Monday, July 4, 2011

60 ఓ బుల్లి కథ 48 ---- మన బ్రెయిన్ లో ఏముంటాయి ?


ముందు మాట:  మన బ్రెయిన్(Brain) ఎల్లా పనిచేస్తుందో అవగాహన కల్పించటానికి కొన్ని వ్యాసాలూ వ్రాయాలని నా ఈ చిన్న ప్రయత్నం లో ఈ పోస్ట్ ఒక భాగం. ఆ వ్యాసాలలో ఉదాహరించబోయే కొన్ని పదములను ఈ పోస్ట్ లో అందరికీ అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఇంగ్లీషు పదాలని తెలుగులో అనువదించే ప్రయత్నం చెయ్యకుండా తెలుగులో వ్రాస్తాను. ఇంకా ఎక్కువ తెలుసు కుందా మనుకునే వారికి ఆ పదములతో గూగులమ్మని అడగటానికి వీలుగా ఉంటుంది.

1. Neuron: మన శరీరం లో ఉండే ఎర్ర కణములు, తెల్ల కణములు లాగా బ్రెయిన్ లో ఉండే  కణములను న్యురోన్లు అంటారు. వీటి ప్రత్యేకత సమాచారాన్ని తీసుకుని ఇంకొక చోట అందించటం. అందుకని సమాచారం తీసుకోటానికి వీటిమీద వేళ్ళు లాగా ఉంటాయి. వీటిని dendrites అంటారు. అలాగే సమాచారం బయటికి పంపటానికి తోక లాగ ఒకటుంటుంది. దానిని Axon అంటారు. ఈ Axon bundles నే మనము Nerves అంటాము.

న్యురోన్ దాదాపు మన చెయ్యి లాగా ఉంటుందనుకోవచ్చు. చేతి వేళ్ళు dendrites, చెయ్యి Axon. ఈ న్యురోన్లు మనము పుట్టినప్పుడే 100 బిలియన్లు ఉంటాయి. జీవిత కాలంలో ఈ సంఖ్య తగ్గటమే కానీ హెచ్చట మంటూ ఉండదు. Brain లో ఇవన్నీ గుంపులు గుంపులుగా (clusters) ఉండి నిర్ణీత పనులు చేస్తాయి. ఉదా: ఒక గుంపు కళ్ళు దగ్గరనుండి వచ్చే సంకేతాలు process చేస్తుంది.

2. Synapse: ఒక న్యురోన్ ఇంకొక న్యురోన్ తో మాట్లాడాలంటే దాని దగ్గరకు వెళ్లి ఆగుతుంది అంతే కానీ physical గ contact ఉండదు. ఈ రెండు న్యురోన్స్ మధ్య ఉన్న సందుని Synapse అంటారు. సంకేతాలు ఒక చోటు నుండి ఇంకొక చోటు కెళ్ళాలంటే న్యురోనులు dendrites ద్వారా సంకేతాలు తీసుకుని Axon ద్వారా బయటికి పంపిస్తాయి. Axon లో నుండి వచ్చిన సంకేతాలు Synapse గ్యాప్ దగ్గర chemical messengers గ మారి ఈదుకుంటూ అవతల న్యురోన్  dendrites దగ్గరకి వెళ్తాయి. అక్కడ మళ్ళా electrical pulses గ మారి గమ్యం చేరేవరకు ప్రయాణం కొనసాగిస్తాయి.సంకేతాలు ఈ విధంగా electrical pulses గానూ chemical pulses గానూ మారుతూ గమ్యం చేరుకుంటాయి. ఈ chemical messengers ని neurotransmitters అంటారు. ఒక న్యురోన్ కి దాదాపు 1,000 నుండి 10,000 వేల దాకా synapses ఉండవచ్చు. అంటే అన్ని వేపులకి సంకేతాలు పంపవచ్చు అన్నమాట.

3. Neurotransmitters: Synaptic gap లో పని చేసే ఈ chemical messengers పనల్లా సంకేతాల్ని ఒక న్యురోన్ నుండి ఇంకొక న్యురోన్ కి చేర వెయ్యటం. ఇవి ఇప్పుడు 27 దాకా ఉన్నాయి. ఇంకా కొత్త neurotransmitters ని కనుక్కుంటూనే ఉన్నారు. మనకొచ్చే కొన్ని జబ్బులు ఇవి సరీగ్గా పని చెయ్యక పోవటం మూలాన అని కనుగొన్నారు. మచ్చుకి కొన్నిneurotransmitters :  Glutamate, Acetylcholine, Dopamine, Norepinephrine, Serotonin మొదలయినవి. ఇవి ఎంత ముఖ్యమో ఒక ఉదాహరణ: మనము కాళ్ళ వేళ్ళు కదిలించాలను కున్నాము. ఆ సంకేతం బ్రెయిన్ నుండి కాళ్ళ వేళ్ళ కండరాలకి neurotransmitters ద్వారా రావాలి. ఎక్కడయినా అవి సరీగ్గా లేకపోతే మనము వేళ్ళని కదిలించలేము.

