అమెరికాలో ఇల్లినొఇస్ అనే రాష్ట్రముంది. దానికి ఎన్నుకోబడిన గవర్నరు(మన చీఫ్ మినిస్టర్ లాగా), బ్లాగోవిచ్ ని ఇవ్వాళ కోర్టులో జ్యూరీ తప్పు చేశాడని నిర్ధారించింది. ఈ తప్పిదానికి వంద ఏళ్ళు దాకా జైల్లో వెయ్యవచ్చు.
అభియోగం: US సెనేట్ సీటుని అమ్ముకున్దామని ప్రయత్నించటం.
ఇల్లినొఇస్ రాష్ట్రం లో ఎన్నికయినవారు మధ్యంతరంగా తమ సీట్ వదిలేస్తే మళ్ళా ఎలక్షనుల వరకు రాష్ట్ర గవర్నరు , తానైనా ఆ సీట్ లోకి అప్పాయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొకళ్ళని అప్పాయింట్ చెయ్యవచ్చు.
ఒబామా ప్రెసిడెంట్ అయినతరువాత సెనేటర్ గ మానేస్తే ఖాళీ అయిన US సెనేట్ సీట్ అది. బ్లోగోవిచ్ గారిని రాష్ట్ర సెనేటర్లు అందరూ కలిసి గవర్నర్ పదవిలోనుండి ఇదివరకే తీసేశారు.
No comments:
Post a Comment