Monday, April 5, 2010

17. ఓ బుల్లి కథ 5 ---- మీరంటే నా కెంతో ఇష్టం

మీరంటే నా కెంతో ఇష్టం ----
ముప్పది ఏళ్ల క్రిందట, మాత్రు దేశానికీ పదివేల మైళ్ళ దూరం లో ఉన్నా, ఔత్సాహిక తెలుగు సంసారాలని వేళ్ళ మీద లెక్కించినా, నావి అని చెప్పుకోటానికి ఉన్నవి తక్కువైనా, ఇది నా మాతృభాష ఇది నాది ఇది గుర్తు పెట్టుకోవాలి అని నడుము బిగించి గొంతు సవరించి ఒక బృహత్కార్యముగా ఉద్యమించి చికాగో లో తెలుగు వెలుగు పత్రిక నడిపిన వారు అంటే నా కెంతో ఇష్టం.
మీరు ఈనెల తప్పకుండా వ్రాసి పంపించాలి అంటూ ఫోనుల మీద ఫోనులు చేసిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన వాటిని శ్రద్ధగా కూర్చుని తెలుగు లో చక్కగా స్వదస్తూరితో కాగితము మీద పెట్టిన వాళ్ళు అంటే నాకు చాలా చాలా ఇష్టం.

నాతో పరిచయమున్న వీళ్ళకి

ద్రోణంరాజు అనసూయ, ద్రోణంరాజు శ్రీరామకృష్ణ, ద్రోణంరాజు వాసవి, దామరాజు మూర్తి, దామరాజు లక్ష్మి, యడవల్లి రమణమూర్తి, శ్రీపాద నాగేంద్ర, వేలూరి వెంకటేశ్వరరావు, చింతా రాణి సంయుక్త.

ఇంకా నాకు పరిచయము లేని వాళ్ళ కేందరికో, మన తెలుగు మనతో పాటే జీవిస్తుంది అని చూపించి నందుకు నా ధన్య వాదాలు. వీళ్ళందరూ చికాగో లో తెలుగు కి వెలుగు నిచ్చిన వాళ్ళూ వీళ్ళూ.

లక్కరాజు శివరామకృష్ణారావు

నా చిన్న కవిత జనవరి 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

ఇలా మొదలవు తుంది
నువ్వంటే నాకెంతో
ఇష్టం
కమ్మగా చెప్పాను
సత్యం
ఇంక మీరు బొమ్మని క్లిక్ చేసి చదవండి

2 comments:

  1. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

    చిన్న కవిత అయినా, సొంపుగా వున్నది. మీరు కూర్చిన పదాలతోనే,నా సమాధానం:- మీకు ఇష్టమైన సత్యాన్ని, గాత్రమనే సూత్రంతో, చిత్రంగా, మంత్ర,తంత్రాల మధ్య చెప్పిన మీ విధానం నా కెంతో ఇష్టమైంది.
    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  2. @మాధవరావు గారూ మీలాగా కవిత్వం తో సమాధానం వ్రాద్దామని కొన్ని రోజులు చూశాను. కుదరలేదు. మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు. కీప్ ఇన్ టచ్.

    ReplyDelete