Monday, February 27, 2017

133 ఓ బుల్లి కథ 121 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 2

సెన్సరీ న్యూరాన్స్ (Sensory neurons )


"కూరలో ఉప్పు లేదు వెయ్యాలి"

"నాకు బాగానే ఉంది, సరిపోయింది "

"లేదు సరిపోలేదు"

"నాకు సరిపోయింది"

సంభాషణ ఇల్లా వెళ్తూ, వెళ్తూ ఎక్కడికో పోయి, ఇంట్లో జుట్టులు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మన ముక్కూ మన కళ్ళూ ఇంతెందుకు మన అవయవాలు ఏవీ ఇంకోళ్ళతో సమానంగా (exact ) ఉండవు. అయినప్పుడు మన రుచులు (tastes ) ఎందుకుండాలి? ఉండవు . ఇంతెందుకు వంట చేస్తున్నప్పుడు వట్టిచేతులతో మా ఆవిడ పట్టుకునే భగుణని నేను పట్టుకోలేను. ఆ వేడికి నా చేతులు తట్టుకోలేవు. నిజానికి పోతే మన అందరి ఆలోచనలూ ఒకటిగా ఉండటానికి అసలు వీలులేదు .

మన ఇష్టా ఇష్టాలూ అభిరుచులూ అన్నీ వేరువేరుగా ఉండటానికి కారణం మన పంచేంద్రియాలు. వాటి నుండి వచ్ఛే సమాచారాన్ని మన మనస్సు గుర్తు పెట్టుకుంటుందని మనకి తెలుసు. మా అత్తయ్య చేసిన ఆ దోసకాయ పప్పు తిన్న రుచి ఇంకా గుర్తుంది. జీవితంలో మన అనుభవాల మూలాన మన అభిరుచులు ఏర్పడుతాయి. మన ఏ ఒక్కరి అనుభవాలు ఒకటి కావు. అయినప్పుడు మన అభిరుచులు ఒకటిగా ఎల్లా ఉంటాయి? మనమనుకునే "జిహ్వకో రుచి" అంటే ఇదే నేమో !

మనం పుట్టిన దగ్గరనుండీ, మనం జీవించాలని మన ఆత్మ ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. వీలయినంత వరకూ జీవత్వాన్ని శరీరంలో ఉంచటమే దాని గమ్యం. అందుకనే శరీరం అంతటా sensory neurons పెట్టి ఎప్పటికప్పుడు మన సమాచారం అంతా సేకరించి కష్టాలొస్తే పరిష్కరించి, మనలో జీవత్వం ఉండేందుకు సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. ఎవరు ఏమి చేసినా (వైద్యులు) తాను చేసే పనులకి సహాయం చేయటం తప్ప ఆజ్యం పోస్తే పరిస్థితి వికటిస్తుంది.

మన శరీర మంతా ఆక్రమించిన ఈ sensory neurons ఎప్పుడూ బ్రెయిన్ కి సంకేతాలు పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు బ్రెయిన్ లో రికార్డు అవుతాయి. మనము కంప్యూటర్ వాడినప్పుడు మన బ్రౌజర్లో మనము చూసిన సైట్లన్నీ రికార్డ్ అయినట్లు. కాకపోతే ఒకటే తేడా  కంప్యుటర్లో ఆ సమాచారాన్ని తీసివేయవచ్చు (delete ). కానీ బ్రెయిన్ నుండి తీసివేయ లేము (ఇంతవరకూ అది చేతకాలేదు. ముందు అవుతుందని నాకు నమ్మకం లేదు ).

ఈ  sensory neurons కాస్త pressure  sensitive. వీటికి కొంచెం వత్తిడి తగిలితే వాటిలో కొద్దిపాటి విద్యుత్ ఉద్భవిస్తుంది. దీనిని action potential అంటారు. ఈ action potentials న్యూరాన్ నెట్వర్క్ ద్వారా ప్రయాణించి మెదడులో thalamus అనే చోటికి చేరుతాయి. శరీరంలో అన్ని న్యూరాన్స్ నుండి వచ్చిన సంకేతాలని thalamus విశ్లేషించి, సమస్యా పరిష్కారానికి central cortex లో వాటి వాటి స్థానాలకు
పంపుతుంది.( కళ్ళవి కళ్ళ చోటుకి, చెవులవి చెవుల చోటుకి అల్లాగ.) అక్కడ వాటి పరిష్కరణకి సరిఅయిన సమాధానాలు తయారుచేయబడి (action potentials ) పని నెరవేర్చటం కోసం వాటి వాటి గమ్యస్థానాలకు  neural network ద్వారా పంపబడతాయి.

ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఏదయినా  ముఖ్యమయిన సమాచారం వెంటనే పరిష్కరించాల్సి వస్తే  network మధ్యలో వచ్చే spinal cord కలిపించుకుని సమస్యను పరిష్కరించి తరువాత thalamus కి తెలుపుతుంది.

Spinal cord కల్పించుకునేవి :
1. మన ఎదురుకుండా పులి కనపడుతుంది వెంటనే పరుగెడుతాము.
2. మీ కాలి మీద చీమ పాకుతోంది. వెంటనే చెయ్యి వెళ్ళి దానిని తీసి వేస్తుంది.
3. పొరపాటున వేడి పెనముని పట్టుకున్నారనుకోండి వెంటనే చెయ్యి తీసేస్తారు.

Thalamus కల్పించుకునేవి:
ఉదా : మీరు మంచినీళ్లు తాగాలనుకుంటున్నారు. మెదడు నుండి షుమారుగా వచ్చే సంకేతాలు:
1. మీ కంటికి, గ్లాస్ ఎక్కడుందో చూడటానికి.
2. మీ చేతికి, గ్లాస్ తీసి నోరు దగ్గర పెట్టటానికి
3. మీ  నోటికి, తాగటానికి.

కింద బొమ్మ లో చేతి లో నుండి బయల్దేరిన సంకేతాలు (Blue ) మెదడులోకి వెళ్ళి cortex లో పరిష్కరించబడి న తరువాత, పరిష్కరణ సంకేతాలు(Red ) గమ్య స్థానం ఎలా చేరుకుంటయ్యె చూడచ్చు.


కొన్ని ప్రాముఖ్యములేని సమాచారాలయితే వాటికి మెదడు(thalamus ) లో గుర్తింపు ఉండదు.
ఉదా : మీరు సముద్రపు ఒడ్డున నివసిస్తున్నారనుకోండి, కొంతకాలానికి సముద్రపు హోరు మీకు వినపడదు, మీరు చేసే ఏ పనికీ అడ్డురాదు. రోజూ చేపల మార్కెట్లో పని చేసే వాళ్లకి  ఆ వాసన అలవాటయి వాళ్ళపని వాళ్ళు చేసుకు పోతూ ఉంటారు. ఇంతెందుకు మనం రోజూ బట్టలు వేసుకుని తిరుగుతుంటే అవి మన చర్మాన్ని రాచుకుంటూఉంటాయి. మనకి అవి మన చర్మాన్ని రాచుకుంటున్నాయనే గుర్తింపు ఉండదు. సెంటు పూసుకున్నామనుకోండి. కొంత సేపటికి మనకి ఆ సెంటు వాసన వెయ్యదు.

ఈ సంకేతాల్లో మన ఉనికిని తెలిపేవి చాలా ముఖ్యమయిన సంకేతాలు. మనము ఏ నిమిషంలో ఎక్కడ ఉన్నామో మెదడుకి ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు విరుద్ధమైన పొంతనలేని సంకేతాలు వస్తే మెదడు తికమక పడుతుంది.

ఉదాహరణకి:
1.  గుండ్రంగా మనచుట్టూతా మనం తిరుగుతూ ఆగి పోయామనుకోండి.
తలతిరిగి కూర్చుండిపోతాము.
2. ప్లేన్ లో వెళుతున్నాము. మన సీటులో కూర్చున్నాము. పుస్తకం చదువుతున్నాము.
మనము పుస్తకం చదవటం అటుంచి పరిగెడుతూ కూర్చోలేము, కూర్చుని పరిగెత్తలేము.మూడు విరుద్ధమైన సంకేతాలు (కదులుతున్నాము, అదే సమయంలో కూర్చున్నాము, అదే సమయంలో చదువుతున్నాము) మన మెదడుకి వెళ్తున్నాయి. మెదడుకి ఏమి చెయ్యాలో సందిగ్దావస్థలో ఉంటుంది. మన మనుకునే travel sickness కి కారణం ఇదే .

