Sunday, July 24, 2011

62 ఓ బుల్లి కథ 50---- మన బ్రెయిన్ కి శక్తి ప్రదాయిని మన తల్లి

ముందుమాట: మన శరీరంలో శక్తి ఎల్లా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోటానికే ఈ పోస్ట్.

మన మొదటి కణం(haploid) లోకి కావలసిన వాటిల్లో సగం జీన్సుతండ్రి నుండీ సగం జీన్సు తల్లి నుండీ వస్తాయి. కానీ కణానికి జీవత్వం ఇచ్చే శక్తి ప్రదాయిని, mitochondria, తల్లి నుండి వస్తుంది. మన శరీరంలో ఏ కణాలకు అయినా జీవత్వం ఇచ్చి పెరుగుదలకు తోడ్పడేది ఈ mitochondria యే. ఈ mitochondria లు ప్రతి కణములో 1000 నుంచీ 2000 దాకా ఉండవచ్చు.

క్లుప్తంగా mitochondria మనము తినే ఆహారము లోనుండి వచ్చిన షుగర్ (Glucose) ని మనము పీల్చే గాలి లోనుంచి వచ్చిన ఆక్సిజన్ తో దహనం చేసి శక్తిని (Adenosine Triphosphate, ATP ద్వారా) విడుదల చేస్తుంది. ఆ శక్తి ద్వారానే మనము నడవటం, మాట్లాడటం, జీవించటం చేస్తున్నాము. ఈ దహన కాండ లో మనకు పనికిరాని కొన్ని పదార్దములు ఏర్పడుతాయి (free radicals). వీటిని వెంటనే హతమార్చక పోతే అవి వెళ్లి ఇంకొక పదార్ధమును చేరి అవి పని చేసే తీరును మార్చ వచ్చును. ప్రకృతి పరంగా వీటిని హతమార్చే పదార్ధాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కానీ వయస్సు పెరిగిన కొద్దీ వీటి ఉత్పత్తి తగ్గుతుంది. అందుకనే వయస్సు పెరిగిన కొద్దీ Antioxidants, CoQ10, Alpha Lipoic Acid, Acetyl L Carnitine అవసరం అవ్వచ్చు.

మన శరీరంలో అన్ని కణాలు( న్యురాన్స్ తప్ప) పై విధముగా శక్తిని ఉత్పాదన చేస్తాయి. బ్రెయిన్ లో ఉన్న న్యురాన్సు కి మాత్రం శక్తిని ఉత్పత్తి చెయ్యటానికి glucose, oxygen ఎప్పుడూ కావాలి.

ఈ శక్తి ఉత్పాదన ప్రక్రియలో Glucose తనంతట తాను శక్తి నిచ్చే చోటుకి వెళ్ళలేదు. ఆపనిని insulin, glucose transporters(GLUT Glycoproteins ) లని ప్రభావితం చేసి, చేయిస్తుంది. ఇందుకని  insulin మన ఆరోగ్యమునకు చాలా ముఖ్యం. మన శరీరం, మిగిలిపోయిన Glucose ని fat గ మార్చుకుని దాచి పెట్టుకుంటుంది. మనము ఆహారము తిన నప్పుడు fat ను glucose గ మార్చి శక్తి వచ్చేటట్లు చేస్తుంది.

మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలన్నీ ఒక దాని మీద ఒకటి ఆధార పడుతాయి. నిజం చెప్పాలంటే మనము చేసే అన్ని పనులూ, ఆకలిగా ఉండి అన్నము తినాలని అనిపించటం నుంచీ, అన్నీ రసాయనిక చర్యలే. ఇవి సమతౌల్యంగ(Balanced) జరగక పోతే రోగాలు వస్తాయి. ఉదా: శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలలో షుగర్ ను పూర్తిగా వినియోగించ లేక పోతే diabetes వస్తుంది.

ఇంగ్లీషు లో క్లుప్తంగా:
Glucose coming from food we eat gets transported by the influence of  insulin to a site in mitochondria where it gets combined with oxygen coming from the air we breath to produce energy in the form of ATP molecule. In short this is how we live.