4. Glial cells: "Glial" అంటే glue అని అర్ధం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. బ్రెయిన్ లో 90% వరకూ ఈ కణములు ఉంటాయి. ఈ కణాలు న్యురోన్స్ కి సపోర్ట్ గ పని చేస్తయ్యి. వీటిల్లో వివిధ రకాల పనులు చేసేవి ఉన్నాయి.
ఉదా: 1. myelin అనే insulator లాంటి పదార్ధాన్ని తయారుచేసి  సంకేతాలు వెళ్ళే దోవని(Axon) insulate చెయ్యటం. మన electrical wires మీద insulation లాగా.
 2. చనిపోయిన న్యురోన్స్ అవ్వీ ఉంటే వాటిని బయటికి తీసివెయ్యటం. మొదలయినవి.

5. Stem Cells: ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో "Embrionic Stem Cells" అనే కణాలు ఉద్భవిస్తాయి. ఇవి వాటి పరిసరాలను బట్టి వివిధ రకాల కణజాలములు గా రూపాంతరము చెందుతాయి. మొదట బ్రెయిన్ లో పనిచెయ్యటానికి తయారయ్యే న్యురోన్స్ ఈ "Embrionic Stem Cells" నుండి వచ్చినవే.

6. Brain Plasticity: ఒక పని చేసే న్యురోన్స్ దెబ్బతిని ఆ పని చెయ్యలేకపోతే, మిగతా న్యురోన్స్ ఆ పనిని చెయ్యటానికి ప్రయత్నిస్తాయి. దీన్ని Brain Plasticity అంటారు. ఉదా: Stroke వచ్చిన వాళ్ళకి కొన్ని అవయవాలు పని చెయ్యకపోతే, Physical Therapy తో కొంతవరకు సరిచేస్తారు. అంటే Physical Therapy తో చెడిపోయిన న్యురోన్స్ పనిని వేరే న్యురోన్స్ కి నేర్పి పనిచేయిస్తున్నారన్న మాట.

చివరి మాట: "బ్రెయిన్ ఎల్లా పనిచేస్తుంది" తెలుసుకోటానికి చాలా మంది పరిశోధకులు ఇంకా పనిచేస్తున్నారు. కొత్త కొత్తవి కనుక్కుంటే ముందు ముందు వాటిని కూడా ఇక్కడ ఉంచటానికి ప్రయత్నిస్తాను.


6 comments:

 1. థాంక్స్ అండి మంచి సమాచారాన్ని అదీ సరళమైన బాష లో అందిస్తున్నందుకు !

  మీ ప్రొఫైల్ చూసి మాత్రం అమ్మో అనుకున్నా ఇన్ని ఫీల్డ్స్ లో వర్క్ చేసారో నిజం గా నాకు చాల సంతోషం గా ఉంది మీలాంటి వాళ్ళ తో కనీసం బ్లాగుల ద్వారా పరిచయం కావటం !

  ReplyDelete
 2. కష్టపడి ఫిజిక్స్ లో డిగ్రీ తెచ్చుకుంటే ఇష్టమున్న ఏ సబ్జెక్ట్ అయినా తేలికగా చదవచ్చు. ఇదీ నా కిటుకు. దీనిలో గోప్పదనమేది లేదు. మనము రోజూ మన మనుగడకు 100% బ్రెయిన్ వాడతాము కానీ చాలామందికి అది ఎల్లా పనిచేస్తుందో తెలియదు. దానిగురించి పాఠాలు కూడా ఎక్కడా చదివి ఉండం. అందుకని వ్రాస్తున్నాను. రోజూ కారు నడుపుతాము. అది ఎల్లా పనిచేస్తుందో కూడా తెలుసుకుంటే జాగర్తగా వాడుకుని ఎక్కువ సంవత్సరాలు మనకు పనిచేసేటట్లు వాడుకోవచ్చు అలాగే బ్రెయిన్ కూడా.

  శ్రావ్య గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. మీ బ్లాగు చాలా బాగుంది సార్. ఒక పుస్తకంగా వెయ్యదగ్గ వ్యాసాలు రాస్తున్నారు - ముఖ్యంగా మీ బుల్లి కథలు. ఉపయోగకరమైన సమాచారం ఇస్తున్నారు. ఇంకా అన్ని టపాలనూ చదవలేదు. ఇప్పటివరకూ చదివిన వాటిలో నాకు నచ్చింది సూర్యరశ్మి గురించి రాసిన టపా. న్యూస్ యు కెన్ యూజ్ లాగా ఇది బ్లాగ్ యు కెన్ యూజ్.

  ReplyDelete
 4. నేను వ్రాసే ప్రతీ పోస్ట్ లోనూ మనకి పనికొచ్చేవి మనకు ఉపయోగించేవి ఉంచాలని ఆశ. మీకు ఉపయోగకరంగా ఉన్నందుకు సంతోషం.
  మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను. Lively Discussion జరుగుతూ ఉంటుంది.

  చదువరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. రావుగారూ
  నమస్తే
  నాకోమారు మెయిల్ ఇవ్వ ప్రార్థన
  admin.websphere@gmail.com

  ReplyDelete
 6. "Lively Discussion" - :) మీరు సున్నితంగా చెప్పారుగానీ, మీ భావం నాకు అర్థమైంది. ఏం చేస్తాం, కొన్ని బ్లాగులంతే సార్. :)

  ReplyDelete