మనకి కలిగే చాలా జబ్బులకి ఈ సంకేతాలు సరీగ్గా తయారు కాకపోవటమో  లేక సంకేతాలు గమ్యస్థానానికి చేరకపోవటమో కారణం.(Alzheimer's, Depression, Epilepsy, Parkinson's etc).

తరువాత పోస్ట్ లో ఈ సంకేతాలు ఒకచోటునుండి ఇంకొక చోటుకి ఎల్లా  ప్రయాణం చేస్తాయో చూద్దాము.

We have five senses, seeing, hearing, smelling, tasting and touching. There are specific receptors for specific senses spread all over body. They produce electrical impulses called action potentials. First destination for all these impulses is the thalamus, which is in the middle of the brain. Thalamus is the central processing unit for sensory impulses where they were analyzed and sent to proper locations on cerebral cortex. Visual Cortex takes care of Optical signals coming from the eye, auditory cortex for hearing, somatic sensory cortex for identifying and locating touching signals. Final signal analysis was made at the cerebral cortex and response signal was sent to the appropriate area through the neural network.

Sometimes conflicting signals reach the brain and brain gets confused resulting in dizziness, or seasickness etc. In almost all these cases you will be doing two opposite things at the same time, you are moving and yet you are sitting stationary ( going in a plane, traveling on a ship, whirl around and stop etc).

Most of the Nerve disorders(Depression, Epilepsy, Parkinson's etc) come because of problems in Nerve signal generation or transmission.

దీనిలోని బొమ్మలు  గూగుల్  నుండి సేకరించినవి.

ఈ పోస్ట్, చాలా పుస్తకాల నుండి క్రోడీకరించి వ్రాసిన సమాచారం. మీకు ఆ పుస్తకాల పేర్లు ఆ పుస్తకాల లోని సంక్షిప్త సమాచారం కావాలంటే క్రింది పోస్టులు చదవండి.

1. Books on Brain
2. Sensory_neuron

Monday, February 20, 2017

132 ఓ బుల్లి కథ 120 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 1

న్యూరాన్స్ (Neurons)


జీవితంలో సంవత్సరాల తరబడి కలసి తిరిగిన వ్యక్తి మనని చూసి తెల్ల మొహం వేస్తే ఎల్లా ఉంటుంది?  చెప్పినా  గుర్తు పట్టక పోతే చేసేదేముంది? దీనికంతటికి కారణం మెదడు. ఇటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు ప్రపంచెంలో ఇప్పుడు ఏకారణానో ఎక్కువ అవుతున్నాయి. అమెరికాలో  ప్రతి 63 నిమిషాలకీ ఒక అల్జీమర్స్, dementia case ని గుర్తిస్తున్నారు.

మనశరీరాన్ని మొత్తం ఎల్లవేళలా పని చేయించేది మన మెదడు. మెదడు బరువు సుమారు 3 పౌనులు ఉంటుంది. శరీరం బరువులో 2% ఉండే మన మెదడు, తను పనిచేయటానికి మన శక్తిలో 20% తీసుకుంటుంది. అందుకనే దీనిని energy hawk అంటారు.

మెదడుకి కొన్నిప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. దీనికి 24 గంటలూ ఆక్సిజన్ కావాలి. రక్తంలో ఉన్న పదార్ధాలు మెదడు లోకి వెళ్లాలంటే  blood brain barrier దాటి రావాలి. అంటే కొన్ని మాత్రమే వెళ్లగలవు. అందుకనే మెదడులో పనిచేసే మందులు తయారు చెయ్యటం కొంచెం కష్టం.

శరీరంలో ఏ భాగమయిన చెడిపోతే అటువంటిదే ఇంకొక  భాగంతో మార్పిడి చెయ్యొచ్చు కానీ మెదడు ని ఇంకొకళ్ళ  మెదడుతో మార్చలేము. ఇంకా ఆ టెక్నాలజీ, ప్రయత్నాలు ఫలించలేదు. అంతవరకూ మనకి ఒకటే మార్గం. మెదడు ఎల్లా పనిచేస్తుందో తెలుసుకుని పాడయి పోకుండా జాగర్తగా  దానిని కాపాడుకోవటమే.

