Thursday, September 8, 2011

69 ఓ బుల్లి కథ 57 ---- కేన్సర్ -- అంటే ఏంటి? ఎందుకొస్తుంది? రాకుండా చూడచ్చా?

ముందుమాట: కేన్సర్ -- అంటే ఏమిటో తెలుసుకొని, ఎందుకొస్తుందో తెలుసుకొని, ఆ వ్యాధి రాకుండా ఉండటానికి మార్గాలు వెతకటమే ఈ పోస్ట్ లక్ష్యం.

కేన్సర్ అంటే: మన శరీరం సరీగ్గా  పనిచెయ్యాలంటే వాటిలో ఉన్న వివిధ అవయవాలు  సరీగ్గా పని చెయ్యాలి. ఆయా  అవయవాలని సరీగ్గా  పనిచేయించేవి వాటిలో ఉండే కణాలు (Cells). వాటిల్లో కొన్ని కణాలు, చెయ్యవలసిన పని చెయ్యకుండా, అవలక్షణాల మూలంగా అడ్డూ ఐపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తమ సంతతిని పెంచుకుంటూ ఉంటాయి (uncontrolled growth). దానితో కొంతకాలానికి మంచి చేసే కణాల కన్నా చెడు చేసేవి ఎక్కువయ్యి శరీరంలో జరగవలసిన పనులు సక్రమంగా జరగవు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి. దీన్నే కేన్సర్ అంటారు.

ఏవిధంగా వస్తుంది?: మన శరీరం అంతా కణాల పుట్ట. వాటి వాటి జీవిత చక్రం ప్రకారం పాత కణాలు చచ్చిపోతూ  కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలు దైనందినమూ మన శరీరమనే రసాయనిక శాలలో జరిగేవే. ఈ పాత వాటి నుండి కొత్తవి జన్మించే ప్రక్రియలో తప్పులు జరగవచ్చు. పుట్టించిన తరువాత జీవించటం ముఖ్యం కాబట్టి, ప్రకృతి, ఆ తప్పులున్న కణాలు వాటంతట అవే చంపుకునేటట్లు చేసింది.  దానిని అపోప్తోసిస్ (Apoptosis) అంటారు. కానీ కొన్ని చెడ్డ కణాలు అన్నిలక్షణాలూ సరీగ్గానే ఉన్నట్టు కనపడి, ప్రకృతి పరిశీలనలో చిక్కకుండా తప్పించుకుని  బయటపడుతాయి. ఈ అవలక్షణాలతోటే వాటి సంతానం  పెరిగించుకుంటూ పోతాయి (uncontrolled growth). ఇవి సరీగ్గా పనిచెయ్యవు సరికదా మంచి కణాల ఆహారానికి కూడా పోటీకి వస్తాయి. దీనితో శరీరంలో అవి ఉన్న చోట ఆ అవయవానికి అవసరమయిన పని జరగదు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి.

ఒక మంచి కణం కేన్సర్ కణంగా ఎందుకు మారుతుంది?: సంత్సరాల బట్టీ పరిశోధనలు చేస్తున్నా గట్టిగా ఏదీ తేలలేదు. కాకపోతే కొంత పరిజ్ఞానం ఏర్పడింది. ఈ పరిశోధనలు కొన్ని దృక్కోణాల్లో జరుపుతున్నారు.

1. జన్మతహా జీన్స్ ద్వారా వస్తుండవచ్చు (Genetics). It is running in the family.

2. cells లో శక్తి కోసం జరిగే రసాయనిక కలయికలలో ఉద్భవించే free radicals మూలాన ఉద్భవించిన సమస్య. ద్రుఢమైన  anti-oxidants కోసం గాలింపు.

2. కణ విభజన జరిగి కొత్త కణములు తయారగు నపుడు కొత్త  రసాయనికల ప్రవేశం మూలాన వచ్చిన చెడు లక్షణం కావచ్చు. అందుకని పరిశోధనలు చేసి కేన్సర్ ఇచ్చే పదార్ధాలను (Carcinogenic Chemicals)  కనుగొనుట.

దీనికి విరుగుడేమిటి?: కేన్సర్ ఇచ్చే చెడ్డ కణాలను రూపు మాపి శరీరం లోనుండి పంపివేయటం. శస్త్ర చికిత్సద్వారా మందుల ద్వారా  ఆపని చేయవచ్చు. ఇది కొంచెం కష్టమైన పని ఎందుకంటే కేన్సర్ కణాలని రూపుమాపే శక్తులు కేన్సర్రావటానికి దోహదం చేస్తయ్యి కూడా. ఉదా: రే డి యే షన్ రెండు పనులూ చేస్తుంది.

1. శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immune Response) పెంచటం. తెలిసిన కేన్సర్  ఇచ్చే పదార్ధాలను తినటం మానటం.

2. Free radicals చేసే హానిని తగ్గించటానికి anti-oxidants వాడటం.

వ్యాధి రాకుండా చెయ్యగలమా?: చెయ్యొచ్చు. జీవితంలో ఆహార విహారాదులాలో నియమాలు పాటించాలి.

చేయరానివి:  పొగత్రాగుట, మధ్యము సేవించుట, స్థూలకాయం (మీ BMI తో గమనించండి), ఫిజికల్ యాక్టివిటీ లేకపోవుట.

