Monday, March 22, 2010

15. ఓ బుల్లి కథ 3 ---- మనోవేదన ----

మనోవేదన -----

@రాజ రాజేశ్వరీ దేవి గారికి నమస్కారములు. నేను కష్టపడి పోస్ట్ వ్రాసి దానికి మీ స్పందన అడిగాను. బాగుందో లేదో చెప్తే పబ్లిష్ చేద్దామని. కాని ఒక రోజు వేచి చూసినా మీ అభిప్రాయం రాలేదు. వ్రాసిన తరువాత ఇంటర్నెట్ లో పెట్టకుండా ఉండలేము. అప్పటికీ ఒక రోజు మీ అభిప్రాయం కోసం ఆగాను. ఒక రోజు అంటే 24 గంటలు. అంటే 24 X 60 నిమిషాలు. అంటే 24x 60 x 60 సెకండులు. అన్ని సార్లు నా చేతి వేలితో మీ లేఖ కోసం మౌస్ ను నొక్కట మైనది . పాపం అది ఎంత బాధ పడినదో కదా. ఇంకా ఆగ లేక బ్లాగ్ లో పోస్ట్ చేసే శాను.

ఆ మర్నాడు గూడా మీ నుండి జవాబు రాలేదు. ఇలా ఎందు కయిందా అబ్బా అని నేను మా ఆవిడ మీటింగ్ పెట్టుకుని విచారించాము. బహుశ fedex లో నిమ్మకాయ, కారప్పూస పంపలేదని అలిగారేమో అని, నా బాధ చూడలేక మా ఆవిడ పిండి కలప టానికి సిద్ధ మయినది . 'బాక్స్ మీద అడ్రస్ రాసి రెడీ చెయ్యండి కారప్పూస వేసి పంపించేద్దాము' అని అన్నది. తీరా చూస్తే నా దగ్గర మీ అడ్రస్ లేదు. గూగుల్ వాళ్ళు ఈమెయిలు తో పార్సిల్ పంపటం ఇంకా మొదలు పెట్టలేదు. అందుకని కారప్పూస చెయ్యటం మాను కున్నాము. ఇది లంచము అనుకోకుండా ఆనరోరియము అనుకుని వెంటనే మీ అడ్రస్ పంపండి. మాకోసమే మేము ఎప్పుడూ చిరు తిండ్లు చేసు కొము. నేను గుప్పిట్లతో తింటానని మా ఆవిడ బాధ. ఆరోగ్యమునకు మంచిది కాదు కదా.

నాబ్లాగ్ లు చదివే వారు మీరొక్కరే. మీరు చదివి చెప్పక పోతే మా ఆవిడ చదవాల సొస్తుంది. అది ఆవిడ బాధ. నేను కంప్యూటర్ ముందర కూర్చుని పని చెయ్యక పోతే నేను ఆరుబయట చలిలో బొగ్గుల కుంపటి మీద వంట చెయ్యల్సో స్తుంది. దానినే నాగరికంగా గ్రిల్ అంటారు. అది నా బాధ. కనుక మీరే మా అందరికోసం నా పోస్టు లు చదివి బాగున్నాయని చెప్పండి. విని సంతోషించి ఇంకా కొన్ని నా బుల్లి కథలు వ్రాస్తాను. కష్టే ఫలి అంటారుకదా ఎప్పుడో కృషి ఫలిస్తుంది. మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటా మరి.

5 comments:

  1. నేను ఆరుబయట చలిలో బొగ్గుల కుంపటి మీద వంట చెయ్యల్సో స్తుంది. దానినే నాగరికంగా గ్రిల్ అంటారు.

    ha ha ha.

    ReplyDelete
  2. @కొత్త పాళీ గారూ నమస్కారాలు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఇంతకీ ఆరుబయట బొగ్గుల కుంపటి పెట్టి వంట చేసారా లేదా ?

    ReplyDelete
  4. @నేదునూరి: చివరి క్షణము లో కొత్త పాళీ గారి కామెంట్ అందినది. ఈ సారికి తప్పించు కున్నాను. మీరు కొంచం ఎమీ అనుకోక పోతే వెంటనే బాగుంది అని కామెంట్ పెట్టండి. ఆ పొగ లో నేను బాధ పడలేను. కొత్త పాళీ గారికి మీకూ మరిఒక ధన్యవాదాలు.

    ReplyDelete
  5. బాగుండక పోవడం ఏమిటి ? గ్రిల్ ఐన కుంపటి ఐన పొగ పొగే కదా ? ఏది ఏమైనా మీ కధ లాంటి వంటకం వంటకంలాంటి కధ సూపరబ్బు. హేట్సాఫు. సరే నా ? కొత్త కధ త్వరలొ

    ReplyDelete