోహినీప్రియ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కవిత డిసెంబర్ 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

ఇలా మొదలవు తుంది
వేసంగి వచ్చింది
వెచ్చగా ఉంది
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Thursday, October 22, 2009

3. కాలం మారింది ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు



ఈ నా చిన్న కవిత 1988 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.
1980's లో విసిఅర్ లు మనం కొనే ధరలలో వాస్తున్నాయి కానీ, ఇంకా అందరికీ ఇవి లేవు.

ఇలా మొదలవు తుంది
మా ఇంట్లో విసిఅర్ ఉంది
మీరు రండి మాఇంటికి
ఇంక మీరు క్లిక్ చేసి చదవండి

Friday, October 9, 2009

2. నా చిన్న కథ ---- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా చిన్న కథ అక్టోబర్ 1987 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు
కథ ఇలా మొదలవుతుంది
కొందరు పనులన్నీక్లుప్తంగా
చేసినా చెయ్యకపోయినా గుప్తంగా చేస్తారు.
కొందరు చేద్దామనుకున్న పనులు చేసినా
చేయకపోయినా ఊరు వాడ ఏకం చేస్తారు.
ఇక మీరు పక్క బొమ్మని క్లిక్ చేసి చదవండి








Friday, September 25, 2009

1. గతం గతః --- రచన: లక్కరాజు శివరామకృష్ణ రావు

ఈ నా రచన ఏప్రిల్ 1987 తెలుగు వెలుగు లో (చికాగో తెలుగు అసోసియేషన్) ప్రచురించ బడినది.
మీరు బొమ్మని క్లిక్ చేస్తే అది పెద్దదౌతుంది.

గేయం ఇలా మొదలవుతుంది :
మేల్విల్ ఇండియానా లో
కాపురముండే
మెలిండా తోర్గినావ్ కి
ముద్దులొలికే మగడు కావాలని
మనసారా ప్రేమించాలని
కన్నె వయసులో తీరని కోరిక
ఇక మీరు క్లిక్ చేసి చదవండి

Sunday, September 20, 2009

నా తెలుగు రచనలు

లక్కరాజు శివ రామకృష్ణా రావు రచనలు

ఇట్చట నేను ప్రచురించిన రచనలు కొన్ని, తరువాత కొత్తగ వ్రాసిన రచనలు కొన్ని ఉంచుతాను. మీరు చదివి ఆనందించండి . మీరు చదివేటప్పుడు, టూల్ బార్ మీద ఉన్న view, దానినుంచి వచ్చే zoom, zoomin, zoomout ఉపయోగించండి. తేలికగా చదవచ్చు.

నా మనవి
నేను ఇంగ్లీష్ లో టైపు చేస్తే తెలుగు లో కనుపిస్తుంది కాబట్టి కొన్ని తప్పులు దొర్లవచ్చు కనుక క్షమించండి. మీకు తెలుగులో కనపడక పోతే మీరు తెలుగు ఫాంట్స్ ని డౌన్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.

If you do not see Telugu script, you have to download Telugu Fonts.