Monday, January 24, 2011

43 ఓ బుల్లి కథ 31 ---- Hawaii -- Pearl Harbor

మన జీవితం లో చూసే, Memorials, సంవత్సరికాలూ, పుట్టినరోజులూ, మెట్టిన రోజులూ, ఇవన్నీ జరిగిన ముఖ్య సంఘటలని గుర్తు కి తెస్తూ వుంటాయి.ఇవి మనస్సు నుంచి చెదరిపోని కొండ గుర్తులు. దీనికి కారణం మనము నేర్చుకోవాల్సినవి వాటిలో ఉన్నాయని మన మనస్సు గ్రహించటమే. అందులో Pearl Harbor సంఘటన ఒకటి. ఇది, మా తెలివి తేటలు ఎవ్వరికీ లేవు, మాకెవ్వరూ అడ్డు రారు, రాలేరు అని విర్రవీగే వాళ్ళకి అహం ఎల్లా దెబ్బ తింటుందో, ఒక పెద్ద ఉదాహరణ.

Pearl Harbor Memorial గురించి క్లుప్తంగా చెప్పాలంటే జపనీస్, Pearl Harbor మీద గుప్తంగా ముట్టడి చేసి అమెరికా పసిఫిక్ ఫ్లీట్ ని దాదాపు సర్వనాశనం చేసిన రోజు  స్మరించుకోవటానికి కట్టిన కట్టడం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో,  మనమీదకి ఎవ్వరూ దండెత్తలేదు కదా అని తటస్థస్థాయిలో ఉన్న అమెరికా కి కనువిప్పు కలిగించి, Japan మీద యుద్ధ ప్రకటనతో రెండవ ప్రపంచ యుద్ధం లో దిగటానికి కారణమయిన రోజు. అటునుంచి జపాన్ ఇటునుంచి జర్మనీ ప్రపంచాన్ని కబళించే ప్రయత్నాన్ని అడ్డుకున్న రోజు. ప్రపంచములో మనకెవ్వరూ అడ్డులేరు అనుకున్న వాళ్ళకి గడ్డురోజులు మొదలయిన రోజు.

ఆరోజు చనిపోయిన దాదాపు 3000 మందిని స్మరించుకోటానికి నిర్మించిన Memorial ని చూడటానికి వెళ్ళాము. మునిగిపోయిన "ARIZONA" యుద్ద నౌకను పైకి తీసి దాని మధ్యలో సముద్రము లో ఈ మెమోరియల్ ని కట్టారు. మేము వెళ్ళిన రోజు సముద్రపు గాలులు తీవ్రత మూలంగా విజిటర్స్ ని వెళ్ళ నివ్వ లేదు. అక్కడ ఒక మ్యుజియం ఉంటే చూశాము, ఒక అమెరికన్ సబ్మరైన్ ఉంటే లోపలికి వెళ్ళి చూశాము. మెమోరియల్ లోకి వెళ్ళలేక పోయినా, మీరే కదా మా స్వాతంత్ర జీవితానికి అంకురార్పణ చేసింది అని స్మరించుకున్నాము.

ఈ పోస్ట్ లో మెమోరియల్ ఫోటో, సుబ్మరైన్ ఫోటో, జపనీస్ దండయాత్ర (Dec 7, 1941) వీడియో, రెండవ ప్రపంచ యుద్దానికి అడ్డుకట్ట వేసిన అమెరికా సమాధానం (Aug 6, 1945) వీడియో పెడుతున్నాను. ఈ రెండు వీడియోలు Re-enactments.

ఫోటోలు వీడియోలు నేను తీసినవి కాదు.





















Monday, January 17, 2011

42 ఓ బుల్లి కథ 30 ---- Hawaii -- Pineapple Express




అమ్మా రైలు వస్తోంది. త్వరగా రా.












ఇంకా రావేమే. వెళ్ళిపోతుంది తొందరగా రా.











అమ్మయ్య ఎక్కాను రైలు. ఇంక కదలవే రైలూ.





ఛుక్ ఛుక్ రైలు కదిలిందిరా. అమ్మ అవిగో మామిడి కాయలు. అవిగో బనానా.  ఏమిటే ఆ పూలు?





అవిగో పైనాపుల్ చెట్లు.












చాకొలేట్ చెట్టు.






అబ్బ ఎన్ని రంగుల చెట్లో!!











చూడు ఎంత బాగుందో.











గణ గణ గణ క్రాస్సింగ్ గేటు వస్తోంది.















అదిగో వాటర్ ఫాల్!.












అబ్బా ఎంత పెద్ద పొలామో!









.
అమ్మాస్టేషన్ వచ్చేసింది.  దిగాలి.


అమెరికాలో ఉన్నవాళ్ళు Dole Pineapple అనే మాట వినకుండా తప్పించుకోలేరు.  ఆ రెండు పదాలకి అవినాభావ సంబంధముంది. 15th century  లో pineapple దక్ష్నిన అమెరికాలో బ్రజిల్ అనే దేశం నుండి వచ్చి అమెరికా, చైనా, ఇండియా మొదలయిన దేశాలకు పాకింది. అమెరికా లో వృక్ష శాస్త్రము చదివిన, జేమ్స్ డోల్, 1900 లో 22 ఏళ్ళప్పుడు Hawaii వచ్చి pineapples తోట వేసి పెంచటం మొదలెట్టాడు. వ్యాపారం వేగంగా పుంజు కొనుట మూలముగా దానిని plantation గ చేసి పండించి,  Honolulu లో ప్రాసెస్సింగ్ ప్లాంట్ పెట్టి ప్రపంచమంతా pineapple ని export  చేశారు. ఆయన వ్యాపారం అలా అభివృద్ది చెందటం మూలంగా దగ్గరున్న ఒక ద్వీపాన్ని(Lanai) కొనివేసి pineapples పెంచి, ఎగుమతి చేసి, Dole అనే పేరు ప్రపంచమంతా తెలిసేటట్లు చేసాడు. Pineapple, Hawaii లో ఒక వ్యాపార పంట. ఒకప్పుడు 75%  ప్రపంచం లో వాడే  pineapples ఇక్కడినుండే వచ్చేవి. Pineapple Plantation ఎల్లా వుంటుంది, ఏ విధంగా సేద్యం చేస్తారు అనే వాటిమీద Dole Plantation వారు ఒక చిన్న ట్రైన్ టూర్  పెట్టారు. దానికి మేము వెళ్ళాము. ఈ పొలం(Plantation) లో దాదాపు మన వేపు పండే అన్ని పళ్ళ చెట్లు, మామిడి, అరిటి, పనస మొదలయినవి చూడవచ్చు. పొలంలో పనిచెయ్యటానికి కావలసిన యంత్రాలని కూడా చూడవచ్చు.

ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. దానిలో Pineapple Ice cream చాలా బాగుంటుంది. షాప్ లో ఒక మూల నడుము నొప్పికి Hawaiian Instant వైద్యం చేస్తున్నారు. "Noni" bottle లో నుండి మందు తీసి నడుముకి ఒక నిమిషం రాస్తారు. నొప్పి తగ్గితే కొనుక్కోండి అంటున్నారు. మేము టెస్ట్ చేసిన తరువాత,  రెండు సీసాలు "Noni" కొనుక్కున్నాము. ఈ కాలంలో నడుం నెప్పులు ఎవరికి  రావటల్లేదు?

ఈ క్రింద Pineapple Express టూర్(Dole plantation టూర్), ఎవరో తీసిన వీడియో పెడు తున్నాను.దానితో పాటు Pineapple  ఎల్లా మెషిన్ తో ప్రాసెస్ చేస్తారో వీడియోలు కూడా  పెడుతున్నాను. చూసి ఆనందించండి.

మీకు వీడియో మధ్యలో ఆగి పోతుంటే, స్టాప్ చేసి కాసేపు ఆగితే buffering (డౌన్లోడ్ ) అవుతుంది. అప్పుడు ప్లే చెయ్యండి. ఆగకుండా చూడవచ్చు.








Tuesday, January 11, 2011

41 ఓ బుల్లి కథ 29 ---- Hawaii -- Waikiki Beach

హవాయీ ద్వీపాలు పసిఫిక్ మహాసముద్రములో అమెరికా పశ్చిమ తీరానికి 2500 మైళ్ళ దూరం లో ఉన్నాయి. వీరి భాష, నాగరికత వేరు. కానీ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు. ఇది అమెరికాలో 50 వ రాష్ట్రము. సియాటిల్, శాండియాగో, లాస్ యాన్జిల్స్, శాన్ఫ్రాన్సిస్కో ల నుండి దాదాపు  5 గంటల విమాన ప్రయాణం. ఈ ద్వీపాల పేర్లు Hawaii, Oahu, Mauve, Kauai మొదలయినవి.  ఈ ద్వీపాలలో టూరిస్ట్ లు ఎక్కువగా వెళ్ళే ద్వీపం పేరు Oahu . దీనిలో పెద్ద పట్టణం Honolulu . ఈ పట్టణంలో టూరిస్ట్ లు ఎక్కువగా తిరిగే  వీధి Kalakauva Avenue , ఎక్కువగా ఆకాశ హర్మ్యాలు ఉన్నది కూడా ఈ వీధిలోనే. ఈ  ప్రదేశాన్ని Waikiki అంటారు. Waikiki బీచ్ ఇక్కడే ఉంది. సామాన్యంగా వసంత, వేసవి కాలాల్లో ఇసకవేస్తే రాలనంత జనంతో హడావిడిగా కళకళ లాడుతూ ఉంటుంది. మేము నవంబర్ చివరలో వెళ్ళాము కాబట్టి పెద్దగా జనం లేరు. వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది కానీ ఆ సమయంలో మేముండే చికాగో తో పోలిస్తే వంద రెట్లు మేలు. ఇక్కడ వస్తువుల ఖరీదులు, ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడకి  వచ్చే జనం మూడు నాలుగు రోజుల కన్న ఎక్కువ ఉండరు.  అందుకని  ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. మేమున్న హోటల్లో ప్రతీ రూముకీ రెండు సంచులు ఇస్తారు. పొద్దున్నే క్రింద పలహారాలు పెట్టివుంటాయి. అవి సంచీల్లో నింపుకోవటం చల్ మోహనరంగా అంటూ బీచ్ కి బయల్దేరటం. వాతావరణం బాగుంటుంది. చుట్టూతా ఉండే సౌందర్యాన్ని ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆస్వాదించ వచ్చు. చుట్టూతా  సహజ ప్రకృతి సౌందర్యం మూలాన ఇక్కడ  ఏ కెమెరా తో ఎల్లా తీసినా చక్కటి ఫోటోలు వస్తాయి. మిమ్మల్ని అందరూ expert photographer అనుకుంటారు. దీనిలో మేము తీసిన Waikiki  బీచ్ ఫోటోలు, ఎవరో ఎప్పుడో  kalakauva avenue లో నడుస్తూ తీసిన వీడియో ఇక్కడ పెడుతున్నాను. మేమున్న హోటల్ పేరు కూడా దాన్లో ఉంది. చూసి ఆనందించండి. నా ఉద్దేశమల్లా నా మనస్సులో కలిగిన చక్కటి అనుభూతిని మీతో పంచుకోవటం.  









Friday, January 7, 2011

Hawaii Beaches

Pictures are taken with Sony Cybershot DSC W310 Camera.