మన జీవితంలో ఉప్పూ, తీపి లేకుండా భోజనం చేసే రోజులు చాలా తక్కువ. అవి మనం జీవించటానికి చాలా ముఖ్యం కూడాను.
తీపిని "షుగర్" అనే ఇంగ్లీష్ పేరుతో చెప్పగానే దాని ప్రాముఖ్యం తెలుస్తుంది. తీపి మనం పంచదారగా తినకపోయినా, మనము తిన్న కార్బో హైడ్రేట్లు శరీరంలో "షుగర్" గా మార్చబడి, రసాయనికంగా మనము పీల్చే "ఆక్సిజన్" తో కలపబడి మనకు శక్తి నిచ్చే పదార్ధం (ATP) ఉత్పత్తి అవుతుంది.
అల్లాగే "సాల్ట్" (NaCl ) కూడా మనం జీవించటానికి చాలా ముఖ్యం. మన శరీరం "hydrated" గ ఉండటానికి ముఖ్య కారణం. మనం hydrate అవటానికి నీళ్ళు తాగినా, అది మన శరీర అంతర్భాగంలో కణజాలానికి అందటానికి ఇది కావాలి. చిన్న ప్రేవులలో మనము తిన్న ఆహారం జీర్ణ మవటానికి ఇది కావాలి. మన శరీరంలో నరాలు, బ్రెయిన్ పని చెయ్యటానికి ఇది చాలా ముఖ్యం. ఇంతెందుకు అలా చెప్పుకు పోతుంటే ఇంకా చాలా ఉన్నాయి.
సాల్ట్, షుగర్ లేక పోతే మనం జీవించటం చాలా కష్టం. "షుగర్" ని వ్యవసాయం ద్వారా సంపాదించ వచ్చు గానీ సముద్రం దగ్గర లో లేకపోతే "సాల్ట్" ని తయారు చెయ్యటం చాలా కష్టం . ఒకప్పుడు రోమన్ రాజులు సైనికులకి జీతంగా సాల్ట్ కొలిచి ఇచ్చే వాళ్ళుట. ఇంతెందుకు మన నెల జీతం పేరు (శాలరీ salary) సాల్ట్ (salt) నుండే వచ్చిన దని చెప్తారు.
మనం తినే ఆహారం కొన్ని పరిమితులలోనే తీసుకుంటాము. మన బ్రెయిన్ సరీగ్గా పనిచేస్తుంటే పరిమితులు దాటుతుంటే, "పొట్ట పట్టదురా తినటం ఆపేయ్" అని చెబుతుంది. అది వినకుండా గారెలు చాలాబాగున్నాయి అని ఇంకో రెండు లాగిస్తే తరువాత వచ్చే బాధలు అందరికీ తెలిసినవే. మరి అయితే ఈ షుగర్, సాల్ట్ లకు మనం తినటానికి పరిమితులు ఉంటాయా ?
పరిమితులు ఉండి ఉంటాయి కానీ పరిస్థుతులు మన చేతుల్లో నుండి జారిపోయే దాకా అవి తెలియవు. ఉదాహరణకి మనం రోజూ మూడు పూట్ల భోజనంతో జిలేబీలు, లడ్లు లాగిస్తున్నామనుకోండి. ఇదివరకు చెప్పినట్లు అవి షుగర్ (glucose ) గ మార్చబడి, శక్తి రూపంలో బయటకి వస్తాయి. తయారు ఐన శక్తి ని మనం ఉపయోగించటల్లేదు అని శరీరానికి అనిపిస్తే , శక్తి తయారు చెయ్యటం ఆపేసి, మనకి తిండి లేనప్పుడు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఆ గ్లూకోస్ ని fat గ మార్చి fat cells లో దాచి పెడుతుంది. ఎప్పుడైనా ఆహారంలేక బాధ పడుతుంటే ఆ fat ని శక్తిగా మారుస్తుంది. అటువంటి అవసరం ఎప్పుడూ రాకపోతే, fat cells అన్నీ నిండిపోతే, భోజనం ఇంకా మూడు పూటలా చేస్తుంటే, గత్యంతరం లేక ఆ షుగర్ ని రక్తంలో వదిలేస్తుంది. దీనినే సూక్ష్మంగా diabetes అంటారు. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటే శరీర అవయవాలు సరీగ్గా పని చెయ్యవు కనుక అప్పటినుండీ తగిన పరిమితుల్లో తినటం మొదలెడుతాము.
