ముందు మాట: మన జీవితంలో రోజూ ఉపయోగించేది మన బ్రెయిన్. అది తయారయ్యేటప్పుడు మనకి స్పృహ కూడా ఉండి ఉండదు. కానీ మన పిల్లలవి తయారయ్యేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. బ్రెయిన్ ఎల్లా తయారవుతుంది. ఆ తయారీలో మన బాధ్యత ఏమిటి? అనేదాన్ని పరిశీలించటానికే ఈ పోస్ట్.
మన శరీరం లో ఏ పనులు ఎప్పుడు ఎలా జరగాలి, అలా జరగటానికి కావాల్సిన మూల పదార్దములు (హార్మోనులు ) చెయ్యటానికి రెసిపీలు (code) ఇచ్చే వాటిని జీన్స్ అంటారు. అవి షుమారు 100,000 ఉంటాయి. వీటిల్లో బ్రెయిన్ తయారవటానికి, పనిచెయ్య టానికి ఉపయోగించుకునేవి 50,000. వాటిల్లో 30,000 జీన్సు బ్రెయిన్ కోసము నిర్దేశించినవే. బ్రెయిన్, జీవికి చాలా ముఖ్యమని సృష్టికి కూడా తెలుసు అందుకనే అన్ని జీన్సు కేటాయించింది.
Conception అయిన తరువాత egg sperm కలయిక మూలంగా వచ్చిన fertilized egg ని Zygote అంటారు. దీనితో human embryo కి అంకురార్పణ జరుగుతుంది. ఈ కలయిక తో సంభవించిన మొదటి కణముని(cell) diploid అంటారు. దీనిలోకి కావాల్సిన జీన్స్ సగం నాన్న నుండీ సగం అమ్మ నుండీ వస్తాయి. కానీ శక్తి తయారు చేసే పరికరాలు(mitochondria) మొదలయినవి మాత్రం అమ్మ cytoplasm నుండి వస్తాయి. అందుకేనేమో మొదట అన్నిembryo లు అమ్మాయిలుగా ఉండి తరువాత వచ్చిన మగ హార్మోనులని బట్టి అబ్బాయిలుగా మారుతాయి (default is female). ఈ diploid విభజనతో వచ్చే మొదటి రెండు కణాలకి తమంతట తాము వేరువేరుగా వృద్ది అయ్యే గుణం ఉంటుంది కానీ కణ విభజనలు జరుగుతున్న కొద్దీ ఈ శక్తి తగ్గుతుంది. అందుకే కమల పిల్లలు అందరికీ పుట్టరు. మొదటి కణాలు multiply అయ్యి embryo తయారు అవుతుంది. మొదటి 8 వారాలు దానికి కావలసిన అవయవాలు సృష్టించుకొని fetus గ మారి పెద్దదవుతుంది.
మానవుని సృష్టి ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోటానికి చాలామంది పరిశోధనలు చేశారు. అన్ని సంగతులు తెలియక పోయినా ముఖ్య విషయాలు గ్రహించారు. embryo పైన ఉండే కణాలు విభజించుకుని చిట్ట చివరకు(ultimate గ) స్కిన్ తయారు చేస్తాయి. వీటిని ectodermal cells అంటారు. అల్లాగే embryo లోపల ఉన్న కణాలు కడుపు, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు మొదలయిన వాటిని తయారు చేస్తాయి. వీటిని endodermal cells అంటారు. దాదాపు embryo పెరగటం మొదలెట్టిన రెండున్నర వారాలకి embryo మధ్యలోకి కొత్త రకం కణాలు, కండరాలు, గుండె మొదలయినవి చెయ్యటానికి వస్తాయి. వీటిని mesoderm cells అంటారు.
దాదాపు మూడు వారాలకి ఈ mesoderm cells ఊరుకోకుండా పైనున్న ectodermal cells ని పురికొల్పి కొత్త కణాలను తయారు చేయించి (షుమారు 125,00) ఒక flat sheet ను తయారు చేయిస్తాయి. దీనిని neural plate అంటారు. బ్రెయిన్ కు కావలసిన neurons, glial cells ఇక్కడ నుండే తయారు అవుతాయి.
దాదాపు మూడు నాలుగు వారాల మధ్యన ఈ షీట్ లాగా ఉండే neural plate అంచులు కలుసుకొని ఒక పొడుగాటి గొట్టం లాగా తయారు అవుతుంది. దీనినే neural tube అంటారు. central nervous system అంతా neural tube నుండే తయారు అవుతుంది. ముందు భాగంలో బ్రెయిన్ వస్తుంది. ట్యూబ్ భాగం spinal cord అవుతుంది. neural tube తయ్యారయ్యే టప్పుడు కొన్ని కణాలు మిగిలిపోతాయి. వాటిని neural crest cells అంటారు. ఈ కణముల నుండే peripheral nervous system అంతా తయారు అవుతుంది.
