మా మనవరాలు అవును అంటోంది.
అమ్మమ్మా తాతయ్యా మనవరాలు |
Richmond , California, US లో ఇంటి అరుగు మీద వేసిన చిత్రం.
Caboose |
Berkeley Rose Garden |
బుద్ద ప్రార్ధన శాల |
Prayer Wheels |
Lymph System - Cleveland Clinic |
Lymph Nodes --- Plymouth Hospitals (UK) |
మన శరీరంలో ప్రసరణ (circulatory system ) రెండు రకాలుగ జరుగుతుంది. రక్త ప్రసరణ, లింఫ్ ప్రసరణ. రక్త ప్రసరణ అంటే మనకందరికీ తెలుసు.
మన శరీరం లో లింఫ్ ప్రసరణ రక్త ప్రసరణ కన్నా భిన్నంగా జరుగుతుంది. రక్తప్రసరణలో ఉండే "pump " , గుండె, లేకపోవటంతో లింఫ్, ముందుకు కదలటానికి, లింఫ్ నాళాలకు పక్కనున్న కండరాల సహాయం తీసుకుంటుంది. అందుకని లింఫ్ కదలాలంటే మన కండరాల కదలిక చాలా ముఖ్యము. ఇంకొకటి లింఫ్ నాళాలు గుండె వేపు వెళ్ళే రక్తనాళాల తోటి మాత్రమే కలుస్తాయి. అందుకని గుండెవేపు కదలికలే లింఫ్ ప్రసారానికి ముఖ్యము అవుతాయి. మన పూర్వికులు చెప్పిన, యోగా లో ఉన్న, దీర్ఘ ఉచ్వాస నిశ్వాసలు ఎంత మంచివో ఇప్పుడు అర్ధమవు తుంది.
ఈ లింప్ శరీరంలోని అన్ని కణాలలోనూ ఉండి, అక్కడ తయారు అయిన చెడు పదార్ధాలను సేకరించి, వాటిని దగ్గరలో దాచి పెట్టి (nodes ), వాటి మలినాల్ని "తెల్ల కణాలు " ద్వారా నిర్వీర్యం చేసి వాటిని శరీరంలో నుండి బయటికి పంపటానికి రక్తంలో కలుపుతుంది. పై బొమ్మలోని "nodes " లో మనకు తెలిసిన గజ్జలు , చంకలను తేలికగా గుర్తించవచ్చు, ఈ nodes మెడ, మోకాలు వెనుక కూడా ఉన్నాయి.
లింఫ్ అంటే "గ్రీక్ " భాషలో "నీళ్ళు " అని అర్ధం. మనము వాడే మెడికల్ పదాలు దాదాపు అన్నీ "గ్రీక్" భాష నుండి వచ్చినవే. డెల్టా వేరియెంట్ , ఓమిక్రాన్ (ఒమేగా నుండి వచ్చింది). ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమేగా, సిగ్మా ఇవన్నీ "గ్రీక్ " అక్షరాలు. లింఫ్ మన జీర్ణ ప్రక్రియలో వేరుపడ్డ కొవ్వుని (fat ) సేకరించటం మూలంగా దీని రంగు తెల్లగా ఉంటుంది.
లింఫెటిక్ సిస్టం మన శరీరంలో "garbage collector " లాంటిది , చెడుపదార్ధాలను తీసివేసి, immunity cells ను శరీరమంతా వ్యాపించ జేసి, రోగ నిరోధ శక్తిని పెంచి, శరీరంలో fluid balance ను సరిచేసి, తిన్న ఆహారాన్ని సరీగ్గా జీర్ణం చేసి, చర్మానికి కాంతినిచ్చి, inflammation ను తగ్గించి, ఒక్కమాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది.
కొన్ని కొన్ని ఆపరేషన్స్ మూలంగానూ, కొన్ని వ్యాధుల మూలంగానూ లింఫ్ nodes కి హాని జరిగినప్పుడు, లింఫ్ ఎక్కడికీ పోలేక అక్కడే పేరుకుపోయి, చాలా బాధలకు దారి తీస్తుంది (Lymphatic congestion ). మందులు లేని ఈ వ్యాధులకు ఒకటే మార్గము, Lymph Drainage ,పేరుకుపోయిన లింఫ్ ను బయటికి పంపి సరిచేయాలి.