ఇక సాల్ట్ వేపు వస్తే అంత తేలికగా చెప్పలేము. దీని మీద ఇంకా చాలా పరిశోధనలు చేస్తున్నారు. 2013 లో Brian Strom (Institute of Medicine ) అనే ఆయన తన నేత్రుత్వంతో, అప్పటికి సాల్ట్ మీద చేసిన 34 పరిశోధనల ఫలితాలని క్రోడీకరించారు. వారు తేల్చిన ముఖ్య విషయం ఏమంటే తక్కువ సాల్ట్ తీసుకుంటే blood pressure తగ్గుతుందనేది నిజం కాదు అని.
అయితే రోజుకి సాల్ట్ ఎంత తీసుకోవాలి ? దీనిని నికార్సుగా చెప్పలేము కానీ రోజుకి 2,300 to 3000 మిల్లీ గ్రాములు సరి అయినట్టుగా కనపడుతుంది అని తేల్చారు. అంటే రోజు కొక teaspoon సాల్ట్ సరిఅయినదని నిర్ధారించారు.
అయితే సాల్ట్ రకరకాల packages లో వస్తుంది, Table salt , Sea salt , Himalaya salt ఏ సాల్ట్ మంచిది ? వీటన్నిట్లోనూ మూల పదార్ధం NaCl ఒకటే.
అసలు సాల్ట్ వచ్చేది రెండు రకాలు గా వస్తుంది. సముద్రపు నీళ్ళ నుండి(sea salt) మరియు సాల్ట్ గనుల నుండి (Utah mines ). ఈ రెండిటిలోనూ trace minerals, micro -minerals zinc iron selenium calcium magnesium potassium ఉంటాయి. ఈ minerals మన శరీరం చక్కగా పనిచెయ్యటానికి దోహదం చేస్తాయి. Table Salt పై వాటి నుండి తయారు చేస్తారు. తయారు చేసే విధానం (high heat high pressure bleaching additives oxidation ) మూలంగా దీనిలో ఈ minerals ఉండక పోవచ్చు. కాకపోతే table salt (కొన్ని బ్రాండ్స్ Sea salt లో కూడా ) తయారు చేసే టప్పుడు చాలా వస్తువులు (18 దాకా Glucose మొదలయినవి) దానిలో కలుపుతారు. అందులో Iodine ఒకటి. ఇది thyroid సరీగ్గా పనిచేసేటట్టు చూస్తుంది. Iodine కోసమే Table salt తినాలని కాదు, ఇది ఆహార పదార్ధాలలోనూ ఉంటుంది (eggs dairy fish seaweed).
చివరి చెప్పేదేమంటే మీకు ఏది నచ్చితే ఆ సాల్ట్ లేకపోతే రెండూ కలిపో రోజుకు కనీసం ఒక teaspoon మోతాదులోవాడటం మంచిది.
1.Salt is essential not a villain by Casey Seidenberg Washington Post

Sri Lakkaraajugaariki Namaskaaramulu. A nice article and good information is given.
ReplyDeleteమనం తినే ఆహార పరిమితులు ముందుగా తెలిసికోవటం మంచిది. తినే మోతాదులు ఎక్కువయ్యి శరీరంలో equilibrium దెబ్బ తింటే డాక్టర్ల చుట్టూతా తిరగాలి. మాధవరావు గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
Delete