కర్నాటిక్ సంగీతంలో "సింహేంద్రమధ్యమం" ఒక రాగం . నాకెందుకో బాగా నచ్చిన రాగం . సంగీతంలో నచ్చటమంటే అదివింటూ తన్మయత్వం చెందుతూ భౌతిక బాధలు కొంతసేపు మర్చిపోవటం . ఇది చాలా చిన్న విషయంగా కనపడవచ్చు కానీ , పరుగులుతీసే మనస్సుని తాత్కాలికంగా ఆపగలగటం చిన్న విషయం కాదు .
నాకు చిన్నప్పుడు ఒక విథంగా చెప్పాలంటే సంగీత జ్ఞానం అంటూ ఏమీ లేదు . ఎదో పల్లెటూరిలో పెరిగాము కాబట్టి అమ్మతో పేరంటాలకు వెళ్ళటం దానిలో వారు పాడే పాటలు వినటం శనగల వాయనాలు తెచ్చుకుని ఇంట్లో గుగ్గెళ్ళు చేసుకుని తినటం తప్ప సంగీతానికి పెద్ద గుర్తింపు లేదు . కాకపోతే సినిమా పాటలు పాడుకుంటూ గంతులు వేసే వాళ్ళం . ఆ పాటలు ఆవిధంగా కూర్చటానికి పాడుకునేటట్టు చెయ్యటానికి వెనుక చాలా పెద్ద సైన్సు ఉన్నదని తెలియదు .
నేను హైస్కూల్ లో చదివేటప్పుడు మా ఇంటికి శ్రీనివాసన్ గారు వచ్చారు . ఆయన అప్పట్లో AIR విజయవాడలో పొద్దున పూట వచ్చే భజగోవిందం ప్రోగ్రాంలో పాడేవారు . ఆయన ఆ రాత్రి ఎవరింట్లో నో పెళ్ళిలో పాట కచ్చేరీ ఇస్తున్నారు . ఇంటి అతిధి కదా ఆయనతోటి మా నాన్నగారూ నేనూ కచ్చేరీ కి వెళ్ళాము . మూడు గంటలు ఓపికగా కూర్చుని పాట కచ్చేరీ విన్నాను . అప్పుడు అనుకోలేదు కానీ అది నా జీవితాన్ని మార్చేసింది . సంగీతమంటేనూ సంగీతంపాడే వాళ్ళంటేనూ ఇష్టం ఏర్పడింది .
"స" "రి" "గ" "మ" "ప" "ద" "ని" , అనే ఏడు అక్షరాలు వివిధ permutation combinations లతో హ్రస్వాలూ దీర్ఘాలతో వివిధ మేళకర్త రాగాలు గుర్తించి చెవుల కింపుగా మలచిన మహాను భావులకు చెయ్యెత్తి నమస్కరించాలి . వాటిల్లో ఒక రాగం "సింహేంద్రమధ్యమం ". నాకెందుకో బాగా నచ్చింది .
సంగీతంలో లోతుపాతులు తెలుసుకోవాలంటే ఒక జీవితం చాలదు . అదే జీవిత ధ్యేయంగా మలుచుకుని శ్రమించి సాధించిన వాళ్ళంటే నా కెందుకో చాలా ఇష్టం . వారిలో ఒకరు చారులతా మణి . "సింహేంద్రమధ్యమం " మీద వారు తయారు చేసిన వీడియోలు యూట్యూబ్ నుండి తీసి మీతో పంచుకుంటున్నాను . అవి తమిళం లో ఉన్నప్పటికీ సంగీత ఆస్వాదనకి అడ్డురావు .
చారులత "సింహేంద్రమధ్యమం "
"సింహేంద్రమధ్యమం " సినిమా పాటలు
👏👏👏
ReplyDeleteUser .123: థాంక్స్
ReplyDeleteలక్కరాజు గారికి, నమస్కారం.
ReplyDeleteఈ రాగం విశిష్ఠత గురించి మంచి వివరాలు తెలియచేసారు. రాగం అత్యద్భుతంగా వుంది. ఈ రాగంలో ప్రతి పదం, ప్రతి అక్షరం స్పష్టంగా వినిపిస్తున్నది. రాహంలోని భావం హృదయాన్ని తట్టుతున్నది. అందుకని ఈ రాగానికి నేను " హృదేంద్రియమధ్యమ" రాగం అని పేరు పెట్టాలనుకుంటున్నాను.
మీ స్నేహశీలి
పబ్బరాజు మాధవరావు.
స రి గ మ ల తోటి అంత మాధుర్యాలు సృష్టించ వచ్చని ఎలా కనుగొన్నారో మన పూర్వికులు . ఆశ్చర్యంగా ఉంటుంది . మనసుకు ఆహ్లాదం కలిగించే ఈ రాగానికి మీరు పెట్టిన పేరు చాలా బాగుంది . థాంక్స్ మాధవరావు గారూ .
ReplyDelete