దాదాపు అయిదు ఆరు వారాల మధ్యన neural tube రెండువేపులా మూసుకు పోతుంది. ముందర వేపు మూడు బొడిపెలు(swellings) వస్తాయి. అవే బ్రెయిన్ లో ఉండే మూడు భాగాలు forebrain, midbrain and hindbrain. అవే చిన్న మెదడు, పెద్ద మెదడు అనేవి. ఇంక అవి పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. వీటిలోకి కావలసిన న్యురోన్స్, న్యురోన్ ట్యూబ్ దగ్గరనుండి తయారు అయ్యి జారుకుంటూ మధ్యలో ఉన్న న్యురోన్స్ కి హలో చెప్పుకుంటూ గమ్యం చేరి అక్కడ ఇంకొక న్యురోన్ తో synaptic connection పెట్టుకుంటాయి. ఈ విధంగా connection లేక పోతే అవి బతక లేవు. అల్లాగే కొన్ని న్యురోనులు వెతుకుంటూ వెళ్ళి తప్పుడు త్రోవ బట్టి ఎక్కడికో వెళ్తాయి. అవి కూడా బ్రతకవు. glial సెల్ల్స్ ఈ చనిపోయిన న్యురోన్స్ ని బయటకు తీసివేస్తూ ఉంటాయి. మొత్తం మీద 10th వీక్ కల్లా embryogenesis పూర్తవుతుంది. దాదాపు అన్ని అవయవాలు ఏర్పడుతాయి. ఇంక వాటిని పెద్దవి చేసి మెరుగుపరచటమే మానవ సృష్టిలో మిగిలింది. ఇలా తొమ్మిదో నెలకల్లా బ్రెయిన్ అన్ని neural synaptic connections తోటి తయారవుతుంది.
మనము పుట్టేటప్పుడు 100 billion న్యురోన్స్ ఉన్నయ్యనుకుంటే, పుట్టటానికి 9 నెలలు పడితే, నిమిషానికి 250,000 తయారు చెయ్యాల్సి వస్తుంది. ఈ పని చెయ్యటానికి శక్తి ఆ తొమ్మిది నెలలు తినే ఆహారాన్నుండి వస్తుంది. అందుకని పౌషికాహారము చాలా ముఖ్యము. embryo ఆరోగ్య వంతంగా పెరగటానికి folic acid చాలా ముఖ్య మని తేలింది.ఇది కూడా ప్రెగ్నెన్సీ మొదటి మూడు వారాలలో అవసరము అవుతుంది. అందుకని ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు B Complex tablets తీసుకొనుట మంచిది. వీటిలో folic acid ఉంటుంది. త్రాగుడూ, సిగరెట్లు మానెయ్యటం చాలా మంచిది. మనస్సుని మంచి ఆలోచనలతోటి సంతోషంగా ఉంచుకోవటం కూడా చాలా మంచిది.
ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు బ్రెయిన్ తయారయ్యేటప్పుడు చాలా క్రిటికల్ అని తెలుసుకున్నాము కదా అందుకని ఈ క్రింద చూపిన జాగార్తలలో ఉండటం చాలా మంచిది.మన శరీరం లో ఏ పనులు ఎప్పుడు ఎలా జరగాలి, అలా జరగటానికి కావాల్సిన మూల పదార్దములు (హార్మోనులు ) చెయ్యటానికి రెసిపీలు (code) ఇచ్చే వాటిని జీన్స్ అంటారు. అవి షుమారు 100,000 ఉంటాయి. వీటిల్లో బ్రెయిన్ తయారవటానికి, పనిచెయ్య టానికి ఉపయోగించుకునేవి 50,000. వాటిల్లో 30,000 జీన్సు బ్రెయిన్ కోసము నిర్దేశించినవే. బ్రెయిన్, జీవికి చాలా ముఖ్యమని సృష్టికి కూడా తెలుసు అందుకనే అన్ని జీన్సు కేటాయించింది.
Conception అయిన తరువాత egg sperm కలయిక మూలంగా వచ్చిన fertilized egg ని Zygote అంటారు. దీనితో human embryo కి అంకురార్పణ జరుగుతుంది. ఈ కలయిక తో సంభవించిన మొదటి కణముని(cell) diploid అంటారు. దీనిలోకి కావాల్సిన జీన్స్ సగం నాన్న నుండీ సగం అమ్మ నుండీ వస్తాయి. కానీ శక్తి తయారు చేసే పరికరాలు(mitochondria) మొదలయినవి మాత్రం అమ్మ
మానవుని సృష్టి ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోటానికి చాలామంది పరిశోధనలు చేశారు. అన్ని సంగతులు తెలియక పోయినా ముఖ్య విషయాలు గ్రహించారు. embryo పైన ఉండే కణాలు విభజించుకుని చిట్ట చివరకు(ultimate గ) స్కిన్ తయారు చేస్తాయి. వీటిని ectodermal cells అంటారు. అల్లాగే embryo లోపల ఉన్న కణాలు కడుపు, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు మొదలయిన వాటిని తయారు చేస్తాయి. వీటిని endodermal cells అంటారు. దాదాపు embryo పెరగటం మొదలెట్టిన రెండున్నర వారాలకి embryo మధ్యలోకి కొత్త రకం కణాలు, కండరాలు, గుండె మొదలయినవి చెయ్యటానికి వస్తాయి. వీటిని mesoderm cells అంటారు.
దాదాపు మూడు వారాలకి ఈ mesoderm cells ఊరుకోకుండా పైనున్న ectodermal cells ని పురికొల్పి కొత్త కణాలను తయారు చేయించి (షుమారు 125,00) ఒక flat sheet ను తయారు చేయిస్తాయి. దీనిని neural plate అంటారు. బ్రెయిన్ కు కావలసిన neurons, glial cells ఇక్కడ నుండే తయారు అవుతాయి.
దాదాపు మూడు నాలుగు వారాల మధ్యన ఈ షీట్ లాగా ఉండే neural plate అంచులు కలుసుకొని ఒక పొడుగాటి గొట్టం లాగా తయారు అవుతుంది. దీనినే neural tube అంటారు. central nervous system అంతా neural tube నుండే తయారు అవుతుంది. ముందు భాగంలో బ్రెయిన్ వస్తుంది. ట్యూబ్ భాగం spinal cord అవుతుంది. neural tube తయ్యారయ్యే టప్పుడు కొన్ని కణాలు మిగిలిపోతాయి. వాటిని neural crest cells అంటారు. ఈ కణముల నుండే peripheral nervous system అంతా తయారు అవుతుంది.
దాదాపు అయిదు ఆరు వారాల మధ్యన neural tube రెండువేపులా మూసుకు పోతుంది. ముందర వేపు మూడు బొడిపెలు(swellings) వస్తాయి. అవే బ్రెయిన్ లో ఉండే మూడు భాగాలు forebrain, midbrain and hindbrain. అవే చిన్న మెదడు, పెద్ద మెదడు అనేవి. ఇంక అవి పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. వీటిలోకి కావలసిన న్యురోన్స్, న్యురోన్ ట్యూబ్ దగ్గరనుండి తయారు అయ్యి జారుకుంటూ మధ్యలో ఉన్న న్యురోన్స్ కి హలో చెప్పుకుంటూ గమ్యం చేరి అక్కడ ఇంకొక న్యురోన్ తో synaptic connection పెట్టుకుంటాయి. ఈ విధంగా connection లేక పోతే అవి బతక లేవు. అల్లాగే కొన్ని న్యురోనులు వెతుకుంటూ వెళ్ళి తప్పుడు త్రోవ బట్టి ఎక్కడికో వెళ్తాయి. అవి కూడా బ్రతకవు. glial సెల్ల్స్ ఈ చనిపోయిన న్యురోన్స్ ని బయటకు తీసివేస్తూ ఉంటాయి. మొత్తం మీద 10th వీక్ కల్లా embryogenesis పూర్తవుతుంది. దాదాపు అన్ని అవయవాలు ఏర్పడుతాయి. ఇంక వాటిని పెద్దవి చేసి మెరుగుపరచటమే మానవ సృష్టిలో మిగిలింది. ఇలా తొమ్మిదో నెలకల్లా బ్రెయిన్ అన్ని neural synaptic connections తోటి తయారవుతుంది.
మనము పుట్టేటప్పుడు 100 billion న్యురోన్స్ ఉన్నయ్యనుకుంటే, పుట్టటానికి 9 నెలలు పడితే, నిమిషానికి 250,000 తయారు చెయ్యాల్సి వస్తుంది. ఈ పని చెయ్యటానికి శక్తి ఆ తొమ్మిది నెలలు తినే ఆహారాన్నుండి వస్తుంది. అందుకని పౌషికాహారము చాలా ముఖ్యము. embryo ఆరోగ్య వంతంగా పెరగటానికి folic acid చాలా ముఖ్య మని తేలింది.ఇది కూడా ప్రెగ్నెన్సీ మొదటి మూడు వారాలలో అవసరము అవుతుంది. అందుకని ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు B Complex tablets తీసుకొనుట మంచిది. వీటిలో folic acid ఉంటుంది. త్రాగుడూ, సిగరెట్లు మానెయ్యటం చాలా మంచిది. మనస్సుని మంచి ఆలోచనలతోటి సంతోషంగా ఉంచుకోవటం కూడా చాలా మంచిది.
