సూక్ష్మంగా చెప్పాలంటే ప్రశ్నోపనిషత్ అంతా ఆరుగురు శిష్యులు అడిగిన ప్రశ్న లకు గురువుగారి సమాధానములు. నలుగురు శిష్యుల ప్రశ్నలకి గురువుగారు సమాధానములు చెప్పిన తరువాత, గురువుగారిని శిష్యుడు శైబ్య సత్యకామ అయిదవ ప్రశ్న క్రింది విధంగా వేశాడు :
అధ్యాయం 5 శ్లోకం 1: (5-1)
అథ హైనం శై బ్య: సత్యకామః ప్రపచ్చ : దాని తర్వాత శైబ్య సత్యకామ అడిగాడు
స యో హ వై తద్భగవన్మనుష్యేషు : ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా
ప్రాయణా న్త మో ర మభిధ్యాయీత : మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే
కతమం వావ స తేన లోకం జయతీతి : అతడు దానివలన ఏ లోకానికి వెళ్తాడు అని
ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకాలకి వెళ్తారు? అని శిష్యుడు శైబ్య సత్యకామ గురువుగారు పిప్పలాదుడిని అడిగాడు.
ఇక్కడ ఓం కారం గురించి ఒక మాట చెప్పాలి. "ఓం" అని నోటితో అనాలంటే మనం "అ " "ఉ " "మ " అనే మూడక్షరాలను కలిపి ఉచ్చరించాలి.
అధ్యాయం 5 శ్లోకం 6: (5-6)
తిస్రో మాత్రా మృత్యుమత్య: ప్రయుక్తా అన్యోన్యసక్తా : : ఈ మూడు మాత్రలూ విడిగా వాడితే (ఉచ్చరిస్తే ) అనిత్య ఫలం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా
అనవిప్రయుక్తా: క్రియాసు : ధ్యానంలో సరీగ్గా వాడితే
బాహ్యాభ్యన్తరమధ్యమాసుజ్ఞ సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతేజ్ఞః : జాగృత్ సుషుప్తి స్వప్నావస్తలకు పరమాత్మను గుర్తించిన జ్ఞాని చలించడు.
ఇక్కడ చెప్పేదేమిటంటే విడి విడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే అది పనిచేయదు, ఓంకార ఫలం పొందాలంటే ఓంకారం జపించేటప్పుడు అక్షరాలన్నీ పెనవేసుకుని ఒకటిగా రావాలి.
విడివిడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే, ఒక మాత్ర "అ " తో జపిస్తే నూ, రెండుమాత్రలు "అ " "ఉ " లతో జపిస్తే దేవతలు వారి వారి లోకాలకు తీసుకువెళ్ళి వారి వారి ఫలితం అనుభవించిన తరువాత మనుష్యలోకానికి తెస్తారు. మూడక్షరాలూ పెనవేసుకుని ఓంకారం జపిస్తే సామవేద దేవత వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం పొందుతారు. (5-7)
నామాట :
"పై లోకాలు" అనే మాటని అర్ధం చేసుకోటానికి ఈ క్రింది విశ్లేషణ ఉపయోగ పడచ్చు :
1. లోకాలు ఉన్నాయి అనే మాట విని ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు. మన ఎదురుకుండా మనమే ఒక లోకాన్ని సృష్టించాము. అదే "Satellite " లోకం. మనము సృష్టించిన కొన్నివేల ఉపగ్రహాలు దానిలో తిరుగుతున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడికి మానవులు వెళ్తున్నారు వస్తున్నారు (space Station).
2. మన శరీరం ఒకటిగా పైకి కనిపించినా అది వేద శాస్త్ర ప్రకారం మూడు శరీరాల కలయిక అని చెబుతారు ("స్థూల శరీరం" (physical body ) , "సూక్ష్మశరీరం" (subtle body ), "కారణ శరీరం" (casual body )).
మన "స్థూల శరీరం" (physical body ) మనకు కనపడే మన శరీరం.
జ్ఞానేంద్రియాలనుండి వచ్చే సంకేతాలను వాటికి తగినట్టు ప్రతిస్పందన చేసిన తర్వాత "మనసు" లో నిక్షిప్తం (record ) చేసేది "సూక్ష్మశరీరం" . మన జీవత్వానికి కారణం ఇదే.
మన మనసులో దాచిపెట్టబడిన సంకేతాలతో మన మనస్సు మనకి కొన్ని గుణాలు ఇస్తుంది.
"బుద్ధి" "జ్ఞానం" అనేవి నిక్షిప్తమైన సంకేతాల్ని వడగట్టితే (process ) వచ్చేది.
"చిత్తం " అనేది మనసులోనున్న సాంకేతాలను అవసరమైనప్పుడు బయటకు తెచ్చేది.
"అహంకారం" మన మనసులో పోగు చేసుకున్న సమాచారాన్ని మన సొంతం అని వక్రీకరించగా వచ్చేది. ఇవి మనం అందరం మనకు తెలీకుండా రోజూ ఉపయోగించేవే.
మన జీవిత రహస్యాలను దాచి పెట్టుకునేది "కారణ శరీరం" (casual body ). మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనని కనిపెట్టుకుని ఉండేది ఇదే. మనం గాఢ నిద్ర పోయామని మరునాడు గుర్తు పెట్టు కొని చెప్పేది కూడా మనలోని "కారణ శరీరం".
మన శరీరం వదిలిన తరువాత మన జ్ఞాపకాలతో ప్రయాణించేవి సూక్ష్మ, కారణ శరీరాలు. మన ప్రారబ్ధం నిర్ణయించేది వీటిలో నిక్షిప్తం చేసిన సమాచారమే.
మనం నిద్ర కుపక్రమించే టప్పుడు wake up state లో ఉంటాము , తరువాత Dream లోకి వస్తాము ఆ తరువాత Deep Sleep లోకి వెళ్తాము వీటినే జాగృత్, స్వప్న, సుషిప్తి అంటారు. వీటిని గురించి మాండూక్యోపనిషత్ లో వివరంగా తెలుసుకుందాము.
3. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్ గురించి చర్చించే టప్పుడు ఇంకా తెలుసుకుందాము. ఓంకారం ఏవిధంగా ఉచ్చరించాలనేది గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి క్రింద లింక్ ఒకటి ఇచ్చాను.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :
No comments:
Post a Comment