Monday, July 29, 2013

94 ఓ బుల్లి కథ 82 --- మన మనసులో ఆలోచనలు ఎల్లా వస్తాయి ?

మనం మెలుకువగా ఉండి కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడల్లా ఎదురుకుండా ఏవో కనపడుతూనే ఉంటాయి. కొన్నికనపడిన వెంటనే అవి మనలో ఆలోచనలు రేకిస్తాయి. కొన్నిటిని చూస్తూఉంటే అసలు ఆలోచనలు రావు. కొన్నిఆలోచనలను మనం ఆస్వాదిస్తాం ఆనందిస్తాం. కొన్నిటిని భయంతో ఉద్రేకిస్తాం కంపిస్తాం.

మనుషులని చూస్తుంటే వచ్చే ఆలోచనలలో కొన్నిటికి సంతోషంగా చలిస్తాం, అసూయతో తిట్టుకుంటాం, ద్వేషంతో కొట్టుకుంటాం, కొన్నిట్లో చలించకుండా వెళ్ళిపోతాం.

అసలు మనుషులని చూస్తుంటే వచ్చే ఆలోచనలు నాలుగు రకాలుగా ఉంటాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
1. వాళ్ళు మన మిత్రులు. కలిసి మాట్లాడ వచ్చు (friend)  2. వాళ్ళు మన శత్రువులు. చూడంగానే ఆమడ దూరం వెళ్ళిపోతాం (enemy ) 3. వాళ్ళు మనకి సంబంధము లేదు. (indifferent) 4. వాళ్ళు మన జీవిత భాగస్వామిగా  పనికొస్తారు. sexual  partner potential to pass on genes.

ఉదాహరణకి మనం స్టేషన్ లో ఉన్నాము. ఎదురుకుండా మనుషులు వస్తున్నారు పోతున్నారు. వాళ్ళను చూస్తుంటే మన ఆలోచనలు :

1. హఠాత్తుగా చిరకాల స్నేహితుడు సుబ్బారావు కనపడ్డాడు. సంతోషం పట్టలేము. ఒరేయ్ సుబ్బారావ్ ఎన్నాళ్ళ యిందిరా చూసి. అందరూ కులాసా యేనా. ఎక్కడికి పోతున్నా? అంటాము.  అది మిత్రుడుగా కనపడే అప్పారావ్ కూడా  అవ్వచ్చు.

2. ఎదురుకుండా మనకి చాలా రోజుల క్రింద అప్పిచ్చిన వాడు వస్తున్నాడు. డబ్బు తిరిగివ్వటం పడలేదు. తప్పించుకోవాలని చూస్తాము.ఇది కూడా మనకి శత్రువుగా కనపడే వెంకట్రావ్ అవ్వచ్చు.

3. ఎదురుకుండా ఎంతమందో వస్తున్నారు పోతున్నారు. మనకేమీ పట్టదు. వాళ్ళ గురించి ఆలోచించ వలసిన పనే లేదు.

4. కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి వెళ్తోంది. ఆహా ఆ అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అల్లాగే అమ్మాయిలకి ఆ అందాల రాజు నా భర్త అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది.

ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అని తెలుసుకోటానికి వేల వేల సంవత్సరాల క్రిందటి పరిస్థుతులు ఎలా ఉండేవో ఊహించాలి. అప్పుడే సృష్టిలో మానవజన్మ ఉద్భవించింది. ప్రకృతిలో సృష్టించబడిన ప్రతి దానికీ జీవించటం ముఖ్యం. ఆ పరిస్థితులలో మానవునికి బ్రతకటం, జాతిని అభివృద్ది చేసుకోవటం ముఖ్యం. మహా అయితే 2000 మంది ఉన్నారేమో అప్పుడు. చుట్టూతా చెట్లు జంతువులు. కొన్ని జంతువులని పట్టించుకోనవసరము లెదు. కానీ వాటిల్లో క్రూర మృగాలని పట్టించుకోవాలి. బతికి బట్ట కట్టాలంటే వాటిని చంపాలి. లేకపోతే వాటికి ఆహారంగా అవ్వాలి. మన సంపాదనని ( ఆహారాన్ని) ఇంకొకళ్ళు ఎత్తుకు పోవాలని చూస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టాలి. అప్పుడే ప్రకృతిలో ఈ శత్రువు, మిత్రుడు అనే వర్గాలు ఏర్పడ్డాయి. దానికి తోడు తన జాతిని పెంపొందించు కోవాలనే జిజ్ఞాసతో ఉండటం మూలాన తగిన వారిని ఎన్నుకోవాలనే ఆశ కూడా ఉద్భవించింది. అప్పుడే మనం ఎన్నుకున్న వారిని ఇంకొకళ్ళు సంగ్రహిస్తారనే భయం కూడా వచ్చింది. ఈ ఆలోచనలు అన్నీ ఆనాటినుండీ మనలో పేరుకుపొయాయి. వాటినుండి బయట పడలేము. ఇవే మనకున్న primitive brain, ఆదిమ ఆలొచనలు. జంతువులు కూడా ఇలాగే ఆలోచిస్తా యేమో !