మెదడులో ఉన్న కణాలు (cells ) కూడా అన్ని కణాలు లాగానే రోజూ మలినాలని ఉత్పత్తి చేస్తాయి. లింఫ్ పేరుకుపోవడం కూడా జరగవచ్చు. మెదడు కు వచ్చే రోగాలకి (Headache , MS ,Stroke etc.), Lymph Drainage ఎంతవరకూ ఉపయోగ పడుతుంది అనే అంశం మీద అమెరికా లోని Center for Brain Immunology and Glia (BIG) at the University of Virginia's Department of Neuroscience వారు పరిశోధనలు చేస్తున్నారు.
అటువంటి లింఫ్ మార్గాన్ని సరిచేసే నిపుణురాలు:
Lisa Levitt Gainsley, CLT (Certified Lymphedema Therapist)
అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు మందుల్లేని రోగాల్ని సరిచెయ్యటానికి వారి వారి పేషంట్స్ ని ఈవిడ దగ్గరకి పంపిస్తూ ఉంటారు.
తన patients తోటి అనుభవాలు, తాను వారి బాధలను నివారించిన విధానాలు వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకం పేరు This Book of Lymph, 2021 ప్రచురణ.
లింఫ్ నాళములు చర్మము నకు దగ్గరగా ఉండుట మూలమున, Lymph Drainage కి, చాల మృదువుగా అంగ మర్దనము (massage ) చెయ్యాలి. ఆ విధి విధానాలు, అవి ఏ విధంగా శరీరంలోని శక్తి చక్రాలతోనూ (మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార ) , యోగా, ఆయుర్వేద, చైనీస్ మెడిసిన్ లతోనూ మిళితమై ఉన్నాయో ఈ పుస్తకంలో వివరించటం జరిగింది.
లింఫ్ సిస్టం ను జాగర్తగా ఉంచుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది నిర్వివాదాంశం. దీనికి కావలసింది మృదువుగా శరీరాన్ని హృదయం వేపు రుద్దటం. అదే మన పూర్వికులు తలస్నానం అని చెప్పి పండగలకి ముఖ్యంగా చేయించేవారు. నా చిన్నప్పుడు పండగలకి చిన్నపెద్ద అందరూ ఆముదం తలమీద అంటుకుని, సున్నిపిండితో వంటిమీద నలుగు పెట్టుకుని, తల స్నానం చేసేవారు. ఇండియాలో "ఆల్ జై మర్స్" తక్కువకి కారణం ఇదేనేమో.
మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ధర $26.99.
The Book of Lymph (2021)
Summary of the post:
We have two circulatory systems in the human body. One is the cardio vascular circulatory system which has heart as the "pump" to circulate the blood, the second one is the Lymph system where in there is no pump for circulating the Lymph; The movement of muscles around the vessels aids the movement of Lymph until it reaches the cardiovascular system to take advantage of its pumping system.
Lymph is a white colored fluid (white color comes because of its absorption of fat in the small intestine). It resides in all cells in the body and is called the body's garbage collector, filtering bacteria and toxins and channeling them to what are called Lymph Nodes in the body. The Lymphatic system is twice the size of the circulatory system and is an essential part of the immune system, producing white blood cells.
The lymph vessels are connected to the veins carrying blood going towards the heart and mixed with the blood in the veins for further elimination and purification.
The Lymph System does not have a "heart" like pump in the circulatory system, to move the Lymph in the vessels. It depends upon the pulsing of nearby arteries and skeletal muscle contractions. As such self-massage, breathing and physical exercises are essential for good lymphatic health.
Problems may arise because of the elimination of lymph nodes in surgery. As lymph nodes do not regenerate, this may result blockages of the lymph flow resulting in unwanted problems in the body. By channeling the collected limp to the circulatory veins trough various means, we can eliminate these problems of the lymph blockage.
This information is taken from the book published in 2021: The Book of Lymph by Lisa Levitt Gainsley , CLT. This book may be available in the Libraries.
అమెరికాలో సియాటిల్ పట్టణానికి 165 మైళ్ళ దూరంలో "లేక్ ష లా న్ " అనే ఒక సరస్సు ఉంది. అది 50 మైళ్ళ పొడుగూ ఒక మైలు వెడల్పు 1400 అడుగుల లోతు ఉన్న పెద్ద సరోవరం. ఊరు పేరు కూడా అదే. ఈ ఫ్యూరీ జనాభా 8 వేలు. చిన్నప్పుడు హిమాలయాల్లో మానససరోవరం గురించి తెలుసుకున్నప్పుడు, కొండల్లో చెరువు ఎల్లా ఉంటుందనేది అర్ధం కాలేదు. పైనున్న రెండు ఫోటోలు మేముంటున్న "ఎయిర్ బియన్ బీ " ఇంట్లో నుండి తీసినవి. చుట్టూతా కొండలూ వాటి మీద పడ్డ స్నో, కింద ఉన్న చెరువు. అర్ధమయ్యింది కదా సరోవరాలు కొండల్లో ఎల్లా పుడుతాయో. స్నో కరిగిన నీళ్లు. ఇంకోటి కూడా తెలుసుకున్నాను జారుడు నీళ్ళల్లో ద్రాక్ష బాగా పెరుగుతుందని. కొండల మీదా కిందా బోలెడన్ని ద్రాక్ష తోటలు (ద్రాక్ష తీగలన్నీ చలికాలం లో నిద్రుస్తున్నాయి). రోడ్డు పక్కన బోలెడన్ని "ద్రాక్ష రసం " రుచి చూసే షాపులు. దీనిని "wine tasting " అంటారు. ఊర్కెనే రుచి చూపిస్తారు అనుకునేరు. మేము అల్లాగే బోల్తా పడ్డాము.
ఒకసారి కాలిఫోర్నియా లో "thousand buddhas " అనే చోటికివెళ్ళి తిరిగివస్తూ ఊరుకోలేక రోడ్డుపక్కన కనపడ్డ "wine tasting " కి వెళ్ళాము. డబ్బులు వదిలించుకుని "తాగు బోతు" అనే బోర్డు తగిలించు కోవాల్సొచ్చింది. నా ఉద్దేశంలో ఒక చుక్క తాగినా తాగుబోతు కింద లెక్కే. అనవసరంగా డబ్బులు పెట్టామనే బాధో, లేక ఆ వైన్ తయారు చేసిన మూలాలు తెలుసుకోవాలనే పట్టుదలో, లేక "wine tasting " మైకమో, చూడటానికి మనోజ్ఞంగా ఉన్న నల్ల ద్రాక్ష గుత్తులో, తిరిగివస్తూ రోడ్డు పక్క ఆగి మా ఇంటావిడా ఆవిడ స్నేహితురాలూ పక్కన తోటలోకి దిగి ద్రాక్ష గుత్తులు కోసుకుని తిన్నారు. మేము మగవాళ్ళం, ఎవరన్నా వచ్చి అడిగితే "చూడటానికి వెళ్ళారు" అని చెబుదామని కారులో కూర్చుని ఉన్నాము. మీరు మాత్రం ఈ విధంగా "wine tasting " చెయ్య బోకండి.
ఈ "లేక్ ష లా న్" సరోవరం ఒక చివరి అంచునుండి ఒక సన్నటి జలపాతం కొలంబియా రివర్ అనే నదిలో పడుతుంది. ఇంకో విచిత్రం ఇక్కడ ఏమి చేశారంటే లేక్ లో నుండి ఒక సొరంగం తవ్వి దాని చివర హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
2022 సంవత్సరం ని ఆహ్వానించటం ఇక్కడే జరిగింది. అందరూ తాగుతూ నాకూ రెండు చుక్కలు "షామ్ పైన్" పోశారు. బయట చలి విపరీతంగా ఉంది (17F అంటే -8.33C). ఈ సమయంలో మీరు బయటికి వెళ్ళాలంటే కనీసం రెండు వరసల దుస్తులు అవసరం. నెలల క్రిందట రిజర్వేషన్ చేసినప్పుడు వాతావరణం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు. పొద్దునపూట స్క్రామ్ బుల్డ్ ఎగ్స్ సాయంత్రం పిజ్జా. ఇక్కడ "Safeway " గ్రోసరీ స్టోర్ ఉంది కాబట్టి తినటానికి ఇబ్బంది లేదు. అయినా మా ఆవిడ రైస్ కుక్కర్, బియ్యం తోటి వస్తుంది కాబట్టి నాకెప్పుడూ ఇబ్బంది ఉండదు. తిండి సరీగ్గా తినక బోతే నేను రోజంతా నసుగుతానుట. అన్నము కందిపొడి గోంగూర చింతకాయ మాగాయ, "yogurt " అనే గడ్డ పెరుగుంటే ఇంకేమికావాలి ? అది రోమ్ అయినా పారిస్ అయినా హాంకాంగ్ అయినా హొనలులూ అయినా అల్బుకర్క్ అయినా నాకేటి కొదవ.
ఇక్కడికి వచ్చే టప్పుడు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళు దాటి వచ్చాము (మచ్చుకి వాటిలో రెండు పేర్లు Cashmere , Sultan). ఒక పల్లెటూరు లో (Leavenworth) బోర్డులన్నీ జర్మన్ పేర్లతో కనపడ్డాయి. ఆరా తీస్తే తెలిసిందేమంటే, ఆ ఊళ్ళో పర్యాటకులు ఆగటల్లేదని బాధేసి, ఆవూరి పెద్దలు, అన్నిటికీ జర్మన్ పేర్లు పెట్టి, అలంకరణలు చేసి ఒక "బెవే రియన్ (జర్మన్)" పల్లెటూరుగా తయారు చేశారు. ఇక్కడ ప్రసిద్ధి "nutcracker museum" (కాయల్ని పగలగొట్టే వస్తువులు ). అప్పటినుండీ ఈ ఊరికి పర్యాటకులు ఎక్కువైనారు. మేమూ వెళ్ళాము (నేను తప్ప -- చలి). పై ఫోటోలు అక్కడివే.
ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణించిన 165 మైళ్ళలో మొదటి 50 మైళ్ళు చదును ప్రదేశం తర్వాత అంతా కొండలు ఎక్కటమే. "ఇక్కడి నుండీ కారు టైర్లకి "chains " వెయ్యాలి లేకపోతే కారు all wheel drive అన్నా అవ్వాలి" అనే బోర్డు కనపడింది. రోడ్లమీద స్నో తో కారు జారచ్చని ముందు హెచ్చరిక. రోడ్డుపక్కన కార్లు ఆపి టైర్లకి చాలామంది గొలుసులు వేసుకుంటున్నారు (మాది AWD). వెళ్తూ ఉంటే కొలంబియా రివర్ దానిపక్కన చిన్న ఊళ్ళు వస్తూ పోతూఉన్నాయి. మేము ఊరు చేరుకోటానికి సియాటిల్ నుండి 5 గంటలు పట్టింది.
తిరిగివచ్చేటప్పుడు మంచు తుఫాను వస్తుందని తెలిసి కొంచెం ముందర బయలుదేరాము. పెద్ద గందరగోళం, ఉత్కంఠ. మా బృందంలోని ఎనిమిది మందిలో ఏడాది పిల్లాడి నుండీ 80 ఏళ్ళ కుర్రాడి వరకూ ఉండటంతో వాళ్ళ వాళ్ళ అవసరాలు వివిధ రకాలు. మొదట మాకున్న కారులో అందరం పట్టం కాబట్టి పెద్ద వాన్ అద్దెకు తీసుకోవాల్సొచ్చింది.
వచ్చేటప్పుడు కొంచెం దారి తప్పి ఒక చిన్న ఊళ్లోకి వెళ్ళి పోయి గూగుల్ మా ప్స్ తో సరి అయిన దోవలోకి వచ్చాము. మొదటి 50 మైళ్ళు బాగానే గడిచింది కానీ తర్వాత "snow storm " మొదలైంది. రోడ్డు సరీగ్గా కనపడక చాల నెమ్మదిగా పోవాల్సి వచ్చింది. ప్రపంచం లో మీరు గమనించారో లేదో కొందరికి కష్టమయినది ఇంకొందరికి ఇష్టంగా ఉంటుంది. స్కీ చేసేవాళ్ళకి స్నోపడటం అంటే చాలా ఇష్టం, వాళ్ళు వాళ్ళ ఆటవస్తువులని పట్టుకుని ఆ సన్నటి దోవలో రోడ్డు పక్కన ఉత్సాహంగా నడుస్తున్నారు. జాగర్తగా కారు తోలుకుంటూ కొంత దూరం వచ్చేసరికి స్నో పోయి వర్షం రావటం మొదలయింది. అదీ గొడవే. అది దాటుకుని వచ్చేసరికి పిల్లలు ఆకలి గొడవ. "subway " మహత్యంతోటి అందరినీ శాంతపరిచి, చీకటి పడుతుంటే ఇంటికి జేరుకున్నాము.
ఇదీ క్లుప్తంగా మా "వింటర్ ఔటింగ్".