రక్తంలో red blood cells ఉన్నట్లు brain లో ఉన్నముఖ్యమైన cells ని  neurons అంటారు. మనం పుట్టేటప్పుడే 100 బిల్లియన్ న్యూరాన్స్ తో పుడతా మని అంచెనా. న్యూరాన్ లు చాలా సూక్షమైనవి. వీటి సైజు లు దాదాపు 4 microns (0.004 mm )  నుండీ 100 microns (0.1 mm ) దాకా ఉంటుంది. వీటికి 24 గంటలూ ఆక్సిజన్ కావాలి. ఉపయోగపడకుండా  ఆక్సిజన్ తిని కూర్చునే న్యూరాన్ లను  energy దండగ అని రోజుకి కొన్నిటిని మెదడు తీసేస్తుంది. దీనిని pruning అంటారు. పోయినవి తిరిగి రావటము చాలా కష్టం. అందుకని వీలయినంత వరకూ రోజూ మన మెదడుని ఉపయోగించటం మంచింది. లేకపోతే  if you do not use it you loose it వీటికి కూడా వర్తిస్తుంది.

మన చేత అన్ని  పనులూ చేయించేది ఈ న్యూరాన్లే. వీటినుండి సంకేతాలు రాకపోతే మన శరీరంలో అవయవాలు ఏమీ పనిచేయవు. మనము పుట్టినప్పుడు మనకి తెలిసినది ఏడవటం ఒకటే. బతకటానికి కావలసిన పరిజ్ఞానం తల్లి తండ్రులు,స్నేహితులూ నేర్పినవే. మనం బోర్లాపడటం నుండీ కొత్తకొత్త skills నేర్చుకున్నప్పుడల్లా ఈ న్యూరాన్స్ కలిసికట్టుగా వాటిని గుర్తు పెట్టుకుంటాయి. అందుకని సామాన్యంగా ఒక్కొక్క న్యూరాన్ 100 నుంచీ 10000 దాకా మిగతా న్యూరాన్స్ తో సంబంధం (connections) పెట్టుకుంటాయి. వీటిని neural networks అంటారు.

న్యూరాన్ మన శరీరంలో ఒక ముఖ్యమయిన సమాచార (communication) సాధనం. ఏ సమాచార సాధనమైనా చేసేపని ఒకటే, కొంత సమాచారాన్ని తీసుకుని (input ) దాన్ని కావలసినట్లు మలచి బయటికి పంపటం (output ).

ఉదాహరణగా మనము రోజూ వాడే సమాచార సాధనం టెలివిజన్. aerial నుండో, cable నుండో, satellite dish నుండో input వస్తుంది, టెలివిజన్ బాక్స్ లో ఉన్న చిప్స్ దానిని output బొమ్మగా మారుస్తుంది. దానినే మనం బొమ్మగా screen మీద చూస్తాము.

న్యూరాన్లలో సమాచారాన్ని సేకరించటం (input ) డెండ్రైట్స్ (dendrites ) అనే వాటివల్ల జరుగుతుంది. ఈ సమాచారం న్యూరాన్ తీసుకుని దానిని విద్యుత్ (charge) గ మార్చి axon (output ) కు అందిస్తుంది. axon మన electric wire లాంటిది. ఆ కరెంట్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలో అక్కడికి
తీసుకు వెళ్తుంది. electric wire కి మనకి షాక్ తగలకుండా ప్లాస్టిక్ ఉన్నట్లే axon కి myelin అనే పదార్ధం కప్పి ఉంటుంది. శరీరంలో axon లన్నీ కట్టలు కట్టలుగా వెళ్తాయి. వాటినే నరము(nerve )
అంటాము.

మనము ఏ పని చేసినా ఎక్కడో ఒక చోట మన మెదడు న్యూరాన్లలో, ఒక ఎలక్ట్రిక్ మెరుపు మెరుస్తుంది. దీనిని neuron firing  అంటారు. మనము ఒకప్పుడు ఏమీ చేస్తుండక పోయినా, ఇంకొకళ్ళు చేస్తున్నవి చూస్తుంటే  న్యూరాన్స్  fire (activate ) అవుతాయి. ఈ న్యూరాన్స్ ని mirror neurons అంటారు. మనం ఇంకోళ్ళని చూసి పనులు నేర్చు కోటానికి కారణం ఈ mirror neurons.

ఇది ఈ అంశం మీద మొదటి పోస్ట్. మిగతావి వరసాగ్గా వారం వారం పోస్ట్ చేస్తాను.

