"అమ్మా మాయమ్మా అని నే పిలచితే నాతో మాట్లాడరాదా (నీ కిది) న్యాయమా మీనాక్షమ్మా"
"సరసిజ భవహరి హరనుత సులలిత నీ పదపంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితి"
నాకు చిన్నప్పుడు సంగీతమంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ రోజూ ఏవో పాటలు పాడుతూ నే ఉండేది. మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున పాటలు పాడేవాడు. గుడికెళ్ళినప్పుడల్లా మా అమ్మక్కయ్యా మా అమ్మ తప్పకుండా గుళ్ళో పాటలు పాడే వారు. అల్లాగే పెళ్ళిళ్ళల్లో కూడా భోజనాలు చేసిన తర్వాత అందరూ కూర్చుని పాడేవాళ్ళు. ఇలా సంగీతం తో పెరిగినా నా కెందుకో సంగీతం మీద పెద్ద మక్కువ రాలేదు. కాకపోతే బుద్ధిమంతుడి లాగా మాట్లాడకుండా వినేవాడిని.
సంగీతం మీద నా ఇష్టా ఇష్టాలన్నీ ఒక రాత్రితో తారుమారు అవుతాయని నేను అనుకోలేదు. నేను అప్పుడు 5th ఫారం అనుకుంటా రేపల్లె లో చదువుతున్నాను. ఒక రోజు మాయింటికి శ్రీనివాసన్ గారు వచ్చారు. రాత్రికి ఎవరింట్లోనో పెళ్ళిలో ఆయన పాట కచ్చేరీ. (1950's లో బాలమురళీకృష్ణ గారు విజయవాడ రేడియో నుండి పొద్దునపూట "భక్తిరంజని " కార్యక్రమం చేసేటప్పుడు, దానిలో శ్రీనివాసన్ గారు పాల్గొనే వారు.ఆయన గుంటూరు Indian Bank లో పని చేసే వారు.)
రాత్రికి శ్రీనివాసన్ గారి పాట కచ్చేరీ కి మా నాన్న గారితో పాటు నేనూ వెళ్ళా ను. పిల్లాడినని నాకు పక్కవేసి పరుపు వేసి పడుకో మన్నారు. నేను పౌరుషంతో పడుకోలేదు. రాత్రి ఒంటి గంట దాకా పాట కచేరి వింటూ మూడు గంటలు అలాగే మేల్కొని కూర్చున్నాను.
తెలిసిన పాటలే. తెలిసిన రాగాలే. అమ్మ పాడుతుంటేనూ తాతయ్య పాడుతుంటేనూ విన్నవే. మూడు గంటలు వరసగా కూర్చుని విన్న తర్వాత ఎందుకో వాటిమీద ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం రాను రాను పెరగటం తప్పితే తరగలేదు. యూనివర్సిటీ లో దుర్గా ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సుందరరామ శర్మ, కృష్ణారావు(voilin ) ల పరిచయాలు కూడా దీనిలో ఒక కారణం కావచ్చు. వాళ్ళు పాట వింటూ ఏ రాగమో చెప్పే వాళ్ళు. నాకు ఇప్పటికీ అది చేత కాదు.
అప్పటినుండీ ఎప్పుడు శాస్త్రీయ సంగీతం విన్నా మనసంతా ఒక విధంగా అయిపోతుంది. తన్మయత్వం అంటే అదేనేమో. నా ఉద్దేశంలో అది ఒక Neural Resonance. అదో చెప్పలేని అనుభూతి. మీకు కూడా ఆ తన్మయత్వం తో ఆ అనుభూతి కలిగించాలని నా ప్రయత్నం.
ఈ క్రింది వీడియో IndianRaga Labs లో సభ్యుడు లలిత్ సుబ్రమణియన్ పాడిన, శ్యామ శాస్త్రి విరచిత "అమ్మా మాయమ్మా ". ఇది విన్న తరువాత మీకూ శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కలగవచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పాలేము! అదొక మరువరాని అనుభూతి. శాస్త్రీయ సంగీతం వింటున్నప్పుడు దానిలోకి వెళ్ళి పోయి వేరొక ఆలోచనలు దగ్గరకు రాకుండా మనసుల తలుపులు మూసేస్తాము. అదొక Yoga , అదొక Meditation.
The timeless classic 'Mayamma' in the rare and beautiful Ragam Ahiri rendered by 2015 IndianRaga Fellow Lalit Subramanian.

No comments:
Post a Comment