తిన కూడనివి:  processed meats, salty foods, sugary drinks, huge helpings of red meat .

చేయవలసినవి:    పిండి పదార్ధము  (starch) తక్కువగా ఉన్న పండ్లు కాయ గూరలు ఎక్కువగా తినుట.

A comprehensive review of thousands of studies on diet, physical activity, and weight conducted for the World Cancer Research Fund and the American Institute for Cancer Research pointed to the benefits of eating mostly foods of plant origin. Foods such as broccoli, berries, and garlic showed some of the strongest links to cancer prevention.

మాతృక:
WebMD
http://www.webmd.com/cancer/features/seven-easy-to-find-foods-that-may-help-fight-cancer

8 comments:

  1. మీరు అద్భుతం సార్. చాలా మంచి విషయాలు రాస్తున్నారు.
    మొన్నే నా ఫ్రెండ్ కి, కలోన్ రిలేటెడ్ కాన్సర్ అని నిర్థారిస్తే, ఆ షాక్ నుంచి తేరుకోవటానికి నాకు వారం పట్టింది.
    గత ఆరు నెలల్లో నాకు తెలిసిన ముగ్గురు తెలుగు వాళ్ళు, కాన్సర్ బారిన పడ్డారు.
    ఒకరు డెలావేర్ అబ్బాయి, వయసు ముప్పై అయిదు - చనిపోయాడు. ఆ అబ్బాయి వైఫ్ మొక్కవోని ధైర్యానికి, నాకు తల వంచటమే కాదు, కాళ్ళు మొక్కాలనిపిస్తూంటూంది.
    ఇంకొకరు: వర్జీనియా, వయసు: నలబై, స్టిల్ ఫైటింగ్ విత్ ఇట్, బట్ not out of danger yet.
    మరొకరు: నాకు పదేళ్ళుగా దగ్గరి దోస్త్,కొలీగ్, ఇంటి దగ్గర్లోనే ఉండే స్నేహితుడు. ప్రస్తుతానికి కాన్సర్ ఉన్న ట్యూమర్ సర్జరీ ద్వారా తీసేసారు, కెమో లోంచి వెళ్తున్నాడు, డేంజర్ జోన్ లోంచి వెళ్ళిపోయినట్లే అని మేమనుకుంటున్నాం .

    ReplyDelete
  2. మీరు అద్భుతం సార్. చాలా మంచి విషయాలు రాస్తున్నారు.

    ReplyDelete
  3. by e-mail from Prasad
    Dear L.S.R., Your latest blog about cancer is timely. We have some choices in what we eat.

    ReplyDelete
  4. @Prasad thanks for the comment.

    @krishna mohan గారూ పాఠకులకు ఉపయోగపడే విధంగా వ్రాయ గలిగితే నా శ్రమ ఫలించినట్లే. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. @KumarN గారూ విచారకరమైన వార్తలు చెప్పారు. బిలియన్లు ఖర్చుపెట్టి సంవత్సరాల తరబడి పరిశోధనలు చేసినా కేన్సర్ ని అంతమొందించలేక పోయారు. మీ స్నేహితులకి తగిన మనోధైర్యం ఇవ్వండి. కేన్సర్ మీద నా తరువాతి పోస్ట్ చూడండి. మనము ఏమి చెయ్యగలమో వ్రాస్తున్నాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  6. మంచి విషయాలు తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు.

    అసలు కారణం లేకుండా కూడా కాన్సరు రావచ్చు. మీరు చెప్పినట్లు మనకు తెలియని ఫ్రీ రాడికల్సు, కార్చినోజెన్సు కారణం కావచ్చు.

    ఎలాంటి బాధా..ముందస్తు సూచనలు... ఏ కాన్సరు లక్షణాలు లేకుండానే కాన్సరు చివరి దశలోకి వెళ్ళిన వాళ్ళని చూసాను. ముఖ్యంగా అన్నవాహిక..పాంక్రియాస్ ..ఇలాంటి వాటిల్లో వచ్చిన కాన్సరుని ముందుగా గుర్తించటం కొంచం కష్టం అనుకుంటాను.

    ReplyDelete
  7. @సిరిసిరిమువ్వ గారూ నేను అనుకోవటం కేన్సర్ అంకురార్పణ కు లక్షణాలు బయటకి కనపడటానికి కొంత టైము ఉంటుందని. కారణం మన శరీరం తన శక్తి కోల్పోయే దాకా శత్రువుతో పోరాడుతూనే ఉంటుంది. వీగిపోయినప్పుడే లక్షణాలు కనపడి సహాయం కోరేది. నేను కూడా సరియిన సమాచారం కోసం వెతుకుతున్నాను. దొరకంగానే పోస్ట్ చేస్తాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. నమస్కారములు రావు గారూ !
    కేన్సర్ వ్యాధి గురించి చక్కగా వివరించారు. తీసుకొ వలసిన జాగ్రత్తలు ,తిన వలసిన పదార్ధాలు వివరంగా తెలియ జెప్పారు. ఒక్క వైద్య పరంగానే గాక ఎన్నో మరేన్నెన్నో సుఖ జీవనానికి ఉపయుక్త మైన విషయాలను మాకందిస్తున్నందులకు ధన్య వాదములు. మీ రచనలు తప్పక చదివి తీర వలసినవి . మరొక సారి ధన్య వాదములు

    ReplyDelete