ఈ పోస్ట్, చాలా పుస్తకాల నుండి క్రోడీకరించి వ్రాసిన సమాచారం. మీకు ఆ పుస్తకాల పేర్లు ఆ పుస్తకాల లోని సంక్షిప్త సమాచారం కావాలంటే క్రింది పోస్టులు చదవండి.

1. Books on Brain
2. 75 ఓ బుల్లి కథ 63 --- బ్రెయిన్ - సృష్టిలో న్యురాన్ పుట్టుక
3. Life-and-Death- of a Neuron
4. Embryological Development of the Human Brain

Tuesday, February 14, 2017

131 ఓ బుల్లి కథ 119 ---- భార్గవి - దానిమ్మ - మొండి మొగుడు




కాఫీ తాగేసి ఎంచేద్దామా అని ఆలోచిస్తున్న భార్గవికి, కాఫీ తాగి ఊర్కెనే కూర్చున్న భర్తా,  డైనింగ్ టేబుల్ మీద ఉన్న దానిమ్మ కాయలూ  కనపడ్డాయి. వెంటనే ఈ రెండు జడపదార్ధాలని ఎందుకు కలపకూడదనే ఆలోచన వచ్చింది.

భార్గవికి ఇటువంటి ఆలోచన వస్తుందనుకుంటే, బహుశా వల్లి Costco లో కొన్న దానిమ్మకాయలు, భార్గవికి ఇచ్చేదికాదు.

రిటైర్ అయిన భర్త అలా ఊర్కేనే కూర్చోటం ఏమాత్రం మంచిది కాదు. If you don't use it you loose it. మనిషిలో ఉన్న కీళ్ళు, బుర్రా రోజూ ఉపయోగించక పోతే అవి ఉపయోగం లేకుండా పోతాయి. అల్లాగే మనుషులు కూడా. మొన్నెవరో ఆయన భార్య పేరే మర్చె పోయాడుట. ఇటువంటి పరిస్థితి తన భర్తకు కలగ కూడదు అని భావించింది భార్గవి.

దానిమ్మ కాయలు ఎంత బాగున్నాయో అని మురిసిపోతూ వాటికి ఒక ఫోటో తీసి, తన కిష్టమని తెచ్చిన వల్లీ గారు ఎంత మంచివారో అనికూడా పెద్దగా అనుకుంది. క్రింది సంభాషణలన్నీ ఆ తరువాత జరిగినవి.

"దానిమ్మ గింజలు తింటే శరీరానికి చాలా మంచిదట "

"అవును చాలా మంచివి. రక్త శుద్ధికి చాలా దోహదం చేస్తాయి"

"పైకెళ్ళి కంప్యూటర్ ముందర కూర్చునే ముందర వాటిని కొంచెం వలిచి పెట్టండి."

అయ్యో ఏమిటన్నాను అని నాలిక కరుచుకుంది. తాను ఎన్ని సార్లో చెప్పాడు పెళ్ళాం చెబితే పనులు చెయ్యటం ఇష్టముండదని. అందుకనే ఆఫీస్ కి వెళ్ళే ముందర భగుణ కూరగాయలు కత్తీ కౌంటర్ టాప్ మీద పెట్టివెళ్తుంది. తాను వచ్చేటప్పటికి కూర తయారు అయి ఉంటుంది. భర్త కొంచెం Old fashioned. తను భోజనంలో కూర పచ్చడి పప్పు పులుసూ లేకపోతే అది భోజనం కాదంటాడు.

తనచేత పని చేయించాలంటే వేరే రూట్లో వెళ్ళాలి. ఒక్కొక్కరోజు ఆయనకి  ప్రేమ పొర్లి పోతూ ఉంటుంది. అప్పుడు ఏపనయినా అడగకుండానే చేస్తాడు. మగవాళ్లందరికీ  ప్రతిరోజూ రూపాలు మారిపోతూ ఉంటాయి. నిన్న ఏ రూపంలో ఉన్నాడో రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. ఇవ్వాళ ఇంకా ఆ ప్రేమ కొద్దిగా మిగిలి ఉంటుందనుకుని:

"నాకు దానిమ్మ గింజలంటే చాలా ఇష్టం" అన్నది.

"ఇష్టమయితే వలుచుకు తిను"

"కొంచెం వొలిచి పెడతారా"

"దానిమ్మ గింజలు వలవటం నా కిష్టం లేదు. వలుస్తుంటే రసం చింది చొక్కా పాడవుతుంది "

ఇప్పుడేం చెయ్యాలో అర్ధం కాలా. ఎల్లాగయినా తన చేత ఆ పని చేయించాలి.

"మరి "రిచ్ మండ్" లో పార్వతి వాళ్ళ ఇంట్లో ఎల్లా చేశారు"

"పార్వతి వేరు"

"అంటే నేను వేరా "

"తాను దానిమ్మ వలుస్తుంటే మరకలు పడితే వెంటనే వెళ్ళి కొత్త చొక్కా కొని తీసుకు వచ్చింది "

"నేనూ కొని పెడతాను"

"నా కక్కరలేదు ఇప్పటికే ఇరవై  చొక్కలున్నాయి. బట్టలు ఉతుక్కునే సరికి నాపని అవుతోంది"

"వాషింగ్ మెషీన్ లో వెయ్యటం కూడా ఉతుక్కోవటమేనా. అయినా ఎవరి బట్టలు వారు ఉతుక్కుంటే తప్పేమిటి "

"నీ లంగాలు కూడా ఉతకాలసొస్తోంది. నా బుట్టలో ఎందుకేస్తున్నావు"

సమస్య ఇంకో చోటికి వెళ్తోందని గ్రహించింది భార్గవి

"పోనీ లాగూ కొనిపెడతాను"

"చొక్కాకి మరకలయితే లాగూ కొని పెడతానంటా వేమిటి"

ఎలాగయినా ఈయనతో దానిమ్మలు వొలిపించాలి.

"పోనీ మీ కిష్టమయిన బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర చేసి పెడతాను"

"మొన్న నాకిష్టమైనదని తెలిసికూడా దాన్ని చెడగొట్టావు. పెళ్లి చేసుకునే ముందర నీ వంట ప్రతాపం తెలిస్తే బాగుండేది "

"నా వంట ప్రతాపం పెళ్ళిలో చూపాను. లొట్టలేస్తూ తిన్నారు"

"పెళ్ళి వంటలు బాగానే ఉన్నాయి నువ్వు చెయ్యలేదుగా"

"నేను చేసినది గుట్టు చప్పుడుగా తిన్నారు"

"నాకెప్పుడు పెట్టావు"

"పెళ్ళిలో  "స్తా  ళీ పాకం" లో పొయ్యి మీద వంట చెయ్యలా"

"ఆ పొగలో ఏమి పెట్టావో ఏమిటో "

"నన్ను చూస్తూ లొట్టలేస్తూ తిన్నారు. మీ చెయ్యి కూడా తగిల్చారు బాగుందని "

"కానీ ఇప్పుడు నాకు భోజనం సరీగ్గా పెట్టటల్లేదు"

"సరే ఇవ్వాళ నుండీ మీ కిష్ట మైనవి చక్కగా చేసి పెడతాను"

"తిని నేను లావెక్కాలని నీ కోరికా"

తలకేస్తే కాలికి కాలికేస్తే తలకీ ముడిపడుతోందని గమనించింది. పని అయ్యేటట్లు కనపడలా.

"ముసుగులో గుద్దులాట ఎందుకు పోనీ ఏమి కావాలో చెప్పండి"

ఆ తరువాత జరిగిన సంభాషణ వ్రాయటం ఇష్టంలేదు. కానీ జరిగింది చెప్తాను.

వెంటనే భార్యా విధేయుడై చొక్కా మీద మరకలు పడకుండా  పాతచీర కప్పుకుని దానిమ్మకాయలు వలిచి గింజలు తీయటం జరిగింది. ఆ రాత్రి బెడ్ రూమ్ కిటికీ లోనుంచి  తొంగి చూస్తూ వెళ్తున్న పౌర్ణమి చంద్రుడు సిగ్గుపడుతూ మబ్బుల్లో దాక్కున్నాడు.

Wednesday, February 8, 2017

130 ఓ బుల్లి కథ 118 ---- నిమ్మకాయ నీళ్ళు


మొన్నీ మధ్య "డెన్నీస్" రెస్టారంట్ కి వెళ్ళి కాఫీ తాగటం ఇష్టం లేక "నీళ్ళు " డ్రింక్ గ ఇమ్మన్నాము. సర్వర్ నుండి తర్వాత ప్రశ్నలు "టాప్ వాటర్ "  "లెమన్ వాటర్" "ఐస్" "వితౌట్ ఐస్".

