Tuesday, August 16, 2011

66 ఓ బుల్లి కథ 54 ---- డయాబెటిస్ - ఆరోగ్య మిచ్చే కూరగాయలు

ముందుమాట: కూరగాయలు ప్రకృతికి దగ్గరలో ఉంటాయి కాబట్టి అన్నీఆరోగ్య ప్రదాయినులే కాకపోతే కొన్ని మన శరీర పరిస్థుతులను బట్టి మనకు సరిపడవు. వాటి గురించే ఈ పోస్ట్.

స్థూలకాయం చాలా అనారోగ్య పరిస్థుతులకు కారణం. ఉదా: డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, హృద్రోగం మొదలయినవి. మన శరీరంలో తిన్న ఆహారము నుండి షుగర్ తయారవుతుంది. మనకి జీవించ టానికి కావలసిన శక్తి కొన్ని రసాయనిక మార్పులతో ఈ షుగర్ నుండి వస్తుంది. ఈ శక్తి ప్రదాయిని, షుగర్, మన శరీరం వాడుకునే దానికన్నా ఎక్కువయితే, క్రోవ్వుగా (fat) మార్పు చెంది శరీరంలో దాచబడుతుంది. ఆహారము లభ్యము కానప్పుడు ఈ క్రొవ్వు శక్తిగ మార్చ బడి మనకి ఉపయోగ పడుతుంది. రోజూ మూడుపూట్లా సుష్టుగా భోజనం చేస్తూ ఉండి (కావాల్సిన దానికంటే ఎక్కువగా) ఉంటే రాను రానూ ఈ క్రొవ్వు శరీరంలో పేరుకు పోతుంది. ఇంకా శరీరానికి fat దాచి పెట్టే చోటు కనపడదు. ఈ రసాయనిక equilibrium చెదిరిపోతే అనారోగ్యాలు రావటం మొదలవుతాయి. ఉదా: రక్తంలో ఉపయోగించ బడని షుగర్ ఎక్కువగా ఉండటం డయాబెటిస్ కి కారణం. 

మన ఆచారాల్లో ఉపవాసాలు చెయ్యమనటానికి కారణం ఇదే అనుకుంటాను. మన శరీరంలో పేరుకున్న క్రోవ్వుని తగ్గించి మనం ఆరోగ్యంగా జీవించటానికి.

మనము స్థూలకాయులమో కాదో తెలుసుకోవటం చాలా మంచిది. దీనికి BMI అనే కొలమానం ఉంది. మీ BMI , 25 కన్నా తక్కువ 18 కన్నాఎక్కువా ఉండాలి. అలా లేకపోతే మీ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ BMI తెలుసుకోవటానికి  ఇక్కడ క్లిక్ చెయ్యండి.

రక్తంలో షుగర్ చేరటానికి రెండు కారణాలు. మొదటిది షుగర్, షుగర్ తో చేసిన పదార్ధాలు తినటం. రెండవది  మనము తినిన ఆహారంలో ఉన్న కార్బో హైడ్రేట్స్(Carbohydrates) శరీరంలో రసాయనిక మార్పిడితో ఏర్పడిన షుగర్.

అందుకని తీపిగా ఉన్నపదార్ధాలు, కార్బో హైడ్రేట్స్ ఉన్న పదార్ధాలు తినటం తగ్గించటం (లేక మానెయ్యటం) చేస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.  మనము రోజూ తినే కూరగాయలు కూడా కొన్నినియమాలతో వాడితే షుగర్ కంట్రోల్ చెయ్యవచ్చు.ఈ క్రింద మనము తినే కూరగాయలు తినటంలో గమనించ వలసిన జాగ్రత్తలు ఉదహరిస్తున్నాను.

1. ఈ క్రింది వాటిని తినటం మానేస్తే మంచిది :
Potatoes, Parsnips, Pumpkin, Rutabaga, Sweet Potatoes, Corn (actually a grain)
బంగాళా దుంప, గుమ్మడి కాయ, చిలకడ దుంప, మొక్కజొన్న 

2. ఈ క్రింది వాటిని మితంగా తినటం మంచిది :
Beets, carrots, Green Beans, Eggplant  (వంకాయ ), Jicama, Peas (actually a legume బటాణీ), Squashes, 
New Potatoes, Taro, Yams (కంద, పెండలం) .


