Saturday, November 16, 2024

210 ఓ బుల్లి కధ --- చారులతా మణి సింహేంద్రమధ్యమం

కర్నాటిక్  సంగీతంలో "సింహేంద్రమధ్యమం" ఒక రాగం . నాకెందుకో బాగా నచ్చిన రాగం . సంగీతంలో నచ్చటమంటే అదివింటూ తన్మయత్వం చెందుతూ భౌతిక బాధలు కొంతసేపు మర్చిపోవటం . ఇది చాలా చిన్న విషయంగా కనపడవచ్చు కానీ , పరుగులుతీసే మనస్సుని తాత్కాలికంగా ఆపగలగటం చిన్న విషయం కాదు . 

నాకు చిన్నప్పుడు ఒక విథంగా చెప్పాలంటే సంగీత జ్ఞానం అంటూ ఏమీ లేదు .  ఎదో పల్లెటూరిలో పెరిగాము కాబట్టి అమ్మతో పేరంటాలకు వెళ్ళటం దానిలో వారు పాడే పాటలు వినటం శనగల వాయనాలు తెచ్చుకుని ఇంట్లో గుగ్గెళ్ళు చేసుకుని తినటం తప్ప సంగీతానికి పెద్ద గుర్తింపు లేదు .  కాకపోతే సినిమా పాటలు పాడుకుంటూ గంతులు వేసే వాళ్ళం .  ఆ పాటలు ఆవిధంగా కూర్చటానికి పాడుకునేటట్టు చెయ్యటానికి వెనుక చాలా పెద్ద సైన్సు ఉన్నదని  తెలియదు .  

నేను హైస్కూల్ లో చదివేటప్పుడు మా ఇంటికి శ్రీనివాసన్ గారు వచ్చారు . ఆయన అప్పట్లో AIR విజయవాడలో పొద్దున పూట  వచ్చే భజగోవిందం ప్రోగ్రాంలో పాడేవారు .  ఆయన ఆ రాత్రి ఎవరింట్లో పెళ్ళిలో పాట  కచ్చేరీ  ఇస్తున్నారు . ఇంటి అతిధి కదా ఆయనతోటి మా నాన్నగారూ నేనూ కచ్చేరీ కి  వెళ్ళాము .  మూడు గంటలు ఓపికగా కూర్చుని పాట కచ్చేరీ విన్నాను . అప్పుడు అనుకోలేదు కానీ అది నా జీవితాన్ని మార్చేసింది .  సంగీతమంటేనూ సంగీతంపాడే వాళ్ళంటేనూ  ఇష్టం ఏర్పడింది . 

 "స"  "రి" "గ" "మ" "ప" "ద" "ని" , అనే ఏడు అక్షరాలు వివిధ  permutation combinations లతో హ్రస్వాలూ దీర్ఘాలతో  వివిధ మేళకర్త రాగాలు గుర్తించి చెవుల కింపుగా మలచిన  మహాను భావులకు  చెయ్యెత్తి  నమస్కరించాలి .  వాటిల్లో  ఒక రాగం "సింహేంద్రమధ్యమం ". నాకెందుకో బాగా నచ్చింది . 

సంగీతంలో లోతుపాతులు తెలుసుకోవాలంటే ఒక జీవితం చాలదు . అదే జీవిత ధ్యేయంగా మలుచుకుని శ్రమించి సాధించిన వాళ్ళంటే నా కెందుకో చాలా ఇష్టం . వారిలో ఒకరు చారులతా మణి . "సింహేంద్రమధ్యమం " మీద వారు తయారు చేసిన వీడియోలు యూట్యూబ్ నుండి తీసి మీతో  పంచుకుంటున్నాను .  అవి తమిళం లో ఉన్నప్పటికీ సంగీత ఆస్వాదనకి అడ్డురావు . 



చారులత "సింహేంద్రమధ్యమం "


"సింహేంద్రమధ్యమం " సినిమా పాటలు



2 comments: