కూర మొదలెట్టే ముందు ఒకటి రెండు పనులు ముందర చెయ్యాలి. ఒక గంట ముందు రెండు స్పూన్ల పెసర పప్పు (moong dal ) నీళ్ళల్లో నాన వెయ్యాలి. బ్రోకలీ నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి (కాడలు కూడా వాడ వచ్చు). అమెరికాలో మీకు కావాలంటే బ్రోకలీ ముక్కల పాకెట్, 15oz సైజులో frozen section లో దొరుకుతుంది.
కావలసిన పదార్ధాలు:
1. వంట నూనె -- రెండు టేబుల్ స్పూనులు. (నేను వాడేది ఆలివ్ ఆయిల్ మీడియం హీట్)
2. మినపపప్పు -- 1/2 టీస్పూన్
3. మెంతులు -- ఆరు గింజలు
4. జీలకర్ర -- 1/2 టీస్పూన్
5. ఆవాలు -- 1/2 టీస్పూన్
6. ఎండుమిరప -- ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి )
7. పసుపు -- చిటికెడు
8. ఇంగువ -- చిటికెడు
9. నాన పెట్టిన పెసరపప్పు -- 1/2 స్పూన్
10. బ్రోకలీ ముక్కలు -- 15oz (3 కప్పులు)
11. ఉప్పు -- 1/2 స్పూన్
ఈ కూర చెయ్యటం చాలా తేలిక:
1.ఒక బాణీ లో నూనెవేసి కాగిన తరువాత తిరగమాత వేయాలి (1--8 స్టెప్స్).
తిరగమోత మాడ్చ వద్దు.
2. నానిన పెసరపప్పు వేసి ఒకనిమిషం కలియపెట్టాలి.
3. పోపులో బ్రోకలీ ముక్కలు , ఉప్పువేసి కాసిని నీళ్ళు జల్లి మూత బెట్టాలి .
4. షుమారు 15 నిమిషాలకి నీళ్లంతా పోయి ముక్కలు ఉడికి కూర తినటానికి తయారు అవుతుంది.
ఈ కూరకి నేను ఉపయోగించే చిట్కాలు:
1. Frozen 15oz బ్రోకలీ పాకెట్ కొంటాను.
2. ముందుగా బ్రోకలీ ముక్కలని pressure cooker లో 3 నిమిషాలు స్టీమ్ చేస్తాను.(ఒక విజిల్ దాకా అనుకోండి). దీని మూలంగా బ్రోకలీ త్వరగా ఉడికి, కూర త్వరగా తయారు అవుతుంది.
3. అసలు బ్రోకలీ ఉడకపెట్టి ఉత్తగా కూడా తినవచ్చు.
వంటలకు సంబంధించిన నా ఇతర పోస్టులు:
70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు
87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి
123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర
Broccoli compound targets key enzyme in late-stage cancer
No comments:
Post a Comment