3. ఈ క్రింది వాటిని తినటం మంచిది :

Artichoke
Asparagus
Avocado
Beet greens

Bitter Melon
(కాకర కాయ)
Bok Choy
Broccoli
Brussel sprouts
Cabbage (green and red)
Cauliflower
Celery
Chicory
Chinese cabbage
Chives
Collard greens
Cucumber
Dandelion greens
Endive
Escarole
Fennel
Garlic
Kale
Kohlrabi
Lettuce (avoid iceberg)
Mushrooms
Mustard greens
Onions


Parsley
Peppers(all kinds)
Purslane
Plantain
Radish
Seaweed
Spinach
Swiss chard
Tomatillos
Tomatoes
Turnips greens
Turnips
Watercress
Zucchini


చివరిమాట: ఆరోగ్యానికి మితంగా తినటం చాలా మంచిది. అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం కూడా ఇంకా మంచిది

మాతృక: 
Rachelle S. Bradley, N.D.


11 comments:

  1. నమస్కారములు.
    షుగర్ వ్యాధిని గురించి చక్కని విషయాలను తెలియ జేశారు.తినవలసినవీ తినకూడనివీ , తీసుకోవలసిన జాగ్రత్తలు , ఏ డాక్టరు చెప్పనంత వివరంగా తెలియ జెప్పారు. ఖర్చు , శ్రమ కుడా లేకుండా మీరందించే సలహాలు అమూల్యం . మీరు శ్రమ పడుతు ,మాకు శ్రమను తప్పించిన మీ ఔన్నత్యానికి ధన్య వాదములు + కృతజ్ఞతలు .

    ReplyDelete
  2. జుచ్చిని, టర్నిప్పు, సెలరి, బ్రకోలి, సీ వీడు, వాటర్ క్రెస్సు, అవకాడో ...అంటూ భయంకరమైన పేర్లు చెబితే ఎలాగండి, రాజుగారు? ఇవి మోండా, మాదన్నపేట, హబ్సిగూడ కూరల మార్కెట్లో దొరుకుతాయా? ఏదో వంకాయ, కాకరకాయ, మెంతులు, భుజంగ, వజ్రాసనాలు అంటే తెలుస్తాయి గాని! :) ;)

    మంచి సమాచారం ఇచ్చారు. వేలెడైనా లేని క్లోమగ్రంధి పనిచేయక చేసే నిర్వాకం అంతా ఇంతా కాదుగదా!

    ReplyDelete
  3. @రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  4. @snkr గారూ వ్రాసిన పేర్లన్నీ అమెరికా మార్కెట్లో రోజూ దొరికేవే. తెలుగులో పేర్లు వ్రాద్దాము అని ప్రయత్నించి చేతకాక తాత్కాలికంగా విరమించు కున్నాను.
    నా పాండిత్యం దీనిలో సున్నా. నేను ఇంకా ప్రయత్నిస్తాను. ఇంతలో తెలిసిన విజ్ఞులు కొంత సహాయం చేస్తే సంతోషిస్తాను. మీరుండే చోటు తెల్సిపోయింది ఇప్పుడు.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. @snkr :) :) అవన్నీ ఇక్కడ చాలా రెగ్యులర్ గా దొరికేవే. రండి కొనిపెడతాము.

    RSL gaaru. Thanks for the info.

    ReplyDelete
  6. @ snkr, :)

    @ Rao S Lakkaraju గారు,

    మీ టపా ఒకరిద్దరికి పంపాను. ధన్యవాదాలు.
    పచ్చి అరటికాయ ఏ లిస్టు లోకి వస్తుంది?

    ReplyDelete
  7. @కృష్ణ ప్రియ గారూ పచ్చి అరటికాయ ని Plantain అంటారు అనుకుంటాను. అది తరచుగా తినతగ్గ మూడవ లిస్టు లో ఉన్నది.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  8. Plantain అంటే పచ్చి అరటికాయేనండి

    ReplyDelete
  9. @కృష్ణప్రియ గారూ , snkr గారూ, Pavani గారూ, రాజేశ్వరి గారూ
    కాకరకాయ (Bitter Melon అంటారు) మంచి చేసే కూరగాయల లిస్టు లోఉంచాను. దానికి రెఫెరెన్స్ పేపర్ కూడా పెట్టాను. మీ విషయాశక్తికి ధన్యవాదములు.

    ReplyDelete
  10. Asparagus in telugu is called Pilli peechara, chandra vanka gaddalu, Muslamma Gadda

    ReplyDelete
  11. @Venu గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete