Thursday, April 22, 2010

19. ఓ బుల్లి కథ 7 ---- ఇది కధ కాదు - నిజం

ఇది కధ కాదు - నిజం-
@sowmya, @Prasad :ఇద్దరు PhD లు శనగలు తిన్నయడల అసౌకర్యముగా ఉంటుంది అని చెబితే నేను ఒప్పుకో కుండా ఉంటానా. నా తరువాత పోస్ట్ లో దానిని గురించి వ్రాస్తాను. ఇదిగో నా పోస్ట్:

ఇది ఒక బుల్లి వస్తు గుణ దీపిక. ఇందులో వస్తువు శనగలు అనే బీన్సు. నా శనగల పోస్ట్ లో వచ్చిన వ్యాఖ్యలకు సమాధానం ఈ పోస్ట్.
శనగలు బీన్స్ అనే జాతి లోనివి. ఇవి తిన్న యడల కోలేస్టేరోల్ తగ్గుట, రక్తము లోని షుగర్ పరిమితులు నిశ్చలముగా నుండుట, ప్రోస్టేట్ మరియు బ్రేస్ట్ కాన్సర్ రిస్క్ తగ్గుట మరియు, డయాబెటిస్ ఉన్న వాళ్ళ హృద్రోగ రిస్క్ తగ్గుట మొదలయినవి జరుగును అని నిరూపించట మైనది.

పని చేయుటకు కారణములు:బీన్సు లో 1) కాంప్లెక్స్ కార్బోహైద్రే టులు, రెండు రకముల పీచులు (2)కరిగేవి 3)కరగని fibers. మొదటి వి షుగర్ గ మారటానికి అరగటానికి ఎక్కువ కాలము పట్టును. అందువలన షుగర్ లెవల్ లు అకస్మాత్తుగా పెరుగవు. కరిగే
fibers కోలేస్టేరోల్ ని పట్టుకుని అది అరిగే లోపల బయటకి పంపుట మూలమున కోలేస్టేరోల్ తగ్గును. దానికి తోడు ఇన్సులిన్ receptors ను పెంచుటము వలన సెల్ల్స్ ఇన్సులిన్ వాడకము పెరుగును. కరగని fibers నీళ్ళని పీల్చటము మూలముగ ఉబ్బి, తుక్కు ను పెద్ద ప్రేవుల నుండి బయటకు పంపుట తేలిక అగును. వీటి మూలమున కొద్దిగా తినిననూ కడుపు నిండి నటులను, కడుపు ఉబ్బినటుల ను ఉండును.
బీన్సు లో అన్నిటికన్నా ఎక్కువ
fibers , తక్కువ fat ఉండును. అందుకని బరువు తగ్గుటకు ఇవి చాలా మంచివి.
బీన్సు లోని
fibers తొందరగా అరుగవు కనుక ప్రేవులలో పులువుట(ఫేర్మేంట్) మూలముగా గ్యాస్ వచ్చును.
కొద్ది కొద్ది గ తినుట మొదలు పెట్టి క్రమముగ దేహములో బీన్సు జీర్ణశక్తిని పెంచుట మూలముగ అజీర్ణ బాధను తగ్గించ వచ్చును.
ఇన్ని మంచి గుణములు గలిగిన
శనగలను రోజుకు నాలుగు తినిన మంచిది కదా.

బీన్సు వండు విధానము:
మొదట బీన్సు ని గిన్నెలో నీళ్ళ లో పోసి కనీసము రెండు అంగుళముల నీరు పయిన ఉండునటుల చూసి బోయిల్ అయ్యేదాకా ఎక్కువ సెగ లో పెట్టండి. ఆ తరువాత సెగ తగ్గించి పది నిమిషములు మరగ పెట్టండి.

తరువాత నీళ్ళు అన్నీ పారబోసి కొత్త నీరు పోసి కనీసం రెండు అంగుళముల నీరు పయిన
ఉండునటుల చూసి
ముప్పది నిమిషములు ఆగండి.

తరువాత నీళ్ళు అన్నీ పారబోసి కడిగి మరుల కొత్త నీరు కనీసం రెండు అంగుళముల పయిన
ఉండునటుల చూసి చిన్న సెగ లో రెండు గంటలు మెత్త పడే దాకా ఉడికించండి.

ఈ విధముగా చేసిన బీన్సు లో ఉండు గ్యాస్ తయారు చేయు షుగర్స్ అన్నీ పోవుటకు అవకాశము కలదు.
బీన్సు తో వంటపదార్ధములు తయారు చేయునప్పుడు ఒక టీ స్పూను అల్లము వేసినను ఫలితము వచ్చును.
బీన్స్ తినునప్పుడు వాటితో caraway seeds తిన్న నూ , one caraway capsule... or one parsley oil capsule వేసుకోనిన ఫలితము కలుగును.

నేను వైద్యుడిని కాను. క్షణిక(పార్ట్ టైం) ఆనందము కోసము వంట చేయు అల్ప సంతోషిని. బీన్స్ గురించి ఇంకనూ విశేషములు కావలసిన ఈ క్రింది వాటిని చూడగలరు. గూగుల్ తో కూడా పరిశోధించ వచ్చును.

The Doctors Book of Food Remedies By Selene Yeager
Prevention Health Books( Rodale Inc.)

Bottom Line/Women’s Health interview Violet I. Haraszthy, DDS, PhD,

"నాన్న" బ్లాగు లో "మీకు తెలుసా" పోస్ట్ (ఏప్రిల్ 7, 2010).


4 comments:

  1. హ హ హ అయితే మీరు పట్టు వదలని విక్రమార్కుడన్నమాట....ఇంతకీ శెనగలంటే కొమ్ము శెనగలా (చనా), లేదా పెద్ద శెనగలా (ఛోలే) లేదా బఠాణీలా?

    ReplyDelete
  2. @sowmya గారూ
    మీరు బఠాణీలా? అన్నారు అంతే నా మనస్సు బఠాణీల మీదికి పోయింది. కాలాక్షేపం బఠాణీలు అంటే నాకు చాలా ఇష్టం విజాగ్ వెళ్ళు తున్నప్పుడల్లా రైల్లో తినేవాణ్ని. చికాగో చుట్టుపక్కల వెతుకు తున్నాను ఇంకా దొరకలేదు.

    ReplyDelete
  3. నమస్కారములు.
    వైద్యుణ్ణి కాను అంటూనే చాలా చక్కని సలహాలను అందించారు. శనగల వలన కొలస్త్రాల్ తగ్గుట రక్తము లొ షుగరు పరిమితంగ ఉండుట బ్రెస్ట్ కాన్సరు,డయాబిటిక్ హృద్రొగము మొదలైన వాటికి నివారణ అని చక్కని సూచనలను తెలియ జెప్పారు.అవును ! బీన్స్ ని అన్నిసార్లు ఉడకబెడితె విటమిన్లు పోతాయి కదా ? మరి ?ఈ వైద్య పద్ధతి అంతేనేమొ. మంచి విషయాలను అందించిన మీ కధకాని కధకి ధన్య వదములు.

    ReplyDelete
  4. @nedunuri గారికి
    బీన్సు లో విటమినుల సంగతి నాకు తెలియదు కాని, కాల్సియం, ఫాస్పోరుస్, మేగ్నేసియం జింక్ మొదలయిన మినరల్సు ఎక్కువ ఉండెను. నేను శనగలు నాన పోసి పొద్దున్నే నాలుగు గింజలు తినుట మొదలుపెట్టితిని. మొలకెత్తు విత్తనములు మంచివి కదా. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.

    ReplyDelete