Nature has backup plans for everything. Survival is most important in Nature. It converts excess food we eat to fat and stores in fat cells and converts it back into glucose in case of a need (when we starve). When oxygen is not there it has the capability of producing energy (anaerobic respiration).  Exception is the neural cell neuron, which takes only glucose and oxygen for energy production. 

చివరిమాట: నాకు ప్రకృతి పరంగా మనకు జరిగే రెండు విషయాలు ప్రశ్నలుగా  నిలిచి పోయాయి. శక్తి ప్రదాయిని  mitochondria, అమ్మనుంచి వస్తుంది ఎందుకు? మనమందరం మొదట్లో embryo లో ఆడవాళ్ళుగా ఎందుకని ఉంటాము ? (embryo female గ ఉండి, fetus గ మారుతున్నప్పుడు హార్మోనుల వలన కొందరిలో  male గ రూపాంతరం చెందు తుంది. ఇది మన కంట్రోల్ తో చెయ్యగలమా? ).

1. Mitochondria (the Powerhouses of our Cells) and Brain Disease
    http://www.studentpulse.com/articles/195/mitochondria-the-powerhouses-of-our-cells-and-brain-disease

2. The Brain Trust Program ---- by Larry McCleary M.D.
    http://brainbooks303.blogspot.com/2010_03_01_archive.html

3. Embryological Development of the Human Brain by Arnold B. Scheibel, MD6 comments:

 1. హ్మ్ ! బావుంది రాజు గారు !
  మనమందరం మొదట్లో embryo లో ఆడవాళ్ళుగా ఎందుకని ఉంటాము ?
  ----------------------------
  ఇది కరెక్ట నేను మొదట్లో ఈ జెండర్ ఉండదూ అని అనుకుంటునాను ఇంతవరకు . చాల బావుందండి బాగా రాసారు .

  ReplyDelete
 2. http://www.commentsyard.com/cy/01/6306/Sorry-Graphic-05.gif

  శివరామకృష్ణ గారూ... ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్లీ సారీఅండి.
  ప్రేమంటేనే భిన్నమైన అభిప్రాయాలు కదా.
  నేను ఇంత చిన్న దాని గురించి మీతో ఇలా వాదించకుండా ఉండాల్సింది.

  గీతిక B

  ReplyDelete
 3. @Sravya Vattikuti గారూ
  నేనూ అల్లాగే అనుకున్నాను మొదట. కానీ పరిశోధన పెరుగుతున్న కొలదీ కొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 4. @geetika గారూ
  మీరు అడిగిన దాన్లో తప్పేమి లేదు (నచ్చకున్నా నొచ్చుకున్నా ఒప్పుకో,నీలహంస, సత్య గారి బ్లాగ్ లో). మీరన్నట్లు ప్రేమ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కనపడుతుంది. అంతా బ్రెయిన్ లో హార్మోన్ల కలయిక. అందుకనే entiti అన్నాను. ఈ బ్రెయిన్ మీద basics అయిపోయిన తరువాత బ్రెయిన్ నుండి వచ్చే ప్రేరేపణల గురించి వ్రాస్తాను. మీరు ఈ విధంగా నా బ్లాగ్ కి వచ్చినందుకు థాంక్స్.

  ReplyDelete
 5. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
  మీ వ్యాసం ఆసక్తిదాయికంగా వున్నది. వ్యాసం చివరలో మీరు మూడు ప్రశ్నలను వేసారు. వాటికి, అంతర్జాలము ద్వారా తెలుసుకున్న వివరాలను తెలియచేస్తున్నాను.
  1. మనిషికి `శక్తి’ ప్రదాయిని అయిన `mitochondria’ తల్లినుంచే ఎందుకు వస్తుంది?
  `ఏమ్బ్రియో’ దశలో తల్లి, తండ్రి ఇద్దరినుంచీ mitochondria సమపాళ్లలో వచ్చినప్పటికీ, తండ్రినుంచి వచ్చిన mitochondria ఖచ్చితంగా, ఎప్పుడూ, నాశనము కాబడుతూవుంటుంది కాబట్టి ( ప్రకృతి ధర్మం) కేవలం తల్లినుంచి వచ్చిన mitychondria నే చివరివరకు వుండగలిగి, తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది.
  2. మనమందరం మొదట్లో, అంటే ఏమ్బ్రియో దశలో `ఆడవాళ్లంగానే’ ఎందుకువుంటాము?
  మొదటగా, తల్లినుంచి వచ్చిన mitochondria ఆధిపత్యం వలన. రెండవది: Doctor Billy & Other, Newyork, వారి పరిశోధనల ప్రకారం, టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎంబ్రియోలోని `కొన్ని కణాలనూ’ అంటే, ఏ కణజాలమైతే పురుషుడిగా మారాలని జనురీత్యా నిర్ణయించి బడివున్నదో, అట్టి కణజాలాను `పురుష మెదడు’ గా మార్పు చెందింస్తుంది. అదేవిధంగా, పురుషాంగాలని తయారు చేస్తుంది. అంటే, ఈ పురుష మార్పు చెందెంతవరకు, అనగా ఆరువారాల వరకు, ప్రతి ఎమ్బ్రియో ఆడవాళ్ళగానే పరిగణించవలస్తు వస్తుంది. దీనిని నిర్ధారిస్తూ, వారిచ్చిన ఉదాహరణ:- పుట్టిన ప్రతి మగపిల్లవాడిలో కూడా Nipples వుండటాన్ని మనం గమనిస్తామ్. కాకపోతే, ఎదుగుతున్న మగపిల్లవాడిలో, వక్షాలు పెరగాటానికి పనికివచ్చే కణజాలం అంతరించిపోతుంది; ఆడపిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. Indifferent gonads కూడా ఆడ, మగ తేడాను నిర్ధారించటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ పై ప్రక్రియనంతటినీ ఆటమ్స్ positive/negative అయోనైజేషన్ చెందే ప్రక్రియతో పోల్చవచ్చని నా అభిప్రాయం.
  ౩. పైన చెప్పిన హార్మోన్లను మనము నియంత్రించి, మగ, ఆడ శిశువులను పుట్టించగలమా? ప్రస్తుతానికి ఇది అసంభవమనే చెప్పాలి. ఎందుకంటే మనిషియొక్క పూర్తి జన్యు పటాన్ని మన శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదుకాబట్టి.
  ఆఖరిగా, పై విషయాలన్నింటినీ పరిశీలిస్తుంటే, `దేవీ భాగవతం’ లో చెప్పబడిన ఒక్క విషయం ఇక్కడ చెప్పటం సముచితం అనిపిస్తుంది నాకు. `పురుష రూపాల్లో’ వుండే త్రిమూర్తులకు తమలో తాము ఎవరు, ఎవరికంటే శక్తిమంతులు అన్న వివాదం వచ్చినప్పుడు వారి ఎదుట ఒక అత్యంత శక్తివంతమైన వెలుగు కనిపించిందట. దాని ఆది, అంత్యాలు తెలుసుకోవటానికోసమై, త్రిమూర్తులు ముందుగా క్రింది వైపుకి వెళ్ళి, అక్కడ ఏమీ తెలుసుకోలేక, తిరిగి పైవైపుకు ప్రయాణించి, ఆ తరువాత ఒక ద్వీపాన్ని చూశారట. అది మణుల కాంతితో శోభిస్తూవున్నదట. అక్కడ ఒక భవనంలో, ఒక సింహాసనంపై ప్రకాశవంతమైన మోముతో ఒక ` స్త్రీ ‘ కూర్చొని వుండగా, ఆమె చుట్టూ అనేకమంది దేవతా స్త్రీలు నిలబడివున్నారుట. త్రిమూర్తులు ఆమెను చూసి, ఈమె ఎవరై వుంటుందని తమలో తాము ప్రశ్నించుకుంటూ, తాముకూడా `స్త్రీ’ రూపాల్లోకి మారిపోయి వుండటాన్ని గమనించి, అయోమయంలో పడిపోయి, తేరుకొని, సింహాసనంపై వున్న ఆ స్త్రీమూర్తిని నీవు ఎవరవు అని అడగగా, `నేను విశ్వ చైతన్యశక్తిని’; నా ఈ శక్తిచే మీరందరూ సృష్టింపబడ్డారు; నా సమక్షంలో వున్నంతసేపు అందరూ స్త్రీ రూపంలోనే వుంటారు; కొన్ని ప్రత్యేక కార్యాలని నిర్వహించటానికి మీ ముగ్గురికి పురుష రూపాన్ని ఇచ్చాను కాబట్టి, మీరు నా పరోక్షంలో పురుషులుగా కనిపిస్తారు అని చెప్పిందట.
  దీనినిబట్టి తెలుస్తున్నది ఏమిటంటే ప్రకృతిరీత్యా అన్నీ జీవులు శ్రీ రూపాలెనని, కొన్ని కారణాలవల్ల, పురుష రూపాలు కలుగుతుంటాయని. ఇది మనకు ఒక కధ రూపంలో చెప్పబడినా, లోతుగా దీని గురించి పండితుల ద్వారా తెలుసుకుంటే ఇందులో జీవుల పుట్టుక రహస్యాలాని తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం. అర్ధనారీశ్వరుడిగా చెప్పబడే శివాంశంకూడా దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

  ReplyDelete
 6. @మాధవరావు గారూ
  మీ వ్యాఖ్యకి సమాధానం నా ఇంకొక పోస్ట్ లో పొరపాటున పడింది. ఇప్పుడే తప్పు గ్రహించి దాని కాపీ ఇక్కడ మళ్ళా ప్రచురించి తప్పు సరిదిద్దు కుంటున్నాను. సారీ.

  @మాధవరావు గారూ
  మీరు అన్నట్లు మూడింటికీ సమాధానాలు ప్రకృతి ప్రకృతి ప్రకృతి. దాన్ని మనము ఎదురించలేము. నాకు తెలిసినవి/చదివినవి కొన్ని వ్రాస్తాను. పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఆడ హార్మోనులు (estrogens) మగ హార్మోనులు (androgens) ఉంటాయి. వాటి నిష్పత్తి బట్టే మగ ఆడ లక్షణాలు వస్తాయి. ఇంకో సంచలన వార్త చదివాను మగ హార్మోనులు ఆడ హార్మోనులనుండి తయారు అవుతాయి. ఎక్కడ చదివానో గుర్తు రావటల్లేదు. చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు, రోజు రోజుకీ కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి. Human Genome Project 2003 లో పూర్తి అయ్యింది. DNA నంతా sequence చేశారు. DNA లో ఉండేవి హార్మోనులు ఎల్లా తయారు చెయ్యాలో రెసిపీలు. switch on switch off mechanisms ద్వారా వాటి తయారు కంట్రోల్ అవుతుంది. ఉదా: బ్రెయిన్ ఉపయోగించే హార్మోనులు బ్రెయిన్ లో మాత్రమే తయారు అవుతాయి. వాటి తయారుకు పురి కొల్పే శక్తి (switches) బ్రెయిన్ లోనే ఉంటాయి. నా ఉద్దేశంలో బయలోజికాల్ టైం కి ఈ Switches కి సంబంధం ఉంది. వ్రుద్ధత్వానికి కారణం అదే అనుకుంటాను.

  దేవి భాగవతంలోని చిన్న కధ చాలా బాగుంది. నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది మన పూర్వుల ఆలోచనా శక్తికి.

  రాను రాను ఇంకా బ్రెయిన్ గురించి ముఖ్యమయిన సంగతులు తెలుసుకొందాము. మన శరీరం మొత్తం కంట్రోల్ చేసేదదే కాబట్టి తెలుసుకుంటే మంచిది.

  మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు.
  August 7, 2011 11:33 PM

  ReplyDelete