ప్రకృతిలో మన మెదడు రూపకల్పన ఉదాహరణకి చేపతో (fish ) తో అంకురార్పణ జరిగిందనుకుంటే,  క్రమంగా అది నూతన జంతువుల సృష్టితో మెరుగులు దిద్దుకుంటూ, జన్యుపరంగా కలుపుకుంటూ, అభివృద్ది చెందుతూ, కొన్ని వేల వేల సంవత్సరాలకి మానవ మెదడుగా రూపొందిందని అంటారు. ఇప్పటికీ జన్యుపరంగా తల్లి తండ్రులనుండి సమాచారం సేకరిస్తూ అభివృద్ది చెందుతూనే ఉంది. అందుకనే ఈ సృష్టిలో ఎప్పుడో మానవుల తర్వాత వాళ్ళు, ఇంకొక జాతి రావచ్చు.

మన మెదడు లో ముఖ్యంగా మూడు భాగాలు (పొరలు leyers ) ఉన్నాయి.

మొదటి భాగంలో జీవించటానికి కావలసిన ముఖ్యమయిన వన్నీ ఉన్నాయి. దీని పని శరీరానికి జీవత్వం ఉండేటట్లు చూడటం. గుండె సరీగ్గా పనిచేస్తోందా, మన దేహంలో అన్ని అవయవాలూ సరి అయిన ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నయ్యా, మనల్ని చంపటానికి ఎవరన్నా వస్తున్నారా,  మనల్ని పొగిడి సంతోష పెట్టటానికి ఎవరన్నా వస్తున్నారా, మనజాతిని అభివృద్ది చేసుకోవటానికి లైంగిక ఏర్పాటు ఎక్కడ దొరుకుతుంది, ఇటువంటివన్నీ మెదడులో మొదటి పొర ఆలోచించేవే . ఇంతెందుకు మనము జీవించటానికి పరిస్థుతులు సరీగ్గా వున్నయ్యో లేదో చూసేది ఇదే. దీనికి ఆలోచనా శక్తి లెదు అందుకని ఇది పనిచెయ్యటానికి తీసుకునే శక్తి చాలా తక్కువ (2%). మన జీవిత సంరక్షణను ప్రతి క్షణమూ చూసే కవచం కూడా ఇదే. ఉదా : చెయ్యి వేడి స్టవ్ మీద పెట్టటం జరిగింది. వెంటనే చేతిని అక్కడనుండి తీసేయించాలి. ఆ ఆజ్ఞ వచ్చేది ఇక్కడినుండే. మొదటి పొర ని  primitive brain అని ( reptilian brain అని కూడా) అంటారు. జంతువులకు మనకూ ఉమ్మడిగా (common) ఉండే మెదడులో భాగం ఇదే. మన ఆలోచనలన్నీ ఇక్కడే ప్రారంభ మౌతాయి. '(It is made up of the brain stem, which sits right at the top of the spinal column, along with some other simple units involved only in instinctive responses and reflexes, some of which are almost half a billion years old.)'

తర్వాత భాగాన్ని limbic system అంటారు. దాదాపు పాలు త్రాగే ప్రాణుల (mammals ) కన్నిటికీ ఇది ఉంటుంది. మన ఉద్రేకాలు ఉద్వేగాలు ఇష్టా ఇష్టాలు నిర్ణయించ బడేది ఇక్కడే. మనకు స్నేహితులుగా ఎవరు ఉండాలి వారితో ఆనందంగా ఎలా గడపాలో నిర్ణయించే దిక్కడే. '(It is made up of the structures of the limbic cortex and some other pieces that together are involved in regulating emotions and memory and telling us who and who not to connect with, care for, and empathize with.)'

మెదడులో చివరి భాగం neocortex మానవుల కోసం ప్రత్యేకంగా  సృష్టించటం జరిగింది. దాదాపు 200,000 సంవత్సరాల వయస్సుంటుందని నిర్ధారించారు. తనలో దాచుకున్న పరిజ్ఞానంతో సమస్యలను పరిష్కరించే సమర్ధత దీనికుంది. కొత్త భాషలు నేర్చుకోవటం వాడటం దీని సొంతం. మనిషి స్మృతిలో ఉన్నాడంటే ఇదే కారణం. mammals కొన్నిటికి ఈ పొర ఉన్నప్పటికీ దానికి మనకున్నంత నూతనత్వం లేదు. '(It is the baby of the bunch nearly 2000,000 years old. It is conscious of itself, and able to plan for the future and learn and use language.)'

ఈ మూడు భాగాలూ పరిస్థుతులని బట్టి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ మూడింటినీ కలిపి మనము మెదడు అంటాము. మన మెదడు శరీర బరువులో 2% ఉన్నప్పటికీ, శరీరంలో తయ్యారు అయ్యే శక్తిలో ముందర 20% తను పని చెయ్యటానికి వాడుకుంటుంది.

మనకి మొట్టమొదట కలిగే స్పందనలన్నీ మొదటి భాగాన్నించే, primitive brain, వస్థాయి. మనం పరిస్థుతుల వత్తిడితో (stress తో ) చేసే నిర్ణయాలు కూడా ఇక్కడ నుండే వస్తాయి. కారణం ఇది తక్కువ శక్తిని (2%) తీసుకుని త్వరగా స్పందిస్తుంది కనుక. మొదట జీవించటం ముఖ్యం. దానికి కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత జాతిని అభివృద్ది చేసుకోవటం. దానికి కావలసిన కామ వాంఛలు పురిగొల్పేది కూడా ఇక్కడే. ఈ రెండిటికీ అవరోధాలు ఏర్పడితే వాటిని సందర్భానుసారంగా మసలమని చెప్పే ఆజ్ఞలు కూడా ఇక్కడినుండే వస్తాయి  (fight or flight). ఈ primitive brain స్పందనలని మనస్సులోని మిగతా రెండు పొరల పరిజ్ఞానంతో సమ్మిళితం చేస్తే, మన ఆలోచనలను మార్చుకునే పరిస్థితి రావచ్చు.

కోప తాపాలకు కారణ మయ్యే అర్దంలేని వాదప్రతివాదాలు, మాటకి మాట చెప్పే ప్రతి స్పందనలూ, వత్తిడితో (stress ) తీసుకునే నిర్ణయాలూ,  primitive brain నుండి వచ్చేవే. అందుకనే పెద్దలు, మాట పట్టింపులూ, కోపతాపాలు వచ్చినప్పుడు మాటకి మాట విసరకుండా కొద్ది సేపు జాప్యం చెయ్యమన్నారు. కారణం ఈ కొద్ది సమయంలో వివేకముతో ఆలోచించగల మెదడులోని మిగతా రెండు భాగముల సలహాలు తీసుకోవచ్చని. మొదట వచ్చే మన స్పందనలు, మన ఆలోచించలేని primitive brain నుండి వచ్చే స్పందనలని గ్రహించి, ఆలోచించి సమాధానం చెప్పగల మెదడు లోని మిగతా రెండు భాగాలతో సంప్రదిస్తే చాలా సంసారాలు చక్కబడతాయి.

నా మాట: మనలో  మానవ జాత్యహంకారములు, నైజమూ వేల వేల సంవత్సరాల బట్టీ వస్తున్నాయి. నేను, నాది, నావారు, నా రక్షణ. అది లేక పోతే మానవ జాతి ఈ భూమి మీద మిగిలేది కాదు. ఇది ఇంకా వేల వేల సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. కానీ మధ్యలో మనలో మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లు (కులాలు వగైరా ) మాత్రం మార్చు కోగలం. కాకపోతే పాత ఆలోచనలను పూర్తిగా తిరగ వ్రాసిన తరం జన్మించటానికి  200 సంవత్సరాలు దాకా పట్టవచ్చు (రెండు తరాలు ).


                      *********************************


ఈ పోస్టు వ్రాయటానికి ఈ క్రింది పుస్తకము మూలము. ఆ పుస్తకమునకు మూలము దాదాపు 100 శాస్త్రజ్ఞుల ప్రచురణలు. ఈ పుస్తకము, రోజూ వారీ ఆఫీసు వాతావరణములో, ఈ primitive brain నుండి వచ్చే స్పందనలకు, యుక్తిగా ప్రతి స్పందనలు చేసి సక్రమంగా ఆఫీసు నడపటానికి మార్గాలేమిటో చెబుతుంది. ఆచర్ణాత్మక సలహాలతో నిండి ఉంది. మంచి పుస్తకం. వీలయితే చదవండి.

Tame The Primitive Brain (2012)
28 ways in 28 days to mange the most impulsive behaviors at work
By Mark Bowden
John Wiley & Sons

Wednesday, May 1, 2013

93 ఓ బుల్లి కథ 81 --- పీకో డి గాయో -- ఓ మెక్సికన్ సల్సా

మీకు వెంటనే మెక్సికన్ తినాలని అనిపిస్తోందా! చాలా తేలిక. అరగంటలో మీ కోరిక నెరవెరుతుంది.

కావలసినవి:

1. ఒక మీడియం టొమాటో
2. ఒక మీడియం ఉల్లిపాయ
3. 1/2 పచ్చి మెరపకాయ
4. 1/2 నిమ్మకాయ
5. ఒక గుప్పెడు కొతిమేర
6. 1/8 టీ స్పూన్ ఉప్పు


టొమాటో ని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చెయ్యండి. మెరపకాయని కొతిమేరని సన్నగా తరగండి(chop చెయ్యండి). ఒక చిన్న గిన్నె (bowl) తీసుకుని తరిగిన ముక్కల నన్నింటినీ వేసి ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండండి. అన్నీ ఒక చెంచా తో గట్టిగా కలపండి. మీ ఇష్టాలని బట్టి ఉప్పు కారం పులుపు సరిచేసుకోండి. వీలయితే ఒక అరగంట రిఫ్రిజిరేటర్ లో ఉంచి తియ్యండి. "పీకో డి గాయో" రెడీ.

మీరు దీనిని, ఆరోగ్యానికి ఇంకా ముస్తాబు చెయ్యాలంటే, ఒక చిటికెడు పసుపు, రెండు చిటికెలు పెప్పర్, మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసి కలపండి.

దీనిని మీరు కార్న్ చిప్స్ తో నంచుకుని తినవచ్చు(Dip లాగా). టాకోస్ లో వేసుకుని తినవచ్చు. మన పుల్కాలో చుట్టుకుని తినవచ్చు. ఇడ్లీ ఉప్మా పెసరట్, వేటితోనైనా తినవచ్చు. కావాలంటే పచ్చడిలా అన్నంలో కలిపేసుకోవచ్చు.

ఇంకా మీరు దీనికి రెండు మూడు టేబుల్ స్పూన్స్ అవకాడో (Avocado ) గుజ్జుని కలిపి బ్లెండ్ చేస్తే ఇంకో మెక్సికన్ డిష్, గోకమోలి (Guacamole ), తయారు అవుతుంది.

మీకు ఇంకా దీన్ని గురించి తెలుసుకోవాలంటే, Pico De Gallo అని, గూగుల్ చెయ్యండి. 

Thursday, April 4, 2013

92 ఓ బుల్లి కథ 80 --- "సూర్యుని కోసం" తపన

కొలను

 "కొలను" మీద "నీలహంస" బ్లాగ్ లో సత్య గారు ప్రకటించిన గేయ పోటీకి నా ప్రతి స్పందన. 

చూడండి గేయం వ్రాయటం ఎంత తేలికో.  నేనే వ్రాయ కలిగితే, మీరు కూడా వ్రాయ గలరు.


"సూర్యుని కోసం"   
రచన: లక్కరాజు శివరామక్రిష్ణ రావు. 
                      
ఉరుకు పరుగుల తోటి 
   ఉప్పొంగి పోయాను 

సన్న జల్లుల తోటి 
    స్నాన మాడాను 

వర్ష కాలపు నడుమ
    నలిగి పోయాను

శీత కాలము వచ్చె 
     చల్లగా ఉండె   

నీలి మబ్బుల నడుమ 
    నింగిలో నువ్వు 

ఆడుతూ పాడుతూ 
   గంతులిడు తున్నావు 

నా దరికి రావా 
    నన్నేలు కోవా 

కలువ పూవులు పెట్టి 
    పచ్చగా చెండేసి 

తామరాకుల తోటి 
    పైట కప్పాను 

నాకు కవితలు రావు 
    కవనాలు నే చేయ 

నీ అరుణ కిరణాలు
   నా మీద వాలాలి 

వెచ్చనీ నీ స్పర్శ 
   నాకు కావాలి 

అర్పణలు చేస్తాను 
   అన్ని నీ కిస్తాను 

నా కోర్కె తీర్చవా  
  ఆరాధ్య  దైవమా.    


Sunday, March 17, 2013

91 ఓ బుల్లి కథ 79 -- కోలెస్టరాల్ తగ్గించటం ఎలా ?

కోలెస్టరాల్ మన శరీర రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్ధము. ఇది మనకి ఎంత అవసరము అంటే, తిన్న ఆహార జీర్ణ శక్తికి, హార్మోనులు తయారు చెయ్యటానికి, విటమిన్ D తయ్యారు చెయ్యటానికి, మన శరీరము లోని కణ జాలాన్ని సక్రమ పద్ధతిలో ఉంచటానికి, మన మెదడు సరీగ్గా పనిచెయ్యటానికి చాలా అవసరము. ఇంతెందుకు మనం జీవించటానికి ఇది చాలా ముఖ్యము. కోలెస్టరాల్ మన రక్తంలో రెండు రకాలుగా ఉంటుంది, LDL(low-density lipoprotein) and HDL(high-density lipoprotein).

మన శరీరములో ఉన్న కాలేయము (liver), మనకి కావలసిన కోలెస్టరాల్ ని తయారు చేసి ఎంత అవసరమైతే అంత రక్తములోకి పంపిస్తుంది. మనము తినే ఆహారము నుండి కూడా కోలెస్టరాల్ రక్తము లోకి వచ్చి చేరుతుంది.  మనలో ఉన్నకోలెస్టరాల్, 75% కాలేయం నుండి మిగతాది మనము తినే ఆహారము నుండి వస్తుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

LDL కోలెస్టరాల్ కొవ్వు పదార్ధం కాబట్టి రక్తంలో వెళ్తూ వెళ్తూ రక్తనాళాలకి అతుక్కుంటుంది. ఈ అతుక్కోవటం ఎక్కువ అయితే, రక్తము ప్రవహించటానికి అడ్డు తగిలి రక్తపోటు గుండె నొప్పి వగైరా వ్యాధులు రావటానికి అవకాశం ఉంది. దీనికి విరుగుడు HDL కోలెస్టరాల్ ని ప్రకృతి సృష్టించటం జరిగింది . HDL కోలెస్టరాల్, అతుక్కున్న LDL లోని కోలెస్టరాల్ ని పీల్చివేసి మళ్ళా రిసైకిల్ చెయ్యటానికి లివర్ కి తీసుకువెళ్ళి ఇస్తుంది.

అందుకనే LDL కోలెస్టరాల్ ని చెడ్డ (bad ) కోలెస్టరాల్ అని HDL కోలెస్టరాల్ ని మంచి (good ) కోలెస్టరాల్ అని అంటారు.

కోలెస్టరాల్ తక్కువగా ఉంటే మనం సక్రమంగా జీవించటానికి శరీరంలో జరగవలసిన పనులు సరీగ్గా జరుగవు, కేన్సర్ లాంటి వ్యాధులు రావటానికి కూడా కారణమవుతుంది. ఎక్కువగా ఉంటే రక్త ప్రసారం సరీగ్గా జరుగక రక్త పోటూ, గుండె పోటూ  రావచ్చు. అందుకనే మన శరీరం కావలసినంత వరకే కోలెస్టరాల్ ని తయారు చేసి రక్తము లోకి పంపిస్తుంది. కానీ మన వయస్సుని బట్టో లేక మన కృత్రిమ జీవితం వలనో, కావలసిన పాళ్ళలో కోలెస్టరాల్ ని  తయారు చెయ్యటం కుదరక ఎక్కువ తక్కువలు జరుగుతుంటాయి. శరీరంలో ఈ ఎక్కువ తక్కువల్ని సరిచేసే ప్రక్రియలు సరీగ్గా పని చెయ్యక పోవటం మూలంగా వ్యాధులు వస్తాయి.

ఒకవేళ కోలెస్టరాల్ ఎక్కువ అయి తగ్గించవలసిన పరిస్థితి వస్తే, మన శరీరంలో కోలెస్టరాల్ 25% ఆహారం నుండి వస్తుంది కాబట్టి ఆహారం ద్వారా సరిచేయ్యటం సులువయిన పద్ధతి. ఇట్లా కుదరకపోతే మందుల ద్వారా కోలెస్టరాల్ ని కంట్రోల్ చెయ్యవలసి వస్తుంది.ఈ పోస్ట్, మనము తినే ఆహారము ద్వారా కోలెస్టరాల్ ని ఎలా కంట్రోల్ చేయాలో పరిశీలిస్తుంది.

మాంసాహారం తినటం మూలంగా కోలెస్టరాల్ పెరగవచ్చు. చీజ్, యగ్ యోక్స్, బీఫ్, పోర్క్, ఫిష్, ష్రిమ్ప్ లలో కోలెస్టరాల్ ఉంటుంది.

శాఖాహారం లో కోలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. దానికి తోడు, కాయ గూరాలలో (ఉదా: ఫ్లాక్సు సీడ్స్, వేరు సెనగ పప్పులు ) ఉన్న కొన్ని రసాయనిక పదార్ధాలు, మనము తిన్న పదార్ధాలలోని కోలెస్టరాల్ తో పోటీపడి, కోలెస్టరాల్ ని మన శరీరంలోకి వెళ్ళకుండా చూస్తాయి. అందుకని మాంసాహారం తోపాటు శాఖాహారము కూడా తినటం మంచిది.

all foods containing animal fat contain cholesterol to varying extents.[17] Major dietary sources of cholesterol include cheese, egg yolks, beef,pork, poultry, fish, and shrimp.[18] Human breast milk also contains significant quantities of cholesterol.[19]

From a dietary perspective, cholesterol is not found in significant amounts in plant sources.[18][20] In addition, plant products such as flax seeds and peanuts contain cholesterol-like compounds called phytosterols, which are believed to compete with cholesterol for absorption in the intestines.

ఈ క్రింది పదార్ధాలు కోలెస్టరాల్ ను తగ్గిస్తాయని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. వీటిని AARP వారు ఒక స్లయిడ్ షో గా ఉంచారు. రెండవ మాతృకలో దానిని చూడవచ్చు. AARP is a nonprofit, nonpartisan membership organization for american people age 50 and over.

1. Avocados. వీటిల్లో Oleic acid ఉండటం మూలంగా LDL ని తగ్గించి HDL ని పెంచుతుంది. 

2. Lentils. వీటిలో ఉన్న ఫైబర్ కోలెస్టరాల్ ని చుట్టుముట్టి బయటికి పంపిస్తుంది.

3. Edamame. ఈ లేత సోయా బీన్స్ లో ఉన్న isoflavons కోలెస్టరాల్ ని తగ్గిస్తాయి.  

4. Nuts. వీటిలో ఉన్న Plant Sterols , కోలెస్టరాల్ శరీరంలోకి పోవటాన్ని తగ్గిస్తాయి. Walnut Almond Cashew

5. Olive Oil. దీనిలో ఉన్న unsaturated fats LDL ని తగ్గిస్తాయి. 

6. Pears. దీనిలో ఉన్న pectin ఫైబర్ LDL ను తగ్గిస్తుంది. 

7. Tea. టీ లోని (Black మరియు Green) Catechins కోలెస్టరాల్ ని తగ్గిస్తాయి అని అనుకుంటున్నారు.

8. Tomatoes. వీటిలోని Licopene, LDL కోలెస్టరాల్ ని తగ్గిస్తుంది.

9. Oranges. వీటిలోని పెక్టిన్, Like other types of soluble fiber, pectin forms a gooey mass in your stomach that traps cholesterol and carries it out of your body before it can be absorbed into your bloodstream (where it contributes to clogged arteries).

10. Oats లో ఉండే పీచు పదార్ధము (soluble and insoluble fiber ) కోలెస్టరాల్ని తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

వీలయినంత వరకూ పైన చెప్పిన వాటిని మీ ఆహారంలో వాడటానికి ప్రయత్నించండి. ముందు జాగ్రత్త మంచిది కదా.


మాతృకలు:
1. http://en.wikipedia.org/wiki/Cholesterol

2. http://www.aarp.org/health/healthy-living/info-09-2012/foods-that-help-lower-cholesterol-slideshow.html?cmp=NLC-WBLTR-NMPCTRL-030813-TS1&USEG_ID=#slide1

3. http://www.everydayhealth.com/high-cholesterol/cholesterol-lowering-foods.aspx?xid=nl_EverydayHealthHealthyLiving_20130329

4.  6 foods that lower Cholesterol

Monday, February 25, 2013

90 ఓ బుల్లి కథ 78 --- అమెరికాలో మా వీధి

నిన్న ఆదివారం మద్యాహ్నం  ఎండ బ్రహ్మాండంగా ఉంది. బయట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది.  అమెరికాలో ఇది మిడ్ వింటర్.  ఉష్ణోగ్రత 33F అవటం తోటి చూసి ఆనందించటమే ( నీళ్ళు 32F దగ్గర ఐస్ గ మారుతాయి). మా ఆవిడ వింటర్ కోటు బూటు టోపీ మఫ్లర్ వేసుకుని ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. కొంచెం ఫోటోలు తియ్యమని బతిమాలితే ఫోటోలు తీసింది. వాటి ద్వారా నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.

మేము చికాగోకి ముఫై మైళ్ళ దూరంలో ఉంటాము. మా వీధి  cul-de-sac. జన సంచారం ఎక్కువగా ఉండదు. అందులో ఆదివారం మధ్యాహ్నం ఫ్రీజింగ్ ఉష్ణోగ్రత.  అప్పుడు అసలే ఉండరు. మధ్య ఫొటో మాయిల్లు (గరాజ్ మాత్రమే కనపడుతుంది). ఇంటికి రెండు పక్కలా ఫొటోలు పెట్టాను. పొటోలో మొన్నటి స్నోస్టాం లో పడ్డ స్నో తెల్లగా కనపడుతుంది. చెట్లు ఆకులు లేకుండా మోళ్ళుగ కనపడుతాయి. మళ్ళా అవన్నీ మే నెల వచ్చేసరికి ఆకులతో కళ కళ లాడుతూ ఉంటాయి, అప్పుడు నేల మీద పచ్చ గడ్డి కూడా కనపడుతుంది. ప్రతీ ఇంటి ముందరా ఒక పోస్ట్ బాక్సు ఉంటుంది. అది ఎంత ఎత్తు ఉండాలో ఎలా ఉండాలో ఎక్కడ పెట్టాలో వాటికి రెగ్యులెషన్లు ఉంటాయి. పోస్ట్ మాన్ ప్రతీ రోజూ కారులో వచ్చి కారు దిగకుండా పోస్ట్, బాక్సు లో వేసి వెళ్ళిపోతాడు. మా వీధిలో ఉన్న 17 ఇళ్ళలో నాలుగు ఇళ్ళల్లో వాళ్ళం మాత్రం, ఇల్లు కట్టించుకున్న దగ్గర నుండీ ఉంటున్నాము (25 ఏళ్లు). సామాన్యంగా అమెరికాలో ఏడు ఏళ్ళ కొకసారి ఇల్లు మారుస్తారు.

రేపు మళ్ళా స్నో వార్నింగ్. స్నో పడుతూ ఉంటే మా వీధి చూడటానికి ఇల్లా ఉండదు. అంతా తెల్లగా స్నో మయం తో ఉంటుంది. స్నో తీసే వాళ్ళతోటి హడావిడిగా ఉంటుంది. ఏదో నాకు నచ్చినవి మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం.








మళ్ళా ఈ వారం స్నో తుఫాను వచ్చింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండీ రాత్రి 12 గంటల దాకా మూగ వాన లాగా మూగ స్నో పడుతూనే ఉంది. ఎవరో ఆకాశం లో కూర్చుని ముగ్గు చల్లుతున్నట్లు ఉంటుంది. రోడ్లు సరీగ్గా కనపడవు. కొద్దిగా కనపడినా డ్రైవ్ చెయ్యటం చాలా కష్టం. ఇసకలో డ్రైవ్ చేస్తున్నట్లు ఉంటుంది. ముందరే తెలుసు కాబట్టి స్కూళ్ళు ఆఫీసులు త్వరగా మూసేసి అందర్నీ ఇంటికి పంపించేశారు. రాత్రికి రాత్రే రోడ్ల మీద స్నో తీసేసి మర్నాడు ఆఫీసులకు వెళ్ళేటట్లు సరిచెసారు. రోడ్ అంచులలో స్నో కుప్పలు తయారు అవుతాయి. రోజూ  స్నో పడితే అవే కొంత కాలానికి స్నో కొండలుగా తయారు అవుతాయి. కొన్ని వింటర్ల లో నెలల తరబడి వాటిని చూడవలసి వస్తుంది. మళ్ళా మా ఆవిడ చేత ఫొటోలు తీయించాను.  వాటిని కింద చూడచ్చు.

ప్రపంచ వాతావరణ పరిస్థుతులు అందరికీ తెలుసు గానీ వాటిని మదించి ముందర ఏమి జరగబోతోంది చెప్పటం, కంప్యుటర్ మోడల్లింగ్, ఒక కళ. మొన్న వాషింగ్టన్ లో స్నో పడుతుందని అందరికీ శలవ ఇస్తే, పడలేదు. కానీ యూరప్ కంప్యుటర్ మోడల్స్ వాషింగ్టన్ లో పడదని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు అమెరికా మోడల్స్ సరీగ్గా చెప్పలేక పోతున్నాయనే దానిమీద చర్చ జరుగుతోంది. నేను చదువుకునే టప్పుడు (50 ఏళ్ళ క్రిందట) ఆంధ్రా యూనివర్సిటీ లో సాయంత్రం వాతావరణ బెల్లూన్ పంపించేవారు. అది పంపిన సమాచారం బట్టి వాతావరణం గురించి రేడియోలో చెప్పేవారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.      










Monday, January 28, 2013

89 ఓ బుల్లి కథ 77 --- ఆరోగ్యానికి మార్గం మెరపకాయ కారం.


మనం తినే ఆహారంలో కారం తినటం మంచిదని ఎవరు గుర్తించారో తెలియదు కానీ అది చాలా మంచిదని ఇప్పుడు తెలుసుకున్నారు. మనల్ని కారం తినమని ప్రోత్సహించిన మన పూర్వికులకి కారం ఇంత మంచిదని ఎల్లా తెలిసింది? American Cuisine లోకి కూడా ఇది పాకుతోంది.  తరతరాల నుండీ మనం తింటున్న మెరపకాయల కారం ఎంత మంచిదో నా కొచ్చిన క్రింది ఈ ఇ-మెయిలు లో చూడండి:

మనం తినే కారంలో "Capsaicin" అనే పదార్ధం ఉండటం మూలంగా అనారోగ్యపరంగా వచ్చే అస్వస్థలను తగ్గించి ఆరోగ్యవంతమైన జీవితం గడిపేటట్లు చేస్తుంది.

ఇది మన శరీరంలో రక్త ప్రసారమును సరి చేసి arthritic pain ను తగ్గిస్తుంది, Asthma వారికి ఉపశమనం కలిగిస్తుంది, గుండె జబ్బు, cancers, cataracts, Alzheimer's disease రాకుండా అడ్డుకుంటుంది.

కారం గురించి వస్తుగుణ దీపిక నుండి: కారము గల పదార్ధములను మితముగా బుచ్చుకొనిన కంఠ రోగము, శోష, ఉబ్బు, అగ్ని మాంద్యము, నేత్ర రోగము వీనిని హరించును. అమితముగా పుచ్చుకొనిన ముందు చెప్పిన రోగములను కలుగ చేయును. వేడి చేయును, శుక్లమును, బలమును పో గొట్టును. 

మీరు ఇంకా తెలుసుకోవాలంటే "Cayenne Pepper" అని గూగుల్ చెయ్యండి. దీనిని చాలా వాటిల్లో ఉపయోగిస్తున్నారు. కారం తో నూనెలు లోషన్లు తయారు చేసి కీళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి తగ్గుతుందిట.
ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి రాసే లోషన్ తయారు చేసే విధానం: అర టీ స్ప్పూన్ కారంని ఒక కప్పు  లోషన్లో బాగా కలిపి మోకాలు నెప్పి ఉన్న చోట వ్రాయండి. ఉపశమనం కలుగుతుందిట. 


----------------------------------------------------------------------------------
Al Sears, MD
11903 Southern Blvd., Ste. 208
Royal Palm Beach, FL 33411

April 11, 2012

Dear Rao,

Most people think that hot spicy food is bad for your health. Yet in some cases, the exact opposite is true. Cayenne peppers can make your eyes water and your tongue burn, but they also have healing power.

Several widely separated cultures have used cayenne for medicinal purposes for centuries. Now modern scientific research validates much of the folklore. Cayenne peppers can ward off the common cold and flu. They take away arthritic pain and help asthma sufferers. Cayenne pepper can stop itching and both internal and external bleeding. Cayenne peppers can help your body fend off ailments such as heart disease, cancers, cataracts, Alzheimer’s disease and others.

Today I’ll show you how to use the naturally occurring, medicinal properties in cayenne peppers to improve your health.

Cayenne contains a compound called capsaicin. Capsaicin is the ingredient that gives peppers their heat. Generally, the hotter the pepper, the more capsaicin it contains. In addition to adding heat to the pepper, capsaicin acts to reduce platelet stickiness and relieve pain. Research shows cayenne can help to:

Improve Circulation.

Benefit Your Heart.

Clear Congestion.
Boost Immunity.

Prevent Stomach Ulcers.
Drop A Few Extra.

If you like to eat peppers, don’t listen to the “naysayers.” Hot Mexican, Szechwan, Indian, or those smoldering Thai dishes can make excellent choices.

You’ll be amazed at how easy it is to incorporate cayenne into your cuisine. I tend to use cayenne by taste and add it to my food in place of black pepper. It is also quite good in salsa.

I also keep a bottle of cayenne in my house for emergencies. The other day, I was cutting down some bananas and accidentally cut my hand with a machete. I sprinkled some cayenne on the cut, applied pressure and the bleeding stopped immediately.

You can also get cayenne in supplement form. Try to get a capsule of at least 500mg, with at least 40,000 heat units, although some may have up to 100,000 heat units.

To Your Good Health,

http://www.holistic-online.com/Herbal-Med/_Herbs/h43.htm

Tuesday, December 18, 2012

88 ఓ బుల్లి కథ 76 --- మళ్ళా సంవత్సరం ముగుస్తోంది

ఈ సంవత్సరంలో ఎన్నో జరిగాయి. భూకంపాలు, సునామీలు, వరదలూ, యుద్ధాలూ, చంపుకోటాలు, కొట్టుకోటాలూ, కరువులూ, కాటకాలూ. వీటన్నిటిలోనూ అనుకోకుండా బాధల్లో పడి రోదించే వా రెందరో. తుఫానులో ఇళ్ళు కొట్టుకుపోయి, ఉన్న ఆస్తి అంతా నీళ్ళ పాలై బజార్లో పడ్డ వాళ్ళు మన ఎదురుకుండా ఉన్నారు. వారు ఏదో విధంగా వాటిని తట్టుకుని బతికి బయటపడాలి. మనమందరం పుట్టిన తరువాత ఏదోవిధంగా జీవించాలి కదా.

వారి తాత్కాలిక జీవిత కష్టకాలంలో మనమేమన్నా సహాయం చెయ్యగలమా?  ప్రపంచం లో అందరికీ మనం సహాయం చేద్దామన్నా చెయ్యలేము. చేసే స్థోమతా మనకి ఉండదు. కానీ మనందరం కలిసి చేస్తే, నార పోగులు కలిస్తే బలమైన చాంతాడుగ మారినట్లు మన శక్తి బలోపేతం అవుతుంది. అలా మన శక్తులని కలిపి ప్రజల నాదుకునే సంస్థలు, ప్రపంచములో ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోటానికి ముందుకి వచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, సాల్వేషన్ ఆర్మీ, రెడ్ క్రాస్, డాక్టర్స్ వితౌ ట్ బోర్దేర్స్ మొదలయినవి.

అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ డిశెంబరు లు చాలా హడావుడిగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు నెలలూ పండగరోజులు. ఇళ్ళ బయట అలంకరిస్తారు, షాపులన్నీ అలంకరిస్తారు. క్రిస్మస్ పాటలు మార్మోగుతూ ఉంటాయి. అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సంవత్సరంలో చాలా వ్యాపారం ఈ రెండు నెలలలోనే జరుగుతుంది. సంవత్సరానికి కావలసిన వస్తువులూ, దగ్గర వాళ్లకి ఇచ్చే బహుమతులూ, ఈ సమయంలోనే కొనుక్కుంటారు. ముఖ్యంగా అన్నదానాలూ ఆదుకోటాలు ఇప్పుడే జరిగేవి. సహాయ సంస్థలు వచ్చే సంవత్సరంలో జరగబోయే అవాంతరాలని ఆదుకోటానికి  కావలసిన ధన సామర్ధ్యం ఈ కాలంలోనే సంపాదించుకుంటాయి. మీ కిష్ట మైన సంస్థలకి మీకు చేతనయినంత సహాయము చెయ్యండి.

నాకు ఇష్టమయిన సంస్థ Kiva. వాళ్ళ వెబ్సైట్  kiva.org. వీళ్ళు ప్రపంచములో  ఏ దేశం వారికయినా "మీరు కొంచెం పెట్టుబడి పెట్టండి, పాలో పెరుగో, కూరగాయలో కొనుక్కుని అమ్ముకుని మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తాము" అనే వాళ్ళకి,  మనందరి నుండీ చిన్న చిన్న డొనేషన్లు తీసుకుని వాటిని కలిపి వారికి సహాయం చేస్తారు. "నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను"  అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?

ఇంతకీ చెప్పోచే దేమంటే మీకు ఇష్టమయిన వాటికి మీకు తోచిన సహాయం చెయ్యండి. మీరు అమెరికాలో ఉంటే ఈ పాటికి చాలా రిక్వెస్ట్ లు వచ్చి ఉంటాయి. ఉడతా భక్తిగా ఎవరో ఒకరికి ఎంతో కొంత సహాయం చేసి తోటి మానవుడుగా వాటిని ఆదుకోండి.