Monday, December 9, 2013

97 ఓ బుల్లి కథ 85 --- నెయ్యి వేసుకోవటం మంచిదేనా?

నేను యూనివర్సిటీ నుండి శలవలకు ఇంటికి వచ్చే టప్పుడు తప్పకుండా పాసెంజర్ లో వచ్చే వాణ్ణి. దీనికి ఒకటే కారణం . ఏలూరు స్టేషన్లో దొరికే  ఇడ్లీలు. రెండు ఇడ్లీలు గట్టిపచ్చడీ కారప్పొడి దానిలోకి కమ్మటి నెయ్యీ . నెయ్యి విడిగా ఇచ్చే వాళ్ళు. ఆ ఇడ్లీలతో,  ఆ ఘుమఘుమ లాడే నెయ్యి కారప్పొడి లో వేసుకుని లాగిస్తూంటే, వావ్, ఆ ఆనందాన్ని వర్ణించలేను. ఆ రుచి మనస్సులో అల్లాగే ఉండి పోయింది. అందుకని ఎక్కడన్నా ఇడ్లీలు తింటే, ఆ రుచి తోటి పోల్చటం అలవాటయి పోయింది.  ఆ రుచిని ఎప్పుడూ వర్ణించ లేక అటువంటి ఇడ్లీలు తినే పరిస్థితి మళ్ళా కలుగలేదు. అమాంతంగా ఒకరోజున మనమే ఆ రుచిని ఎందుకు తెప్పించకూడదు అనే ఆలోచన వచ్చింది. కానీ ఎంత అనుకున్నా సరే ప్రపంచంలో అందరూ అన్ని పనులూ చెయ్యలేరు కదా. ఆ ultimate ఇడ్లీ రుచి తయారు చేసే quest లో ఒకటి మాత్రం సాధించాను. కమ్మటి నెయ్యి తయారు చెయ్యటం. ఈ పోస్ట్ అంతా దాని గురించే. మీకు నెయ్యి వేసుకోవటం అలవాటు లేకపోతే ఈ పోస్ట్ గురించి పట్టించుకోకండి.

కానీ పోస్టు వేసి మీకు చెప్పే ముందర అసలు నెయ్యి శరీరానికి మంచిదో కాదో తెలుసుకోవాలని ఒక చిన్న పరిశోధన చేశాను. దాని పరిశోధనా ఫలితాలు సూక్ష్మంగా:  వెన్న, వెన్ననుండి వచ్చిన నెయ్యిలో 80% milk fat కొవ్వు పదార్ధాలు ఉంటాయి వాటిలో చాలా వరకు saturated fat. వెన్న కన్నా నెయ్యిలో medium, short chain fats ఎక్కువగా ఉండటం మూలాన శరీరంలో వెన్న కన్న నెయ్యి కి అరుగుదల ఎక్కువ. వెన్న లో long chain fats ఎక్కువ. ఏది ఏమయినా రోజుకి మనం తినే ఆహారంలో 10% calories కంటే ఎక్కువ నెయ్యి వాడటం మంచిది కాదు. అంటే షుమారుగా రోజుకు రెండు స్పూనులు కన్నా ఎక్కువ వాడటం మంచిది కాదు. నా ఉద్దేశంలో saturated fats ఉండటం మూలాన వెన్న,  నెయ్యి ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

మా చిన్నప్పుడు పాలని తోడు బెట్టి, వచ్చిన పెరుగుని చిలికి వెన్న బయటికి తీసే వారు. పల్లెలో పాడి ఉన్న ప్రతి ఇంటిలోనూ జరిగే ప్రక్రియ ఇదే. ఆ వెన్నని సన్నటి సెగలో పొయ్యిమీద కరగబెట్టి నెయ్యి చేసేవాళ్ళు. మా అమ్మ కుంపటి మీద తయారు చేసేది. ఇక్కడ ఒకటే జాగర్త.  కమ్మని నెయ్యి కావాలంటే సరి అయిన సమయంలో పోయ్యిమీదనుంచి తీసి చల్లార్చాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద డైరీ ఫారంలు వచ్చిన తరువాత,  వడిగా పాలని చిలికే యంత్రాలు వచ్చి (centrifuge), వెన్నని పాల మీద తెలేటట్లుచేస్తున్నాయి. ఆ తేరుకున్న వెన్నను తీసి one lb పాకెట్స్ కింద అమ్ముతారు. అమెరికాలో అయితే  వీటిని రెండు రకాలుగా అమ్ముతారు (salted , unsalted ).