During this critical period (most of the first trimester), the developing embryo is also susceptible to toxic exposures, such as:
Alcohol, certain drugs, and other toxins that cause birth defects, such as Fetal alcohol syndrome
Infection (such as rubella or cytomegalovirus)
Radiation from x-rays or radiation therapy
Nutritional deficiencies such as lack of folate which contributes to Spina bifida
చివరి మాట: బ్రెయిన్ తయారు అవటం అనేది చాలా సున్నిత మైన పని. ఆ తయారయిన బ్రెయిన్ ను మన పిల్లలు వారి జీవితాంతము ఉపయోగించుకుంటారు. వాళ్ళ నడవడికలు దీని మీదే ఆధారపడేది. అందుకని మనకు తెలిసిన జాగర్తలు తీసికొనుట మంచిది. ఈ వ్యాసములోని సంగతులు చాలా పుస్తకాల్లో నుండి గ్రహించినవి. నేను ఇచ్చిన ఇంగ్లీషు పదములు వాడి గూగులమ్మని అడిగితే ఆ విషయాలన్నీ చెబుతుంది. ఈ క్రింది రెఫెరెన్సు చాలా బాగుంటుంది.
1. Embryological Development of the Human Brain by Arnold B. Scheibel, MD
2. వీలయితే నా ఇంకొక బ్లాగ్ కూడా చూడండి.
http://brainbooks303.blogspot.com/
బ్రెయిన్ గురించి చాలా బాగా వ్రాశారండి.
ReplyDeleteనాకు ఏమనిపిస్తుందంటేనండి , మానవ శరీరభాగాలను పోలినవిధంగా ప్రకృతిలో కొన్ని కనిపిస్తాయి. ఉదా... అక్రూట్ లోపలి భాగం బ్రెయిన్ లాగ కనిపిస్తుంది. దానిమ్మ గింజలు మన దంతాలు,పళ్ళు లాగ కనిపిస్తాయి. కిడ్నీ బీన్స్ కిడ్నీలను పోలి ఉంటాయి.
దానిమ్మ గింజల రసం పన్ను నొప్పిని తగ్గిస్తుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఇవన్నీ ఇలా సృష్టించబడటానికి వెనుక ఏమైనా ఉపయోగాలున్నాయేమో ? అని మీలాంటి వారు కనుక్కోవాలి...
Again a nice post ! Thanks for sharing raaju gaaru !
ReplyDeleteనమస్కారం
ReplyDeleteరావు గారు మీకు వీలుకుదిరినప్పుడు నాకు ఒకసారి నాకు మెయిల్ చెయ్యగలరు.
rajasekharuni.vijay@gmail.com
ధన్యవాదములు
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ReplyDeleteమెదడు కు సంభందించి రెండు వ్యాసాలు ఎంతో ఉపయోగంగా వున్నాయి. ధన్యవాదాలు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@anrd గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. శరీర అవయవాల రుగ్మతలు తగ్గించే పళ్ళ సారూప్యాల వీడియో నాదగ్గర ఒకటి ఉండేది, ప్రస్తుతం కనపడ లేదు. కనపడితే పోస్ట్ లో పెడతాను. మీరు అన్నది సమంజసము గానే ఉన్నది. ప్రకృతి లో నున్న కిటుకులు తెలుసు కోటానికే గదా పరిశోధనలు.
ReplyDelete@Sravya Vattikuti
ReplyDeleteThanks for the comment. Hang in there, we are going to explore lot of amazing things in the brain.
మాధవరావు గార్కి, రాజశేఖరుని విజయ్ శర్మ గార్కి
ReplyDeleteమీ వ్యాఖ్యలకి ధన్యవాదములు.
మీతో సంవత్సరం క్రింద చెప్పాను బ్రెయిన్ మీద వ్రాస్తానని. ఇప్పటికి కుదిరింది. మొదలెట్టాను. మనకి వచ్చే ఆలోచనలూ, భావాలూ అన్నీ బ్రెయిన్ నుండి వచ్చేవే. అవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేవి తెలుసుకోటానికి ఈ ప్రయత్నం. కొంత వరకూ బేసిక్స్ తెలిపిన తరువాత మనందరమూ కలిసి వీటికి కారణాలు ఏమి అయి ఉంటవి అని పరిశీలిద్దాము. బ్రెయిన్ మనది అది ఎల్లా పనిచేస్తుందో మనము తెలుసుకోవాలి.