లాక్ డౌన్ లో ఇల్లంతా శుభ్రం చేస్తుంటే పాత కాగితాల్లో నేనెప్పుడో వ్రాసిన గేయం కనపడింది. ఈ గేయం క్రింద నా గురించి రెండు లైనులు వ్రాశారు కాబట్టి ఇది ఎప్పుడో ఎక్కడో అమెరికాలో ఎవరి పత్రిక లోనో పడుంటుందని అనుకుంటున్నాను.
మాతంగిని
ప్రేమ మాటలు రావు నాకు
పెద్ద చదువులు చదవలేదు
పాటు పడి నా సాటి కొస్తే
ప్రీతిగా సాపాటు పెడతా
దాచుకోమని హృదయమిస్తే
కొంగు కొసలో మూటగట్టి
హృదయ పేఠిలో దాచుకుంటా
నృత్య నాటికలాడలేను
పాటగట్టి పాడలేను
ఊసురోమని ఇంటికొస్తే
చెంగు పరచి చెంతజేరి
కమ్మగా నిను కౌగాలిస్తా
మృదువుగా నీ మాటలన్నీ
మల్లెమొగ్గల మాల కట్టి
తురిమి జడలో పెట్టుకుంటా
భావకవితలు చెప్పలేను
భామ కలాపము చెయ్యలేను
నీదు హృదిలో స్థానమిస్తే
సన్న జాజుల తల్పమేసి
సాదరంగా నిన్ను చేరి
నాతి హృదయపు లోతులన్నీ
దొంగ చూపులు చూడనిస్తా
తేల్చుకో నీ కొరికెవరో
మాధవా ! నేనాగలేను
మరుని ధాటికి తాళలేను
No comments:
Post a Comment