వెన్న నుండి ఘుమ ఘుమ లాడే నెయ్యి తయారు చెయ్యటం చాలా తేలిక. కాకపోతే కొంచెం time తీసుకుంటుంది (కనీసం ఒక గంటా గంటన్నర దాకా ).

చేయు విధానం: ఒక  1 lb unsalted బట్టర్ పాకెట్( దానిలో నాలుగు భాగాలు ఉంటాయి)  ని తీసుకుని ఒక గిన్నె లో వెయ్యండి. స్టవ్ మీద పెట్టి మీడియం కన్నా తక్కువగా ఉన్న హీట్ లో పెట్టి కాగ నివ్వండి. మొదట వెన్న అంతా కరిగి పోతుంది. తరువాత తెల్లని నురగ,  పైన తెట్ట లా కడుతుంది. తరువాత తెట్ట పోతూ పోతూ పసుపు రంగులో నెయ్యి కనపడుతుంది. తరువాత పైనున్న నురుగు తెట్టా అంతా పోయి Golden  Brown color లో మంచి వాసనతో ఘుమ ఘుమ లాడుతూ నెయ్యి కనిపిస్తుంది. పై నురుగు మాడిపోయి అడుగున అట్ట లాగా తయారు అవుతుంది. దీనినే గోకుడు అంటారు. చిన్నప్పుడు దానిని తినే వాళ్ళం. ఇంక మీరు చెయ్యాల్సిన దల్లా కొద్దిగా చల్లారిన తరువాత వడబోసి మంచి నెయ్యిని వేరు చెయ్యటమే.  ఒక గంటా గంటన్నర లో వెన్న నుండి ఘుమ ఘుమ లాడే నెయ్యి తయారు అవుతుంది. మనం జాగర్తగా ఉండాల్సినదల్లా మాడకుండా చూడటమే.

నాకు వచ్చే ఒక న్యూస్ లెటర్ నుండి (INH Health Watch):

1. Ghee: It comes from the Hindi word for “fat,” and it’s a major player in Indian cooking. Ghee begins as unsalted butter. It is then melted until the milk fats and water have separated. This leaves only the pure butter oil behind. Ghee is different from clarified butter because it has a slightly nutty flavor and darker color.

Research shows that ghee safely increases blood lipids without raising LDL cholesterol. This means that it does more than simply lower total cholesterol. It raises the good kind (HDL) and lowers the bad (LDL). Ghee also reduces inflammation and prevents heart disease. One study found that men who consumed two tablespoons of ghee a day lowered their risk for heart disease by 23 percent. And although it isn’t exactly “mainstream,” ghee isn’t hard to find. Most health food stores have an international section where you can pick up grass-fed, organic ghee. But if you can’t find it nearby, you can always order it online.

1. వెన్న , నెయ్యి ఎంత మంచివి ?
http://www.whfoods.com/genpage.php?tname=newtip&dbid=9

7 comments:

  1. laila silu గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మీ వెబ్సైటు తప్పకుండా చూస్తాను.

    ReplyDelete
  2. నేను నెయ్యి అలాగే చేస్తానండీ రావ్ గారూ! నెయ్యి లేకుండా తిండి దిగడం కష్టమే నాకు! ఇండియన్ స్టోర్స్ లో దొరికే పసుప్పచ్చటి ఆవు నెయ్యి చూస్తే కొనాలనిపించదు. అందుకే నేనూ దార్లు వెదికి పట్టుకున్నాను.

    Land O lakes అన్ సాల్టెడ్ బటర్ బాగుంటుంది. సన్న సెగ మీద దగ్గరుండి కాస్తే, చక్కని పూసల నెయ్యి తయారవుతుంది. మా ఇంట్లో మైసూర్ పాకులూ అవీ కూడా తయారై పోతుంటాయి దీనితో

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అమ్మయ్య నాలాంటి నెయ్యి ప్రీతి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. నెయ్యి లేనిది ముద్ద దిగని వాళ్ళలో నేనూ ఉన్నాను. సుజాత గారూ మార్కెట్ లో సీసాలలో దొరికే నెయ్యి నేను భరించలేను. ఎవరి ఇంటికయినా వెళ్ళినప్పుడు అటువంటి నెయ్యి కనపడితే నెయ్యి మానేశానని తప్పించు కుంటాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. It does things like slows the heart beat, lowers blood pressure, opens blood vessels to the skin, etc.
    People were very afraid and intolerant of being needled.

    After several patients had to be admitted to the hospital with gastrointestinal bleeding given the
    aspirin or ibuprofen I prescribed (which all my peers and specialists
    used, and many continue to prescribe) I decided that
    there had to be other approaches that were safer and still effective for managing these
    many frustrating problems.

    my web page Chinese medicine expert ()

    ReplyDelete