Sunday, December 12, 2010

38 ఓ బుల్లి కథ 26-- ఒక బెలూను ఆత్మకథ --

ముందు మాట: ఒక చిన్నకొత్త ప్రయోగం చేస్తున్నాను. ఫోటోలు తీసినది కిరణ్,  శ్రీలత.


నేనెంత చక్కగా ఉన్నానో చూస్తున్నారుగా. నా ఎత్తు ముప్పై అడుగులు. ఎవరు నన్ను ఇలా సృష్టించారో తెలుసా.




   మొదట నా శరీరం మొత్తం నేల మీద పరుస్తారు. క్రింద నాకో బాస్కెట్ ఉంటుంది. దానిలో ప్రొపేన్ గాస్  ఉంటుంది.




ఆ తరువాత పక్క ఫ్యాన్ తో గట్టిగా గాలి విసురుతారు. అది చాల  పవర్ఫుల్ హోండా ఫ్యాన్. నేను    నేల మీద పెద్ద బుడగలా మారుతాను.



నా బాస్కెట్ లో ఉన్న ప్రొపేన్ గ్యాస్ ని కొద్ది సేపు వెలిగిస్తారు. నేను లేచి కూర్చుంటాను. పదిమంది నన్ను పారి పోకుండా పట్టుకుంటారు. వాళ్ళల్లో నలుగురు నా బాస్కెట్ లో ఎక్కుతారు అందులో ఒకరు పైలెట్. ఆ పైలెట్ చేసే పని అల్లా నేను పైకి ఎగరాలంటే ప్రొపేన్ మంట తో నాలోని గాలిని వేడి చేస్తాడు. అందుకనే నన్ను హాట్ ఎయిర్ బెలూన్ అంటారు.

అందరూ ఎక్కారు. నన్ను పట్టులోంచి వదిలారు. ఆహా నాకు ఎగిరే స్వేఛ వచ్చింది.








ఇంక నా స్నేహితులతో కలసిపోతాను.







అలా అలా నింగిలో హాయిగా విహరిస్తాను నాలో వేడి తగ్గే వరకూ. అంతదాకా అనంతంలో ఉంటాను. బైబై.



చివరిమాట: చూద్దాం ఎల్లా వస్తుందో.?




8 comments:

  1. నమస్కారములు రావు గారు !
    మీ బెలూన్ ఫొటోలు మీ కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగున్నాయి ఇలా మాకు తెలిపితె [ మాకు చెయ్యడం రాదు గనుక ]చూసి ఆనందించ గలము ధన్య వాదములు. మరిన్ని మీ కలం నుంచి జాలు వారాలని కోరుతూ మీ అభిమాని

    ReplyDelete
  2. @రాజేశ్వరి గారికి
    బొమ్మలు 'పికాసా' లో నుంచి తీసి పెట్టాను. అవి జూం లో సరీగ్గా ఫోకస్ అవటల్లేదు. కొంచెం సరిచేసి ఒరిజినల్ ఫోటోలు పెట్టాలి. మీ బహామా ట్రిప్ గురించి పోస్ట్ వ్రాయలేదు. ఎదురుచూస్తున్నాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. @నాగేంద్ర గారూ
    మీ వ్యాఖ్యకు థాంక్స్.

    ReplyDelete
  4. బహామా ఏముంది ? అన్నీ ప్రకృతి అందాలె
    ఇది పుష్పక విమానమా ? భూతల స్వర్గమా ? అన్న భ్రాంతిని కలిగించె షిప్పు.అందులొ నిర్విరామంగా తిరిగుతూ తింటూ తాగుతూ డెక్ మీదకు వెడితే సముద్రపు కెరటాలను దూసుకు పోతూ దూరంగా సాగరుడు నింగిని చుంబించి నట్టు అనుభూతి.అక్కడక్కడ కొంత దగ్గరలొ చెలిమి చేస్తు మనతో పాటు మరి కొన్ని షిప్పులు ,పయనిస్తుంటె అసూయతొ ఆకాశం జేగురు రంగు దాల్చి నట్టుంది.
    ఇక బహామాలొ దిగితె " అన్నీ బీచిలె .తెలుసుగా " బీచిలంటే ఆరబోసిన అందాలె మరి.ఇక గ్రీకు రాజుల అందమైన కట్టడాలు కోటలు 18 క్యారెట్ల తొ చేయబడిన కోట పై కప్పులు ,అంద మైన రంగు రంగుల చేపల ఎక్వేరియంలు ,రక రకముల " మొదుగ తాటి కొబ్బరి ఈత ,మందారం, బోగన్విల్లా ,గన్నేరు ,లాంటి ఎన్నో ఎన్నెన్నో మన దేశపు [ తెలుగు ] వృక్ష రాజములు స్వాగతం పలుకుతాయి .అల్లా చూసుకుంటూ పోతె 40 కళ్ళు 80 రోజులు సరిపోవు మరి .కాని ఏం చేస్తాం "? ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు ,మన భారత దేశ సంపద మాత్రం తక్కువా ? ఆస్వాదించె రస హృదయం ఉండాలె గాని ? అందుకె వెంటనే మన సంపద మన ఆవకాయలు మన నెయ్యి నిమ్మ కాయ పచ్చడి మన చారు మన తెలుగు బ్లాగులు ,మన బుల్లి కధలు గుర్తొచ్చి షిప్పులొ కొచ్చెసాం . [అక్కడి కేదో షిప్పు మనల్ని దింపేసి ఆగి పోయినట్టు.]? ? ? ?

    ReplyDelete
  5. మీ బుల్లి కథలులో....(ఈ రోజే చూసాను...ఇదొక్కటే చదివాను)
    బెలూన్...కథ బాగుంది.......ఫోటోలు బాగున్నాయి.
    వివరణ కూడా చక్కగా అర్ధమయ్యేలా ఉంది.

    ReplyDelete
  6. ఆదిత్య గారూ ధన్యవాదములు. తరచూ మనం ఇలా కలుస్తూ ఉందామని కోరుకుంటూ. ఉంటా మరి.

    ReplyDelete
  7. ధన్యవాదాలు...తప్పకుండా...కలుస్తూవుందాం.

    ReplyDelete