అప్పటి దాకా రెస్టారెంటుల్లో  "లెమన్ వాటర్" సర్వ్ చేస్తారని తెలియదు. సరే  "లెమన్ వాటర్" తెప్పించామనుకోండి, ఒక జగ్ నీళ్ళ లో ఒక స్లైస్ యెల్లో లెమన్ వేశారు. మొన్నీ మధ్య వల్లీ వాళ్ళ ఇంట్లో కూడా  "లెమన్ వాటర్" ఇచ్చారు. (పై బొమ్మని Lemon అంటారు. కింద బొమ్మ Lime.) నిన్న "శ్రవణ్ " గారు  "లెమన్ వాటర్" తో తేనె కలిపి తినటం మంచిదేనా? అని email లో అడిగారు.  దాని ఫలితమే ఈ పోస్ట్.

జీర్ణ ప్రక్రియలో మనం తిన్న ఆహారం షుగర్ (glucose ) గ  మార్చబడి మన రక్త కణాల్లో mitochandria అనే చోట oxygen తో దగ్దమవటం మూలంగా శక్తి (ATP రూపంలో ) విడుదలవుతుంది. ఎప్పుడైనా రసాయనిక మార్పులు జరుగుతుంటే వ్యర్ధ పదార్ధాలు (byproducts ) బయటకి వస్తాయి. వాటిల్లో freeradicals ఒకటి. అవి వెళ్ళి వేటిమీదన్నా కూర్చుంటే  ఆ పదార్ధాల పని తీరు మారి పోతుంది. శరీరంలో జబ్బులు రావటానికి ఈ freeradicals కారణం కూడా ఒకటి. ఈ హడావిడిలో కొన్ని ఆక్సిజన్ atoms  ఉదృత రూపం దాలుస్తాయి. ఉదృత రూపం దాల్చినవి, ఇంకొకళ్ళు సక్రమంగా చేస్తున్న పనిని  చెడగొట్టట మేగా.

At the end of this electron transport chain, the final electron acceptor is oxygen, and this ultimately forms water (H20). At the same time, the electron transport chain produces ATP. (This is why the the process is called oxidative phosphorylation.)

ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళకి వద్దాము. నిమ్మకాయ రసంలో antioxidents ఉన్నాయి. శరీరం లో ఆక్సిజన్ atoms ఉదృతం తగ్గించాలంటే antioxidents కావాలి. ఇవి నిమ్మకాయ రసంలో సమృద్ధిగా ఉన్నాయి.

ఒక గ్లాస్ నీళ్లలో ఒక అర నిమ్మకాయ రసం కలపండి. మీ ఇష్టాలని బట్టి తక్కువ ఎక్కువలు చూసుకోండి. మీకు తాగటం కొంచెం కష్టంగా ఉంటె తేనె కలుపుకోండి. తేనె మంచిది. కానీ మార్కెట్ లో కార్న్ సిరప్ కలిపిన తేనె ఎక్కువగా అమ్ముతున్నారు. కల్తీ తేనె (high fructose corn syrup ఉన్న తేనె ) కాకుండా చూసుకోండి. ఇందాక చెప్పినట్లు మీ ఇష్టాలను బట్టి పాళ్ళు నిర్ణ ఇంచు కోండి.

ఇదంతా కష్టంగా ఉంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు రోజూ నిమ్మకాయ ఊరగాయ వేసుకుని ఒక అన్నం ముద్ద తినండి. నేను అందుకనే నిమ్మకాయ ఊరగాయ పెట్టి అందరికీ ఇస్తూ ఉంటాను. నా ఇదోరకం దేశసేవ.

Health benefits of drinking lime juice and warm lime water

Every time you drink a glass of lime juice, you not only quench your thirst, you also give your body a lot of health benefits. In spite of the wealth of information about the health benefits of lime, I’m still faced with questions like, “Is lime juice good for you?” Well, take a look at just some of its many benefits and the answer will be clear:
0. Skin care
1. Digestive aid
2. Constipation
3. Supporting healthy blood sugar levels
4. Heart health
5. Respiration
6. Joint care
7. Treatment of scurvy
8. Temperature regulation
9. Weight loss