ఈ ప్రశ్నోపనిషత్ , అధర్వణ వేదము నుండి గ్రహించ బడినది. అధర్వణ వేదములో మూడు ముఖ్య ఉపనిషత్ లు ఉన్నాయి. అవి ముండక, ప్రశ్న, మాండూక్య. అందుకని అధర్వణవేద శాంతి మంత్రం ఈ మూడింటికీ వర్తిస్తుంది.
శాంతి మంత్రం:
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా: : మా చెవులతో మంచి మాటలు వినుగాక
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా: : బుద్ధితో అర్ధం చేసుకునేటట్లు చేయి
స్థిరై రంగైస్తుష్టువాగంసస్తనూభిః : దేవతలని అనేక సూక్తుల ద్వారా ప్రార్ధించనీ
వ్యశేమ దేవహితం యుదాయుః : దేవుడిచ్చిన పూర్ణాయుష్షుని అనుభవించనీ
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః : ఇంద్రుడు మాకు మేలు చేయు గాక
స్వస్తినః పూషా విశ్వవేదా : : ఈశ్వరుడిని అర్ధం చేసుకునేలా బుద్ధి ప్రకాశం చేయి
స్వస్తి నస్తార్ క్ష్యో అరిష్టవేమి: : నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆటంకం లేకుండా చేయి
స్వస్తి నో బృహస్పతి ర్దధాతు : నా బుద్ధిని పదును చేసి అన్నీ అర్ద్మమయ్యేలా చెయ్యి
ఓం శాంతి: శాంతి: శాంతి: : ఆది దైవిక , ఆది భౌతిక , ఆధ్యాత్మిక ఆటంకాలని తొలగించు
ఓ దేవతలారా మా చెవులతో శుభప్రాయమైనవి విని, కళ్ళతో శుభప్రాయమైనవి చూస్తూ, వాటిని అర్ధం చేసుకునేలా బుద్దిని ప్రసాదించి, మమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యముతో ఉంచి, ఆపదలలో నుండి రక్షిస్తూ, మా ఈ ఆధ్యాత్మిక జీవితాన్నీఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళండి.
జీవితంలో మనకు తెలియని సంగతులు తెలుసుకోవాలంటే మనకు వాటిని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి తెలుసుకోవాలనే మన ప్రయత్నమూ కావాలి. వీటన్నింటికన్నా ముందర మనకి ఎవరన్నా చెబితే అర్ధం చేసుకునే శక్తి ఉండాలి. దీనితోపాటు ఆరోగ్యం సరీగ్గా ఉండాలి. మన ప్రయత్నాలకు అడ్డంకులు రాకుండా ఉండాలి. వీటిలో మనం చేసే ప్రయత్నం తప్ప మిగతావన్నీ ఇతరుల మీద ఆధారపడి నవే. ఈ ప్రపంచంలో మన మొకళ్ళమే చేయగలిగినవి చాలా తక్కువ. అది ఎప్పుడూ మనం గ్రహించి ఉండాలి.
ఈ ప్రశ్నోపనిషత్ లో ఆరుగురు చదువుకున్న శ్రోత్రియులు ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందని తెలుస్తోంది గానీ, తాను చెబితే వాళ్ళకి గ్రహించగల శక్తి ఉన్నదో లేదో గురువుగారికి సందేహంగా ఉంది. నాకు ఇక్కడ "శుభోదయం" సినీమా, దానిలో హీరో గుర్తుకు వస్తున్నారు.
IIT లలో చదవాలని చాలామందికి కోరిక ఉంటుంది. పెద్ద ఉద్యోగాలూ పెద్ద పదవులూ వాటితో వచ్చే సంపద అందరికీ ఇష్టం. కోరిక మాత్రమే IIT ప్రవేశానికి అర్హత కాదు గదా, IIT వాళ్ళకి వీళ్ళు పాఠాలు గ్రహించ కలిగే శక్తి ఉన్నదో లేదో తెలియాలి కదా. అందుకే ప్రవేశ పరీక్షలు పెడతారు.
అందుకనే గురువుగారు " అబ్బాయిలూ మీకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నది సంతోషం. మీరు ఒక సంవత్సరం పాటు సుఖాలకి అతీతంగా ఆశ్రమ క్రమశిక్షణలో నా దగ్గర ఉండి శిష్యరికం చేయండి. అప్పుడు మీరడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే నాకు చెప్పాలని అనిపిస్తే మీకు తప్పకుండా చెబుతాను " అంటాడు.
గురువుగారి పేరు పిప్పలాద మహర్షి , శిష్యుల ఆరుగురి పేర్లు , సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ కాత్యాయన.
అమెరికా లో పేరుపెట్టేవిధానం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లు, ఇక్కడి నుండే నేర్చుకున్నారే మో !.
సంవత్సరం అయిపొయింది గురువుగారికి శిష్యుల మీద నమ్మకం కలిగి వారి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఉపక్రమిస్తారు.
వచ్చే పోస్టుల్లో గురు శిష్యుల సంవాదం గురించి తెలుసుకుందాము.
తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.
Prasnopanishad is one of the three major Upanishads taken from Atharva Veda. The other two beingMundka and Mandukya Upanishads.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
DeleteValuable good post
Deleteథాంక్స్ శర్మ గారూ .
Delete